Home Blog Page 712

గుడులను మింగిన ఘనులలో గుబులు మొదలైంది!

జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెలరేగి, ఎన్ని రకాల అక్రమాలకు పాల్పడ్డారో, ఎన్ని రకాల దోపిడీలు కొనసాగించారో లెక్కేలేదు! ఆ క్రమంలో దేవస్థానాలకు చెందిన ఆస్తులు దిగమింగడం ఒక భాగం మాత్రమే!! గుడిలో లింగాన్నీ గుడినీ కూడా మింగేయగల కబ్జాకోరులు విచ్చలవిడిగా వ్యవహరించారు.

ఆలయ అధికారులను బెదిరించి, ప్రలోభ పెట్టి, మభ్యపెట్టి, రకరకాలుగా లోబరుచుకుని వైయస్సార్ కాంగ్రెస్ నాయకులు ఏ స్థాయిలో దందాలు కొనసాగించారో ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది. తాజాగా ఆనం రామనారాయణ రెడ్డి చొరవతో, అన్యాకాంతం అయిన భూకబ్జాల వ్యవహారాల మీద ఇప్పుడు లోతైన విచారణ జరగబోతోంది. ఇన్నాళ్లు దేవుడి సొత్తును దిగమించిన ఘనులు ఇప్పుడు బెంబేలెత్తిపోతున్నారు.

వైసీపీ హయాంలో దేవాలయ భూములకు కూడా గ్రహణం పట్టిన సంగతి తెలిసిందే. చిన్న చిన్న ఆలయాలకు ఉండే భూములను కూడా లీజు పేరుతో దోచుకోవడానికి… నామమాత్రం రుసుములు ఇచ్చేలా అనేక వ్యవహారాలను వైసీపీ నేతలు నడిపించారు. చంద్రబాబు సర్కారు ఆ తప్పులన్నింటినీ సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నది. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆక్రమణలన్నింటి లెక్క తేల్చాలని ఆదేశించినప్పటికీ.. అధికారుల్లో మాత్రం పెద్దగా స్పందన రాలేదు. ఆయన మళ్లీ వారిమీద ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. కదలిక మొదలైంది.

సర్కారు మారిందే తప్ప.. జగన్ భక్తితో అక్రమాలు చేయడమే అలవాటుగా పెట్టుకున్న కొందరు అధికారుల తీరులో మార్పు రాలేదు. ఆ క్రమంలో ఇప్పుడు మంత్రులు, నాయకులే.. ప్రతి ఒక్కరినీ అదిలించి ముందుకు నడిపించాల్సి వస్తోంది. ఇప్పుడు సాక్షాత్తూ మంత్రి వెంటపడుతుండడంతో.. ఆలయ భూముల అక్రమాలు మొత్తం ప్రక్షాళన అయ్యే అవకాశం ఉంది. 

మద్యం షాపుల వద్ద బూతుల ప్రవాహం ఉండదిక!

జగన్మోహన్ రెడ్డి ప్రజలు తనకు ఇచ్చిన ఒక్క ఛాన్స్ ను ఆర్థికంగా బలపడడానికి వాడుకోవాలని అనుకున్నారు. అధికారం దొరికిందే తడవుగా ఎన్ని రకాల అక్రమాలు చేయవచ్చునో ఆలోచన చేశారు. వాటి ఫలితంగానే రాష్ట్రవ్యాప్తంగా పేదలందరినీ నిలువు దోపిడీ చేయడానికి అనువైన కొత్త మద్యం విధానం రూపొందింది. కొత్త ఇసుక విధానం రూపొందింది. ఆ ముసుగులో కనీసం డిజిటల్ పేమెంట్లను కూడా అనుమతించకుండా విచ్చలవిడిగా రాష్ట్రాన్ని దోచుకోవడం ఒక నిత్యకృత్యంగా మారింది.

జగన్ మార్పు లిక్కర్ పాలసీలో మద్యం ప్రియులు ఇష్టంగా తాగే ఏ బ్రాండ్ కూడా అందుబాటులో లేకుండా చేశారు. మద్యం తయారీ వ్యాపారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు బినామీ పేర్లతో హస్తగతం చేసుకున్నారు. ప్రముఖ బ్రాండ్లు ఏవీ అందుబాటులో లేకుండా.. కల్తీ, నకిలీ, ఊరూపేరూ తెలియని బ్రాండ్లు మాత్రమే ఏపీలో అందుబాటులో ఉంచారు. వాటికి కూడా అపరిమితమైన ధరలు పెట్టారు. పర్యవసానంగా ప్రజలు ఆర్థికంగా గుల్లయిపోవడం మాత్రమే కాదు, వాళ్ళ ఆరోగ్యం కూడా సర్వనాశనం అవుతూ వచ్చింది.

మద్యం వ్యాపారాల రూపేణా వేలకు వేల కోట్ల రూపాయలు అక్రమ మార్గాల్లో  దండుకోవడం తప్ప ప్రజల క్షేమం, ఆరోగ్యం ఏది కూడా జగన్మోహన్ రెడ్డికి పట్టలేదు. రాష్ట్రంలో ఆయన పరిపాలన సాగిన కాలంలో.. ఏ మద్యం దుకాణం వద్ద చూసినా మద్యం ప్రియులు విచ్చలవిడిగా ఆయనను తిట్టుకుంటూ ఉండే వాతావరణం కనిపించేది. సంక్షేమ పథకాల ముసుగులో ప్రతి కుటుంబానికి డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి.. మద్యం వ్యాపారం రూపంలో నిరుపేదల్ని కొల్లగొట్టేస్తున్నారనే విమర్శలు గతంలో చాలా వచ్చాయి.

ఇప్పుడు ఆ పరిస్థితి మారినట్టే. మద్య ప్రియులకు నచ్చే అన్ని ప్రముఖ బ్రాండ్లను కూడా రాష్ట్రంలోని మద్యం దుకాణాలలో ఇకపై అందుబాటులో ఉంచుతామని చంద్రబాబు నాయుడు ముందే ప్రకటించారు. ఇప్పుడు ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేస్తున్నారు. కల్తీ బ్రాండ్లనుంచి ప్రజలకు విముక్తి కల్పిస్తాం అంటున్నారు. త్వరలోనే కొత్త మద్యం పాలసీకి సంబంధించి ప్రస్తుతం సర్కారు కసరత్తు చేస్తోంది. జగన్ సర్కారు మద్యం పాలసీ ముసుగులో సాగించిన అక్రమాలన్నీ త్వరలోనే బయటపెడతాం అని కూడా మంత్రి చెబుతుండడం విశేషం.

దుకాణాల వద్ద తిట్టుకుంటూ మద్యం కొనుగోలు చేసే వాతావరణం ఇకపై ఉండదు. అలాగే నకిలీల బారిన కల్తీ మద్యం బారిన పడకుండా ఆరోగ్యాలను కూడా కాపాడుకునే వాతావరణం ఏర్పడుతుందని ప్రజలు అనుకుంటున్నారు.

సుప్రీం హుకుం జగన్‌కు చేదుమాత్రే!

జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులు, అవినీతి ఆర్జనలకు సంబంధించి సుమారు పదేళ్లకు పైగా కేసులు, విచారణ నడుస్తూనే ఉంది. ఒక పట్టాన ఏదీ తేలడం లేదు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజుల్లో పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా.. తాను అడిగిన మినహాయింపులు కోర్టు అనుమతించక, ప్రతి శుక్రవారం కోర్టుకు వచ్చి వెళుతుండేవారు జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి అయ్యాక మాత్రం.. ఆ నెపం పెట్టి కోర్టుకు స్వయంగా రావడం మానుకున్నారు.

అయితే.. ఆయన కేసులు ఎంతకీ తేలకపోవడం గురించి సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ విషయంలో న్యాయమూర్తి వ్యాఖ్యలు.. జగన్ కు చేదుగా ధ్వనించేవే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
జగన్  అక్రమాస్తుల కేసుల విచారణలో చాలా జాప్యం జరుగుతున్నదని, ఈ విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ.. గతంలో వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామక్రిష్ణరాజు అప్పట్లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా.. అసలు జగన్ కేసుల విచారణలో వరుసగా దాఖలవుతున్న దరఖాస్తులు విస్మయం కలిగిస్తున్నాయంటూ న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. అసలు ఆ దరఖాస్తులతో నిమిత్తం లేకుండా.. విచారణను కొనసాగించాలంటూ న్యాయమూర్తి సూచించారు.

ఇప్పటికే జగన్ కు తన అక్రమాస్తుల కేసుల విషయంలో ఒక ఎదురుదెబ్బ తగిలిఉంది. ఆయన మీద కేసులను రోజువారీ విచారణ చేపట్టాలని న్యాయస్థానం గతంలో ఆదేశించింది. ఇప్పుడు సుప్రీం కోర్టు కూడా జోక్యం చేసుకుంటోంది. విచారణ కోర్టులను నియంత్రించలేం అంటూనే.. రఘురామ పిటిషన్ పై విచారణను నవంబరు 11ను వాయిదా వేశారు.

తన అక్రమాస్తుల కేసుల విషయంలో జగన్మోహన్ రెడ్డి ఇంకా సుదీర్ఘకాలం తప్పించుకుంటూ కాలం వెళ్లబుచ్చడం సాధ్యం కాదని న్యాయనిపుణులు భావిస్తున్నారు. రోజువారీ విచారణలతో పాటు, రఘురామ పిటిషన్ వలన విచారణలో వేగం పెరిగినా కూడా.. త్వరలోనే జగన్ కు శిక్షలు ఖరారు అవుతాయని అంటున్నారు. జగన్ ఒకవైపు ఎన్డీయే ప్రభుత్వం మీద అనుచిత అసంబద్ధ విమర్శలతో విరుచుకుపడుతూ కేంద్రానికి చికాకు కలిగిస్తున్నారని, ఇన్నాళ్లూ సత్సంబంధాలతో నెట్టుకొచ్చినట్టుగా ఇకపై సాగదని కూడా అంటున్నారు. 

TDP alliance clean sweep in Visakha Standing Committee polls

Giving a rude shock to the YCP, the TDP alliance has registered a clean sweep in the Visakha Municipal Corporation (GVMC) Standing Committee elections. All the ten seats were won by the alliance candidates. This development shocked the YCP leaders who have absolute majority in GVMC.

Out of total 98 corporators in GVMC, there are currently 97 corporators after one resigned. As CPM corporator Ganga Rao abstained from voting, only 96 people exercised their right to vote in the standing committee elections. Ten people contested on behalf of the alliance and ten from YCP.

In GVMC, YCP has 58 corporators, TDP, Jana Sena and BJP alliance has 37 corporators. CPI and CPM have one each. The notification for the standing committee election was released on 22nd of last month, after which six YCP corporators joined TDP and five joined Jana Sena.

The YCP’s strength fell to 47 on Tuesday, while the alliance’s strength increased to 49, as CPI corporator AJ Stalin announced support for the alliance’s candidates. As polling is on Wednesday, both parties have kept their corporators in separate camps since Tuesday.

However, only 43 people attended the YCP camp. The YCP leaders were taken aback when the four absentees reached the GVMC headquarters in special buses along with the alliance corporators when polling started on Wednesday. The YCP leaders thought that at least the remaining 43 votes would go to their candidates. But, after the counting of votes, the coalition candidates won with a huge majority.

The fact that only one of the YCP candidates got a maximum of 42 votes made the party leaders more distressed. The YCP leaders were angry that even the corporators in their camp had cross-voted for the alliance candidates.

While each candidate needs to get at least 49 votes to win the standing committee election, not even one of the YCP candidates secured necessary votes. During the counting of votes, the YCP candidates, who went as agents, put special codes on 14 ballot papers with pen and pencils.

AP cabinet bill facilitating to contest in local bodies even with more than two children

The Andhra Pradesh cabinet has decided to remove the rule of ineligibility for contesting in local bodies and cooperative societies,f a person having more than two children. The state cabinet meeting chaired by Chief Minister Chandrababu Naidu on Wednesday approved the bill brought to this effect.

This bill will be introduced in the next assembly session. This bill was moved in accordance with the promise given by alliance leaders during recent  elections. The cabinet also discussed the allegations of irregularities in the excise department during the YCP government and compared excise policies observed during   2014-19 and 2019-24 governments.

The cabinet has given approval to remove the photo and name of former CM YS Jaganmohan Reddy from the land survey stones. It has decided to take back the patta books with pictures of Jagan. In place of these, new pass books with government logo seals will be provided.

The Cabinet has decided to implement the new liquor policy in the state from October 1 and suggested changes in excise procurement policy. The Chief Minister advised that the policy should not be aimed at improving the government’s revenue, but should reform from all the existing irregularities adopted by the previous regime.

It has decided to supply quality liquor at affordable prices for the common people. It observed the excise policy followed by YS Jagan’s regime resulted in bringing a loss of Rs 18,860 crore to the state. The cabinet extended the ban on Maoists for another year.

The cabinet canceled GO Nos 217 and 144 of the Animal Husbandry Department and Fisheries Department so as to cancel the public auction in the reservoir and ponds and give opportunity to the local fishermen. It has been decided to increase the number of MBBS seats in new medical colleges of the state in phases. In the first phase 380 additional seats will be provided in Vizianagaram, Eluru, Rajamahendravaram, Machilipatnam and Nandyal medical colleges.

అక్కడి దెబ్బ చూసి అలర్ట్ అవుతున్న బొత్స!

గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్- జీవీఎంసీలో స్థాయీ సంఘం ఎన్నికలు జరిగిన తీరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద షాక్ అనే చెప్పాలి. కొందరు కార్పొరేటర్లు అధికార కూటమి పార్టీల్లోకి ఫిరాయించినా సరే.. గెలుపు తమదే అవుతుందని నమ్మకంగా ఉన్న పార్టీకి ఈ దెబ్బ తట్టుకోలేనిది. అసలే ఓటమిభారంతో ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఈ జీవీఎంసీ ఎన్నికలు మరింత అసహనానికి గురిచేసేవే అని చెప్పాలి. అయితే.. ఈ ఎన్నికల ప్రభావం పార్టీ మీద ఎలా ఉన్నదంటే.. ప్రస్తుతం ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీగా పార్టీ తరఫున పోటీచేస్తున్న బొత్స సత్యనారాయణ ముందుగానే జాగ్రత్త పడుతున్నారు.

ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో బొత్స కుటుంబంలో నలుగురికి జగన్మోహన్ రెడ్డి టికెట్లు కేటాయించారు. బొత్స దంపతులు ఇద్దరూ పోటీచేశారు. ఆయన చీపురుపల్లి ఎమ్మెల్యేగా, భార్య ఝాన్సీ విశాఖ ఎంపీగా బరిలోకి దిగారు. మొత్తం బొత్స కుటుంబం ఖాతాలో రెండొందల కోట్ల రూపాయలకు పైగానే ఖర్చు చేసి ఉంటారనే పుకార్లు స్థానికంగా ఉన్నాయి. ఇంత చేసినా.. నలుగురిలో ఒక్కరు కూడా గెలవలేదు. ఆ భారం నుంచి, పరాభవం నుంచి వారు ఇంకా కోలుకోనే లేదు. ఇలాంటి సమయంలో బొత్స సత్యనారాయణను జగన్ ఎమ్మెల్సీ బరిలోకి దించారు.
ఈ ఎన్నికలో ఉండే ఓట్లు 841 మాత్రమే. అన్ని ఓట్లనూ కొనవలసిన అవసరం లేదు. తమ పార్టీకి చెందిన (అలా అనుకుంటున్న) 600పైచిలుకు ఓట్లను నికరంగా తనకు వేయించుకోగలిగితే చాలు. కానీ ఈ ఓట్ల విలువ ఎమ్మెల్యే ఎన్నికల్లో 3 నుంచి 5 వేల ధర పలికేవి కాదు. లక్షల్లో ధర పలికే ఓట్లు! ఇంత చేసినా అందరూ ఓటు వేసి తీరుతారనే గ్యారంటీ లేదు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది సందేహంగానే ఉంది. జీవీఎంసీ స్థాయీ సంఘం ఎన్నికల్లో కూటమి మొత్తం పది సీట్లనూ గెలుచుకోవడం అందుకు నిదర్శనం. ఆ ఫలితాలు చూసిన తర్వాత.. ఇతర ప్రాంతాల్లో ఉండే స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా నికరంగా తమ పార్టీకి కట్టుబడి ఉంటారనే నమ్మకం బొత్సలో సన్నగిల్లినట్టుగా ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికకు డబ్బు ఖర్చు పెట్టేప్పుడు ఆచితూచి వ్యవహరించాలని ఆయన అలర్ట్ అవుతున్నారుట. ఇన్ని కష్టాలు పడినా.. బొత్స నెగ్గుతారో లేదో అనే అనుమానాలు ఆయన అనుచరుల్లోనే వ్యక్తం అవుతున్నాయి. 

జంగిల్ క్లియరెన్స్ కాదు.. కుట్రల క్లియరెన్స్!

అమరావతి రాజధాని స్వప్నం సాకారం అయ్యే దిశగా ఒక మంచి ముందడుగు పడింది. ప్రస్తుతం పిచ్చిమొక్కలు మొలిచిన స్మశానంలాగా ఉన్న అమరావతి రాజధాని ప్రాంతం.. సరిగ్గా ఒకనెలరోజుల్లోగా.. నిర్మాణాలు ప్రారంభించడానికి అనువైన సువిశాల మైదానంలాంటి రూపాన్ని సంతరించుకోనుంది. అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులను మంత్రి నారాయణ బుధవారం ప్రారంభించారు. ఆ ప్రాంత రైతులు, రాష్ట్రప్రజలు మాత్రం ఇది జంగిల్ క్లియరెన్స్ కాదని.. అమరావతి మీద జరిగిన కుట్రల క్లియరెన్స్ అని వ్యాఖ్యానిస్తున్నారు.

చంద్రబాబునాయుడు విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టుగా అమరావతి రాజధానిని తలపెట్టి 51 వేల ఎకరాలను రైతులనుంచి సమీకరించారు. ఆ ప్రాంతాన్ని మొత్తం ఒక స్థాయికి తీర్చారు. నిర్మాణాలను ప్రారంభించారు. ఇప్పుడు నడుస్తున్న హైకోర్టు, సచివాలయం అక్కడే ఏర్పడ్డాయి. ఈలోగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. అమరావతి ప్రాంతంపై విషం చిమ్మింది. అన్ని పనులను స్తంభింపజేసేసింది.  70 -80 శాతం పూర్తయిన ఐఏఎస్ అధికారుల, జడ్జిల క్వార్టర్లు సహా అన్నీ నిలిచిపోయాయి. అయిదేళ్లపాటూ వీటిగురించి పట్టించుకున్న నాధుడు లేడు. అంతా కర్రతుమ్మ చెట్లు మొలిచి, అమరావతి ప్రాంతం మొత్తం అడవిలాగా తయారైంది. ఈ ప్రాంతం మీద జగన్ కుట్రలకు జనం ఎన్నికల్లో చెక్ పెట్టారు. మూడు రాజధానుల డ్రామాను తిప్పికొట్టారు.

చంద్రబాబు తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి ప్రాంతమంతా తిరిగి పరిశీలించి.. పనుల పునరుద్ధరుణకు సిగ్నల్ ఇచ్చారు. అడవిలా మారిన పిచ్చిచెట్లను, కర్రతుమ్మ ముళ్ల చెట్లను తొలగించేందుకు 36 కోట్ల రూపాయలు కేటాయించారు. ఆ పనులు బుధవారం ప్రారంభం అయ్యాయి. ఒక నెలరోజుల్లోగా ఈ పనులు మొత్తం పూర్తిచేస్తాం అని మంత్రి నారాయణ ప్రకటించారు. అదే జరిగితే.. నెలగడిచేసరికెల్లా.. అమరావతి ప్రాంతం నిర్మాణాలకు యోగ్యమైన ఆకర్షణీయమైన ప్రాంతంగా మారిపోతుందనడంలో సందేహం లేదు.
పైగా ఈ పనులు పూర్తయిన తర్వాత.. ఇప్పటికే రాజధానిలో వివిధ సంస్థలకు కేటాయించిన భూములను వారికి అప్పజెబుతారు. అందులో కేంద్రప్రభుత్వ రంగ సంస్థలే 130 వరకు ఉన్నాయి.

చంద్రసర్కారు ఏర్పడిన తర్వాత.. సీఆర్డీయే సంప్రదించినప్పుడు.. తమకు స్థలాలు ఎక్కడున్నాయో చూపిస్తే నిర్మాణాలు చేపడతామని ఆ సంస్థలు పేర్కొన్నాయి. స్థలాలు పొందిన సంస్థలన్నీ రెండేళ్లలోగా నిర్మాణాలు పూర్తిచేయాలని కూడా చంద్రబాబునాయుడు అంటున్నారు. ఆ ప్రకారం చూస్తే మరో రెండేళ్లు గడిచేసరికి అమరావతి ప్రాంతం వైభవమైన నగరంగా రూపుదిద్దుకుంటుందని ప్రజలు నమ్ముతున్నారు. 

YCP Govt. splurged 90 Crores per year for Jagan’s security

As former Chief Minister and YSR Congress party supremo YS Jagan Mohan filed a writ petition in the Andhra Pradesh High Court for restoring his security cover that was in force prior to the recent assembly elections has once again brought to the fore a heated discussion on how the previous government splurged public money to provide unreasonable protection to their leader. 

While YSRCP leaders and its supporters have been making a lot of hue and cry over the depleted security personnel to Jagan Mohan Reddy, the ruling dispensation led by NDA in AP is firm on exposing how the former regime resorted to glaring misuse of government money every month just to make sure that the former CM and his family is under huge blanket of security with as many as 900 people working round the clock. 

Reportedly, the previous government expended more than 90 Crores every year for salaries and other contingencies towards Chief Minister’s security. Every month nearly 8 Crores was apportioned for this purpose as a huge number of security personnel were deployed to guard Jagan and his family. What is more shocking is that Jagan’s daughters who were studying in abroad were also provided security by the state government. There was security at his residences in Bengaluru and Hyderabad even though he used to stay in Tadepalli palace in Vijayawada. 

The present government immediately cut down the disproportionate security cover after coming to power. So, Jagan Mohan Reddy filed a plea in the court to consider the sensitive nature of his position and the ongoing political environment in the state and provide him with additional security which is similar to the one which was in place before the election results. 

NDA leaders took swipe on Jagan and his supporters for creating unnecessary fuss about security. They claimed that the government cut down only the extra security personnel who were inducted without a justification. 

Meanwhile, the High Court has directed the state government to submit a detailed report on the security cover provided to Jagan Mohan Reddy and also asked them to allot him a proper and good condition bullet proof vehicle to avoid any further risk. 

Prabhas Donates Rs 2 Crore for Kerala Relief Fund

Rebel star Prabhas is currently basking in the phenomenal success of the blockbuster film ‘Kalki 2898 AD’. Prabhas, renowned for his philanthropic endeavors and helping hand in serious crises, is making headlines for his act of generosity in the recent Wayanad landslides.

Recently, Wayanad district in Kerala witnessed heavy rains and landslides on July 30, which resulted in the loss of numerous lives. In response to that, Bahubali actor Prabhas expressed his condolences and solidarity and extended his support to the Kerala relief fund.

Prabhas donated Rs. 2 crore in financial aid to the Kerala Government Disaster Relief Fund. Besides Prabhas, many renowned celebrities from the film industry extended their support. Icon star Allu Arjun donated 50 lakhs for the relief fund, while Chiranjeevi and Ram Charan jointly donated 1 crore.

Speaking about Prabhas’ professional commitments, Prabhas has dived into his next project, ‘Salaar Part 2: Shouryaanga Parvam’ directed by Prashanth Neel. Additionally, Prabhas will feature in Maruthi’s romantic horror comedy film ‘The Raja Saab’ and will take on a role in Sandeep Reddy Vanga’s next ‘Spirit’. Furthermore, Prabhas will appear in Manchu Vishnu’s magnum opus ‘Kannappa’ in a special cameo appearance.

ఈ కథ వెనుకుంది ఆయనా?

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం త‌న కెరీర్ లోని 29వ చిత్రాన్ని సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ ఎస్ఎస్.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను బిగ్గెస్ట్ అడ్వెంచ‌ర్ మూవీగా తీసుకొచ్చేందుకు రాజ‌మౌళి అండ్ టీమ్ సిద్ధ‌మ‌వుతున్నారు.

ఇక ఈ సినిమా కోసం మ‌హేష్ సాలిడ్ మేకోవ‌ర్ అవుతున్నాడు. ఇప్ప‌టికే జుట్టు, గ‌డ్డం బాగా పెంచిన‌ట్లుగా మ‌హేష్ క‌నిపిస్తున్నాడు. అయితే, ఈ సినిమా వెన‌క రాజ‌మౌళి, ఆయన తండ్రి , రచ‌యిత విజయేంద్ర ప్ర‌సాద్ లు మాత్ర‌మే కాకుండా మరో  వ్య‌క్తి కూడా ఉన్న‌ట్లుగా సమాచారం. ఆయ‌నే ఎస్ఎస్.కాంచి. రాజ‌మౌళి క‌జిన్ అయిన కాంచి ఈ సినిమా క‌థ‌కు సంబంధించి విజ‌యేంద్ర ప్ర‌సాద్ కు త‌న ఆలోచ‌న పంచుకున్నాడంట.

ఆయ‌న చెప్పిన పాయింట్ న‌చ్చ‌డంతో విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఈ అడ్వెంచ‌ర్ క‌థను రాశార‌ట‌. ఈ క‌థ వెన‌కాల కాంచి ఆలోచ‌న‌లు, సూచ‌న‌లు ఉన్నాయ‌ని తెలుస్తోంది. ఈ సినిమా  మ‌హేష్ సినీ కెరీర్ లో అతి పెద్ద సినిమాగా రాబోతుంది. ఈ సినిమాను అతి త్వ‌ర‌లో సెట్స్ప‌ మీదకు తీసుకుని వెళ్లేందుకు చిత్ర బృందం రెడీ అవుతోంది.