Home Blog Page 711

జగనన్నా.. వారి గోడు వినిపిస్తోందా..?

‘మరణించే ముందు ఎవ్వరూ అబద్ధం చెప్పరు’.. అనేది మనకు ఒక నమ్మకం. ఈ కాన్సెప్ట్ మీద ఆధారపడి మనకు అనేక సినిమాలు కూడా తయారయ్యాయి. ఈ సూత్రాన్ని రాజకీయాలకు అన్వయించుకుంటే.. పార్టీని వదలి, గుడ్ బై కొట్టి వెళ్ళిపోయే సమయంలో కూడా ఎవ్వరూ అబద్ధాలు చెప్పరు అనే అనుకోవాలి. మరి అలాంటి వారు చెబుతున్న మాటలని పార్టీ అధినేత పరిగణనలోకి తీసుకోవాలా వద్దా? ఆ అధినేత అయినా.. ఈగోలు లేకుండా నిజంగా తన పార్టీ క్షేమాన్ని కోరుకునే వాడు అయితే.. వెళ్ళిపోయే వారి మాటల్ని పట్టించుకోవాలి. కానీ.. వైసిపికి గుడ్ బై కొట్టి వెళుతున్న వారి గోడు జగన్ కు అసలు వినిపిస్తోందా అనేది ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా ఉంది.

పైగా.. వెళ్ళిపోతున్న నాయకులు అందరూ ఒకే తరహా ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికలకు ముందు పలువురు నాయకులు వైసీపీని వీడిపోయారు. టికెట్లు దక్కని వారు గుడ్ బై కొట్టడం విశేషమేమీ కాదు. కానీ వారిలో కూడా పలువురు ఒకటే రకం ఆరోపణలు పార్టీ మీద చేశారు. ఎన్నికలు ముగిసిన తరువాత ఇప్పటికే ముగ్గురు తాజా మాజీ ఎమ్మెల్యేలు గుడ్ బై కొట్టారు. మద్దాలి గిరి, కిలారు రోశయ్య, పెండెం దొరబాబు వెళ్ళిపోయారు. వీరందరికీ కూడా ఒకటే మాట. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో తమకు సాధారణ కార్యకర్తకు దక్కే గౌరవం కూడా దక్కలేదని వారు వాపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి మంచి నాయకుడే గాని. ఆయన చుట్టూ ఉన్న కోటరీ పార్టీని సర్వనాశనం చేస్తున్నదని వారు ఆరోపిస్తున్నారు. 

ఏదో ఒక నాయకుడు ఇలాంటి ఆరోపణలు చేస్తే ఎవరి మీద అయినా వ్యక్తిగత ద్వేషంతో చెబుతున్నారని అనుకోవచ్చు. కానీ పార్టీ నుంచి వెళ్ళిపోతున్న అందరూ ఇదే మాట చెబుతుంటే పట్టించుకోకపోతే ఎలా? నిజానికి పార్టీలో కొనసాగుతున్న వారు కూడా అనేకమంది ఇదే తరహా ఆరోపణలు చేస్తున్నారు వైయస్ జగన్మోహన్ రెడ్డి నిజంగానే తన పార్టీని కాపాడుకోవాలని ఆలోచన ఉన్న నాయకుడు అయితే కనుక.. కచ్చితంగా ఈ మాటలను పరిగణనలోకి తీసుకోవాలి. తల చుట్టూ గోడ లాగా మారి తనకు కార్యకర్తలకు సాధారణ నాయకులకు మధ్య ఉండవలసిన అనుబంధానికి గండి కొడుతున్న కోటరీ అనుచరులను పక్కన పెట్టాలి లేదా వారి ప్రాధాన్యం తగ్గిం.. అని పలువురు కోరుకుంటున్నారు. అహంకారంతో ఉండే జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి హిత వాక్యములు చెవికి ఎక్కుతాయా అనేది చాలామందిలో ఉన్న సందేహం!

Neeraj Chopra Secures Silver at Paris Olympics

0

India’s Neeraj Chopra fell short of retaining his gold medal at the Paris Olympics, securing silver in the men’s javelin throw final. Chopra’s best throw was 89.45 meters, achieved in his second attempt. Despite high expectations following his gold medal win at the Tokyo Olympics, Chopra fouled five of his six attempts, leaving him unable to surpass the 90-meter mark. Pakistan’s Arshad Nadeem clinched gold with a record-setting throw of 92.97 meters, while Grenada’s Anderson Peters won bronze with 88.54 meters.

Chopra’s silver medal marks his second consecutive Olympic medal, adding to his gold from Tokyo. This achievement places him among elite Indian athletes who have won multiple Olympic medals, including PV Sindhu, Manu Bhaker, and Sushil Kumar. Nadeem’s victory also represents Pakistan’s first-ever gold medal in athletics, making the competition a significant milestone for both nations.

Supreme Court to Deliver Verdict on Manish Sisodia’s Bail Plea

New Delhi: The Supreme Court is set to deliver its verdict on Friday regarding the bail plea of senior Aam Aadmi Party (AAP) leader Manish Sisodia, who has been in custody for nearly a year and a half. Sisodia was arrested in February 2023 in connection with the Delhi liquor policy case and has faced multiple extensions of his judicial custody. He is currently facing charges from both the Central Bureau of Investigation (CBI) and the Enforcement Directorate (ED).

On May 21, the Delhi High Court denied Sisodia bail, citing concerns that he might misuse his position and potentially influence evidence and witnesses if released. The Supreme Court, which heard Sisodia’s appeal on August 6, has reserved its decision and inquired about the expected timeline for the trial’s conclusion. During the June 4 hearing, the ED informed the court that it planned to file a final chargesheet by July 3.

Chiranjeevi and Ram Charan Donate ₹1 Crore to Kerala Relief Fund Amidst Wayanad Tragedy

Kerala’s Wayanad district has been severely affected by natural calamities, with more than 400 people confirmed dead and hundreds reported missing due to widespread landslides. The situation remains critical as rescue and recovery efforts continue.

In response to the disaster, Tollywood megastar Chiranjeevi and his son, global star Ram Charan, have shown their support by donating ₹1 crore to the Kerala Chief Minister’s Relief Fund.

Chiranjeevi traveled to Kerala today on a special flight, where he met with Kerala Chief Minister Pinarayi Vijayan. During the visit, Chiranjeevi presented a cheque of ₹1 crore to the Chief Minister. Vijayan expressed his gratitude to Chiranjeevi for his generous contribution during this challenging time.

YS Sharmila Criticizes Government Negligence in Seed Distribution to Farmers

AP Congress President Y.S. Sharmila criticized the negligence of the Agriculture Department, stating that while farmers were initially happy about the arrival of irrigation water under the Nagarjuna Sagar Right Canal, the government’s carelessness has become a curse for 400,000 farmers. She accused the coalition government of failing to make seeds of high-demand crops available to farmers. Sharmila expressed her concern that the government’s actions are completely dashing the hopes of farmers, who were optimistic about moving from crop holidays to cultivating fallow lands.

“What is the point of deploying police to guard and issue tokens? Why are counters being closed after distributing tokens to just a few? Why are farmers being pressured to buy seed varieties favoured by the government instead of what they asked for? How can you leave women standing in the rain for seeds? Are you just going to watch while there’s a stampede?” Sharmila questioned the government’s actions.

She further demanded that within 48 hours, 15,000 quintals of JGL-384 seed variety be made available to farmers. She also insisted that this seed variety be included in the subsidy list and called on the coalition government to put an end to the black market activities, on behalf of the Congress Party.

Pawan Kalyan criticizes heroes’ smuggler roles in films

Bengaluru: Andhra Pradesh Deputy Chief Minister and Jana Sena chief Pawan Kalyan, currently visiting Karnataka, expressed his concerns over the evolving roles of heroes in films. Reflecting on the shift in cinematic culture, Pawan remarked, “Forty years ago, a hero would protect forests, but now he is depicted as cutting down trees and smuggling them. This change in culture is troubling.” He further added that, as someone from the film industry, he would find it challenging to participate in such films.

During his visit to Karnataka on Thursday, Pawan Kalyan met with Chief Minister Siddaramaiah. Their discussions primarily focused on wildlife and forest conservation, particularly on measures to curb red sandalwood smuggling. 

Additionally, the issue of elephants damaging farmers’ fields was reportedly on the agenda. Pawan Kalyan also requested Karnataka to hand over six trained kunki elephants to Andhra Pradesh to assist in managing these challenges.

సెన్సార్‌ పనులు పూర్తి చేసుకున్న డబుల్‌ ఇస్మార్ట్‌ !

యంగ్ అండ్ ఎనర్జీటిక్ హీరో రామ్ పోతినేని, క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కిన తాజా సినిమా ‘డబుల్ ఇస్మార్ట్’ ఆగస్టు 15న గ్రాండ్ విడుదల అయ్యేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించడంతో ఈ సినిమా ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా తాజాగా సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకుంది.

సెన్సార్ బోర్డు డబుల్ ఇస్మార్ట్ చిత్రానికి ‘A’ సర్టిఫికెట్ ని జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో యాక్షన్ డోస్ ఎక్కువగా ఉండటం.. బోల్డ్ డైలాగులు కూడా ఉండటంతో ఈ మూవీకి A సర్టిఫికెట్ జారీ చేశారు. అయితే, ఈ సినిమాలోని కంటెంట్ మాస్ ఆడియెన్స్‌ను ఇంప్రెస్ చేసే విధంగా ఉంటుందని మేకర్స్ అంటున్నారు. ఈ చిత్రానికి 2 గంటల 42 నిమిషాల రన్‌టైమ్‌ను లాక్ చేసినట్లుగా సమాచారం. ఇక ఈ సినిమాలోని ట్విస్ట్ ఆడియెన్స్‌ను కచ్చితంగా థ్రిల్ చేస్తుందని వారు చెబుతున్నారు.

ఈ సినిమాలో అందాల భామ కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తోండగా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా చేస్తున్న సంగతి తెలిసిందే.

నాగ్‌ ఏంటి కాబోయే కోడల్ని అంత మాట అనేశాడు!

ఎంతోకాలంగా నాగచైతన్య, శోభిత దూళిపాళ లవ్‌లో ఉన్నారని.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే కొంతకాలం క్రితం వరకు వీరు అలాంటిది ఏమి లేదని కొట్టిపారేస్తూ వచ్చారు. కానీ నేడు వాటిని అన్నింటిని నిజం చేస్తూ వారిద్దరూ అతి కొద్దిమంది అతిథుల సమక్షంలో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు.

అందుకు సంబంధించిన ఫోటోలను కింగ్ నాగార్జున సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దీంతో.. చైతన్య, శోభితలకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు నెటిజన్లు. గురువారం ఉదయం 9:42 నిమిషాలకు శోభిత-చైతన్యలు ఉంగరాలు మార్చుకున్నారు. ఈ విషయాన్ని టాలీవుడ్ కింగ్, నాగచైతన్య తండ్రి నాగార్జున సోషల్ మీడియా ద్వారా అధికారికంగా తెలియజేశారు. చై-శోభిత జంటకు నెటిజన్లు, టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు.‘నా కుమారుడు నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం ఈరోజు ఉదయం 9.42 గంటలకు జరిగింది.

ఈ విషయాన్ని మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. శోభితను మా కుటుంబంలోకి సంతోషంగా ఆహ్వానిస్తున్నాం. కొత్త జంటకు నా అభినందనలు. వీరి జీవితం మొత్తం సంతోషం, ప్రేమతో నిండాలని కోరుకుంటున్నా. దేవుడు కూడా ఆశీర్వదిస్తాడు. 8.8.8 అనంతమైన ప్రేమకు నాంది’ అని కింగ్ నాగార్జున ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ పోస్టులోనే చై-శోభిత ఎంగేజ్‌మెంట్ ఫోటోలను పంచుకున్నారు. అయితే.. ఇదే సమయంలో నాగార్జునకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. 2018లో అడవి శేష్ నటించిన ‘గూఢచారి’ సినిమా సక్సెస్ మీట్‌లో శోభిత ధూళిపాళ గురించి నాగార్జున చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

 ‘శోభితా ధూళిపాళ.. ఆమె చాలా బాగుంది. నేను ఇలా చెప్పకూడదు కానీ, సినిమాలో శోభిత చాలా హాట్‌గా కనిపించింది. నా ఉద్దేశంలో ఆమెలో ఎంతో ఆకర్షణీయమైన విషయం ఉంది..’ అని నాగార్జున చెప్పుకొచ్చాడు. దీంతో.. నాగార్జున తనకు కాబోయే కోడలిపై షాకింగ్ కామెంట్స్ చేశారంటూ.. ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు.

గళ్ల లుంగీ..గన్‌ విత్‌ గొడ్డలి..!

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా పుష్ప 2. డైరెక్టర్‌ సుకుమార్ కాంబోలో అత్యంత  ప్రతిష్మాత్మకమైన పాన్‌ ఇండియా సినిమాగా ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్‌ అసోసియేషన్‌ విత్‌ సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్స్‌పై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాని డిసెంబర్ 6న  ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఈ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్న ఫహాద్‌ ఫాజిల్‌ క్యారెక్టర్‌కు సంబంధించిన పోస్టర్‌ను గురువారం ఫహాద్‌ ఫాజిల్‌ పుట్టినరోజు సందర్భంగా  మూవీ టీమ్‌ విడుదల చేసింది.

బన్వర్‌ సింగ్‌ షెకావత్‌గా పుష్ప ది రైజ్‌లో ఆకట్టుకున్న ఫహాద్‌ ఈ సినిమాలో అంతకు మించి ఆడియన్స్‌ను ఆకట్టుకోబోతున్నాడు. గళ్ళ లుంగీ ధరించి.. ఒక చేతిలో గన్‌తో…మరో చేతిలో గొడ్డలితో ఫహాద్‌ ఈ పోస్టర్‌లో చాలా ఇంట్రస్ట్‌ గా కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించిన విడుదలైన ప్రమోషన్‌ కంటెంట్‌ అంతా అందరిలోనూ అంచనాలు పెంచేలా ఉన్నాయి. టీజర్‌తో పాటు విడుదలైన రెండు పాటలకు కూడా ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది.

 రోజురోజుకు అంచనాలు పెంచుకుంటూ పోతున్న ఈ సినిమా గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ సినిమా  షూటింగ్‌ ఆర్‌ఎఫ్‌సీలో భారీ వ్యయంతో వేసిన సెట్‌లో చాలా లావిష్‌గా జరుగుతుంది. ప్రస్తుతం పతాక సన్నివేశాలు అత్యంత అద్బుతంగా చిత్రీకరించే పనిలో ఉన్నారు. హీరోతో పాటు సినిమాలోని కీలక నటులు కూడా పాల్గొంటున్నారు.

సినిమాకు ఈ సన్నివేశాలు ఎంతో హైలైట్‌గా ఉండబోతున్నాయని అంటున్నారు. అంతేకాదు రేపు థియేటర్‌లో ఈ పతాక సన్నివేశాలు గూస్‌ బంప్స్‌ వచ్చే విధంగా ఉంటాయని అంటున్నారు. ఇక మరోపక్క రజనీకాంత్ నటిస్తున్న వేట్టయాన్ సినిమాలో ఫహాద్ ఫాజిల్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఫహాద్ ఫాజిల్ పుట్టినరోజు సందర్భంగా వేట్టయాన్ మేకర్స్ ఒక ఆసక్తికరమైన ఫొటో పంచుకున్నారు. బర్త్ డే బాయ్ ఫాజిల్ ఇద్దరు సూపర్ స్టార్లు రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ లతో కలిసి ఉన్న ఫోటోను చిత్రబృందం షేర్ చేసింది.

ఎన్టీఆర్‌-నీల్‌ సినిమా అంతా గప్‌చుప్‌ నే!

ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబోలో ఓ భారీ ప్రాజెక్ట్‌ ను ఎప్పుడో అనౌన్స్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం నీల్‌ ప్రభాస్‌ సలార్‌ సినిమాతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. దీంతో ఎన్టీఆర్ కూడా దేవర కమిట్ అయ్యాడు. ఇక ఇప్పుడు దేవర షూటింగ్ చివరి దశకు చేరింది. మరోవైపు వార్2 కూడా కంప్లీట్ చేయబోతున్నాడు తారక్. ఇక ప్రభాస్ డేట్స్ లేకపోవడంతో.. సలార్‌ 2ని పక్కకు పెట్టేశాడు నీల్.  దీంతో.. ఇప్పుడు ఎన్టీఆర్ మూవీకి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.

ఆగష్టు 9న అంటే శుక్రవారమే రామనాయడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్ట్‌ మొదలు కానుంది. అయితే.. దీనిపై మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన ఇంకా బయటికి రాలేదు.  ఈ ఓపెనింగ్ సెర్మనీకి మీడియా కవరేజ్ కూడా ఉండదని సమాచారం.
ఎన్టీఆర్‌ 31 ప్రారంభ కార్యక్రమం సాదాసీదాగా జరుగబోతుందని సమాచారం. అయితే.. పూజా కార్యక్రమం పూర్తయిన తర్వాత ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలు బయటకు విడుదల చేయనున్నారని సమాచారం.

కానీ.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అసలు ఈ ప్రాజెక్టు అనౌన్స్ చేసినప్పుడు.. సెలబ్రేట్ చేసుకున్నారు. ఎందుకంటే..కేజీయఫ్, సలార్ వంటి బిగ్గెస్ట్ హిట్స్ తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా ఇది. పైగా ఎన్టీఆర్ తన అభిమాన హీరో కావడమే కాదు, ఈ సినిమా ప్రశాంత్‌ నీల్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ కూడా. మామూలుగానే నీల్ తన హీరోలను నెక్స్ట్ లెవల్ అనేలా చూపిస్తుంటాడు. అలాంటిది ఎన్టీఆర్‌ను ఇంకే రేంజ్‌లో ఎలివేట్ చేస్తాడనే ఆసక్తితో ఉన్నారు. అందుకు తగ్గట్టే.. ఈ సినిమాకి ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది.