Home Blog Page 710

సర్ది చెప్పడంలో జగన్ ఫెయిల్ అవుతున్నారా?

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ మీద పట్టు క్రమంగా కోల్పోతున్నారా? రాజకీయాల్లో గెలుపోటములు చాలా సహజం అయినప్పుడు, నిన్నటి గెలుపు తర్వాత ఇవాళ ఓటమి పలకరించింది. ఓకే కానీ, ఇక భవిష్యత్తు కూడా ఉండదేమో అని భయపడుతున్న రీతిలో చాలామంది నాయకులు పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. ఇలాంటి వాటికి వారికి భరోసా కల్పించడంలో, సర్దిచెప్పి పార్టీలోనే కొనసాగేలా చేయడంలో జగన్మోహన్ రెడ్డి ఫెయిలవుతున్నారనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది. ఇతర పార్టీల నుంచి ఆఫర్లు ఉండి అందుకోసం ఎగబడి లేదా అధికారం పంచన మాత్రమే ఉండదలుచుకునే వ్యక్తులు వెళ్లిపోవడం అర్థం చేసుకోవచ్చు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై కొట్టేసి, ఇక రాజకీయ సన్యాసం తీసుకోవాలి అనే స్థాయిలో విరక్తితో వెళుతున్న నాయకుల పరిస్థితి చిత్రంగా కనిపిస్తోంది.

నిన్నటి వరకు జగన్ ఎంతగానో నమ్మినట్లుగా, ప్రాధాన్యం ఇచ్చినట్లుగా కనిపించిన నాయకులు కూడా ఇవాళ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ళ నాని) తాజాగా పార్టీకి రాజీనామా చేయడం ఇలాంటి అభిప్రాయాన్నే కలిగిస్తుంది.

ఇప్పటికే పలువురు తాజా మాజీ ఎమ్మెల్యేలు వైయస్సార్ కాంగ్రెస్ ను వీడిపోయారు. ఆళ్ల నాని నాలుగో వ్యక్తిగా అనుకోవాలి. అయితే ఇదివరకటి ముగ్గురు నాయకులు పార్టీని వీడడం వేరు.. ఆళ్ల నాని పార్టీని వేయడం వేరు అన్నట్టుగా పరిగణించాలని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇదివరకు వెళ్లిపోయిన వారిలో మద్దాలి గిరి, పెండెం  దొరబాబు ఒక కేటగిరీకి చెందుతారు. వారిద్దరూ తాజా మాజీ ఎమ్మెల్యేలు అయినప్పటికీ, ఇటీవల ఎన్నికలలో వారికి సీటు దక్కలేదు. ఏదో మొక్కుబడిగా పార్టీలో కొనసాగారు. ఓడిపోయిన తర్వాత అదే అసంతృప్తిగా వారు వెళ్ళిపోయారు అని అనుకోవచ్చు. కిలారి రోశయ్య పరిస్థితి వేరు. ఎందుకంటే ఆయన తాజా మాజీ ఎమ్మెల్యే అయినప్పటికీ ఎంపీ టికెట్ ఇచ్చి ప్రమోషన్ కట్టబెట్టారు జగన్మోహన్ రెడ్డి. ఆ ఎన్నికలో ఆయన దారుణంగా ఓడిపోయారు. ఇప్పుడు ఆళ్ల నాని వంతు వచ్చింది. ఆయన కూడా తాజా మాజీ ఎమ్మెల్యే నే. అయితే జగన్మోహన్ రెడ్డి ఆయనకు చాలా ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. డిప్యూటీ ముఖ్యమంత్రి చేశారు మంత్రిగా కూడా ఆళ్ళ విస్తృతంగా తిరిగారు. అయినా సరే ఎమ్మెల్యేగా ఓడిపోయారు. ఇప్పుడు అసలు రాజకీయాలకే దూరంగా ఉండాలని అనుకుంటున్నట్టుగా ప్రకటించి పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పద్ధతితో సహా రాజీనామాలు సమర్పించి జగన్మోహన్ రెడ్డికి రాజీనామా లేఖ పంపడం సర్వత్రా చర్చినీయాంశం అవుతోంది. జగన్మోహన్ రెడ్డి నెమ్మదిగా పార్టీ నాయకుల మీద పట్టు కోల్పోతున్నారని అందరూ అనుకుంటున్నారు.

Actor Suriya Sustains Minor Head Injury During Shoot of ‘Suriya44’

Actor Suriya has experienced a minor head injury while filming for his upcoming project, tentatively titled ‘Suriya44’. The shooting was briefly halted following the incident. The second schedule of the film, which began earlier this month in Ooty, had been progressing smoothly until this mishap occurred. The film is directed by Karthik Subbaraj.

Producer Rajasekar Pandian took to Twitter to ease fans’ concerns, stating, “Dear #AnbaanaFans, it was a minor injury. Please don’t worry; Suriya Anna is perfectly fine thanks to all your love and prayers.” Reports indicate that Suriya has been advised to rest for a few days.

Meanwhile, Suriya is also preparing for the release of his highly anticipated PAN Indian film ‘Kanguva’. Directed by Siruthai Siva, this grand period action drama, featuring Disha Patani as the female lead and Bobby Deol as the antagonist, is set to hit theaters on October 10th.

వారిద్దరూ నా అభిమాన దర్శకులే!

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్ థియేటర్లలో విడుదల కి రెడీ అయిపోయింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ట్రైలర్ లాంఛ్ సందర్భంగా దర్శకుడు హరీష్ శంకర్ కి ఓ ప్రశ్న ఎదురైంది. పాన్ ఇండియా మూవీస్ కల్కి, పుష్ప లాంటి డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అని అడగగా అందుకు తనదైన శైలిలో సమాధానం చెప్పారు హరీష్‌.

పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేస్తే అవ్వవు, మనం ఒక మంచి సినిమా చేస్తే, అది ఇండియా మొత్తం ఆదరిస్తే, అది పాన్ ఇండియా చిత్రం అవుతుంది. కల్కి లాంటి సినిమాలు చేయడానికి నాగ్ అశ్విన్ ఉన్నాడు, పుష్ప లాంటి సినిమాలు చేయడానికి సుకుమార్ ఉన్నాడు. నేను నా స్టైల్ లో  సినిమాలు తీస్తా అని చెప్పుకొచ్చాడు. అంతేకాక ఆ ఇద్దరూ కూడా నా అభిమాన దర్శకులే అని పేర్కొన్నాడు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

పెళ్లి పీటలు ఎక్కబోతున్న యానిమల్‌ ముద్దుగుమ్మ!

‘యానిమల్’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హాట్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ అందరికీ సుపరిచితమే. తన ఫస్ట్ సినిమాతోనే ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది. దీంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు వెదుక్కుంటూ వచ్చాయి. అలా రీసెంట్‌గా ‘బ్యాడ్ న్యూస్’ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ కెరీర్‌ పరంగా ముందుకు దూసుకుపోతుంది.

అలాగే టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా సౌత్ ఇండస్ట్రీ మొత్తం కూడా నటిస్తూ తన అంద చందాలతో కుర్రకారు మనసులు దోచుకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడి పెళ్లికి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. అందులో భాగంగా ఈ బ్యూటీ ఫ్యాన్స్ హార్ట్‌లను బ్రేక్ చేస్తూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం.

అయితే వీరి రిలేషన్ చాలా సంవత్సరాల నుంచే కొనసాగుతుందట. త్రిప్తి చేసుకోబోయే వ్యక్తి ఎవరో కాదు ప్రముఖ బిజినెస్ మ్యాన్ సామ్ మర్చంట్.. చాలామంది సెలెబ్రెటీలకు సామ్ మర్చంట్‌తో మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. అయితే గత కొద్ది సంవత్సరాలుగా సామ్ మర్చంట్‌తో త్రిప్తి డిమ్రీ ప్రేమలో ఉందని.. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో వార్తలు వచ్చాయి. దీంతో త్వరలోనే వీరి పెళ్లి జరగబోతున్నట్టు సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది

ఇప్పట్లో లేనట్లేనా..?

స్టార్‌ హీరో కమల్‌ తాజాగా నటించిన సినిమా భారతీయుడు 2.  ఈ సినిమా పై దర్శకుడు శంకర్‌ చాలా హైప్స్‌ క్రియేట్‌ చేసి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చాడు. అయితే ఈ సినిమా ప్రేక్షకులు ఆశించిన మేర ఆకట్టుకోలేకపోయింది. అంతేకాదు ఈ సినిమా చూసిన ప్రేక్షకులు చాలా మంది సినిమా గురించి బహిరంగంగానే మాట్లాడారు అంటే దాని రేంజ్‌ ఏంటో తెలుసుకోవచ్చు.

గత నెలలో విడుదల అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ఫ్లాప్‌గా నిలిచింది. ఈ చిత్రం కమర్షియల్‌గా విఫలం అవ్వడమే  కాకుండా.. శంకర్ ఓల్డ్ స్కూల్ ఆలోచనలపై భారీ విమర్శలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. భారతీయుడు- 2 సినిమా ప్రమోషన్స్ లో కూడా భారతీయుడు- 3 సినిమాని మరో ఆరు నెలలలో విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే ఈ సినిమా దెబ్బకు ఆ మూడో భాగాన్ని ఇప్పట్లో విడుదల చేయడం లేదని సమాచారం.

శంకర్‌ రీ వర్క్ చేసి ఆ చిత్రాన్ని మెరుగుపరచడానికి లైకా ప్రొడక్షన్స్ “భారతీయుడు 3” విడుదలను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ శంకర్‌  “భారతీయుడు 2”, “భారతీయుడు 3” రెండు కూడా ఒకేసారి చిత్రీకరించిన సంగతి తెలిసిందే. “భారతీయుడు 3″ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర బృందం భావించిన సంగతి తెలిసిందే. రెండవ భాగం విజయవంతమైతే.. మూడవ భాగంపై క్రేజ్ భారీగా ఉండేది. కానీ ఇప్పుడు, ఇది పూర్తిగా మారి పోయింది. అయితే భారతీయుడు 2 కంటే భారతీయుడు 3 బాగుంటుందని కమల్ హాసన్ ముందు నుంచి చెబుతు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ మూడవ భాగం ఆకట్టుకునేలా రివర్టింగ్‌గా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

పవర్‌ ఫుల్‌ పోస్టర్‌ తో సూపర్‌ స్టార్‌…ఏ సినిమాలోనిది ఇది!

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ పుట్టిన రోజు శుక్రవారం జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈసారి మహేష్‌ బాబు పుట్టిన రోజు సందర్భంగా మహేష్‌ సినిమాలు రీ రిలీజ్‌ లు …తనకి బర్త్‌ డే విషెస్‌ తో సోషల్‌ మీడియాలో అలాగే ఆఫ్‌ లైన్‌ లో కూడా అభిమానుల రచ్చ వేరే లెవల్లో కొనసాగుతుంది.

 మరి ఇలా ఓ రేంజ్ లో మహేష్ బాబు బర్త్ డే ని ఎంజాయ్ చేస్తున్న అభిమానులకు ఓ పోస్టర్ మాత్రం ఒక్కసారిగా చిన్న షాక్ ఇచ్చింది అని చెప్పాలి. మహేష్ బాబు లాస్ట్ గా నటించిన సినిమా “గుంటూరు కారం” అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి నిర్మాణం వహించిన సంస్థ హారికా హాసిని వారు వదిలిన పోస్టర్ ఒకటి ఇప్పుడు ట్విట్టర్ ని షేక్ చేస్తుంది.

అయితే వారు వదిలిన ఈ పోస్టర్ అసలు గుంటూరు కారం అనే సినిమాకి ఎక్కడా సంబంధమే లేదని తెలుస్తుంది. రెండు చేతుల్లో రెండు కత్తులు పట్టుకొని మొత్తం ఎర్రటి ఎఫెక్ట్ తో డిజైన్ చేసిన పోస్టర్ లో మహేష్ బాబు చూసేందుకు చాలా పవర్ఫుల్ గా కనిపిస్తున్నాడు. అలాగే తన డ్రెస్సింగ్ కూడా గుంటూరు కారం తో సంబంధమే లేకుండా ఈ పోస్టర్ లో ఉంది.

దీంతో అసలు ఇది మాత్రం గుంటూరు కారం లోనిది కాదని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే గుంటూరు కారం సినిమా మొదలు కాకముందే మహేష్ బాబుతో మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ స్టార్ట్ చేసిన యాక్షన్ ప్రాజెక్ట్  ఒకటి ఆగిపోయిన సంగతి తెలిసిందే. దాని ప్లేస్ లో గుంటూరు కారం స్టార్ట్ చేశారు. దీంతో ఈ పోస్టర్ ఆ సినిమాకి చెందినది కావచ్చని అంతా అనుకుంటున్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ మాత్రం ఇవాళ ఏ కొత్త సినిమా అప్డేట్ లేకపోయినా ఈ ఒక్క పోస్టర్ మాత్రం ఫ్యాన్స్ లో ఓ రేంజ్ హైప్ ని తీసుకొచ్చింది అని చెప్పాలి.

నెగిటివ్‌ కామెంటా…అయితే పట్టించుకోవాల్సిన అవసరం లేదు!

సౌత్‌ అత్యధిక ట్రోల్స్‌ ఎదుర్కొన్న నటిని నేనే అంటుంది మహానటి కీర్తి సురేశ్‌.  సినిమా కెరీర్‌ ప్రారంభంలో తాను నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడడంతో చాలామంది తనని విమర్శించారని కీర్తి చెప్పుకొచ్చింది. ట్రోల్స్ వల్ల కొన్ని సందర్భాల్లో తాను చాలా బాధపడ్డానని కూడా వివరించింది.. కావాలని చేసే నెగెటివ్‌ కామెంట్స్‌ను తాను పెద్దగా పట్టించుకోనని ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది.

 తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న కీర్తి పలు విషయాల గురించి ఆసక్తికర కామెంట్‌ చేసింది. ‘వర్క్ విషయంలో చాలా సంతోషంగా ఉన్నా. నాకు నచ్చిన చిత్రాల్లో యాక్ట్‌ చేస్తున్నా. కెరీర్‌ ప్రారంభంలో నేను చేసిన చాలా సినిమాలు ఫ్లాప్‌ గా నిలిచాయి. దాంతో నేను ఎన్నో ట్రోల్స్‌ ఎదుర్కొన్నా. బహుశా అత్యధిక ట్రోల్స్ ఎదుర్కొన్న సౌత్‌ నటిని నేనే కావొచ్చు అంటూ కీర్తి చెప్పుకొచ్చింది. మహానటి తర్వాత నాపై ట్రోల్స్‌ కొంచెం తగ్గాయి. వివరణాత్మక విమర్శల నుంచి నేను కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటాను.

అయితే కొంతమంది కావాలని చేసే నెగెటివ్‌ కామెంట్స్‌ గురించి పెద్దగా పట్టించుకోను. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందని భావిస్తా’ అని రఘు తాత సినిమా ప్రమోషన్‌లో భాగంగా కీర్తి సురేశ్‌ చెప్పుకొచ్చారు. 2000లో మలయాళ చిత్రం పైలట్స్‌తో కీర్తి సురేష్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చారు. పాంభు సత్తాయ్, పెంగ్విన్, మరక్కర్, నేను లోకల్, మహానటి, సర్కారు వారి పాట, దసరా వంటి హిట్ సినిమాల్లో కథానాయికగా చేశారు.

తెలుగులో మహానటి చిత్రానికి ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే. దసరాలో తన పాత్రకు ఫిలింఫేర్ సౌత్ అవార్డ్స్‌లో ఉత్తమ నటి అవార్డును కీర్తి అందుకుంది. ఇటీవల రఘు తాత పూర్తి చేసిన కీర్తి.. ‘బేబీ జాన్‌’తో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టబోతున్న సంగతి తెలిసిందే.

చరణ్‌-బుచ్చిబాబు సినిమా ఎప్పుడంటే..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ చివరి దశలో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను కోలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా చివరి షెడ్యూల్ లో  రామ్ చరణ్ కు సంబంధించి కొంత మేర షూటింగ్  పెండింగ్ లో ఉంది. ఎప్పుడు స్టార్ట్ చేస్తారనే క్లారిటి కూడా మూవీ టీమ్‌ ఇవ్వలేదు. మరోవైపు ఈ  సినిమా డబ్బింగ్ పనులను కూడా మెుదలు పెట్టారు మూవీమేకర్స్. వీలైనంత త్వరగా ఈ సినిమాను ముగించాలని  మెగా పవర్ స్టార్ చూస్తున్నాడు.

కాగా తన తరువాత  సినిమాను చాలా రోజుల క్రితమే చరణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉప్పెనతో బ్లాక్ బస్టర్ కొట్టిన బుచ్చి బాబు సాన దర్శకత్వంలో చరణ్ నటించబోతున్నాడు. అత్యంత భారీ బడ్జెట్ లో టాలీవుడ్ బడా నిర్మాణ సంస్ధ మైత్రీ మూవీస్ ఈ సినిమాను ఎంతో గ్రాండ్‌ నిర్మించనుంది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు… అక్టోబర్ నుండి ఈ సినిమా షూటింగ్ మొదలెట్టాలని ప్లాన్ చేస్తున్నారట చిత్ర యూనిట్.

ఈ లోపు రామ్ చరణ్ తన ఫిజిక్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా అందుకోసం బాడీని మరికొంత పెంచి ఫిట్ గా మారేందుకు డైట్ ప్లాన్ మార్చబోతున్నాడట మెగా హీరో. రామ్ చరణ్ కెరీర్ లో 16వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ కథానాయకగా చేస్తుంది.

“Simbaa” Telugu Movie Review

Movie Name : Simbaa

Cast : Jagapathi Babu, Anasuya, Gautami, Kasturi, Aneesh Kuruvilla, Vasishta N Simha, Divi Vaidhya, Kabir Duhan Singh, Srinath Maganti and etc.

Director : Murali Manohar Reddy

Music Director : Krishna Saurabh

Telugumopo.com Rating: 2.25/5

Story:

Simbaa presents an intense drama of environmental advocacy versus corporate greed, set in Hyderabad. The city is rocked by a series of violent murders aimed at people linked to the Partha Group of Industries, run by the powerful Partha (Kabir Duhan Singh).

The police investigation centers on school teacher Akshika (Anasuya Bharadwaj) and investigative journalist Faasil (Maganti Srinath), raising doubts about their involvement. However, the case takes an unexpected turn when the meticulous officer Anurag (Vasishta Simha) uncovers a series of shocking revelations.

The story intertwines with that of Purushottam Reddy (Jagapathi Babu), a fervent environmental activist battling against industrial pollution. The film delves into how his fight against the Partha Group and their damaging environmental practices is linked to the series of murders, leading to a gripping investigation.

Review :

Jagapathi Babu gives a compelling performance as the determined environmental activist, showcasing his acting abilities. Anasuya Bharadwaj excels with her versatility, skillfully managing intense action sequences. Vasishta Simha makes a strong impression as the committed investigative officer, infusing his role with depth and gravitas.

Divi Vaidya and Maganti Srinath enhance the film’s ensemble with their notable performances. Gautami’s role, however, is rather insignificant, and Kabir Duhan Singh’s depiction of the antagonist lacks nuance, coming across as somewhat one-dimensional. Anish Kuruvilla, Kasturi, and the supporting actors provide solid performances, adding to the film’s overall story.

Simbaa offers a captivating story that emphasizes the pressing need for environmental conservation within the context of a suspenseful crime thriller. However, a more refined and engaging flashback sequence could have enhanced the film’s overall impact.

The film kicks off with a gripping series of murders in the first half, but the subsequent police investigation fails to maintain suspense and becomes rather predictable. The introduction of Jagapathi Babu in the second half adds a dynamic element to the story. However, the director missed an opportunity to strengthen the environmental message by incorporating more compelling dialogues for his character.

Krishna Saurabh’s background music is adequate, though it could have been more compelling. The production values are acceptable, providing a solid foundation without being particularly remarkable.

Simbaa effectively communicates an important environmental message within the framework of a crime thriller. While the film has notable strengths, such as Jagapathi Babu’s impressive performance and an engaging premise, it falls short in areas like the police investigation, which lacks excitement, and editing, which could be tighter. Additionally, a more pronounced emphasis on the environmental theme would have added greater impact to the overall narrative.

Overall, Simbaa emerges as a conventional crime thriller. Directed by Murali Manohar, the film initially grabs interest with its intriguing premise. However, the investigation sequences fall short of delivering the expected twists and turns, leading to a predictable and somewhat disappointing experience.

తన బిడ్డ పేరు బయటపెట్టిన మృణాల్..అదేంటి పెళ్లి కాకుండానే..?

సీతారామం సినిమాతో తెలుగు సినీ పరిశ్రమతో పాటు అభిమానుల గుండెల్లో కూడా సీతామహాలక్ష్మిగా స్థిరపడిపోయింది మృణాల్‌ ఠాకూర్‌. ఈ సినిమాలో దుల్కర్‌ సల్మాన్‌ సరసన సీతగా చేసి తనకంటూ ఓ గుర్తింపు ను సొంతం చేసుకుంది.  ఆ తర్వాత ‘హాయ్ నాన్న’ చిత్రంలోనూ నాని సరసన నటించి మంచి పేరు సొంతం చేసుకుంది ఈ ముద్దు గుమ్మ. శౌర్యువ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బేబీ కియారా ఓ కీలక పాత్ర పోషించింది.

కాగా హాయ్ నాన్న చిత్రంలో తండ్రి కూతుళ్ల బంధం గురించి చాలా చక్కగా చూపించారు. తల్లి పాత్రలో మృణాల్ కూడా అద్భుతంగా యాక్ట్‌ చేసింది. ఇక కొన్ని సార్లు ఆన్ స్క్రీన్ లో ఏర్పడిన బంధాలు ఆఫ్ స్క్రీన్ లో కంటిన్యూ అవ్వడం చూస్తుంటాం. అలాంటిదే మృణాల్ బేబీ కియారా మధ్య అనుబంధం ఉందని తెలుస్తోంది. హాయ్‌నాన్న సినిమాలో నటించిన బేబి కియారాతో తనకు అలాంటి అనుబంధం ఏర్పడిందని తెలిపింది.

‘వయస్సులో నాకంటే చాలా చిన్నది అయినా నన్ను యష్నా లేదా ”ఎం” అని పిలుస్తుంది. తానే ఎప్పటికీ నా మొదటి పాపే. నాకు పిల్లలు పుట్టిన వారు నాకు రెండో సంతానమే అవుతారు…ఎందుకంటే కియారాతో ఏర్పడిన అనుబంధం అలాంటిది. తను కళ్లతోనే ఎన్నో విషయాలను మాట్లాడేస్తుంది. తన నుంచి ఎన్నో కొత్త విషయాలను నేర్చుకోవచ్చు’ అంటూ సినిమా షూటింగ్ వీడియోను తన సోషల్‌ మీడియా ఖాతాలో మృణాల్‌ పోస్ట్ చేసింది.

దీంతో దీని గురించి స్పందించిన చిన్నారి కియారా  నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను .మిమ్మల్ని కలవడం నా లక్‌. ఎల్లప్పుడూ మీ ఆశీర్వాదం నాకు ఉండాలి. త్వరలోనే నన్ను కలవండి అంటూ రిప్లై ఇచ్చింది. దీనికి మృణాల్ రెండు హార్ట్ సింబల్స్ ను రిప్లైగా ఇచ్చి తన ప్రేమను వ్యక్తం చేసింది. ఇప్పుడు ఈ పోస్టులు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి.