Home Blog Page 708

జగన్.. థాంక్స్ చెప్పడం మరిచి.. తాళలేకపోతున్నారే!

ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి తన పరువు కాపాడే ప్రయత్నం చేస్తున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు థాంక్స్ చెప్పుకోవాలేమో. ఆయన మాటలను గమనిస్తే.. చంద్రబాబునాయుడు.. జగన్మోహన్ రెడ్డి పరువు కాపాడేందుకు ఎంతగా ప్రయత్నిస్తున్నారో మనకు అర్థమవుతుంది. కానీ.. జగన్ థాంక్స్ చెప్పడానికి బదులుగా తనకు అలవాటైన బురద చల్లే ప్రయత్నమే చేస్తున్నారు. కాలపరీక్షకు నిలబడే విమర్శలు కాకపోయినా.. బురద చల్లుతున్నారు. ఇప్పటికి ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలే అయింది. తను చేస్తున్న విమర్శలకు ఇంకో రెండు నెలలు గడిచేసరికి కాలం చెల్లుతుందని, ఈ విమర్శల పట్ల జనం నవ్వుకుంటారని తెలిసినా కూడా జగన్ అదే పనిచేస్తున్నారు. చూడబోతే.. అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం వేస్తున్న అడుగులు చూసి తాళలేకపోతున్నట్టుగా ఉంది.

ఎన్నికల ప్రచార సమయంలో రాష్ట్రానికి 14 లక్షల కోట్ల అప్పులున్నాయని, అయినా సంపద సృష్టిస్తానని చంద్రబాబు చెప్పారట. అధికారంలోకి వచ్చిన తర్వాత.. అప్పులు పదిలక్షల కోట్లు అంటున్నారట. ఇలా ప్రజలను మభ్యపెడుతున్నారంటూ జగన్ ఆడిపోసుకుంటున్నారు. నిజానికి అప్పుల లెక్క తగ్గించినందుకు జగన్ మురిసిపోవాలి కదా. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుకు ఎగ్జాక్ట్ లెక్కలు తెలియవు గనుక.. అంచనాగా చెప్పి ఉండొచ్చు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా లెక్కతీసి పదిలక్షల కోట్లు అని ఉండొచ్చు. అందుకు జగన్ సంతోషించాలి కదా అని జనం ప్రశ్నిస్తున్నారు.

అదే సమయంలో.. జగన్ అసలు నిజానికి ఉన్నది 7.48 లక్షల కోట్లు అప్పు మాత్రమే  అని జగన్ స్వయంగా చెబుతున్నారు. మరి జగన్ నిజాయితీ పరుడు అయితే.. చంద్రబాబు ఎన్నికల ప్రచార సమయంలో అప్పులు 14 లక్షల కోట్లు అన్న రోజున..  అదే సమయంలో ఆ అంకె తప్పు.. 7.48 లక్ష్లల కోట్ల అప్పు ఉంది అనే మాట ధైర్యంగా చెప్పగలిగారా? అనేది ప్రజల ప్రశ్న. చంద్రబాబు మభ్యపెట్టడం అంటూ ఇందులో ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డే.. నిన్నటిదాకా రాష్ట్రప్రజలందరినీ మోసం చేస్తూ వచ్చారు. అప్పుల విషయంలో మాయ చేస్తూ వచ్చారు అని అంతా అనుకుంటున్నారు. 

Get Ready For Action: Saripodhaa Sanivaaram Trailer Announcement From Nani!

Nani, the star of ‘Shyam Singha Roy’, has just dropped an electrifying update on his social media! He teased the trailer of his upcoming movie ‘Saripodhaa Sanivaaram’ with a thrilling message: “Starts with a drizzle – Ends with a STORM.” And guess what? The trailer is set to hit screens on August 13th!

Directed by the inventive Vivek Athreya, this action-packed thriller is sure to captivate audiences. Produced by DVV Entertainment’s DVV Danayya and Kalyan Dasari, the film promises to deliver a whirlwind of excitement.

The production house couldn’t resist sharing Nani’s tweet, adding their own hype: “The people of Sokulapalem are buzzing with excitement! Brace yourselves for an adrenaline-pumping trailer on August 13th!”

Mark your calendars and get ready for a cinematic storm!

Minister Uttam Kumar Reddy Hints at Ration Card Flexibility for Dual-State Holders

Minister Uttam Kumar Reddy announced that there could be an option provided for individuals holding ration cards in both Telangana and Andhra Pradesh. This was discussed during a cabinet sub-committee meeting on the distribution of white ration cards, attended by Ministers Uttam Kumar Reddy, Damodar Rajanarasimha, and Ponguleti Srinivas Reddy.

During the meeting, the sub-committee proposed that households in rural areas with an annual income of up to Rs 1 lakh, owning 3.50 acres of Magani or less than 7.5 acres, should be eligible for white ration cards. For urban areas, the proposal suggests that those with a maximum annual income of Rs 2 lakh would qualify for the ration cards.

The sub-committee also emphasized the importance of gathering input from all political parties and public representatives. Letters will be sent to MPs and MLAs seeking their suggestions on the matter. Uttam Kumar Reddy confirmed that the recommendations of the Saxena Committee would also be considered in the ration card distribution process. Currently, Telangana has over 89 lakh ration cards, with an additional 10 lakh applications pending approval.

పేర్ల పిచ్చిలో జగన్ – బాబు మధ్య తేడా అదే!

ప్రభుత్వంలో ఒక పని పూర్తి చేయడానికి ఒక నాయకుడు తన శాయశక్తులా కృషి చేసిఉంటే, అందుకోసం పరితపించి ఉంటే.. అలాంటి నాయకుడిని ఆ పనికి పెడితే సబబుగా ఉంటుంది. అలా కాకుండా.. అధికారం తమ చేతికి వచ్చింది కదా అని.. ఉన్న ప్రాజెక్టులు అన్నింటికీ తనకు నచ్చిన పేర్లు పెట్టేసుకుంటే కామెడీగా ఉంటుంది. రాష్ట్రంలో అనేక పథకాలకు, ప్రాజెక్టులకు పేర్లు పెట్టే విషయంలో జగన్మోహన్ రెడ్డి అనుసరించిన వైఖరి అదే. అర్థం పర్థం లేకుండా నీటి ప్రాజెక్టులకు తన తండ్రి వైయస్ఆర్ పేరు పెట్టుకున్నారు జగన్. ఆ ఓవర్ యాక్షన్ పనులను ఇప్పుడు ఎన్డీయే కూటమి ప్రభుత్వం సరిదిద్దుతోంది. తమ పార్టీకి చెందిన వ్యక్తుల పేర్లే ప్రధానం అనే యావ వదిలేసి..  ప్రాజెక్టులకు పాత పేర్లు పునరుద్దరిస్తున్నారు.

రాష్ట్రంలో మొత్తం 12 నీటి ప్రాజెక్టులకు, జగన్ సర్కారు పెట్టిన పేర్లను తొలగించి అంతకు ముందు ఉన్న పాత పేర్లను పునరుద్ధరించేలా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గోదావరి పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టు, ముక్త్యాల ఎత్తిపోతల పథకం వంటివి ఇందులో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి పేర్ల పిచ్చి ఉన్నట్లుగా.. ప్రతి పథకానికి ఎన్టీఆర్ పేరును జోడించాలని చంద్రబాబు నాయుడు ఆత్ర పడలేదు. ఆ పథకాలకు సహజంగా ఏ పేరు బాగుంటుందో అవే పెట్టారు. జగన్ లాగా తమకు సంబంధం లేని ప్రాజెక్టులకు కూడా తమ పేరు పెట్టుకోవాలి అనే అతిశయ పోకడను ప్రదర్శించలేదు. ఇలా పథకాలకు ప్రాజెక్టులకు పేర్లు పెట్టే విషయంలో చంద్రబాబు నాయుడు జగన్ ప్రభుత్వాల మధ్య హస్తిమశకాంతరం అనదగినంతటి తేడా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

గత ప్రభుత్వ హయాంలో విద్యా రంగానికి సంబంధించిన పథకాలు కూడా జగన్ కుటుంబ పేర్లతోనే నిండిపోయాయి. కొత్త ప్రభుత్వం ఆ పేర్లను తొలగించింది. జాతీయస్థాయిలో విద్యారంగంలో పేరు మోసిన మహానుభావుల పేర్లను పథకాలకు పెడతాం.. అని మంత్రి లోకేష్ ప్రకటించారు కూడా. ఆ వైఖరిలోనే జగన్ చంద్రబాబు ప్రభుత్వాల మధ్య పేరు పిచ్చి విషయంలో ఉండే తేడా తెలిసిపోతున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

రెడ్ బుక్ చూసి జగన్ జడుసుకోవడం ఎందుకు?

అధికారంలో ఉండగా చేసిన పాపాలకు పరిహారం చెల్లించక తప్పదని మాజీ ముఖ్యమంత్రి జగన్ భయపడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఏ పాపం ముందుగా పండుతుందో.. ఏ క్షణాన కటకటాల్లోకి వెళ్ళవలసి వస్తుందో అనే భయంతో ఆయన సతమతం అయిపోతున్నారు. రాష్ట్రంలో ఏ పనిమీద ఎక్కడ పర్యటించినా.. మీడియా ముందు మాట్లాడే అవకాశం ఎక్కడ వచ్చినా ఆయన రెడ్ బుక్ ప్రస్తావన తెస్తారు. రెడ్ బుక్ పరిపాలన రాష్ట్రంలో నడుస్తోందని అడిపోసుకుంటారు.

అసలు ఇంతకూ రెడ్ బుక్ గురించి జగన్ భయపడాల్సిన అవసరం ఏముంది అనేది సాధారణ ప్రజలకు కలుగుతున్న సందేహం. ఎందుకంటే.. నియమ నిబంధనల గీత దాటి అడ్డగోలుగా వ్యవహరించిన అధికారుల దురాగతాలు అన్నీ తాను రెడ్ బుక్ లో నమోదు చేశామని లోకేష్ గతంలో పలు సందర్భాల్లో చెబుతూ వచ్చారు. టిడిపి సర్కారు ఏర్పడిన తరువాత.. గతంలో నీతి తప్పిన అధికారులు మాత్రమే రెడ్ బుక్ గురించి భయపడాలి గాని, జగన్ కు భయమెందుకు? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

జగన్ పరిపాలన సాగుతున్న రోజుల్లో, ఆయన చట్టాలను పట్టించుకోకుండా చెలరేగిన సందర్భాల్లో.. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని టీడీపీ వారు విమర్శించేవారు. దానికి కౌంటర్ గా.. ఇప్పుడు రెడ్ బుక్ పరిపాలన నడుస్తోందని జగన్ అంటున్నారనేది. ఒక వాదన.

అదేసమయంలో మరొక కీలక వాదన కూడా వినిపిస్తోంది. 

రెడ్ బుక్ నిజంగానే ఉంటే.. తప్పుడు పనులు చేసిన అధికారుల వివరాలు అందులో ఉంటే.. వారిని విచారిస్తారని జగన్ భయపడుతున్నట్టుగా కొందరు అంచనా వేస్తున్నారు. తనకు వీర భక్తులు ఆయిన అధికార్లను విచారించినా, తన జాతకం బయటకు వస్తుందనే భయం జగన్ లో ఉన్నట్టుగా పలువురు అంచనా వేస్తున్నారు.

Chandrababu determined to revive TDP in Telangana

Telugu Desam Party supremo and Andhra Pradesh Chief Minister Chandrababu is very determined to revive the lost glory of his party in Telangana in the next few years. Though the party was pushed into the state of complete oblivion with the sudden exit of Telangana president Kasani Gnaneshwar ahead of the 2023 polls in November last year, Naidu appears to have now harboured the dream to regain its strength after his historic electorate victory in Andhra Pradesh assembly elections in June this year. 

On Saturday, Naidu convened a meeting with a TDP leaders of Telangana in NTR Trust Bhavan Hyderabad and announced his plans to reclaim the party’s lost charisma in the state and vowed to strengthen the cadre in the coming days. He exuded confidence in bringing the party back to power in Telangana in the future. Naidu said TDP once had a stronghold in Telangana, but lost the grip due to many reasons. He admitted that the party didn’t contest in the last year’s elections for some reasons and also agreed that the president wasn’t announced owing to his busy commitments in Andhra Pradesh. 

Naidu informed all TTDP leaders that the restructuring of the party will commence very soon and a membership drive will be conducted on a large scale. He also promised to take steps to strengthen the party at all levels. Naidu also announced that he will avail himself to meet Telangana leaders once in a while to discuss about the strategies to help the party revive the past glory. 

It looks like the victory in Andhra Pradesh emboldened Naidu to concentrate on Telangana politics. After the state bifurcation, TTDP dominated some areas in Telangana in the 2014 elections. However, by 2019, the party struggled to keep its flock together and performed poorly in elections. In 2023, it completely stayed away from the contest. Many of its leaders dumped the party and joined the remaining parties. 

Already, three parties are fighting it out in Telangana. So, it would be interesting to see if Naidu can lift the party from the ashes there and make it a force to reckon with in the next few years. 

మెగా ప్రిన్స్‌ మట్కా..సినిమా ఫస్ట్‌ లుక్‌ ఎప్పుడో తెలుసా!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా మీనాక్షి చౌదరి అలాగే బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి కథానాయికలుగా దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “మట్కా”  గురించి అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా ఇంట్రెస్టింగ్ గ్యాంగ్ స్టర్ కం పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతుండగా వరుణ్ తేజ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లుగా సమాచారం.

ఇక ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ ఓ సరికొత్త మేకోవర్ ని సిద్ధం చేయగా ఈ లుక్ పై ఫస్ట్ లుక్ పోస్టర్ ఎపుడు విడుదల చేస్తారు అనేది ఇప్పుడు మేకర్స్ ప్రకటించేశారు. మరి ఈ ఫస్ట్ లుక్ ని ఆదివారం ఆగస్ట్ 11న ఉదయం 11 గంటల 7 నిమిషాలకి విడుదల చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి దీనిపై కూడా ఒక ఇంట్రెస్టింగ్ ప్రీ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. దీంతో రేపు రానున్న పోస్టర్ పై మంచి ఆసక్తి నెలకొంది. ఇక ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా “హాయ్ నాన్న” నిర్మాణ సంస్థ వైరా ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.

దేవర మైకంలో జాన్వీ చుట్టేస్తుందిగా…!

బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ టాలీవుడ్ లో సాలిడ్‌ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిపోయింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతోన్న ‘దేవర’ సినిమాలో హీరోయిన్‌గా ఈ బ్యూటీ తన సత్తా చాటేందుకు త్వరలోనే రాబోతుంది. దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమాలో అమ్మడు తన నటనతో పాటు గ్లామర్ డోస్‌తో ఆడియెన్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు రెడీ అయిపోతుంది. ఇక ఈ సినిమా నుంచి ఇటీవల ‘చుట్టమల్లె’ అనే రొమాంటిక్ సాంగ్‌ను విడుదల చేశారు మూవీ మేకర్స్‌.

ఈ పాటను రొమాంటిక్ మెలోడీగా చిత్ర యూనిట్ ప్రెజెంట్ చేయబోతుంది. ఈ పాటలో జాన్వీ తన అందాలతో కుర్రకారును ఆకట్టుకుంటోంది. ఈ పాట విడుదల అయ్యి రోజులు గడుస్తున్నా యువత ఈ పాటకు అట్రాక్ట్ అయ్యి అదే మేనియాలో ఊగిసలాడుతున్నారు. అటు జాన్వీ కూడా ఈ పాటకు బాగా అడిక్ట్ అయ్యినట్లు తెలుస్తుంది. ఆమె తన సోషల్ మీడియాలో రోజూ ఈ పాటకు సంబంధించి ఏదో ఒక విషయాన్ని రివీల్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది.

తాజాగా ఈ పాట హిందీ వర్షెన్‌కి అమ్మడు ఓ రీల్ చేసి తన ఇన్‌స్టా లో పోస్ట్ చేసింది. ఈ రీల్‌కి అభిమానులు ఫ్లాట్‌ అయిపోతున్నారు. తన అందంతో అభిమానుల గుండెల్ని చుట్టేస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక దేవర చిత్రాన్ని సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేసేందుకు మూవీమేకర్స్ రెడీ అవుతున్నారు.

సుహాస్‌ తో మహానటి ఫోటో..ఇంట్రస్టింగ్‌ పోస్ట్‌!

మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ నటుల్లో నేచురల్ పెర్ఫామర్ సుహాస్ కూడా ఒకడు. తన నటనతో చిన్న చిన్న పాత్రలు నుంచి ఇప్పుడు హీరోగా కూడా మంచి సినిమాలు చేసే స్థాయికి చేరుకున్నాడు. ఇలా పలు ఆసక్తికర సినిమాలు తాను చేస్తుండగా ఈ చిత్రాల్లో ఒక వెబ్ ఫిల్మ్ ని కూడా తాజాగా తాను చేస్తున్నాడు.

ఆ సినిమానే “ఉప్పు కప్పురంబు” కాగా ఈ చిత్రాన్ని అని శశి దర్శకత్వం వహిస్తుండగా ఈ చిత్రంలో సుహాస్ సరసన స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కూడా యాక్ట్‌ చేస్తుంది. మరి ఈ సినిమాపై సుహాస్ లేటెస్ట్ గా ఇచ్చిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీంతో ఈ చిత్రాన్ని తాము పూర్తి చేసేసినట్టుగా తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.

మరి ఇందులో కీర్తి సురేష్ తో కలిసి ఉన్న పిక్ ని ముందు పోస్ట్ చేయగా తమ సినిమా ఉప్పు కప్పురంబు షూటింగ్ శుక్రవారం రాత్రితో పూర్తి చేసేసినట్టుగా వివరించాడు. మరి కీర్తి సురేష్ తో అలాగే సినిమా యూనిట్ అందరితో కలిసి వర్క్ చేయడం ఎంతో బాగుంది అని తెలిపాడు. దీంతో ఈ పిక్ ఇపుడు వైరల్ గా మారింది.

ఒకే వేదిక పై చిరంజీవి..బాలయ్య!

నందమూరి నటసింహం బాలయ్య బాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న టాక్‌ అన్‌స్టాపబుల్‌…ఈ సినిమా ఇప్పటికే విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసుకుని మరో సీజన్‌ కి రెడీ అయిపోయింది. ఆహాలో ప్రసారం అవ్వబోతున్న ఈ షోకి సంబంధించిన పనులు కూడా ఇప్పటికే పూర్తయ్యాయని తెలుస్తోంది.

కొత్త సీజన్‌ సరికొత్త సర్‌ప్రైజ్‌లతో సిద్ధమవుతోందని నిపుణుల బృందం చెబుతుంది. నిజానికి మొదటి మూడు సీజన్లలో అనేకమంది హీరోలు, డైరెక్టర్లతో సహా చంద్రబాబు వంటి వారితో సందడి చేసిన ఈ షో ఇప్పుడు మరింత జోష్‌తో కొనసాగనుందని తెలుస్తోంది. ఈ సారి సీజన్లో చిరంజీవితో పాటు నాగార్జున ఎపిసోడ్స్ కూడా టీమ్‌ ప్లాన్ చేసినట్టు సమాచారం.

ఈ విషయాన్ని ఒక మీటింగ్ లో ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రెటరీ ప్రసన్న కుమార్ తెలిపారు. ఇక అధికారికంగా ప్రకటన వెలువడటమే లేట్ . ఇక చిరు పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రకటన బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ మొదలయింది. నిజానికి తెలుగు చిత్ర పరిశ్రమలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లది ఓ ప్రత్యేక స్థానం. ముఖ్యంగా బాలయ్య-చిరు అభిమానుల మధ్య గొడవలు పీక్స్ లో ఉంటాయి.

కానీ ఇప్పుడు పోటీ తగ్గడంతో పాటు జనసేన టీడీపీ కలిసి పనిచేయడం ఓ కలిసి వచ్చిన అంశం. ఇక ఈ ఇద్దరు స్టార్‌ హీరోలు ఒకే వేదికపై కనిపిస్తే, అభిమానులకు అంతకుమించిన వినోదం ఏముంటుంది.