Home Blog Page 686

విరాళంలో కూడా డ్రామాయేనా జగన్!

మాజీ ముఖ్యమంత్రి వర బాధిత ప్రాంతాల ప్రజలకు సాయం అందించే విషయంలో కూడా తన సంకుచిత బుద్ధిని బయట పెట్టుకుంటున్నారు. ఆయన ఏపీలో వరద బాధితులకు సహాయక చర్యలు అందించేందుకు కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. అయితే ఆ సొమ్ము జగన్ ఇచ్చినట్టుగా కాదన్నమాట. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇచ్చినట్టుగా ప్రకటించారుట. అది కూడా దానిని ఏ ముఖ్యమంత్రి సహాయ నిధికో ఇవ్వకుండా.. నేరుగా తమ పార్టీ వారి ద్వారానే ప్రజలకు సహాయక చర్యలు అందించాలని ఆదేశించారుట. దాంతో ఇన్నాళ్లూ వరద తీవ్రత ముప్పు బాగా ఉన్నప్పుడు గడప దాటకుండా ఉండిపోయిన వైసీపీ నాయకులు.. ఇప్పుడు ప్రజలందరూ శిబిరాలకు తరలిన తర్వాత.. వరద తీవ్రత ఉపశమించిన తరువాత ఆహార పొట్లాలు వాటర్ బాటిళ్లు పట్టుకుని డ్రామా ఆడడానికి రంగంలోకి దిగారు.

అంటే ఏమిటన్నమాట? కోటిరూపాయల విరాళం ఇస్తున్నది జగన్ కాదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అది కూడా వారు పంచిపెట్టే నీళ్ల సీసాలు, అన్నం పొట్లాల రూపంలో లెక్క చెప్పేయబోతున్నారు. రెండు రోజుల ఈ పంపకాల నాటకం నడిపించి.. కోటి రూపాయల విలువకు సరిపడేలా ఇన్ని వేల అన్నం ప్యాకెట్లు పంచాం, ఇన్ని లక్షల వాటర్ బాటిళ్లు పంచాం అని ప్రకటించి వారు చేతులు దులుపుకోగలరు. చివరికి ఇవి పంచడానికి వైసీపీ నాయకులు ఎక్కి తిరుగుతున్న ట్రాక్టర్ల అద్దె కూడా కోటిరూపాయల లెక్కలో రాయగలరు!

ఇలాంటి పనులు చేస్తున్న వాళ్లు ఇప్పటికే చాలా మంది ఉన్నారు. స్థానికులు సామాన్యులు కూడా వందల ఆహార పొట్లాలు తాము స్వయంగా సిద్ధం చేయించి తీవ్రత ఉన్న రోజుల్లో పంచిపెట్టారు. ఆయా రోజుల్లో అసలు వైసీపీ నేతలు గడపదాటి బయటకు రాలేదు. కేవలం ప్రభుత్వం మీద నిందలు వేయడానికి మాత్రమే పరిమితం అయ్యారు. జగన్ కోటిరూపాయలు  వైసీపీ పార్టీ తరఫున ప్రకటించిన తరువాత.. వారు బయటకు వచ్చారు. ఇంతకీ ఆ అన్నం పొట్లాలు తయారుచేసేవారికి, వాటర్ బాటిళ్లకు డబ్బులిచ్చి కొనుగోలు చేస్తున్నారో.. లేదా, రెగులర్ గా సాగించే దందాల్లాగానే నడిపిస్తున్నారో కూడా అర్థం కావడం లేదు.

అసలే తెలంగాణకు ఒక్కరూపాయి సాయం కూడా ప్రకటించకుండా ఏపీకి మాత్రం జగన్ సాయం అందించడంపై కొన్ని విమర్శలున్నాయి. దానికి తగ్గట్టుగా ఆ ఒక్క కోటి రూపాయలతో.. తమ పార్టీ నాయకులందరూ అపరిమితమైన కీర్తిని గడించాలని జగన్ ఆశించడం చాలా సంకుచితంగా ఉన్నదని ప్రజలు అంటున్నారు.

Vijayawada city Recovering From Floods Havoc, Budameru slowly Receding

As Budameru flood is slowly receding and water flow in Krishna river drastically receded to 3.16 lakh cusecs, the Vijayawada city is recovering from floods havoc. Around 80 percent of Ajit Singh Nagar, Payakapuram and other areas, which were submerged in 5 to 8 feet of flood water due to the inundation of Budameru, have survived the flood.

Authorities are restoring power supply in places where the flood water has receded. Special attention was paid to sanitation in flood prone areas. Sanitation works are being done on a war footing. 3454 workers and 450 public health personnel are being used for these works under Vijayawada Municipal Corporation.

Along with them, 5889 workers from other municipalities were brought into the field. However, due to the accumulation of mud in the houses, it is difficult to clean it. Observing this situation, the officials simultaneously brought fire engines to the field. About 48 fire engines have been brought from different parts of the state. Through them, the mud and sewage that have reached the streets and houses are being removed.

About 60,000 houses were completely flooded and it was estimated that the damage would be Rs.600 crores. This is only residential property damage. It is estimated that each family has lost property worth at least Rs. 1 lakh.

The government has said that 32 people have died due to heavy rains and floods across the state, of which 24 people have died in NTR district alone. Seven people died in Guntur district and one died in Palnadu district. It said that 1,69,370 acres of crops and 18,424 acres of horticultural crops were damaged. It is said that 2.34 lakh farmers have lost due to these floods.

It has been revealed that 60,000 chickens and 222 cattle have died. 22 electricity sub-stations were damaged due to floods and 3973 kilometers of roads were damaged. It is said that 78 ponds and canals have been damaged.

50 NDRF and SDRF teams have reached the field, six helicopters and 228 boats are working to help the flood victims. It said that 317 yards of swimmers were fielded.

Ram Madhav slams Ex-Militants openly campaigning For NC, PDP, Candidates In J&K

BJP senior leader and Jammu and Kashmir Election’s Incharge, Ram Madhav alleged that the National Conference (NC) and the People’s Democratic Party (PDP) of taking support from ex-militants for the assembly polls in Jammu and Kashmir. He warned that the two parties want to take the Union territory back to its “trouble-filled days”.

Referring to the Abdullahs and Muftis, Madhav, he said the two families need to be shown the door. He cautioned that people of Jammu and Kashmir have witnessed enough uncertain situations in the past, and BJP believes that families responsible for violence, bloodshed and uncertainty must be vacated from the political landscape of Jammu & Kashmir.

He asserted that BJP will be the single largest party who will emerge victorious in the upcoming Assembly elections in J&K. He is confident of BJP forming the first government in the history of Jammu and Kashmir by winning 45 seats in the 90-member Assembly. According to him, the party will win 35 seats in Jammu and 10 seats in Kashmir.

If the party is unable to win an absolute majority, he said they will consider seeking support from small groups.


“We want to remember people of J&K that the manifesto of NC, PDP and others explains the revival of uncertainty in Jammu & Kashmir, and such parties are getting open support of ex-militants,” he said.

 “Today ex-militants are campaigning for NC, PDP, Congress and others. The people of J&K need to defeat their designs, and give a chance to new government formation in the region,” Madhav told reporters.

He said in democracy there is a space for everyone and we welcome if anyone comes forward and takes part in the electoral process, but at the same time we won’t endorse those using backing of militants in elections.

Without naming Jamaat-e-Islami, the BJP senior leader said “They too came forward and are fighting elections. They have admitted this fact that elections that took place in J&K in the recent past were free and fair”.

Ram Madhav said that Union Home Minister Amit Shah is visiting the state on September 6 and 7 and he will release BJP’s election manifesto. Later, he said Prime Minister Narendra Modi and other party leaders will participate in BJP’s election campaign.

YS Jagan slams Vijayawada Floods A Man Made Disaster

Former Chief Minister and YCP chief YS Jaganmohan Reddy reiterated that the Vijayawada floods were a man-made disaster caused by government negligence. He alleged that Chandrababu Naidu’s government has miserably failed in coming to rescue of the flood victims and also blamed the government for not taking any concrete measures to assist flood victims,

During his visit to the flood-affected areas of old Rajarajeswari Peta in Vijayawada, he expressed his frustration with the negligent attitude of Chandrababu’s government. He said that if a proper plan had been in place, the situation would not have escalated to this level.

Blaming the coalition government for indifferent attitude in rescue operations, he said that there are no camps anywhere, and it’s clear that Chandrababu has no concern for the people. No matter which colony you visit in Vijayawada, the situation is the same, he added.

Jaganmohan Reddy asked who lifted the Budameru regulator gates? Why were they lifted? If the gates were not lifted, he alleged that Chandrababu’s house would have been submerged. If lifted, he said, it would affect only Vijayawada.

Referring to Chandrababu having been monitoring relief operations by residing at Collectorate, Jagan rediculted it stating that as his house was submerged in the floods, so he chose to stay at the Collectorate Office, putting up a front. .

He alleged that besides advance information about the rains and floods, yet no effective measures were taken. “If proper reviews were conducted and responsibilities were assigned to relevant officials, and if things were handled systematically, we wouldn’t have seen this situation”, he added.

He deplored that Chandrababu is trying to escape by making the officials the scapegoats for his mistakes and blaming officials after replacing all officials during the last four months.

The former Chief Minister asserted that if the volunteer system were in place, such a situation wouldn’t have arisen. Without retaining walls, areas like Krishnalanka would have been submerged, he added.

He asserted that such dire situations never occurred during his government. When floods hit the Godavari in our time, he recalled that they had relocated 30,000 out of 40,000 people to relief camps.

“We set up relief camps in advance, and volunteers were always on alert. Volunteers, along with secretariat staff, would work together to evacuate people. After the flood impact subsided, we provided immediate financial aid and sent them back, never empty-handed”, he added.

మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్

వైసీపీ నేత, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ ను పోలీసులు గురువారం ఉదయం హైదరాబాద్‌ లో అరెస్ట్‌ చేశారు. మంగళగిరిలోని టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో నందిగం సురేష్‌ పై కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని ఆయన  పిటిషన్‌  దాఖలు చేయగా దానిని హైకోర్టుకొట్టేసింది.

దీంతో ఆయన్ని అరెస్ట్‌ చేసేందుకు బుధవారం తుళ్లూరు పోలీసులు ఆయన ఇంటికి చేరుకున్నారు. అయితే అప్పటికే సురేష్‌ ఇల్లు విడిచి అజ్ఙాతంలోకి వెళ్లిపోయారు. తన మొబైల్‌ కూడా స్విచ్ఛాఫ్‌ చేశారు. దీంతో పోలీసులు చాలా సేపు అక్కడే ఉండి చూశారు. కానీ లాభం లేకపోయేసరికి వెనక్కి వెళ్లిపోయారు.

సురేష్‌ సెల్‌  సిగ్నల్స్‌ ఆధారంగా బుధవారం ఉదయం నుంచి ఆయన ఎక్కడున్నారో పోలీసులు విచారణ మొదలు పెట్టారు. హైదరాబాద్‌ నుంచి పారిపోయేందుకు సురేష్‌ ప్రయత్నిస్తున్నారనే పక్కా సమాచారం అందడంతో హైదరాబాద్‌ వెళ్లిన ప్రత్యేక బలగాలు ఆయన్ని అరెస్ట్‌ చేసి మంగళగిరి తరలిస్తున్నట్లు తెలిపారు.

పెద్ద మనసున్న నిజమైన హీరో పవన్ కళ్యాణ్!

ఆపదలో ఉన్న వారిని ఆదుకునే విషయంలో తనకు సమానం లేనే లేదని పవర్ స్టార్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిరూపించుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో వరద తాకిడికి బాధపడుతున్న ప్రజల కోసం పవన్ కళ్యాణ్ ఏకంగా ఆరు కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే ఎంత పెద్ద విపత్తులు వచ్చిన సందర్భాలలో కూడా ఒకే వ్యక్తి నుంచి ఇంత భారీ మొత్తం విరాళంగా రావడం అనేది జరగలేదు. ఈ విషయంలో తనకు సాటి రాగల ఔదార్యం ఉన్నవాళ్లు లేనే లేరని పవన్ కళ్యాణ్ చాటి చెప్పినట్లు అయింది!

డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో విపత్తు బారిన పడిన ప్రజలను ఆదుకోవడం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి మంగళవారం నాడు కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఆ సమయంలో తెలంగాణలో వచ్చిన వరద బాధితుల కోసం ఆయన ఏ ప్రకటన చేయలేదు. బుధవారం నాడు పవన్ మళ్లీ భూరి విరాళం ప్రకటించారు. తెలంగాణ ప్రజలను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయలు ఇస్తున్నట్లు వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి సహా బాలకృష్ణ, మహేష్ బాబు, ఎన్టీఆర్ తదితర సెలబ్రిటీలు,  అందరూ కూడా రెండు రాష్ట్రాలకు చెరి 50 లక్షల వంతున కోటి రూపాయల విరాళాలు మాత్రమే ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత్ బయోటెక్ కృష్ణ ఎల్లా కూడా ఏపీకి కోటిరూపాయలు ప్రకటించారు.  పవన్ కళ్యాణ్ మాత్రం రెండు రాష్ట్రాలకు కోటి రూపాయలు వంతున రెండు కోట్ల రూపాయలు విరాళం ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధులకు అందజేశారు. పవన్ ఔదార్యం అక్కడితో ఆగలేదు !

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరద బారిన పడిన పంచాయితీలకు వ్యక్తిగతంగా ప్రతి పంచాయతీకి లక్ష రూపాయల సాయం అందించనున్నట్లుగా కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 400 పంచాయితీల ఖాతాల్లోకి నేరుగా ఈ సొమ్ము డిపాజిట్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అంటే కేవలం పంచాయితీలకు నేరుగా పవన్ కళ్యాణ్ నాలుగు కోట్ల రూపాయల విరాళం అందిస్తున్నారన్నమాట! ముఖ్యమంత్రుల సహాయ నిధులకు ఇస్తున్న రెండు కోట్లకు ఇది అదనం. ఇంత భారీ విరాళం ప్రకటించిన పవన్ పెద్ద మనసును ప్రజలు శ్లాఘిస్తున్నారు.

గులాబీల బాటలో జగన్ దళాలు చేయొచ్చు కదా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముంచెత్తిన వరద ముప్పునుంచి బాధితుల్ని ఆదుకోవడానికి రాష్ట్రం నలుమూలల నుంచి మనసున్న ప్రతి ఒక్కరూ కూడా స్పందిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు, ప్రెవేటు వ్యక్తులు, రాజకీయ పార్టీలు తమకు తోచిన సహాయంతో ఆదుకుంటున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి తప్ప స్పిందించిన నేతలు లేరు. జగన్ మాత్రమే వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. ప్రభుత్వాన్ని నిందించడానికి ప్రయత్నించి భంగపడ్డారు కూడా! అయితే తెలంగాణలో అక్కడి ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి నాయకులు స్పందించిన రీతిలో.. ఇక్కడ వైసీపీ నాయకులు ఎందుకు స్పందించలేకపోతున్నారు? ప్రజలంటే వారికి ఉన్న వాస్తవమైన ప్రేమ అదేనా? అనే అనుమానం ప్రజలకు ఇప్పుడు కలుగుతోంది.

జగన్మోహన్ రెడ్డి ముంపు ప్రాంతాల పర్యటనకు వచ్చారు.. వెళ్లారు తప్ప.. ఒక్క అన్నం పొట్లమైనా సాయం చేశారా? అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించడం కూడా జరిగింది. ఆ తర్వాత మొహమాటపడ్డారేమో జగన్ తన తరఫున ఓ కోటి రూపాయల విరాళం ప్రకటించారు. అంతే ఆయన తప్ప ఆ పార్టీలోని మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, అంతకుమించిన కుబేరుల వంటి నాయకులు ఎవ్వరూ కూడా ఒక్కరూపాయి కూడా ప్రకటించలేదు. పనిగట్టుకుని సహాయక చర్యల మీద బురద చల్లుతూ కాలం గడుపుతున్నారు.

కానీ, తెలంగాణలో పరిస్థితి ఆ విధంగా లేదు. అక్కడ కూడా ఏపీలో మాదిరిగానే వరద కొన్ని ప్రాంతాల్లో తీవ్ర నష్టాన్ని కలుగజేసింది. ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యల సంగతి తరువాత.. ప్రతిపక్షం భారాసకూడా పెద్దమనసుతో స్పందించింది. తమ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం మేరకు ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఒక నెల జీతం విరాళంగా ఇవ్వనున్నట్లుగా మాజీ మంత్రి హరీశ్ రావు ఎక్స్ లో పోస్టు ద్వారా ప్రకటించారు. పార్టీ తరఫున ఇప్పటికే సహాయ చర్యలు చేపడుతున్నామని.. అదనంగా ఈ విరాళాలు అందిస్తున్నామని.. ప్రజలు అందరూ కూడా బాధితులను ఆదుకోవడానికి ముందుకురావాలని ఆయన కోరారు.

ఇలాంటి మానవత్వం ఉన్న మాటలు ఏపీలో జగన్మోహన్ రెడ్డి సహా వైసీపీలో ఏ ఒక్క నాయకుడి నోటినుంచి కూడా బయటకు రావడం లేదు. ప్రజలందరూ ముందుకువచ్చి విరాళాలతో బాధితులను ఆదుకోండి.. అని వైసీపీలో ఎవ్వరూ పిలుపు ఇవ్వలేదు. జగన్ కూడా.. ఏదో అందరూ కోటి వంతున ఇస్తున్నారు గనుక.. తన వంతు కోటి ఇచ్చేసి చేతులు దులుపుకున్నారు తప్ప.. ప్రజల పట్ల తన శ్రద్ధ ను నిరూపించుకోలేదు. వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులు కూడా వరద బాధితులను ఆదుకునే విషయంలో ఉదారంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు. 

ఇది నా బయోపిక్‌ లా ఉందంటున్న నాని!

యంగ్ బ్యూటీ నివేదా థామస్ నటిస్తున్న తాజా చిత్రం ‘35 – చిన్న కథ కాదు’ ప్రేక్షకుల్లో మంచి హైప్‌ ను  క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు నందకిషోర్ ఈమని క్లీన్ ఎంటర్‌టైనర్ సినిమాగా దీనిని తెరకెక్కించాడు. ఈ సినిమా టీజర్, ట్రైలర్లు మంచి పాజిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేశాయి. దీంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు చాలా ఆసక్తిని చూపుతున్నారు.

తాజాగా ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ని ఎంతో వేడుకగా మూవీ మేకర్స్‌ నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా నేచురల్ స్టార్ నాని వచ్చాడు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. ఈ సినిమా చూస్తుంటే నా బయోపిక్ తీస్తున్నట్లుగా అనిపించింది. ఇందులో కుర్రాడు 35 మార్కులు తెచ్చుకునేందుకు కష్టపడతాడు. కానీ, నాకు అవి కూడా రాలేదు.’’ అంటూ నాని సరదాగా చెప్పుకొచ్చాడు.

ఇలా నాని ‘35’ సినిమాను ప్రమోట్ చేస్తుండటంతో ఈ సినిమాపై మూవీ లవర్స్‌లో ఈ సినిమా పై మంచి ఆసక్తి ఏర్పడింది. ఇక ఈ సినిమాను రానా దగ్గుబాటి ప్రెజెంట్ చేస్తుండగా.. ఇందులో విశ్వదేవ్, ప్రియదర్శి, గౌతమి తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

చరణ్‌ గురించి ఆ క్రికెటర్ కామెంట్స్‌!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇప్పుడు నటిస్తున్న తాజా చిత్రం “గేమ్ ఛేంజర్” గురించి అందరికీ తెలిసిందే. మావెరిక్ దర్శకుడు శంకర్ కాంబోలో వస్తున్నా మోస్ట్‌ అవైటెడ్ సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ చేస్తుంది. ఇక ఇదిలా ఉండగా రామ్ చరణ్ కూడా తన క్రేజ్ ని మరింత పెంచుకుంటున్నాడు అని చెప్పుకొవచ్చు.

లేటెస్ట్ గా ఇండియన్ డాషింగ్ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ చిన్న థలాగా పిలవబడే సురేష్ రైనా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
రీసెంట్ గా రైనా ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ అలగ్ యాక్టర్ హైన్( రామ్ చరణ్ వేరే లెవెల్ నటుడు) అంటూ తనకి ఇష్టమైన నటుల్లో రామ్ చరణ్ కూడా ఒకరు అని కామెంట్స్ చేసాడు.

దీంతో ఈ కామెంట్స్ ఇపుడు మెగా అభిమానుల్లో వైరల్ గా మారాయి. అలాగే సౌత్ సినిమా నుంచి నటుడు సూర్య కూడా ఇష్టం అంటూ రైనా చెప్పుకొచ్చాడు. దీంతో తన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

శ్రీనువైట్ల కచ్చితంగా ”విశ్వ” రూపం చూపిస్తాడు!

డైరెక్టర్ శ్రీను వైట్ల కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను డీల్ చేయడంలో మంచి ఎక్స్‌పర్ట్‌ అనే విషయం తెలిసిందే.  ముఖ్యంగా కామెడీని హ్యాండిల్ చేయడంలో అందవేసిన చెయ్యి. మ్యాచో హీరో గోపీచంద్ తో శ్రీను వైట్ల రూపొందిస్తున్న స్టైలిష్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘విశ్వం’ సినిమా. ఈ సినిమా ప్రమోషన్స్‌ను కిక్ స్టార్ట్ చేస్తూ మేకర్స్ టీజర్‌ను తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు.

టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో గోపీచంద్ మాట్లాడుతూ.. విశ్వ ప్రసాద్ గారికి చాలా థ్యాంక్స్‌. ఆయన లేకపోతే ఈ సినిమా ఇంత స్మూత్ గా పూర్తయ్యేది కాదు. శ్రీనువైట్ల గారితో సినిమా చేయాలని ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను. వన్ ఇయర్ బ్యాక్ ఆయన్ని ఓ పార్టీలో కలవడం, సినిమా చేద్దామని అనుకోవడం, అక్కడి నుంచి మా జర్నీ మొదులయ్యింది.

నేను చాలా మంది డైరెక్టర్స్ తో వర్క్ చేశాను. శ్రీను వైట్ల గారు కంఫర్ట్ బుల్, హీరో డైరెక్టర్. హీరోని ఎలా చూపించాలనే కంప్లీట్ క్లారిటీ ఉన్న డైరెక్టర్. ఈ జర్నీ చాలా ఎంజాయ్ చేశాను. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది. ఒక మంచి ఎంటర్ టైనర్ చేయాలని అనుకున్నాను. శ్రీను గారు అందులో మాస్టర్. ఇంత పెద్ద స్కేల్ లో ఆయన మార్క్ మిస్ అవ్వకుండా ఎవ్రీ ఫ్రేంలో నవ్వు వస్తూనే ఉంటుంది.

అందరూ కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. కావ్య చాలా బాగా చేసింది. చేతన్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. గోపి మోహన్ నా లక్ష్యం, లౌక్యం తర్వాత మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు నా సినిమాకి పని చేశారు. టీం అంతా చాలా హార్డ్ వర్క్ చేశాం. ఈ సినిమా డెఫినెట్ గా మంచి హిట్ అవుతుందనే నమ్మకం ఉందన్నారు.