Home Blog Page 683

విజయ్ సేతుపతి, త్రిష ల కల్ట్‌ క్లాసికల్‌ సినిమా సీక్వెల్‌ కి రెడీ!

దర్శకుడు సి ప్రేమ్ కుమార్ తన తొలి చిత్రం 96, విలక్షణ నటుడు విజయ్ సేతుపతి,   త్రిష నటించిన సూపర్ హిట్‌తో దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందారు. దాని తెలుగు రీమేక్ జానుకి కూడా దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు, అతని తదుపరి సినిమా, కార్తీ ప్రధాన పాత్రలో నటించిన మెయ్యళగన్ సెప్టెంబర్ 27, 2024 న సినిమాల్లో గ్రాండ్ విడుదలకు రెడీ అయ్యింది.

ఇటీవల ఒక మీడియా ఛానెల్‌తో జరిగిన సంభాషణలో, ప్రేమ్ కుమార్ 96 సీక్వెల్ గురించి ప్రస్తావించారు. అతను సీక్వెల్ స్క్రిప్ట్‌ను దాదాపు పూర్తి చేసినట్లు ప్రకటించారు. అతను దానిని విజయ్ సేతుపతికి ఇంకా చెప్పలేదని పేర్కొన్నారు. స్క్రిప్ట్‌ను ఖరారు చేసిన తర్వాత దానిని సేతుపతికి అందజేస్తానని తెలిపారు.

విజయ్ సేతుపతి,  త్రిష వారి ప్రస్తుత కమిట్‌మెంట్‌లను పూర్తి చేసిన తర్వాత ప్రాజెక్ట్ మొదలవుతుందని ప్రేమ్ పేర్కొన్నాడు. 96 సీక్వెల్ గురించి ప్రేమ్ కుమార్ ఆలోచనలు అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. అయితే కల్ట్ క్లాసిక్‌ని తాకకుండా వదిలివేయడం ఉత్తమమని కొందరు భావిస్తున్నారు. మరి ఈ సినిమా పరిస్థితి ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.

విశ్వంభర నుంచి సాలిడ్‌ బజ్‌!

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష  హీరోయిన్ గా  బింబిసార ఫేమ్‌ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న భారీ ఫాంటసీ సినిమా  “విశ్వంభర”. ఈ మూవీ గురించి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే . మరి మెగా అభిమానులు ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి కూడా  ప్రేక్షకుల నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది.

అయితే ఈ సినిమా నుంచి టీజర్ ని కూడా మేకర్స్ ఈ మధ్యనే విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ ఆ ప్లాన్ మారింది. అయితే ఫైనల్ గా ఈ సినిమా టీజర్ కట్ కి రంగం సిద్ధం అయ్యినట్టుగా స్ట్రాంగ్ బజ్ ఒకటి వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ భారీ సినిమా టీజర్ ని మేకర్స్ ఈ దసరా మహోత్సవ కానుకగా విడుదల చేయనున్నట్టుగా సమాచారం.

దీనిపై అధికారిక క్లారిటీ కూడా రావాల్సి ఉందని టాక్ వినిపిస్తుంది. మరి చాలా కాలం తర్వాత చిరు చేస్తున్న ఫాంటసీ సినిమా ఇది కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. మరి వశిష్ఠ ఈ చిత్రాన్ని ఎలా తెరకెక్కించాడో తెలియాలి అంటే వచ్చే ఏడాది జనవరి 10 వరకు వెయిట్‌ చేయాల్సిందే.

ధనుష్‌ పై నిషేదం ఎత్తివేత!

కోలీవుడ్‌ అగ్రహీరోలలో ఒకరిగా ఉన్న ధనుష్‌…బాలీవుడ్‌, హాలీవుడ్‌ సినిమాల్లో కూడా నటించి మెప్పించాడు. తాజాగా ధనుష్  50వ సినిమా, స్వయంగా దర్శకత్వం వహించి నటించిన రాయన్ గత జులైలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లతో సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత ధనుష్ ప్రముఖ నిర్మాణ సంస్థల నుంచి అడ్వాన్స్ డబ్బులు తీసుకుని వారి సినిమాల్లో నటించకుండా అడ్వాన్స్ డబ్బులు తిరిగి ఇవ్వలేదన్న ఫిర్యాదు తెరమీదకు వచ్చింది. దీంతో తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ధనుష్‌పై నిషేధం విధించింది.

దీంతో ధనుష్‌ని తమ సినిమాల్లో కమిట్ చేసే ముందు నిర్మాతల సంఘంతో సంప్రదింపులు జరపాలని నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉంటే తను ఇప్పటికే కమిట్ అయిన సినిమాలతో పాటు తను దర్శకత్వం వహిస్తున్న ‘నిలుకు ఎన్ మేల్ ఎన్నడి గోబం’ సినిమా పనుల్లో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. తనపై విధించిన నిషేధానికి సంబంధించి ధనుష్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. సమాచారం ప్రకారం, ధనుష్ 2 షరతులకు అంగీకరించాడు.

అవి ప్రముఖ నిర్మాణ సంస్థ తేనాండాల్ ఫిల్మ్స్ నిర్మించే చిత్రంలో నటించడం కాగా.. మరొకటి ఫైవ్ స్టార్ క్రియేషన్స్ నుండి వచ్చిన అడ్వాన్స్ మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించడం. ఈ రెండు షరతుల నేపథ్యంలో ధనుష్‌పై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని నిర్మాతల సంఘం అనుకుంది. అంతకుముందు, గత జులైలో తమిళ చిత్ర నిర్మాతల సంఘం విడుదల చేసిన ఓ ప్రకటనలో, ధనుష్ అనేక మంది నిర్మాతల నుండి అడ్వాన్స్‌లు అందుకున్న దృష్ట్యా, నిర్మాతలు ఏదైనా కొత్త చిత్రాలను ప్రారంభించే ముందు తమిళ చిత్ర నిర్మాతల సంఘాన్ని సంప్రదించవలసిందిగా తెలిపింది..

ఆ మూడో వాడు ఎవరంటే!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ హీరోగా, బాలీవుడ్‌ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా మూవీ  “దేవర” గురించి అందరికీ తెలిసిందే. మొత్తం రెండు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ సినిమాలో మొదటి భాగం ఈ సెప్టెంబర్ 27న గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

అయితే ఈ సినిమా నుంచి మోస్ట్‌  అవైటెడ్ ట్రైలర్ కట్ ని మూవీ మేకర్స్ విడుదల చేయగా ఈ ట్రైలర్ లో చాలానే ఎలిమెంట్స్ ఆడియెన్స్ ని ఆకట్టుకున్నాయి. అయితే ఈ ట్రైలర్ తో తారక్ రెండు రోల్స్ లో కనిపించనుండడం అనేది ప్రస్తుతం అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ ఇద్దరూ కాకుండా మూడోవాడు ఉన్నాడని పలు ఎగ్జైటింగ్ వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి.

ట్రైలర్ లో ఒక షాట్ స్పెషల్ గా వైరల్ అవుతుంది. దీంతో దేవరలో ఇంకో కీలక పాత్ర ఉంటుంది అని అది కూడా ఎన్టీఆర్ చేసిందే అంటూ ఓ టాక్ వినిపిస్తుంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో వేచి చూడాల్సిందే.

ఆస్ట్రేలియాలో స్పెషల్‌ ట్రైనింగ్‌!

రామ్ చరణ్  ప్రస్తుతానికి శంకర్ గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ పూర్తి చేసి విడుదలకు రెడీ అవుతున్నాడు. తన 16వ సినిమా కోసం సిద్దం అవుతున్నాడు. ఈ సినిమా ఒక స్పోర్ట్స్ డ్రామా అని ముందు నుంచే ఓ టాక్‌ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా కోసం బాడీ బిల్డ్ చేసేందుకుగాను చరణ్  ఆస్ట్రేలియా కు వెళ్లినట్లు సమాచారం.

ఆస్ట్రేలియాలో రామ్ చరణ్ తేజ బాడీ బిల్డింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ మొదలు కావడానికి ముందే బాడీ ఫిట్గా ఉంచుకోవాలని భావించి ఆయన అక్కడికి వెళ్లినట్టు సమాచారం. ఈ సినిమా కోసం రాంచరణ్ అథ్లెటిక్‌ లో కనిపించాల్సి ఉంది. గత మూడు వారాల నుంచి ఆస్ట్రేలియాలోనే చరణ్ ఈ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఈ నెలాఖరున ఆయన హైదరాబాద్ తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దసరా తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టే అవకాశాలున్నాయి. ఈ సినిమాకి పెద్ది అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇక ఈ సినిమా కోసం హైదరాబాద్ శివారులలో ఒక పెద్ద ఊరి సెట్ వేసినట్లు సమాచారం. రాంచరణ్ ఇంటి తో పాటు అతని లొకాలిటీ అంతా అక్కడే షూట్ చేయబోతున్నట్లుగా సమాచారం. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించబోతున్నాడు. ఇక ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న బుచ్చిబాబు చరణ్ ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్నాడు.

మళ్లీ చెక్కుతున్నారు…ఎందుకంటే!

యంగ్‌ హీరో విశ్వక్సేన్ హీరోగా నటించిన చాలా సినిమాలు ముందు ప్రకటించిన తేదీ కంటే ఆలస్యంగా విడుదలైన దాఖలాలు చాలానే ఉన్నాయి. ఆయన హీరోగా వచ్చిన చివరి సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా ప్రకటించిన తేదీ నుంచి 8 నెలల ఆలస్యంగా వచ్చింది. మూడుసార్లు విడుదల తేదీలు మార్చారు. అయితే ఇప్పుడు ఆయన ప్రేక్షకుల ముందుకు మెకానిక్ రాఖీ అనే సినిమాతో వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

నిజానికి ఈ సినిమా షూటింగ్ చాలా కాలం క్రితమే పూర్తయ్యింది. అక్టోబర్ 31వ తేదీన రిలీజ్ తేదీ  కూడా ప్రకటించారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా ఆరోజు కూడా విడుదల అవ్వడం లేదని తెలుస్తోంది. నవంబర్ నెలలో విడుదల  చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు మూవీ మేకర్స్. ఎందుకంటే ఈ సినిమా కోసం విశ్వక్ సేన్ చాలా కృషి చేశాడు. అయితే ఫైనల్ కట్ చూసిన తర్వాత మూవీలోని కొన్ని ఎపిసోడ్స్ అంతగా బాగా రాలేదని చిత్ర బృందం ఫీల్‌ అయ్యిందంట.

అందుకే మళ్ళీ రీ షూట్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. హైదారాబాద్ సిటీలో వేసిన మెకానిక్ షెడ్ లో సినిమాకి సంబంధించిన రీషూట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం విశ్వక్ సేన్ నైట్ షిఫ్ట్ లో చిత్రీకరణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా వాయిదా పడిన సంగతి ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రవితేజ ముళ్ళపూడి ఈ సినిమాతో డైరెక్టర్గా పరిచయం అవుతున్నాడు. ఇక మీనాక్షి చౌదరి ఈ సినిమాలో విశ్వక్సేన్ సరసన హీరోయిన్‌ గా చేస్తున్న సంగతి తెలిసిందే.

Sudheer Babu’s ‘Ma Nanna Super Hero’ Teaser is Here!

“Ma Nanna Super Hero,” starring Sudheer Babu and directed by Abhilash Kankare (known for the ‘Loser’ series), is set to release worldwide in theaters on October 11, 2024. The film has already created a buzz with its promotional material. Recently, the teaser for the film was released on social media by Natural Star Nani.

The teaser is generating excitement and showcases an emotional journey between a father and his son. Sudheer Babu, Sai Chand, and Sayaji Shinde deliver notable performances. Jay Krish has provided a feel-good background score that enhances the teaser. Produced by Sunil Balu under the V Celluloids banner, the audience is eagerly anticipating this film.

Experience the Deep Emotions of ‘Nuvve Naku Lokam’ from Janaka Ayithe Ganaka

The latest lyrical song, “Nuvve Naku Lokam,” from Suhas’ upcoming film ‘Janaka Ayithe Ganaka’ is a deeply emotional piece that beautifully portrays the love and affection between husband and wife. 

Featuring captivating performances by Suhas and Sangeerthana Vipin, the lyrics has been penned by Krishna Kanth and composed by Vijai Bulganin, whose music adds a profound layer to the heartfelt lyrics. The vocals are provided by the renowned singer Karthik, enhancing the song’s emotional depth.

The film, which is written and directed by Sandeep Reddy Bandla, also stars notable actors Rajendra Prasad, Vennela Kishore, Murali Sharma, and Goparaju Ramana. It is produced by Harshith Reddy and Hanshitha under the Dil Raju Productions banner, with Shirish presenting the film.

Veteran CPI (M) Leader Sitaram Yechury Passes Away At 72

Sitaram Yechury, the National General Secretary of the Communist Party of India (Marxist), has died at the age of 72. Yechury, who had been battling respiratory issues for some time, passed away this afternoon at AIIMS in Delhi, where he had been receiving treatment.

Yechury was admitted to AIIMS on August 19 due to a respiratory infection. Despite being placed on a ventilator, his health continued to deteriorate over the past few days.

Born on August 12, 1952, in Chennai, Yechury completed his education in Hyderabad and pursued a BA in Economics at St. Stephen’s College, Delhi. He was actively involved in the Telangana movement in 1969 and joined the Student Federation of India (SFI) in 1974. He became a member of the CPI (Marxist) the following year and was notably arrested during the Emergency in 1975 while studying at JNU.

Yechury’s first wife, Indrani Majumdar, was a renowned educator and leftist activist. His second marriage was to Seema Chishti, a prominent journalist. He is survived by three children.

Row over PM’s visit To CJI’s Home During Ganpati Puja

Prime Minister Narendra Modi’s visit to CJI Chandrachud’s house on the occasion of Ganpati Puja has struck a raw nerve with the Opposition questioning the transparency in the judiciary system and its code of conduct. 

Shiv Sena’s Sanjay Raut raised doubts if the Uddhav Thackeray faction of Sena would get justice under Supreme Court Chief Justice D Y Chandrachud and advised him to recuse himself from the case. 

In a post on X (formally Twitter) the Sena (UBT) MP listed several recent cases where the judiciary ruled against the leaders of the Opposition and  wrote, “One should understand the chronology to understand all such cases.” 

“Chandrachud is retiring in November. The Ganesh festival is celebrated at several places in Delhi too. But I am not sure if Modi has visited any of the houses other than of CJI Chandrachud. He visited Chandrachud’s house and together performed the Aarti,” Raud said.

The Sena vs Sena case challenges the Maharashtra Assembly Speaker Rahul Narwekar’s decision not to disqualify Shiva Sena MLAs owing allegiance to Chief Minister Eknath Shinde.

CJI Chandrachud and his wife, Kalpana Das, were seen welcoming Modi at their house on September 11. Later, in an X post, PM Modi wrote, “Joined Ganesh Puja at the residence of CJI, Justice DY Chandrachud Ji. May Bhagwan Shri Ganesh bless us all with happiness, prosperity and wonderful health.”

Another Sena (UBT) MP, Priyanka Chaturvedi, also took potshots at the PM’s visit to CJI home. Chaturvedi, in an X post, wrote, “After the festivities are over hopefully CJI will deem fit and be slightly freer to conclude the hearing on Maharashtra and the blatant disregard of Article 10 of the Constitution in Maharashtra. Oh wait, elections round the corner anyway, it can be adjourned for another day.” 

However, the BJP has countered the attacks and said the PM’s visit was restricted to celebrating the Ganpati festivities and it was a part of culture.  BJP leader Shehzad Poonawalla slammed Chaturvedi and other members of the INDI Alliance for politicising the PM’s visit to the CJI’s house. 

However, Sena leader from Eknath Shinde group Milind Deora criticised his faction for giving a “reckless commentary” on the Prime Minister’s visit to CJI residence and said that casting baseless aspersions on the highest court sets a dangerous precedent.

Senior advocate and former Additional Solicitor General (ASG), Indira Jaising also criticised the PM’s visit and said the Supreme Court Bar Association (SCBA) should condemn it. 

“Lost all confidence in the independence of the CJI. The SCBA must condemn this publicly displayed compromise of Independence of the CJI from the Executive Kapil Sibal,” she wrote in a post on X.