Home Blog Page 66

Mahesh Babu Takes on Risky Action Scenes Himself In SSMB29

Tollywood superstar Mahesh Babu is once again collaborating with visionary director S.S. Rajamouli for the eagerly awaited film SSMB29. The movie stars international sensation Priyanka Chopra and Malayalam star Prithviraj Sukumaran in key roles.

Amidst the massive budget and large canvas of the film, the director Rajamouli has been maintaining tight wraps around the updates, generating a web of curiosity about the movie. The shoot is progressing at a rapid pace with two schedules already complete. The crew is now set to move to Kenya for the key sequences.

Against the adventurous background of a forest landscape, SSMB29 has generated great anticipation among fans and film buffs. The movie promises to be filled with stunning action scenes and innovative stunts that guarantee a new cinematic experience.

In a thrilling news, there are reports that Mahesh Babu has decided to do all his action sequences himself without body doubles. This is the first time he is doing so and proves his commitment to giving realistic and engaging performances. He is reported to have begun rigorous physical training to get ready for these challenging action scenes.

If the reports are to be believed, the fans are in for a treat as Mahesh Babu gets into an action-hero and bold avatar, exhibiting unparalled energy and dedication to the silver screen.

‘మొగుణ్ని కొట్టి మొగసాలకెక్కిన..’ సామెతలా జగన్!

వెనకటికి పల్లెపట్టుల్లో ఓ మొరటు సామెత చెబుతుంటారు. అలవిగాని గయ్యాళి అయిన ఆడది తానే మొగుణ్ని కొట్టి.. ముందుగా తానే మొగసాలకెక్కి, అంటే రచ్చబండ దగ్గరికెళ్ల.. ‘నా మొగుడు నన్ను కొట్టేశాడో’ అని దొంగ ఏడుపులు ఏడ్చి గోల చేసిందంట- అనేది ఆ సామెత అర్థం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యవహారసరళి అచ్చంగా ఈ సామెత తీరుగానే కనిపిస్తున్నది. ఎందుకంటే.. కడపజిల్లాలోని వైఎస్సార్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ విద్యార్థులకు తీరని అన్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.

వారి జీవితాలతో ఆడుకున్న వ్యక్తి జగన్. అక్కడ కోర్సు పూర్తిచేసినా కూడా.. వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారడానికి ప్రధాన కారకుడు జగన్. అలాంటి జగన్ ఇప్పుడు వారికోసం కపటప్రేమను చూపిస్తున్నారు. పైగా.. కూటమి ప్రభుత్వం అక్కడి విద్యార్థుల ఆందోళనను తొలగించడానికి, వారి మేలుకోరి అన్ని రకాల చర్యలు తీసుకుంటే.. తనను చూసి భయపడి ఆ నిర్ణయాలు తీసుకున్నట్టుగా జగన్ ప్రగల్భాలు చెప్పుకుంటున్నాడు. తన ట్వీట్ కు ప్రభుత్వం జడుసుకున్నదని అంటున్నారు. ఆయన అత్యుత్సాహం చూసి జనం నవ్వుకుంటూ ఉండడం విశేషం.

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. రాష్ట్ర విద్యారంగాన్ని ఉద్ధరించరేస్తున్న తరహాలో.. తన సొంత జిల్లాలో తన తండ్రి పేరుతో ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీని స్థాపించారు. విద్యాసంస్థలను ప్రారంభించడం అనేది కాంట్రాక్టర్లకు నిధులు దోచిపెట్టడం కోసం మాత్రమే అన్నట్టుగా ఈ యూనివర్సిటీని ఆర్భాటంగా ప్రారంభించిన జగన్.. ఆర్కిటెక్చర్ కోర్సుకు సంబంధించి.. ఢిల్లీనుంచి అనుమతులు తీసుకురావడం గురించి మాత్రం పట్టించుకోలేదు. అయిదేళ్లుగా అక్కడ చేరిన విద్యార్థులు మొరపెట్టుకుంటూనే ఉన్నప్పటికీ.. వారి ఆవేదన ఆయన చెవులకు సోకలేదు.

జగన్ పదులసార్లు ఢిల్లీ వెళ్లారు గానీ.. తన జిల్లాలో తాను స్థాపించిన వైఎస్సార్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ అనుమతుల గురించి కనీసం లేఖ కూడా ఇవ్వలేదు. కడప ఎంపీగా అవినాష్ రెడ్డిని వివేకా హత్య కేసు నుంచి బయటపడేయడానికి చూపించిన శ్రద్ధలో ఒక్కశాతం కూడా తన తండ్రిపేరిట ఉన్న యూనివర్సిటీ మీద చూపించలేదు. తీరా ఈ ఏడాది పెద్దసమస్య వచ్చి పడింది. అక్కడ తొలిబ్యాచ్ విద్యార్థుల కోర్సు కూడా పూర్తయింది. అయితే యూనివర్సిటీకే ఢిల్లీలోని సీఓఏ గుర్తింపుల లేకపోవడంతో వారి భవిష్యత్తు అగమ్యగోచరం అయింది. జగన్ నిర్లక్ష్యం వలన.. వారికి గుర్తింపు ఉన్న సర్టిఫికెట్లు వస్తాయో లేదో అని భయపడుతూ వారు చాలా వారాలుగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. వారి ఆందోళన కాలంలో జగన్ పలుమార్లు కడప జిల్లాకు వెళ్లినా వారివైపు కూడా చూడలేదు.

వైఎస్ షర్మిల వారిని పరామర్శించి.. జగన్ చేసిన ద్రోహాన్ని కనీసం చంద్రబాబు చక్కదిద్దాలని విజ్ఞప్తి చేసింది. అప్పటికే విద్యార్థుల భవిష్యత్తు గురించి శ్రద్ధ పెట్టిన సర్కారు మొత్తానికి ఈ ఏడాది మెరిట్ ద్వారా మాత్రమే అడ్మిషన్లు జరగాలని ఆదేశించింది. అయితే.. ఇదంతా తన ప్రతిభ అని జగన్ నిస్సిగ్గుగా చాటుకుంటున్నారు. వైఎస్సార్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీకి తాను చేసిన ద్రోహాన్ని చంద్రబాబు సర్కారు సరిదిద్దుతోంటే.. ఇలా చాటుకోవడం అనేది చవకబారుతనంగా ఉన్నదని ప్రజలు అంటున్నారు.

Vijay Deverakonda’s Kingdom Drops Emotional Track “Anna Antene”   

Vijay Deverakonda’s highly awaited film, Kingdom, directed by Gowtam Tinnanuri, continues to attract attention with the release of its moving second single, “Anna Antene.”

The song wonderfully captures the long-term rapport between Vijay Deverakonda and Satyadev, and presents moments of shared sentiment and emotional touch. Anirudh Ravichander’s melodious voice and emotive composition imbue the song with realism and intensity, and Krishna Kanth’s lyrical depth further increases its emotional quotient.

Bhagyashri Borse essays the lead female role in this high-budget emotional drama. The movie is produced on a grand scale by Suryadevara Naga Vamsi and Sai Soujanya under their banners, with Srikara Studios supporting the film.

Scheduled for global theatrical release on July 31, Kingdom is set to be a gripping mixture of powerful emotions, heart-moving music, and visual narrative — making it one of the most highly anticipated releases of the season.

‘అది సినిమా డైలాగ్’ అంటూంటే భ్రష్టు పట్టిపోవడమే!

వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాటల్లో విచక్షణ ఉండదు. గతాన్ని గుర్తుంచుకుని, భవిష్యత్తు పర్యవసానాలను అంచనావేసి మాట్లాడగల తెలివి కూడా లేదు. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇటీవలి కాలంలో పదేపదే అంటున్న ఒక మాట వల్ల ఇప్పుడు మరింతగా భ్రష్టుపట్టిపోతున్నారు. జగన్ బుధవారం నాడు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటుచేశారు. కృష్ణాజిల్లా జడ్పీ ఛైర్మన్ ను తెలుగుదేశం వారు నిలదీసినందుకు, దానిని ఖండించడానికి ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ అది. కానీ.. జగన్ తెలివికి అసలు పాయింటు ఎక్కడో మరుగున పడిపోయింది. ఆయన తన సొంత సోదితో ఆ సమయం మొత్తం హరించారు.

తన రెంటపాళ్ల పర్యటన నుంచి ప్రతిరోజూ వేస్తున్న ప్రసంగాల రికార్డునే మళ్లీ ఇక్కడ కూడా వినిపించారు. అయితే.. ‘రప్పా రప్పా నరుకుతాం’ అంటూ వివాదాస్పద ఫ్లెక్సిల వల్ల రేగిన వివాదంలో వైసీపీ ధోరణుల్ని ఆయన సమర్థించడం అనేది ప్రస్తుతానికి ఆయన పరువును బజారు పాల్జేస్తోంది.
పుష్ప2 సినిమాలోని.. ‘గంగమ్మ జాతరలో యేటను నరికినట్టు రప్పా రప్పా నరుకుతాం’  అనే డైలాగును ఫ్లెక్సిలుగా ముద్రించి.. జగన్ 2.0 సర్కారు వస్తే తెలుగుదేశం వారిని ఆ విధంగా నరుకుతాం అని అంటూ జగన్ యాత్రలో ఆయన మూకలు అల్లరిచేసిన సంగతి తెలిసిందే. వారిని అరెస్టుచేశారు కూడా.

అయితే ఆరోజునుంచి ఇప్పటిదాకా వైసీపీ నాయకులందరూ కూడా ‘రప్పా రప్పా’ డైలాగుల్ని వల్లెవేస్తూ ప్రభుత్వాన్ని రెచ్చగొట్టే పనిచేస్తున్నారు. హింసను ప్రేరేపించడమే లక్ష్యం అన్నట్టుగా పదేపదే అదే వాడుతున్నారు. మరొకవైపు ఆ మాటలను సమర్థించుకుంటున్నారు. అది సినిమా డైలాగే కదా.. సినిమాలో వాడినప్పుడు మరి బయట వాడితే తప్పేంటి.. ఫ్లెక్సిలు వేస్తే తప్పేంటి అని జగన్ సమర్థించుకుంటున్నారు.
ఈ సమర్థింపు ఆయన అజ్ఞానాన్ని బయటపెడుతున్నది. ఎందుకంటే.. సినిమాలో ఒక మాట అంటే.. దానికి ఒక సీను, ఆ డైలాగు రావడానికి దారి తీసిన పరిస్థితులు అన్నీ కారణం అవుతాయి.

అలాంటప్పుడే ఒక డైలాగును పదునుగా, ఆవేశంగా రాస్తే ఆ సీను పండుతుంది. పుష్ప2 సినిమాలో హీరో అన్న కూతురిని విలన్ గ్యాంగ్ కిడ్నాప్ చేసి ఎత్తుకుపోయి, సామూహిక అత్యాచారానికి పాల్పడబోతున్నారనగా.. వారిని హెచ్చరిస్తూ హీరో పలికే డైలాగు అది. మరి జగన్ తాలూకు కిరాయి గూండా మూకలు.. వారికి ఏ అన్యాయం జరిగిందని.. ఏ ఆవేశం పొంగుకొచ్చిందని ఆ డైలాగును ఫ్లెక్సిలుగా ముద్రించాయో జగనే కాస్త వివరించి చెబితే బాగుంటుంది. జగన్ ఇంట్లోని ఏమహిళలకు ఏ అన్యాయం జరిగిందని ఆయన దళాలకు ఆవేశం వచ్చిందో చెప్పాలి. నిజానికి తన సొంత తల్లి, సొంత చెల్లి మీద కూడా అసభ్యపు కారుకూతలను తన అనుచరులతోసోషల్ మీడియాలో పోస్టులు పెట్టించిన దారుణమైన వ్యక్తి జగన్. ఆయన ఇప్పుడు రప్పారప్పా డైలాగుల్ని సమర్థించుకోవడం చూసి.. ఆ పార్టీ లోని నాయకులే కొందరు పెదవి విరుస్తున్నారు. ఈ తప్పుడు మాటలను సమర్థించుకున్నంత కాలం.. తమ పార్టీ భ్రష్టుపట్టిపోవడమే అని ఆవేదన చెందుతున్నారు.

Rashmika Mandanna’s The Girlfriend Gains Momentum as First Single “Nadhive” Drops  

Actress Rashmika Mandanna, the country’s crush as she is usually hailed as, is all ready to enthrall her fans yet again with her new romantic drama The Girlfriend. Produced by Geetha Arts and Dheeraj Mogilineni Entertainment, the movie has been creating huge expectations, particularly from Rashmika’s fast-growing fanbase.

Adding to the buzz, the producers have officially dropped the first single of the film – “Nadhive.” This melodious song, composed by Hesham Abdul Wahab, gives a beautiful emotional journey partly made possible by the mellow melody. With heartfelt melodies, Hesham brings an emotional song that puts a person in touch with themselves. The lyrics are penned by Rakendu Mouli, and the poetical and emotional elements of the lyrics beautifully go with the music.

The song has Rashmika with Dheekshith Shetty, both artists gave performances with deep emotion and romantic strain that execute the emotional depth of the song.

Directed by Rahul Ravindran, The Girlfriend is shaping up to be a heartfelt romantic entertainer. With “Nadhive” already receiving good words, anticipation is now building for what’s in store next. The film is readying for pan-India release and will release in various languages.

రొమాంటిక్ మెలోడిగా ‘నదివే’

నేషనల్ క్రష్‌గా గుర్తింపు పొందిన రష్మిక మందన్న నటిస్తున్న తాజా సినిమా “ది గర్ల్‌ఫ్రెండ్” పై ఆసక్తి రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఇప్పటికే వరుస విజయాలతో క్రేజ్ మీదున్న రష్మిక ఒక రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తోందని తెలిసినప్పటి నుంచే ఈ సినిమాపై మంచి బజ్ నెలకొంది. ఇప్పుడు ఈ సినిమాతో సంబంధించి మొదటి మ్యూజిక్ అప్డేట్ వచ్చింది.

హేషమ్ అబ్దుల్ వాహబ్ స్వరపరిచిన “నదివే” అనే మెలోడీ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాట సాఫ్ట్ మ్యూజిక్‌తో, ఫీల్‌గుడ్ ట్యూన్స్‌తో ఎంతో హాయిగా సాగుతుంది. మెలోడీ తరహాలో రూపొందిన ఈ పాటను స్వయంగా హేషమ్ పాడిన తీరు మంచి అనుభూతిని ఇచ్చేలా ఉంది. స్క్రీన్ మీద రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి కలసి అందమైన స్టెప్పులతో ఆ పాటను మరింత ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.

ఈ సినిమాకు దర్శకుడిగా రాహుల్ రవీంద్రన్ వ్యవహరిస్తున్నాడు. ప్రేమకథ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తుండగా, ఫస్ట్ సాంగ్ వదిలిన దగ్గర నుంచి సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం ప్రమోషన్ కార్యక్రమాలను కూడా స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేస్తున్నారు.

ప్రస్తుతం మ్యూజిక్ అప్డేట్‌తో మంచి శభ్దం తెచ్చుకున్న ఈ సినిమాకి సంబంధించి మిగతా వివరాల కోసం ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు. రష్మిక ప్రెజెన్స్‌కి తోడు, కథా పరిణామాల మీద కూడా మంచి ఆసక్తి నెలకొంది.

హీరో రామ్‌ కొత్త అవతారం!

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని మరోసారి ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు కొత్త చిత్రంతో రాబోతున్నారు. ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం ఫుల్ స్పీడ్‌లో షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రాన్ని పి. మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ సరసన భాగ్యశ్రీ బొర్సె కథానాయికగా నటిస్తోంది. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ వంటివి సినిమాపై మంచి హైప్‌ని తీసుకువచ్చాయి.

తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ పాట విడుదలకు సిద్ధమవుతోంది. ప్రేమభరితమైన రొమాంటిక్ మెలోడీగా ఈ పాట రాబోతున్నట్టుగా సమాచారం. ఈ స్పెషల్ సాంగ్‌ను సంగీత దర్శకుల ద్వయం వివేక్ – మెర్విన్ కంపోజ్ చేయగా, ఫేమస్ సింగర్ అనిరుధ్ రవిచందర్ ఆలపించారు. అయితే ఇందులో ఓ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ పాటకు రామ్ స్వయంగా లిరిక్స్ రాశాడు. అంటే ఈసారి హీరోగా కాకుండా గీత రచయితగా కూడా తన టాలెంట్‌ను చూపించబోతున్నాడు.

ఈ లవ్ సాంగ్‌ను జూలై 18న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. పాట వినిపించిన వెంటనే శ్రోతల మనసుల్లో నిలిచిపోయేలా ఉంటుందన్న నమ్మకంతో ఉన్నారు. ఇందులో సీనియర్ యాక్టర్ ఉపేంద్ర ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి మొదటి పాట సినిమాపై మరింత ఆసక్తి పెంచేలా ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది.  

ఓజీ టీజర్‌ కి డేట్‌ కన్ఫార్మ్‌ !

పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఓజి సినిమా మీద ఫిల్మ్ సర్కిల్స్ లో హైప్ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్‌తోనే ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రం, పవన్ కెరీర్‌లోనే ఓ బిగ్ గేమ్ చెంజర్ అవుతుందన్న బజ్ వినిపిస్తోంది.

ఇక తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా నుంచి ఇంకో పవర్‌ఫుల్ టీజర్ రాబోతుందన్న టాక్ ఫిలింనగర్ లో జోరుగా వినిపిస్తోంది. ఆగస్ట్ 15న ఈ కొత్త టీజర్ రిలీజ్ చేసేందుకు టీమ్ ప్లాన్ చేస్తోందని సమాచారం. ఇప్పటికే విడుదలైన కంటెంట్ సినిమా మీద భారీ క్రేజ్ తెచ్చిందంటే, కొత్త టీజర్‌తో ఇంకోసారి ఊహించని రేంజ్ లో ఓజి హైప్ పెరగడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే ఈ ఒక్క సినిమాతో 300 కోట్లకిపైగా బిజినెస్ జరగడంతో, వచ్చే కంటెంట్ ఇంకా బలంగా ఉంటే, రిలీజ్ రోజే రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్స్ అందుకోవడం తథ్యం అంటున్నారు ట్రేడ్ వర్గాలు. మొత్తానికి ఓజి సినిమా మీద మళ్లీ ఇంట్రెస్ట్ పెంచే విధంగా మేకర్స్ స్ట్రాటజీ ప్లాన్ చేస్తున్నారన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

రవితేజకి పితృవియోగం!

తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన విషాదకర సంఘటనలు వరుసగా జరుగుతుండటంతో ఆవేదన మిన్నంటుతోంది. కొన్ని రోజుల క్రితమే సంగీత దిగ్గజం ఎం ఎం కీరవాణి గారి తండ్రి మృతి చెందారు. ఆ ఘటన మర్చిపోకముందే సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు గారి అకాలమరణం సినీప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తింది.

ఇప్పుడు మరో కఠినమైన వార్త వెలుగులోకి వచ్చింది. ఈసారి అది మాస్ మహారాజ రవితేజ కుటుంబాన్ని విషాదంలో నెట్టేసింది. ఆయన తండ్రి రాజగోపాల్ రాజు గారు ఇటీవల 90 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచినట్టుగా సమాచారం అందింది. హైదరాబాదులోని రవితేజ నివాసంలోనే ఆయన మృతి చెందినట్టు తెలుస్తోంది.

ఈ అణచివేయలేని దురదృష్టకర సంఘటనతో రవితేజ కుటుంబంలో శోకచాయలు అలుముకున్నాయి. ఈ వార్త తెలిసిన వెంటనే పలువురు సినీ ప్రముఖులు, స్నేహితులు, అభిమానులు తమ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఈ సందర్భంలో రవితేజ కుటుంబానికి అభిమానుల మద్దతు, ప్రేమ తోడుగా ఉండాలని సినీ వర్గాలు కోరుకుంటున్నాయి.

అమీర్ ఖాన్‌తో లోకేష్ కనగరాజ్ మూవీ!

తమిళ సెన్సేషన్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కూలీ సినిమా థియేటర్స్‌కి రావడానికి కేవలం ఒక్క నెల మాత్రమే మిగిలి ఉంది. సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ పాన్ ఇండియా చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మాస్ యాక్షన్‌తో పాటు కమర్షియల్ హంగులు మెండుగా ఉండబోతున్నాయని ముందుగానే టాక్ వినిపిస్తోంది. విడుదల సమయం దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్‌కి ఫుల్ గేర్ లో దిగారు.

ఈ నేపథ్యంలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఇటీవల పలు మీడియా ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమాతో పాటు ఇతర ప్రాజెక్టుల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నాడు. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కూలీలో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ పాత్రపై హింట్ ఇచ్చాడు. అయితే ఆ పాత్ర గురించి పూర్తిగా బయటపెట్టకూడదనే ఉద్దేశంతో, అతడి పాత్ర గురించి గంభీరంగా చెప్తే సర్ప్రైజ్ బలహీనపడుతుందని చెబుతున్నాడు. ఆ కారణంగానే ఆ పాత్రకు సంబంధించిన వివరాలను ఈ దశలో బయట పెట్టడం లేదని చెప్పాడు.

ఇక త్వరలోనే అమీర్ ఖాన్‌తో కలిసి మరో సినిమా చేయబోతున్న విషయాన్ని కూడా లోకేష్ కన్ఫర్మ్ చేశాడు. అది ఒక సూపర్ హీరో కథగా రూపొందుతుందని, కేవలం దేశీయ ప్రేక్షకులకే కాకుండా ఇంటర్నేషనల్ ఆడియన్స్‌కి కూడా కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుందని చెప్పాడు. లోకేష్ చెప్తున్న ఈ అంశాలన్నీ అమీర్ ఖాన్ పాత్రపై, అతడితో చేయబోయే కొత్త సినిమాపై కుర్చిలో కూర్చునే ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి.

ఇప్పటికే వరుస విజయాలతో ఉన్న లోకేష్ ఈసారి కూడా మరో మేజర్ హిట్‌తో వస్తాడా..? రజినీ మాస్‌కు అమీర్ స్పెషల్ టచ్ కలవడం ఎలా ఉండబోతుందా అన్నది సినిమాకి మరో హైప్ జోడించేస్తోంది.