Home Blog Page 637

లక్కీ బన్నీ: ఒక తలనొప్పి వదిలిపోయింది! 

సినిమా హీరో అల్లు అర్జున్ నిజంగానే లక్కీ అని చెప్పాలి. ఎందుకంటే ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారంటూ ఆయన మీద నమోదైన కేసును హైకోర్టు పూర్తిగా కొట్టేసింది. ఆయన మీద కేసు నమోదు చేసిన తీరే సక్రమంగా లేదని అభిప్రాయపడింది. ఫిర్యాదు చేసిన అధికారి వ్యవహారాన్ని ఆక్షేపించింది. హైకోర్టు తీర్పుతో అల్లు అర్జున్ కు ఒక తలనొప్పి వదిలిపోయినట్లయింది. 

ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల సమయంలో పోలింగ్ కు ముందు అల్లు అర్జున్ తన మిత్రుడైన, నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. సహజంగానే అర్జున్ వచ్చిన సమయంలో స్థానికులు, వారి అభిమానులు చాలా పెద్ద సంఖ్యలో అక్కడ గుమికూడారు. అల్లు అర్జున్ అక్కడ గుమికూడిన అభిమానులను ఉద్దేశించి అభివాదం చేశారు తప్ప ఎలాంటి రాజకీయ ప్రసంగం చేయలేదు. శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డితో కలిసి ప్రజలకు కనిపించారు తప్ప ఆయనకు ఓటు వేయమని గాని, మరొక మాట గాని చెప్పనేలేదు.

అయితే పెద్ద సంఖ్యలో అభిమానులు గుమికూడటం అనేది ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడమేనంటూ నంద్యాల రూరల్ తహసీల్దారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగి ఇచ్చిన ఉత్తరువు పట్ల అవిధేయత చూపించినందుకు వారి మీద కేసు నమోదు అయింది. ఈ కేసును కొట్టేయాలంటూ అల్లు అర్జున్ మరియు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తమ మీద బనాయించిన కేసులో అర్థం లేదని వారి వాదనలు వినిపించారు. 

తాజాగా తుది తీర్పు వెల్లడించిన హైకోర్టు ధర్మాసనం ఈ కేసును కొట్టేసింది. స్నేహితుడి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లారే తప్ప అభిమానులను ఆయన ఆహ్వానించినట్లుగా ఆధారాలు లేవని.. జనం పెద్ద సంఖ్యలో పోగవటం ఆయన తప్పు కాదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. జనం పెద్ద సంఖ్యలో ఉంటే చెదరగొట్టవలసిన బాధ్యత అధికార యంత్రాంగానిది మాత్రమేనని, అల్లు అర్జున్ ను బాధ్యుడిని చేయడం కరెక్ట్ కాదని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలో కేసు నమోదు చేయడం మతిలేని చర్య అని వ్యాఖ్యానిస్తూ న్యాయమూర్తి కేసు కొట్టేశారు. 

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం ఇప్పుడు విడుదలకు సిద్ధం అవుతోంది. చిత్ర బృందం మొత్తం ఆ హడావుడిలో నిమగ్నమై ఉన్నారు. పుష్ప 2 తెలుగు సినిమా చరిత్రలో ఎలాంటి కొత్త రికార్డులు నమోదు చేస్తుందా? అని అంచనాలు వేయడంలో అందరూ బిజీగా ఉంటున్నారు. ఇలాంటి సమయంలో అల్లు అర్జున్ మీద ఎన్నికల నియమ ఉల్లంఘన కేసు కొట్టి వేయబడడం వారికి పెద్ద ఊరట అని చెప్పాలి. అల్లు అర్జున్ అభిమాన శిబిరం ఈ హైకోర్టు తీర్పుతో మరింత ఉత్సాహంగా కనిపిస్తోంది.

Pawan Kalyan Clarifies on Volunteer System

The coalition government, which had pledged during the elections to continue the volunteer system set up by the previous YSRCP government, has yet to fulfill this promise. Volunteers have been neglected, with their services going unrecognized and their salaries unpaid, leading to significant criticism. In response to these concerns, Deputy Chief Minister Pawan Kalyan recently met with Sarpanch associations and provided clarity on the government’s stance.

Speaking with Sarpanch leaders in Amaravati, Pawan Kalyan addressed the ongoing discussions surrounding the volunteer system. Responding to requests from Sarpanches to abolish the system, the Deputy CM explained that while the current government intends to support volunteers, the previous administration had misled them.

Pawan Kalyan emphasized that the volunteer system could only be dismantled if the volunteers were officially employed. He clarified that since they are not formal employees, the issue at hand is primarily technical. His comments shed light on why the government has distanced itself from the volunteer system and raised questions about its future. It remains to be seen whether the government will issue formal directives regarding the continuation of the volunteer system.

Scuffle In J&K Assembly over Article 370 Banner

A massive brawl broke out between the Bharatiya Janata Party (BJP) MLAs and marshals of the Jammu and Kashmir Assembly on Thursday after the speaker directed the eviction of opposition members who had stormed the well during their protest over the special status resolution.

The opposition People’s Democratic Party (PDP) moved a fresh resolution in the assembly to seek restoration of Articles 370 and 35A. “This House strongly condemns the unconstitutional and unilateral abrogation of Article 370 and Article 35A, along with the enactment of the Jammu and Kashmir of its special status and statehood, undermining the foundational guarantees and protections originally accorded to the region and its people by the Constitution of India,” the resolution read.

The resolution was submitted by PDP members Waheed Para (MLA Pulwama) and Fayaz Mir (MLA Kupwara), Peoples’ Conference MLA from Handwara Sajad Lone, Awami Ittehad Party MLA from Langate Sheikh Khursheed (brother of MP Sheikh Abdul Rashid alias Engineer Rashid), and independent MLA from Shopian Shabir Kullay.

This came a day after the Assembly had passed a resolution on special status, seeking a “dialogue” with the Union Territory’s elected representatives for restoration of the same as well as constitutional guarantees, “and to work out constitutional mechanisms for restoring these provisions”. BJP MLAs had stormed the Well of the House yesterday as well when the resolution was moved.

While the scuffle ensued, PDP’s Waheed Para and Fayaz Mir and Peoples Conference’s Sajad Gani Lone brought forth another resolution seeking the restoration of the special status. The resolution was also signed by Sheikh Khursheed.

PDP MLAs also called for the reversal of all changes introduced in the Union territory after the erstwhile state was stripped of its special status in 2019. The Modi government abrogated Article 370, which gave special status to Jammu and Kashmir in 2019, and bifurcated the erstwhile state into two Union Territories of Jammu and Kashmir and Ladakh. Article 35A gave special rights to the permanent residents of the erstwhile state of Jammu and Kashmir.

At least three MLAs were marshalled out on the directions of Speaker Abdul Rahim Rather but the brawl ensued due to resistance put up by the opposition members. 

విద్యుత్తు భారం పాపానికి మూల కారణం అన్నయ్యేనట!

చంద్రబాబు నాయుడు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లపాటు విద్యుత్ ఛార్జీలు  పెంచబోమని ఎన్నికల ప్రచార సమయంలో స్పష్టంగా ప్రకటించారు. వీలైతే జగన్ పెంచిన చార్జీలను తగ్గిస్తాం అని కూడా అప్పట్లో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే.. ట్రూ అప్ చార్జీల పేరిట ఇప్పుడు ప్రజల మీద భారం మోపడం జరిగింది. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినప్పటికీ అందుకు భిన్నంగా ఇలా ఎందుకు జరిగిందనే సందేహాలు ప్రజల్లో ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు ఇచ్చుకునే వివరణల సంగతి పక్కన పెడితే.. ప్రజల్లోని అలాంటి సందేహాలను నివృత్తి చేస్తున్నారు స్వయానా జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల. అన్నయ్య జగన్ చేసిన పాపాల ఫలితంగానే ఇప్పుడు ప్రజల మీద అనివార్యంగా విద్యుత్తు చార్జీల భారం మోపవలసి వచ్చింది అంటున్నారు.

ఇవాళ ప్రజల మీద పడిన విద్యుత్తు చార్జీల సర్దుబాటు భారం యొక్క పాపం పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాని దేనని షర్మిల ఆరోపిస్తున్నారు. పెంచిన చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఏపీసీసీ అధ్యక్షురాలు హోదాలో షర్మిల విజయవాడలో పార్టీ నాయకులతో కలిసి ధర్నా నిర్వహించారు. చేతుల్లో లాంతర్లు పట్టుకుని వారంతా తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. విద్యుత్తు చార్జీల రూపంలో రాష్ట్ర ప్రజల మీద 35 వేల కోట్ల భారం వేయడం వల్లనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్ మోహన్ రెడ్డి పాలనను ప్రజలు దారుణంగా తిరస్కరించారని గుర్తు చేశారు. అవి చాలవన్నట్లుగా జగన్ చేసిన పాపాల ఫలితంగా ఇప్పుడు కూడా ప్రజల మీద 17 వేల కోట్ల భారం పడే ప్రమాదం ఉన్నదని ఆమె పేర్కొన్నారు. ఆ భారం నుంచి ప్రజలను తప్పించాలని వైఎస్ షర్మిల.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరుతున్నారు. అవసరమైతే కేంద్రంతో సంప్రదించి వారి నుంచి నిధులు తీసుకుని అయినా సర్దుబాటు చార్జీల భారాన్ని పూడ్చాలని ప్రజలకు ఇబ్బంది లేకుండా తప్పించాలని ఆమె కోరుతున్నారు.

విద్యుత్తు చార్జీల భారాన్ని కూడా కేంద్రం మీద వేయడం వారి నుంచి నిధులు తీసుకురావడం అంత సులభం కాకపోవచ్చు. తాను కాంగ్రెస్ పార్టీ నాయకురాలు గనుక బిజెపిని కార్నర్ చేయడానికి కేంద్రం నుంచి నిధులు తేవాలని షర్మిల అంటుండవచ్చు గాని అందులో లాజిక్ లేదు. రాష్ట్రంలో ప్రస్తుతం డబల్ ఇంజిన్ సర్కారు నడుస్తున్న నేపథ్యంలో కేంద్రం అన్ని రకాలుగా సహకారం అందిస్తున్న సంగతిని విస్మరించడానికి వీల్లేదు. అమరావతి, పోలవరం, ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు ఇలా అనేక రకాల వ్యవస్థలకు కేంద్రం ఇప్పటికే వేల వేల కోట్లు రూపాయలు అందిస్తున్నది. ప్రస్తుతానికి విద్యుత్తు చార్జీల పెంపు భారం ఎవరు భరించాలనే విషయాన్ని పక్కన పెడితే.. ప్రజల మీద భారం పడడానికి ఐదేళ్లపాటు జగన్మోహన్ రెడ్డి సాధించిన దుర్మార్గమైన పరిపాలనే కారణం అని తాజాగా షర్మిల మాటల ద్వారా ప్రజలకు క్లారిటీ వస్తున్నది.

రణబీర్, సాయి పల్లవి “రామాయణం” విడుదల తేదీ ఖరారు

బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ ఒక వైలెంట్ సూపర్ హిట్‌ సినిమా “అనిమల్” తర్వాత చేస్తున్న భారీ పీరియాడిక్  సినిమానే “రామాయణం”. దర్శకుడు నితీష్ తివారి కాంబోలో స్టార్ట్ అయ్యిన ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుగుతుంది.

అయితే ఈ సినిమాలో రామునిగా రణబీర్ నటిస్తుండగా హీరోయిన్ సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తున్నారు. మరి మొదటి నుంచీ మంచి ఎగ్జైట్మెంట్ ఉన్న ఈ సినిమా రిలీజ్ పై ఫైనల్ గా బాలీవుడ్ నుంచి క్లారిటీ వచ్చేసింది.

మరి ఈ సినిమాని రెండు భాగాలుగా చేస్తున్నట్టుగా ఇపుడు కన్ఫర్మ్ అయ్యింది. మొదటి భాగాన్ని ఏకంగా 2026 దీపావళి కానుకగా విడుదల చేస్తున్నట్లుగా తెలిపారు. అలాగే రెండో భాగాన్ని ఆ మలి ఏడాది 2027 దీపావళి కానుకగా అయితే విడుదల చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. దీనితో రానున్న వరుస రెండేళ్లు దీపావళి రేస్ ని బాలీవుడ్ సినిమా పాన్ ఇండియా వైడ్ గా లాక్‌ చేసేసుకుందని తెలుస్తుంది. మరి ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

తెలుగులో ఎందుకు చేయడం లేదు..ఆఫర్లు రావడం లేదా!

టాలీవుడ్ ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత గురించి అందరికీ తెలిసిందే. మరి సమంత ఇపుడు తెలుగు తో పాటు పాన్ ఇండియా మార్కెట్ లో కూడా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది.

 అయితే సమంత ఇపుడు తన మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్ “సిటాడెల్ హనీ బన్నీ” ప్రమోషన్స్లో ఫుల్‌  బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ ప్రమోషన్స్ లో ఆమె బిజీగా ఉంది. అయితే దీనికి ముందు తన ఆరోగ్య విషయంలో  కొన్నాళ్ల పాటుగా బ్రేక్ తీసుకుని మళ్లీ కమ్ బ్యాక్ ఇచ్చింది.

అయితే ఇలా వచ్చాక మాత్రం టాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. అయితే దీని గురించి ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఐఫా అవార్డ్స్ వేడుకలో యంగ్ హీరో రానాతో చేసిన ఇంటరాక్షన్ లో సమంత రానాని ఎందుకు సినిమాలు చెయ్యట్లేదు అంటే నన్నెవరూ తీసుకోవట్లేదు అని రానా బదులిస్తే సామ్ కూడా తనకి కూడా అలాగే ఉంది అంటూ కామెంట్స్ చేసింది. దీంతో ఈ కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి.

ReplyForwardAdd reaction

తేజ్‌ సినిమాలో మరో విలక్షణ నటుడు!

సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ నటిస్తున్న తాజా సినిమాని SDT18 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందిస్తున్నారు. భారీ థ్రిల్లింగ్ పీరియడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను రోహిత్ కెపి డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ నటిస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా మేకింగ్ గ్లింప్స్‌ని చిత్ర యూనిట్ విడుదల చేయగా, దానికి ప్రేక్షకుల నుండి సాలిడ్‌ రెస్పాన్స్ అందుకుంది.

ఇక ఈ సినిమాలో వెర్సటైల్ యాక్టర్ జగపతి బాబు ఓ కీలక పాత్రలో యాక్ట్ చేస్తున్నట్లు ఇటీవల చిత్ర బృందం ప్రకటించింది. అయితే, తాజాగా ఈ సినిమాలో మరో విలక్షణ నటుడు, డైలాగ్ కింగ్ సాయి కుమార్ కూడా ఓ వైవిధ్యమైన పవర్‌ఫుల్ పాత్రలో చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

ఈ మేరకు ఓ పవర్‌ఫుల్ పోస్టర్‌ని కూడా వారు విడుదల చేశారు. సాయి కుమార్ పాత్ర ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తుందని మేకర్స్ ధీమా గా ఉన్నారు. ఈ సినిమా కోసం సాయి దుర్గ తేజ్ భారీ మేకోవర్ చేయనున్నట్లు సమాచారం.

ఆయన ఇప్పటికే భారీగా బాడీ బిల్డ్ చేస్తున్నాడు.  ఇక ఈ సినిమాలో అందాల భామ ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్‌గా నటిస్తోండగా ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించనున్నాడు.. 

తండేల్‌ పై ఆసక్తికర అప్డేట్‌!

అక్కినేని యువ సామాట్ర్  నాగ చైతన్య  హీరోగా , నేచురల్  బ్యూటీ, ముద్దుగుమ్మ సాయి పల్లవి కాంబోలో  దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కిస్తున్న భారీ సినిమా “తండేల్”. మరి అనౌన్సమెంట్ నుంచే మంచి అంచనాలు ఉన్న ఈ సినిమా కోసం అక్కినేని అభిమానులు అయితే ఎప్పుడు నుంచో ఎంతో ఆతృంగా ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ సినిమాపై అవైటెడ్ విడుదల తేది గురించి అప్డేట్ ని కూడా మేకర్స్ అందించారు. ఇక నెక్స్ట్ అప్డేట్ పై ఇపుడు లేటెస్ట్ రూమర్స్ వినపడుతున్నాయి. దీని ప్రకారం తండేల్ నుంచి నెక్స్ట్ మ్యూజికల్ ట్రీట్ ఉండనున్నట్లు సమాచారం.  

అలా మేకర్స్ దేవిశ్రీ ప్రసాద్ మార్క్ ఒక బ్యూటిఫుల్ లవ్ ట్రాక్ తో తండేల్ మ్యూజిక్ ఆల్బమ్ ని మొదలు పెట్టనున్నట్లు తెలుస్తుంది. దీంతో అభిమానులతో పాటు మ్యూజిక్ లవర్స్ కి రానున్న రోజుల్లో మంచి ట్రీట్ ఉండబోతుందని సమాచారం.

ఇక ఈ చిత్రానికి గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ వారు నిర్మాణం వహిస్తుండగా పాన్ ఇండియా లెవెల్లో ఫిబ్రవరి 7న సినిమాని విడుదలకి తీసుకురానున్నారు.

ReplyForwardAdd reaction

ఇతర భాషల్లో క విడుదల!

తాజాగా టాలీవుడ్ సినిమా కొట్టిన రీ సౌండింగ్ సూపర్ హిట్ సినిమాల్లో “క” మూవీ కూడా ఒకటి. యువ హీరో కిరణ్ అబ్బవరం నటించిన ఈ సినిమాలో నయన్ సారిక హీరోయిన్ గా చేసిన సంగతి తెలిసిందే.

 ఇక ఈ సినిమా దీపావళి కానుకగా వచ్చి ఒక బ్లాస్టింగ్ హిట్ అందుకుంది. ఇలా సాలిడ్ హైప్ లో నిలిచిన ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టి అదరగొట్టగా మేకర్స్ అయితే ముందు పాన్ ఇండియా విడుదలకి ప్లాన్‌ చేసిన సంగతి తెలిసిందే.

కానీ పలు కారణాలు చేత ఇది ఏకకాలంలో సాధ్యం కాలేదు. మొదట తెలుగులో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని అందుకుని ఇతర భాషల్లో విడుదలకి  రెడీ అయ్యింది. హిందీ, మళయాళం, తమిళ్ భాషల్లో విడుదలకి  రెడీగా ఉంది.

మరి వీటిలో మళయాళ వెర్షన్ ఈ నవంబర్ 15న విడుదల కానుండగా… మిగతా రెండు భాషల్లో నవంబర్ 22న “క” థియేటర్స్ లో సందడి చేయనున్నట్టుగా సమాచారం. ఇక ఈ చిత్రానికి సందీప్, సుజీత్ లు దర్శకత్వం వహించగా క ప్రొడక్షన్స్ వారు నిర్మించారు.

IT Raids on YCP Ex MLA Grandhi Srinivas

Income Tax (IT) officials have raided the businesses of YSRCP leader and former MLA of Bhimavaram in West Godavari district, Grandhi Srinivas. Searches were conducted at his residence and the houses and business establishments of Grandhi’s business partners in the wake of allegations of tax evasion related to businesses worth crores of rupees.

The IT officials conducted these raids simultaneously in West Godavari, Krishna and Prakasam districts on Wednesday. Amidst the security of the Central Police Force, IT officials reached Grandhi’s house in Bhimavaram on Wednesday morning and seized records. It is reported that key documents were found in these.

Grandhi Srinivas has processing units in the shrimp business. It is also known that he has conducted transactions with other shrimp traders in Bhimavaram. This is the second time that IT searches have been conducted at Grandhi’s residence. Inspections were conducted once three decades ago. Inspections were conducted again now.

IT officials also conducted raids at Sagar Grandhi Exports Private Limited (GVR) in the old Singarayakonda panchayat limits of Singarayakonda mandal of Prakasam district. This is a shrimp processing and export company owned by Grandhi Srinivas. 11 IT officials thoroughly examined all the records of the company.

 It is reported that IT officials have seized several key records after the searches. IT officials also conducted searches at the residence of Chennu Lakshmana Rao (CL Rao), a prominent shrimp trader from Nagayalanka in Krishna district and business partner of Grandhi Srinivas.

Nine IT officials from Telangana.. Under the direction of the Commissioner of that department, searches were conducted at Lakshmana Rao’s house in Nagayalanka. Lakshmana Rao has a shrimp company in Vakkapatla Vari Palem and an ice factory in Avanigadda. IT officials have conducted searches at five places.

Lakshmana Rao came to Nagayalanka less than 20 years ago and started a shrimp business. In this process, he is also doing business with former YSRCP MLA Granthi Srinivas. It is known that financial transactions worth Rs. 75 crores were recently made in partnership between Lakshmana Rao and Granthi Srinivas. However, it is reported that IT officials conducted raids due to non-payment of income taxes in this regard.