Home Blog Page 632

పాపం జగన్! జీవో తెచ్చినా అనుభవించే ప్రాప్తం లేదు!!

విశాఖలోని ఋషికొండను పూర్తిగా గుండు కొట్టించేసి అత్యంత విలాసవంతమైన భవనాలను నిర్మించడం కేవలం జగన్మోహన్ రెడ్డి నివాసం కోసం మాత్రమే.. అనే సంగతి ప్రజలందరికీ అర్థమైంది! విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధాని చేస్తానని ప్రకటించిన జగన్ మోహన్ రెడ్డి ఋషికొండను బోడి కొట్టించి అక్కడ తన కోసం ఒక ప్యాలెస్ నిర్మించడం మినహా ఆ ఊరికి మరేం చేయలేదు. అందుకే యావత్తు ఉత్తరాంధ్ర అత్యంత దారుణంగా జగన్మోహన్ రెడ్డిని తిరస్కరించింది. ఇంతా కలిపి రుషికొండలో నిర్మించిన ప్యాలెస్ ను జగన్ కనీసం అనుభవించగలిగారా అంటే అది కూడా లేదు. దాదాపు 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తగలేసి టూరిజం ప్రాజెక్టు ముసుగులో తన నివాస భవనాలను నిర్మించుకున్న జగన్మోహన్ రెడ్డి- తన పదవీకాలంలో వాటికి ప్రారంభోత్సవం మాత్రం చేశారు. కనీసం ఒక్క రాత్రి కూడా ఆ ప్యాలెస్ లో బస చేయడానికి కుదరలేదు.

ఇంకా లోతుగా చెప్పాలంటే ఇప్పుడే బయటపడిన రహస్యం మరొకటి ఉంది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం గానూ, నివాసం గాను వినియోగించుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఒక జీవో కూడా తెచ్చారు. గత ఏడాది నవంబర్ 22వ తేదీన జీవో ఆర్ టి 2282 లో ఈ విషయాన్ని పేర్కొన్నారు. జగన్ సర్కారు తన పరిపాలన కాలంలో తీసుకువచ్చిన అనేక అనేక రహస్య జీఓలలో ఋషికొండ ప్యాలెస్ ముఖ్యమంత్రి నివాసమే అని చెప్పే ఈ జీవో కూడా ఒకటి! అందులో ఇంచుమించుగా ఒకటిన్నర లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం ఉంటుందని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి అక్కడితో ఆగలేదు. ఆ భవనంలో ఫర్నిచర్ ఏర్పాటు కోసం డిసెంబరులో మరొక జీవో కూడా తీసుకువచ్చారు. ఈ విషయాలన్నీ ఇప్పుడే వెలుగు చూశాయి!

చాలా సుదీర్ఘకాలం శోధించిన తర్వాత ఈ జీవోలు తనకు దొరికినట్టుగా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జరిగిన బిఎసి మీటింగులో చంద్రబాబు నాయుడుకు విష్ణుకుమార్ రాజు ఈ విషయం తెలియజేశారు. ఆయన చెప్పే వరకు ఋషికొండ ప్యాలెస్ ను సీఎం నివాసం కోసం కేటాయించారనే సంగతి చంద్రబాబుకు కూడా తెలియకపోవడం గమనార్హం. అంత గోప్యంగా జగన్ జీవో తీసుకువచ్చారని అర్థమవుతోంది. పాపం ఆయన అత్యంత విలాసవంతమైన భవనాన్ని అనుభవించడానికి ప్రభుత్వ సొమ్మును తగలేసి జీవో కూడా తీసుకువచ్చారు గాని అందులో నివసించే ప్రాప్తం మాత్రం ఆయనకు లేకుండా పోయిందని ప్రజలు నవ్వుకుంటున్నారు!

TDP Leader Sudha Rani Shocks By Contesting MLC Elections Independently

Ahead of the crucial MLC elections, the Chandrababu Naidu-led TDP government faced a major setback. TDP leader Sudha Rani has surprised many by filing her nomination as an independent candidate for the Unified Vijayanagaram district local body MLC elections, going against the party’s instructions. In her explanation, Sudha Rani shared that her personal aspiration to become an MLC was the key reason behind her decision to contest independently.

Sudha Rani clarified that her nomination was a personal choice, separate from the TDP’s directives. For context, her husband Raghuraju had previously served as an MLC. At present, Sudha Rani serves as the Vice MPP of S. Kota and is a Director at the State Tourism Corporation. Despite her prominent positions, she chose to file her nomination without consulting the local MLA or coalition leaders.

Her independent candidacy has created ripples, complicating the alliance’s chances of success in the elections. In response, TDP leaders have intervened, requesting her to withdraw her nomination to avoid harming the party’s prospects.

As the situation continues to unfold, clarity is expected in the next few days. With the coalition government still in power, uncertainty surrounds the MLC race. The presence of multiple candidates from TDP, Jana Sena, and BJP has heightened the competition, while Sudha Rani’s surprise independent candidacy has quickly become a hot topic in Unified Vijayanagaram, keeping the political scene buzzing.

 “I Still Dream of Becoming A Mom”: Samantha

Actress Samantha has sparked interest with her heartfelt revelation about still dreaming of becoming a mother. Embracing the idea of motherhood, she shared that while she hasn’t yet stepped into this role, she doesn’t feel it’s too late and looks forward to the possibility. Samantha recently played a mother to young Nadia Singh, portrayed by Kashvi Majmudar, in the web series Citadel: Honey Bunny, which has earned her rave reviews. When asked in an interview if she misses the experience of real-life motherhood, Samantha spoke openly about her desires and thoughts on the subject.

Samantha and Naga Chaitanya, who married in 2017, went their separate ways in 2021, and she has since focused on her solo journey. Meanwhile, Naga Chaitanya recently became engaged to Sobhita Dhulipala, with wedding celebrations planned for December 4 at Hyderabad’s Annapurna Studios.

Released on November 7, Citadel: Honey Bunny also stars Varun Dhawan in a prominent role, and the series is winning fans over with its captivating storyline and performances.

జగన్ బుద్ధి : 11 నియోజకవర్గాలకు శాపం!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క సంకుచిత మనస్తత్వం, కురచబుద్ధి రాష్ట్రంలో ఏకంగా 11 నియోజకవర్గాలకు శాపంగా మారుతున్నాయి. 11 నియోజకవర్గాల ప్రజలకు ద్రోహం చేస్తున్నాయి. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేంత వరకు తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎవ్వరూ కూడా సభకు వెళ్లవద్దని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించడం వలన, ఆ నియోజకవర్గాలకు చెందిన సమస్యలు ఏవీ శాసనసభలో ప్రస్తావనకు వచ్చే అవకాశమే లేదు. దీనివల్ల ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ఆ నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం కుంటుపడుతుంది. వెరసి జగన్ బుద్ధి ప్రగతి నిరోధకం అవుతోంది.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకుచితమైన బుద్ధి పట్ల ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. శాసనసభ సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి సమావేశం నిర్వహించిన జగన్ వారికి తేల్చిచెప్పారు. మామూలు ఎమ్మెల్యేలకు ఇచ్చినట్టు రెండు నిమిషాలు మైక్ ఇస్తానంటే ప్రజా సమస్యలను ఏం చెప్పగలను?  అంటూ జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలతో అన్నట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేలు ఆయనకు నచ్చజెప్పడానికి ప్రయత్నించినా కూడా ఆయన పట్టించుకోలేదు.

ఎమ్మెల్యేలుగా మనం సభకు వెళ్లకపోవడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు.. అని కొందరు ఎమ్మెల్యేలు ప్రస్తావించినప్పుడు జగన్ అసహనానికి గురైనట్టు తెలుస్తోంది. వారికి పెద్ద క్లాస్ తీసుకున్నారని అంటున్నారు. మనం శాశ్వతంగా వెళ్లం అని చెప్పడం లేదు.. ప్రతిపక్ష హోదా ఇచ్చాక వెళ్దాం అని జగన్ అంటున్నారు గానీ.. అది ఈ అయిదేళ్లలో జరిగేది కాదని  ఆయనకు కూడా తెలుసు అని సొంత ఎమ్మెల్యేలే అనుకుంటున్నారు.
సభకు ఒకసారి వెళదాం.. వెళ్లిన తర్వాత కూడా మైక్ ఇవ్వకపోతే అప్పుడు అసెంబ్లీకి రాబోము అని ప్రకటించడం బాగుంటుంది- అని కొందరు సీనియర్లు జగన్ కు బుద్ధి చెప్పే ప్రయత్నం చేశారు. అయితే దానికి కూడా అసహనంగా ‘వాళ్లూ ఎటూ  మైక్ ఇవ్వరు.. అంతదానికి వెళ్లడం ఎందుకు?’ అంటూ జగన్ విరుచుకుపడ్డట్టు తెలుస్తోంది.

ఒకవైపు సభకు వెళ్లకపోతే మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసేయాలని.. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేస్తున్నారు. జగన్ మాత్రం తన సంకుచిత బుద్ధులను మార్చుకుని ప్రజల కోసం ఎమ్మెల్యేగా బాధ్యతగా ఉండాలనే సంగతిని మర్చిపోతున్నారు.

Samantha’s Tears on The Family Man-2 Set

Director duo Raj & DK are gearing up for the release of their upcoming web series Citadel: Honey Bunny, featuring Samantha in the lead role. This follows their previous collaboration with the actress on The Family Man-2, where Samantha also played a significant role. Reflecting on their earlier work together, Raj & DK shared an emotional behind-the-scenes moment.

The directors revealed that when filming for The Family Man-2 concluded, Samantha was moved to tears. “When we told her the shoot was finished, she asked, ‘Is everything wrapped up? Is there anything left to shoot?’ We informed her that the shoot was complete, and she began crying like a child. Both of us exchanged puzzled looks,” Raj & DK said.

They further explained, “We wondered why she was crying. We thought perhaps we had been too demanding during the shoot. At that time, we were unaware of the emotional struggles Samantha was dealing with during the filming of The Family Man-2.”

Kasthuri Seeks Anticipatory Bail in Defamation Cases Over Telugu Community Remarks

Actress Kasthuri’s recent remarks regarding the Telugu community in Tamil Nadu have sparked major controversy, leading to defamation cases filed against her in Chennai and Madurai. Allegations claim that her comments about Telugu residents in the state were derogatory, igniting backlash from the community.

On Sunday, police visited Kasthuri’s residence in Chennai to serve a notice, but found the premises locked, leading them to believe she may be evading contact. In response, Kasthuri has now sought anticipatory bail from the Madras High Court, arguing in her plea that the cases were filed with intent to malign her. Justice Anand Venkatesh’s bench is scheduled to review her bail petition tomorrow, November 12.

The actress made the remarks during a November 3 protest organized by the Hindu Makkal Katchi in Chennai, where she was reportedly vocal about Telugu people’s historical role in Tamil Nadu, which many found offensive. Despite issuing an apology, Telugu associations in the state have maintained their stance and continue to press charges.

Kasthuri, who recently campaigned for the BJP in the Lok Sabha elections, faced criticism from her own party, with BJP leaders condemning her remarks. Her statement insinuated that the Telugu people in Tamil Nadu, originally brought centuries ago to serve in royal palaces, now assert a Tamil identity. This statement has led to growing discontent among Telugu residents across Tamil Nadu.

Director Sukumar Puts Selfish on Hold, Focuses on Pushpa-2 Release

Director Sukumar is currently engaged in post-production and final shooting stages for Pushpa-2: The Rule, starring Allu Arjun. Set to be one of India’s biggest releases, the trailer for this highly-anticipated film is scheduled for launch on November 17 in Patna, Bihar, with the film’s theatrical release planned for December 5.

Meanwhile, the release timeline of Pushpa-2 has impacted another project, Selfish, produced by Dil Raju and directed by Sukumar’s protégé, Kasi, with Ashish Reddy in the lead role. Sukumar’s own production house, Sukumar Writings, is co-producing the film. Although Selfish commenced filming last year and completed about 50% of its shoot, Dil Raju sought Sukumar’s input for adjustments in the storyline.

With Sukumar presently focused on Pushpa-2, he advised Dil Raju to defer story discussions until after Pushpa-2’s release, resulting in a temporary pause in Selfish’s production. In a press meet today, Dil Raju announced that filming for Selfish would resume after finalizing story changes with Sukumar, commending the director’s commitment to supporting his team even amid a packed schedule.

బుగ్గన కూడా ఇంత మూర్ఖంగా మాట్లాడితే ఎలా?

జగన్మోహన్ రెడ్డి పరిపాలన హయాంలో ఆయన మంత్రి వర్గ సహచరుల్లో అంతో ఇంతో బుర్ర ఉన్న, ప్రాక్టికాలిటీకి దగ్గరగా ఉన్న మంత్రుల్లో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఒకరు అని ఎరిగిన వారు చెబుతూ ఉంటారు. అందుకే.. జగన్మోహన్ రెడ్డి ఆచరణ సాధ్యం కాని, ప్రభుత్వాన్ని ముంచేసే అనేక పథకాలను ప్రవేశపెడుతున్నప్పుడు అప్పట్లోనే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన అభ్యంతరాలను కూడా చెబుతూ వచ్చారని కూడా అంటుంటారు.

అలాంటి బుగ్గన ఇప్పుడు పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ గురించి తన అమూల్యమైన అభిప్రాయాలు వెల్లడించారు. సొంత బుద్ధి, ఆలోచన ఉన్న బుగ్గన బడ్జెట్ గురించి తన సొంత అభిప్రాయాలే చెప్పారా? లేదా, వైసీపీ లోని ఇతర పార్టీ నాయకుల్లాగా తాడేపల్లి నుంచి వచ్చిన స్క్రిప్టును చదివివినిపించారా? అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. బుగ్గన కూడా ఇంత మూర్ఖంగా మాట్లాడితే ఎలా అని వారు అంటున్నారు.
మేనిఫెస్టో అమలు చేస్తారని ఎదురుచూసిన వారికి నిరాశ కలిగించేలా ఈ బడ్జెట్ ఉన్నదట. మేనిఫెస్టో అనేది అయిదేళ్లకోసం ప్రభుత్వం ఇచ్చే హామీపత్రం. దానిని తొలి ఏడాదిలోనే పూర్తిచేసేయాలని ఎదురుచూసేవారు ఎవరుంటారు? బుగ్గన తప్ప.. అని జనం జోకులేసుకుంటున్నారు.


అలాగే గత ప్రభుత్వం కంటె 41 వేల కోట్ల ఎక్కువ ఖర్చు పెట్టేలా బడ్జెట్ ఉన్నదని, ఎలాంటి పథకాల అమలు లేకుండానే ఇంత బడ్జెట్ ఎందుకో అర్థం కావడంలేదని బుగ్గన అంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జగన్ ఏలుబడి కాలంలో.. అసలు పథకాలు తప్ప ప్రభుత్వం ఒక్క పనికూడా చేసిన పాపాన పోలేదు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేపట్టడం అంటే ఏమిటో అయిదేళ్లుగా ప్రజలు పూర్తిగా మరచిపోయారు. అలాంటిది ఇప్పుడు చంద్రబాబునాయుడు ప్రభుత్వం పోలవరం, అమరావతి సహా అనేక ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన చేపడుతుండగా.. డబ్బు ఖర్చు పెరగకుండా ఎలా ఉంటుంది? బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి  మరీ అంత అమాయకంగా మాట్లాడితే ఎలా అనే ప్రజలు అనుకుంటున్నారు.


తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 2.94 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు అని అర్థమవుతోంది. వారి అక్కసు బుగ్గన మాటల్లో కనిపిస్తోందని అంతా అనుకుంటున్నారు.

కేసులో ఆర్జీవీ.. కావాలంటే ఇంకో పోస్టు పెట్టేస్తారు కదా!!

సోషల్ మీడియాను వాడుకుని అసభ్యమైన పోస్టులు పెట్టినందుకు, ఒక ప్లాట్‌ఫాం ఉన్నది కదా అనే దూకుడుతో అత్యంత హేయగా ప్రవర్తించినందుకు ఇప్పుడు అనేకమందిమీద కేసులు నమోదు అవుతున్న సంగతి అందరికీ తెలుసు. వైస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్  మీడియా అనే ముసుగులో చత్త పోస్టులు పెట్టిన వారంతా ఇప్పుడు అరెస్టులకు సిద్ధం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ క్రమంలోనే సినిమా దర్శకుడు రాంగోపాల్ వర్మ మీద కూడా ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. అయితే కిరాయి డబ్బుల కోసం తన సినిమా  ప్రమోషన్స్ చేయడానికి ఎంతకైనా దిగజారే ఆర్జీవీ.. ఇప్పుడు కేసు నుంచి తప్పించుకోవడానికి కావాలంటే జగన్మోహన్ రెడ్డిని తిుతూ గానీ, లోకేష్ బ్రాహ్మణి లను పొగుడుతూ గానీ.. ఇంకో పోస్టు సునాయాసంగా పెట్టేయగలరు కదా.. అని ఇండస్ట్రీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

ఎన్నికలకు ముందు.. సినిమా మీడియం ద్వారా.. చంద్రబాబునాయుడు మీద బురద చల్లడానికి, ఆయనను విలన్ గా ప్రొజెక్టు చేస్తూ ప్రజల్లో చులకన చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఒక సుదీర్ఘమైన స్కెచ్ వేశారు. రాంగోపాల్ వర్మతో రెండు మూడు చిత్రాలు  చేయించి.. ప్రజల మీదికి వదలాలని అనుకున్నారు. వం కోట్ల రూపాయలు సాలిడ్ గా ఆయనకు ఇచ్చినట్టుగా, సినిమాల బాధ్యత అంతా ఆయన చూసుకునేట్టుగా డీల్ కుదిరింది.

సాధారణంగా రాంగోపాల్ వర్మ.. తనకు నిర్మాత రూపంలో డబ్బు పెట్టే వారు దొరికితే చాలు.. వారికి ఏం కావాలంటే అది – తన భావజాలంతో సంబంధం లేకుండా సినిమా తీసి ఇచ్చేస్తాడని.. ఆ సినిమా ప్రమోషన్స్ కోసం స్పైసీగా ఏం కావాలంటే అది చేస్తారని పేరుంది. అలాంటిది ఆయన- వైఎస్సార్ మరణం నుంచి జగన్ సీఎం కావడం వరకు పరిణామాలను వ్యూహం సినిమాగా తెరకెక్కించారు. ఆ సినిమా ప్రమోషన్స్ లో ఏదో ఒక చెత్త వ్యాఖ్యలు చేసే ఉంటారు. ఆ క్రమంలో నారా లోకేష్ బ్రాహ్మణి లను కించపరిచే మాటలు చెప్పి ఉంటారు. అవి ఇప్పుడు తలకు చుట్టుకుంటాయని ఆయన ఊహించి ఉండకపోవచ్చు.

కానీ ఆర్జీవీ వ్యాఖ్యలు కేవలం కిరాయి వ్యాఖ్యలు, కూలి మాటలు అని గుర్తించాలి. ఇప్పుడు తెలుగుదేశం వాళ్లు డబ్బులు ఇస్తే జగన్మోహన్ రెడ్డిని అత్యంత నీచంగా తిడుతూ పోస్టులు పెట్టగరు కూడా అని పలువురు అంటున్నారు. మొత్తానికి ఈ కేసు ను ఆర్జీవీ ఎలా డీల్ చేస్తారో.. వైసీపీ లీగల సెల్ సాయం తీసుకుంటారో లేదో వేచిచూడాలి.

ఈ సినిమాలో కూడానా?

బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో స్టార్ హీరో రణబీర్ కపూర్ రాముడిగా, హీరోయిన్ సాయి పల్లవి సీతగా రామాయణ్ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. రావణుడిగా కన్నడ స్టార్ హీరో యష్ యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో సన్నీ డియోల్, రకుల్, లారా దత్తా వంటి ప్రముఖ నటీనటులు కూడా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో మరో కీలక పాత్రలో సీనియర్ హీరోయిన్ శోభన కూడా యాక్ట్‌ చేస్తున్నట్లు సమాచారం.

మరి శోభన ఏ పాత్రలో నటిస్తోందో చూడాలి. ఇక, ఈ నెల నాలుగో వారం నుంచి జరగబోయే కొత్త షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారట. ఈ సన్నివేశాలు సినిమాలోనే కీలకం అని, ముఖ్యంగా రణబీర్ – సాయి పల్లవి పాత్రలను ఎలివేట్ చేస్తూ ఈ సన్నివేశాలు ఉంటాయని సమాచారం. అన్నట్టు కన్నడ స్టార్ హీరో యష్ ఈ మూవీ ప్రొడక్షన్ లో ఓ భాగమైన సంగతి తెలిసిందే. ఆయన సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పవిత్ర ఇతిహాసం రామాయణం ఆధారంగా రాబోతుంది.