Home Blog Page 629

ఈ ఏడాది చివరిలోనే!

పాన్ ఇండియా యంగ్‌ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా  భారీ సినిమాల్లో సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో చేస్తున్న పాన్ ఆసియా సినిమా “స్పిరిట్” ఓ మూవీ. మరి దీనిపై భారీ అంచనాలు సెట్ చేసుకోగా ఈ సినిమా కోసం అభిమానులు ఓ రేంజ్ లో ఎగ్జైట్ అవుతున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అంతా ఆసక్తిగా కూడా ఎదురు చూస్తున్నారు.

అయితే ఇపుడు ప్రభాస్ ఉన్న ఈ అంత బిజీలో కూడా సందీప్ ఈ సినిమాని తాను అనుకున్నట్టుగానే ఏడాది చివరిలోనే స్టార్ట్ చేసేయనున్నాడట. దీంతో డిసెంబర్ లోనే సినిమా మొదలవుతుందని తాజా సమాచారం. సినిమా లాంచ్ ని మేకర్స్ మొదలు పెట్టానున్నారంట. ఈ సినిమాకి సంబంధించి ఆల్రెడీ మ్యూజికల్ సిట్టింగ్స్ కూడా మొదలైనట్లు సమాచారం. మరి ఈ సినిమా లాంచ్ పై అధికారిక అప్డేట్ మాత్రం ఇంకా బయటకు రావాల్సి ఉంది.

ReplyForwardAdd reaction

ఓ అరుదైన గౌరవం!

ఒక సినిమాని మనం తెరపై చూస్తున్నాము అంటే ఒక దర్శకుని విజన్, నిర్మాత డబ్బులు ఉంటే సరిపోదు ఆ రెండిటిని కలిపి కెమెరాలో అందంగా బంధించే ఛాయాగ్రాహకుల వల్లే అవుతుంది అని చెప్పాలి. అలా చాలా సినిమాల్లో కొందరు సినిమాటోగ్రాఫర్ లకి వారి పేరు పక్కన ఐ ఎస్ సి(ISC) అనే జత పదాలని చూస్తాం అయితే దానికి అర్ధం చాలా తక్కువమందికే తెలిసి ఉండొచ్చు. ఇంతకీ ఈ ఐ ఎస్ సి అంటే ఆయా సినిమాటోగ్రాఫర్ లకి ఇచ్చే అరుదైన గౌరవం అనమాట.

మన దేశంలో పలు శాఖలకు సంబంధించి పలు సంస్థలు ఉన్నాయి. అలా భారతీయ సినిమా దగ్గర తమ కెమెరా పనితనంతో అద్భుతమైన వర్క్ అందించిన కొందరికి దక్కే అరుదైన గౌరవమే ఈ ఐఎస్సీ ఇండియన్ సొసైటీ ఆఫ్ సినిమాటోగ్రాఫర్ వీరి సంస్థలో వేదం సినిమా సహా కంచె, గౌతమి పుత్ర శాతకర్ణి,  అలాగే టాలీవుడ్‌  ప్రయోగాత్మక చిత్రం అంతరిక్షం 9000 కేఎంపిహెచ్,  ఇంకా మణికర్ణిక లాంటి ప్రైడ్ ఇండియన్ సినిమాలకి తన విజువల్స్ ని అందించిన ఛాయాగ్రాహకులు జ్ఞాన శేఖర్ కి ఇపుడు ఈ అరుదైన గౌరవం దక్కింది.

సినిమాలో తన పనితనంతో అపారమైన వర్క్ అందించిన అందించినందుకు గాను ఐ ఎస్ సి వారు తమ సొసైటీలోకి ఆహ్వానించి ఈ గౌరవాన్ని అందించారు. మరి దీనితో జ్ఞాన శేఖర్ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ తన సినిమా జర్నీలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని ఈ కొత్త గుర్తింపు తనకి మరింత బాధ్యతని పెంచింది అని తాను తెలిపారు.

అలా వచ్చి..ఇలా వెళ్లిన….

టాలీవుడ్ పద్మ భూషనుడు మెగాస్టార్ చిరంజీవికి ఏ ఎమోషన్ ని అయినా అద్భుతంగా పండించగలరు అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే తనని చాలా వరకు ఫుల్ మాస్ హీరోగానే అనుకుంటారనే విషయమూ తెలిసిందే.

 కానీ తన వింటేజ్ కామెడీ టైమింగ్ అయితే ఒక సెపరేట్ అభిమానుల బేస్‌ అయితే ఉంది. ఉంది. కానీ దీనిని ప్రెజెంట్ చాలా మిస్ అవుతున్నామని కంప్లైంట్స్ కూడా ఉన్నాయి.తన వింటేజ్ మూవీస్ అన్నయ్య, జై చిరంజీవ తదితర సినిమాల్లో చిరు కామెడీ టైమింగ్ అదిరిపోయే లెవెల్లో ఉంటుంది. మరి రీసెంట్ గా అయితే మొన్న “వాల్తేరు వీరయ్య” లో కొంచెం కనిపించింది కానీ లేటెస్ట్ గా ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన స్పాంటేనియస్ కామెడీ టైమింగ్ వైరల్ గా మారింది.

యువ హీరో సత్యదేవ్ నటించిన “జీబ్రా” ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో  చిరులోకి అలా సడెన్ గా  లోకి వాల్తేరు వీరయ్య అలా వచ్చి ఇలా వెళ్లాడు. దీంతో ఈ క్లిప్ సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ గా మారింది. అలాగే తన కామెడీ టైమింగ్ ని పర్ఫెక్ట్ గా వాడుకునే సినిమాలు పడాలని ఆశపడుతున్నారు.

తాజా అప్డేట్‌ ఏంటంటే!

ప్రస్తుతం పాన్ ఇండియా ప్రేక్షకులు ఎంతో  ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ సినిమాల్లో ఐకాన్ స్టార్, జాతీయ నటుడు  అల్లు అర్జున్,  దర్శకుడు సుకుమార్ కాంబో లో వస్తున్న మోస్ట్‌  అవైటెడ్ సీక్వెల్ సినిమా “పుష్ప 2”  ఒకటి.

ఈ సినిమా పై  ఎనలేని అంచనాలు నెలకొనగా ఈ సినిమా ప్రమోషన్స్ ని మేకర్స్ ఆకాశమే హద్దుగా ఊహించని లెవెల్లో చేస్తున్నారు.

అయితే ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో ఈ  సినిమా ఐటెం సాంగ్ పై సాలిడ్ అప్డేట్ ని అందించారు. యంగ్ బ్లాస్ట్ శ్రీలీలతో  ప్లాన్ చేసిన ఈ సాంగ్ రీసెంట్ గానే మొదలై షూటింగ్ ని పూర్తి చేసుకుందంట. నిన్ననే ఈ సాంగ్ షూటింగ్ అంతా కంప్లీట్ అయ్యిపోయినట్టుగా తెలుస్తుంది.

ఇక ఇపుడు నెక్స్ట్ సాంగ్ పై లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది. ఆ సాంగ్ పూర్తయిన తరువాత ఇపుడు రష్మికపై డ్యూయెట్ సాంగ్ ని మేకర్స్ మొదలు పెట్టానున్నారని సమాచారం. ఇక ఈ సాంగ్ కూడా షూటింగ్ అయిపోతే సినిమా అయిపోయినట్టే అని తెలుస్తుంది. మరి ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందజేస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తుంది.

Vicky Kaushal As Chiranjeevi Parashurama In ‘Mahavatar’: A Fierce Look

Bollywood actor Vicky Kaushal has surprised fans with a stunning transformation for his new look in the upcoming mythological drama ‘Mahavatar’. The intriguing first look of Vicky Kaushal as Chiranjeevi Parashurama has been unveiled today, generating significant buzz.

Making it an official announcement, Maddock Films unveiled the first look of Vicky Kaushal from ‘Mahavatar’. The filmmakers shared two posters and a glimpse of Vicky Kaushal as Chiranjeevi Prashurama, showing him as a fierce warrior with long hair and a long beard. 

One poster highlights his intense expression as a powerful and fierce warrior from the front, while the other showcases his powerful stance from behind, showcasing his chiseled body and an axe holding. Vicky’s transformation is unbelievable, embodying the character’s strength, and looks apt for this role.

Directed by Amar Kaushik, renowned for his unique storytelling with Stree and Bhediya, will be helming this epic drama. This high-budget project is produced by Dinesh Vijan under the banner of Maddock Films. ‘Mahavatar’ is about the story of Chiranjeevi Prashurama, the eternal warrior of Dharma.

The film is expected to go on floors in November 2025 and is scheduled for a Christmas release worldwide in theaters in December 2026. Additional cast and crew details are expected to be revealed soon. Meanwhile, Vicky is gearing up for his next ‘Chhava’, a historical action film based on the life of Maratha King Sambhaji Maharaj. Rashmika Mandanna plays the female lead alongside Vicky Kaushal.

జగన్ పదవులిస్తే.. చంద్రబాబు ప్రాజెక్టులు తెచ్చారు!

గ్రీన్, బయో ఎనర్జీ విభాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకంగా 65 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ సంస్థ రాష్ట్రప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు సంబంధించి సంస్థ ప్రతినిధులు చంద్రబాబు ఎదుట ఎంఓయూపై సంతకాలు కూడా చేశారు. ఈ ఒప్పందం ద్వారా నెలకొల్పే ప్లాంట్లతో రాబోయే అయిదేళ్లలో దాదాపు 2.5 లక్షల మందికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఉపాధి అవకాశాలు దొరుకుతాయనేది అంచనా. చంద్రబాబునాయుడు ప్రభుత్వం అయిదేళ్లలో రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. ఈ ఒక్క రిలయన్స్ వారి ఒప్పందంతోనే ఏకంగా 12 శాతానికి పైగా లక్ష్యాన్ని అందుకున్నట్టుగా కనిపిస్తోంది.

రాష్ట్రంలో 500 ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి రిలయన్స్ సంస్థ ఈ ఒప్పందం చే సుకుంది. పైలట్ ప్రాజెక్టుగా వాటిని 8 జిల్లాల్లో ఏర్పాటుచేయబోతున్నారు. వచ్చే ఏడాది నవంబరు నాటికి ఉత్పత్తి మొదలవుతుంది. క్రమంగా ఇతర ప్రాంతాలకు విస్తరిస్తారు. ఇంటిగ్రేరటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ కింద ఇచ్చే ప్రోత్సాహకాలన్నీ వీరికి వర్తిస్తాయని చంద్రబాబునాయుడు ప్రకటించారు.

ఇక్కడ గమనించాల్సిన కీలకాంశం ఏంటంటే.. జగన్మోహన్ రె్డి రిలయన్స్ సంస్థ అధిపతుల మెహర్బానీ కోసం వారి కుటుంబాలకు సన్నిహితుడైన పారిశ్రామికవేత్త పరిమల్ ధీరజ్ లాల్ నత్వానీకి 2020లో రాజ్యసభ సభ్యతం కట్టబెట్టారు. పరిమల్ నత్వానీ కి పదవి కట్టబెట్టడంతో.. రిలయన్స్ సంస్థ నుంచి భారీ ప్రాజెక్టులు వస్తాయని ప్రజలు అనుకున్నారు. కానీ వారి ఆశలన్నీ తేలిపోయాయి. జగన్ తన స్వప్రయోజనాలు ఏమైనా నెరవేర్చుకున్నారో లేదో తెలియదు గానీ.. మొత్తానికి వారు కోరిన ఎంపీ పదవిని మాత్రం అప్పనంగా కట్టబెట్టారు. అక్కడికేదో తాను సాధించేసినట్టుగా పరిమల్ నత్వానీని తాడేపల్లికి పిలిపించి.. పార్టీ కండువా కప్పి పార్టీలో చేర్చుకుని ఆ తర్వాత ఎంపీగా ప్రకటించారు. కానీ ఆయన నుంచి గానీ, రిలయన్స్ సంస్థ నుంచి గానీ.. రాష్ట్రానికి ఒక్క మేలు సాధించలేకపోయారు.

చంద్రబాబునాయుడు అలా కాదు. రాష్ట్రప్రభుత్వం తరఫున ఇప్పటిదాకా వారికి కట్టబెట్టినది, అప్పగించినది ఏమీ లేదు.  అయితే 65 వేల కోట్ల రూపాయల భారీ ప్రజెక్టును రిలయన్స్ నుంచి సాధించుకున్నారు. రాష్ట్రంలో రెండున్నరలక్షల మందికి ఉపాధి కల్పించే ప్రాజెక్టు తెచ్చారు. 

భళా అంబటీ.. వైసీపీ వారంతా ఇలా సహకరిస్తారా?

నిజానికి అంబటి రాంబాబు తెలిసో తెలియకో అలా మాట్లాడేశారు అనడానికి కూడా వీల్లేదు. ఆయన కేవలం అత్యుత్సాహంతో.. తనకు అలవాటైన సవాళ్లు విసిరే ధోరణిలోనే మాట్లాడారు. కానీ.. తానొకటి తలిస్తే.. విధి మరొకటి తలచింది అన్నట్లుగా పరిస్థితులు వికటించాయి. సోషల్ మీడియా లో దుర్మార్గమైన పోస్టులు పెడుతున్న వైసీపీ కార్యకర్తల మీద ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తుండగా.. అంబటి రాంబాబు కొంత అత్యుత్సాహం ప్రదర్శించారు. తన నియోజకవర్గ పరిధిలోని ఒక కార్యకర్త మీద కేసులు నమోదు కాగా, ఆయన తన ఇంట్లోనే ఉన్నాడని.. పోలీసుల వద్ద సరైన ఆధారాలుంటే తన ఇంటికి వచ్చి అరెస్టు చేసుకోవచ్చునని సవాలు విసిరారు. పోలీసులు బుధవారం ఎంచక్కా ఆధారాలతో సహా వెళ్లి అంబటి ఇంట్లోంచి ఆ కార్యకర్తను అరెస్టు చేసి తీసుకెళ్లారు. తెలిసో తెలియకో అయినా.. ఈ రకంగా పోలీసులు వైసీపీ నాయకులు అందరూ సహకరిస్తే.. సోషల్ మీడియా పురుగులను ఏరిపారేయడం ఎంత సులువో కదా అని ప్రజలు అనుకుంటున్నారు.

విషయం ఏంటంటే.. హోంమంత్రి వంగలపూడి అనితపై నకరికల్లుకు చెందిన వైసీపీ కార్యకర్త రాజశేఖర్ రెడ్డి సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టారు. దీనిపై నూజివీడులో పోలీసు కేసు నమోదు అయింది. కొన్ని రోజులుగా పోలీసులు రాజశేఖర్ కోసం గాలిస్తున్నారు.  ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు మీడియా ముందుకు వచ్చి.. రాజశేఖర్ తన ఇంట్లోనే ఉన్నాడని.. ఆధారాలు ఉంటే అరెస్టు చేసుకోవచ్చునని సవాలు విసిరారు. దాంతో బుధవారమే పోలీసులు అంబటి ఇంటికి వెళ్లి అరెస్టు చేయడం జరిగింది.

నిజానికి ఇది అంబటి సహకారం కాకపోవచ్చునని.. ఆధారాలు ఉండవనే ఉద్దేశంతో, అత్యుత్సాహంతో సవాలు విసిరితే అది కాస్తా బెడిసికొట్టిందని ప్రజలు భావిస్తున్నారు. అదే సమయంలో.. జులై1 నుంచి అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత ప్రకారం.. కేవలం నేరానికి పాల్పడిన వారికి మాత్రమే కాదు, వారికి రక్ష్ణణ కల్పించిన వారికి కూడా కఠిన శిక్షలే ఉన్నాయి. అందువల్ల.. అంబటి రాంబాబు ముందుజాగ్రత్తగా..అరెస్టులు తనదాకా రాకుండా ఉండేందుకు తానే బహిరంగంగా పోలీసులకు ఉప్పందించి.. రాజశేఖర్ అరెస్టుకు కారణమై ఉంటారనే అనుమానం కూడా కొందరిలో ఉంది.

AP High Court Backs Arrests on vulgar social Media posts

In what could be a big setback for YSR Congress party and its supporters, the Andhra Pradesh High Court on Wednesday refused to issue any orders on the ongoing arrests of the state government against abusive and derogatory posts on various social media platforms. 

It is known fact that the NDA government in Andhra Pradesh has launched a witch-hunt to set a strong precedent against the undeterred use of social media to target political opponents and their families with slanderous content and objectionable morphs. As part of this campaign, numerous social media activists belonging to YSR Congress party have been arrested and several cases were filed in the last two weeks. 

While the YSR Congress party alleged abuse of power and suppression of freedom of expression against government inabilities, a Public Interest Litigation was filed by P. Vijay Babu, former Information Commissioner and senior journalist. Hearing this matter, the High Court expressed deep displeasure over filing of PIL in such a matter which is very pertinent and crucial. The court observed that there is no wrong in arresting those who resort to malicious propaganda on social media platforms. 

The bench also pointed how the YSR Congress party supporters launched a massive tirade on social media aimed at Judges of High Court and Supreme Court for passing orders against the government. The court stated that if anyone is having issues with the arrests, they can directly approach the court for perusal of the matter. 

The court ordered that it cannot interfere in the matter as long as the police department is acting within its purview and in accordance with the law. It clarified that no orders can be issued to restrain the arrests as there is no wrong to clampdown such a hateful practice.

As per reports, the state government has submitted adequate proofs to support its claims for the series of arrests for those who have been targeting several politicians and their families. It made is very clear that posting of vulgar content on social media cannot be allowed to continue. 

This observation will be a big blow to the legal cell of YSR Congress party because the government has firm evidences on how an organized assualt has been orchestrated by  the previous government with the help of power and public money. 

Prabhas ‘Spirit’ Muhurtham Set For December; Producer Reveals Interesting Updates

Prabhas, the pan-Indian star, has an exciting lineup of projects, including The Raja Saab, Salaar: Part 2—Shouryanga Parvam, Spirit, and Fauji. Among them, ‘Spirit’ in Sandeep Reddy Vanga’s direction is generating significant buzz due to its deadly combination, making it one of the most anticipated films.

Recently, Bhushan Kumar, the owner of T-series, spilled some intriguing details about this upcoming film. In a recent interview with Connect Cine, Bhushan Kumar revealed that Sandep Reddy Vanga is currently working on the script and involved in songs. He also shared that the film’s muhurtham shot is scheduled for December and the movie is expected to be released in 2026.

When the interviewer asked about the latest details about Spirit, Bhushan said, “Sandeep Reddy Vanga is writing every day and making songs. We will do muhurtham shot in December mostly, and the proper principal shooting will begin from January, early next year.”

The producer also confirmed that Spirit is a cop drama. He further added, “The movie is being produced on a huge scale with an impressive cast. Sandeep narrated some scenes, and it feels like a different zone. We are planning to release the film in mid-2026.”

Pre-production for Spirit is in full swing, with the music sessions recently kicking off. Rumors are circulating that Korean star Dong Lee is set to take on a major role in the film, though the filmmakers have yet to reveal the details of the full cast and crew.

అందరి నోళ్లూ భార్గవ పేరే పలుకుతున్నాయ్!

ఒక్క కేసులో తన పేరు బయటకు వచ్చినందుకు, తన పేరును కూడా కేసులో చేర్చినందుకు సజ్జల భార్గవ రెడ్డి కంగారుపడి ముందస్తు బెయిలు కోసం హైకోర్టులో పిటిషన్ వేసుకున్నారు. కానీ.. చూడబోతే.. సోషల్ మీడియా అసభ్యకర పోస్టుల దుర్మార్గాల వ్యవహారంలో సజ్జల భార్గవ్ రెడ్డి ఇప్పటికే పీకలదాకా కూరుకుపోయినట్టుగా కనిపిస్తోంది. సోషల్ మీడియా అసభ్యకర పోస్టులతో అరెస్టు అయిన అనేక మంది.. విచారణలో సజ్జల భార్గవ రెడ్డి పేరే చెబుతున్నారు. ‘అన్ని మార్గాలూ రోమ్ నగరానికే చేరుకుంటాయ్’ అనే ఇంగ్లిషు సామెత లాగా.. ఇప్పుడు అరెస్టు అవుతున్న అందరి నోర్లూ సజ్జల భార్గవ రెడ్డి పేరునే ఉచ్చరిస్తున్నాయి. ఇప్పటికే ఆయన మీద లుకౌట్ నోటీసు కూడా జారీ అయి ఉన్న నేపథ్యంలో భార్గవ్ ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది.  
వైసీపీ వారి అసభ్య పోస్టుల విషయంలో ఇప్పుడు ప్రభుత్వం చురుగ్గా స్పందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అనేక అరెస్టులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భాగంగా గుడివాడ ముబారక్ సెంటర్ కు చెందిన వైసీపీ కార్యకర్రత మహ్మద్ ఖాజాబాబా.. సీఎం చంద్రబాబు ఆయన కుటుంబసభ్యులపై అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ ఒక కేసు నమోదు అయింది. పోలీసులు ఖాజాబాబాను అరెస్టు చేశారు. వైసీపీ సోషల్ మీడియా ఇన్చార్జి గా గతంలో ఉన్న సజ్జల భార్గవ రెడ్డి ఆదేశాలతోనే ఆ పోస్టులు పెట్టినట్టుగా ఖాజాబాబా పోలీసు విచారణలో చెప్పాడు. భార్గవరెడ్డి తదితరులపై కూడా కేసు నమోదు అయింది.

ఈ కేసులో తమకు ముందస్తు బెయిలు ఇవ్వాలని కోరుతూ భార్గవరెడ్డి తరఫున హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. పోలీసుల తరఫున ఏజీ పూర్తివివరాలు ఇవ్వడానికి సమయం కోరడంతో న్యాయమూర్తి కేసు  వాయిదా వేశారు. అయితే ఈ కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరడాన్ని కూడా కోర్టు తోసిపుచ్చింది. మీకు తొందర ఉంది కాబట్టి.. ఆ తొందరను కోర్టుపై రుద్దడం ఎందుకు అంటూ న్యాయమూర్తి సజ్జల తరఫు న్యాయవాదిని ఆక్షేపించడం గమనార్హం. ఇది హడావుడిగా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిన వ్యవహారం కాదని, లోతుగా పరిశీలించాల్సి ఉందని పేర్కొన్నారు.

ఒక్క గుంటూరు ఖాజాబాబా విచారణలో తన పేరు చెప్పినందుకే సజ్జల భార్గవ ఉలికిపడి, హైకోర్టును  ఆశ్రయించారు. తాజాగా వర్రా రవీందర్ రెడ్డి సహా అరెస్టు అవుతున్న అనేకమంది సజ్జల భార్గవ్ పేరే చెబుతున్నారు. ముందుముందు ఆయన ఎలా తట్టుకోగలరో చూడాలి.