Home Blog Page 62

రాయలసీమ ద్రోహిగా జగన్ కు ముద్రపడనున్నదా?

వైఎస్ జగన్మోహన్ రెడ్డిలోని విధ్వంసక మనస్తత్వం రోజురోజుకూ జడలువిప్పి నాట్యం చేస్తున్నదా అనే అనుమానం ప్రజలకు కలుగుతోంది. ఎందుకంటే..  రాష్ట్రం బాగు కోసం కూటమి ప్రభుత్వం ఏం చేయదలచుకున్నా సరే.. ఆ పనులను అడ్డుకోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ దళాలు చేస్తున్న వికటప్రయత్నాలు అన్నీ యిన్నీ కావు. ఒక్కో విషయంలో ఒక్కో రకంగా తమ దుర్బుద్ధులను ప్రదర్శించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెనుకాడడం లేదు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి జాతీయ, అంతర్జాతీయ సంస్థలను కలిసి వారిని ఆహ్వానిస్తూ ఉండగా.. ఆ సంస్థలు రాష్ట్రానికి రాకుండా ఉండేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ దళాలు దాదాపుగా 200 ఈమెయిల్స్ నకిలీ పేర్లతో పంపి.. కంపెనీలను బెదిరించిన సంగతి ఇటీవలే చర్చకు వచ్చింది. అంటే పెట్టుబడిదారులు రాష్ట్రానికి రాదలచుకున్నప్పుడు.. ఆకాశరామన్న ఈమెయిల్స్ తో అడ్డుకోవడానికి ప్రయత్నించారన్నమాట. ఇప్పుడు.. చంద్రబాబునాయుడు రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి, గోదావరి వృథాజలాలను, ఆయకట్టు చివరిరాష్ట్రంగా ఏపీ వాడుకోగల హక్కుతో పోలవరం- బనకచర్ల ప్రాజెక్టును తలపెడితే.. దానిని అడ్డుకోవడానికి జగన్మోహన్ రెడ్డి డైరక్టుగానే రంగంలోకి దిగుతున్నారు. బనకచర్లకు మోకాలడ్డడానికి బినామీ పేర్ల వ్యవహారం కూడా కాదు.. జగన్ స్వయంగా రంగంలోకి దిగి విషం కక్కుతున్నారు. ఈ ప్రయత్నాలతో వైఎస్ జగన్ రాయలసీమ ద్రోహిగా ముద్రపడే అవకాశం ఉన్నదని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేషనల్ మీడియాతో మాట్లాడుతూ.. బనకచర్ల ప్రాజెక్టుపై విషం కక్కారు. ఒకవైపు ఈ ప్రాజెక్టుకు తీవ్రఅభ్యంతరాలు తెలుపుతున్న తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ఒప్పించి, నిధులు-అనుమతులు ఇవ్వాల్సి ఉన్న కేంద్రాన్ని కూడా ఒప్పించి.. ఆయకట్టు చివరి రాష్ట్రం గనుక.. వృథాజలాలను వాడుకోవడానికి ఉన్న హక్కును వారికి వివరించి.. బనకచర్లను సాధించాలని చంద్రబాబునాయుడు ఢిల్లీలో కీలక సమావేశాల్లో పాల్గొంటూ ప్రయత్నాలు సాగిస్తున్న సమయంలోనే.. ఇక్కడ రాష్ట్రంలో జగన్ ఇలా విషం కక్కడం గమనార్హం.
బనకచర్ల ఈ రాష్ట్రానికి అవసరం లేదని, గోదావరి మిగులు జలాల గురించి స్పష్టమైన లెక్కలు తేలకుండా.. 80 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ ప్రాజెక్టు నిర్మించడంలో అర్థం లేదని జగన్ వ్యాఖ్యానించారు. నిజానికి మూడువేల టీఎంసీలు ప్రతి ఏటా సముద్రంలో కలిసిపోతున్నట్టుగా.. చంద్రబాబు సర్కారు వందేళ్ల వెనక్కు వెళ్లి గణాంకవివరాలను కేంద్రానికి సమర్పించి మరీ అనుమతులు అడిగింది. అయితే.. రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి కూటమిప్రభుత్వం సంకల్పించిన ఈ ప్రాజెక్టు వద్దని అనడం ద్వారా.. జగన్ రాయలసీమ ద్రోహిగా ముద్రపడనున్నారని విమర్శలు వస్తున్నాయి. నంద్యాల జిల్లా మల్కాల పంపింగ్ స్టేషను వద్ద హంద్రీనీవా కాల్వకు చంద్రబాబు నీటిని విడుదల చేసిన సందర్భంగా.. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ ఇదే సంగతి వెల్లడించారు. రాయలసీమ జీవితాల్లో వెలుగులు నింపాలని చంద్రబాబునాయుడు చూస్తోంటే.. జగన్ మాత్రం ఇక్కడ అరాచకం సృష్టించాలని అనుకుంటున్నారని ఆయన ఆరోపించారు. 

తమరి పిలుపుకు పార్టీలో స్పందన ఉందా జగన్!

అధికారంలోకి వచ్చిన ఏడాదికాలంలో రాష్ట్రప్రజలకు ఏం చేశామో చెప్పడంతో పాటు, రాబోయే రోజుల్లో ఏమేం చేయబోతున్నామో వివరించడం, అలాగే వారి సమస్యలను కూడా తెలుసుకుని పరిష్కరించడం అనే లక్ష్యంతో చంద్రబాబునాయుడు ‘సుపరిపాలనలో తొలి అడుగు’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కూటమి పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు అందరూ గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను కలుస్తున్నారు. అయితే అధికార కూటమి ఇలా ప్రజల్లోకి వెళ్లడం కూడా చూసి ఓర్వలేకపోతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తొలిఅడుగుకు పోటీగా, ఒక కార్యక్రమానిక పిలుపు ఇచ్చారు. తన పార్టీ నాయకులు కూడా ఇంటింటికీ తిరుగుతూ చంద్రబాబునాయుడు ఏడాదిలో చేసిన మోసాలను (?) ప్రజలకు తెలియజెప్పాలని ఆయన పిలుపు ఇచ్చారు. ‘బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ.. చంద్రబాబు మ్యానిఫెస్టోను గుర్తు చేసుకుందాం’ అని ఈ కార్యక్రమానికి పేరు పెట్టారు. అయితే ఆ పార్టీ తరఫున ప్రజల్లోకి వెళ్తున్న నాయకుడు ఒక్కడు కూడా కనిపించడం లేదు. జగన్ మాత్రం తనకు గుర్తువచ్చినప్పుడు.. పార్టీ నాయకులతో సమావేశమై ఈ కార్యక్రమం ఎలా జరుగుతున్నదని అడగడం.. అంతటితో చేతులు దులుపుకోవడం జరుగుతోంది. అయినా ఇంతకూ తమరు ఇచ్చిన పిలుపునకు తమ సొంత పార్టీలో అయినా.. కనీసం ఒక్క నాయకుడైనా స్పందిస్తున్నాడా? ప్రజల్లో తిరుగుతున్నారా? తమ నిఘా వర్గాల ద్వారా.. తమ సొంత గూఢచారుల ద్వారా ఆ సంగతి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
‘జగన్మోహన్ రెడ్డి పిలుపు ఇచ్చిన ‘చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుచేసుకుందాం’ అనే కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ కావడానికి మొదటి కారణం.. ఆయనే’ అనే అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే వ్యక్తం అవుతోంది. ఎందుకంటే.. ‘సుపరిపాలనలో తొలి అడుగు’ అనే పేరుతో ప్రజల్లోకి వెళ్లాలనే ఒక కార్యక్రమానికి పిలుపు ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.. సాధారణ ఎమ్మెల్యేలకంటె చురుగ్గా తాను కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఊరూరా తిరుగుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి.. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత.. ఇప్పటిదాకా పిలుపు ఇచ్చిన ఏ ఒక్క కార్యక్రమంలో కూడా తాను స్వయంగా పాల్గొన్నది లేదు. ఆయనకే లేని శ్రద్ధ పార్టీ వారికి మాత్రం ఏముంటుంది? అని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కూటమి పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులందరూ ముమ్మరంగా తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సాక్షి మీడియా కు అవి కనిపించవు గనుక వారిని పక్కన పెడితే తక్కిన మీడియాల్లో తొలిఅడుగు కార్యక్రమాల గురించిన వార్తలు పుంఖానుపుంఖాలుగా వస్తూనే ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి పిలుపు ఇచ్చిన చంద్రబాబు వ్యతిరేక కార్యక్రమాన్ని వైసీపీ నాయకులు ప్రజల్లో నిర్వహిస్తూ ఉంటే.. ఆ వార్తలు కనీసం సాక్షి చానెల్లో అయినా కనిపించాలి కదా అనేది ప్రజల సందేహం. వైసీపీ నాయకులు ఎంతసేపూ ప్రెస్ మీట్లు పెట్టడం, లేదా, కార్యకర్తల సమావేశాలు పెట్టడం.. కూటమి ప్రభుత్వాన్ని తిట్టిపోయడం చేస్తున్నారు తప్ప.. జగన్ పిలుపును వారు బేఖాతరు చేస్తున్నారు. కూటమి ఏడాది పాలన తర్వాత ప్రజల్లోకి వెళ్లి బాబు సర్కారు పనిచేయడం లేదని నిందలు వేయాలంటే భయపడుతున్నారు.

తాను పిలుపు ఇచ్చిన కార్యక్రమం సొంత పార్టీ నాయకులు కూడా ఏమాత్రం పట్టించుకోకుండా దారుణంగా ఫ్లాప్ అయితే.. దానిని గుర్తించకపోవడం జగన్ వైఫల్యం అనే విమర్శలు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో తన సొంత పార్టీవారిలోనే లేని దృక్పథంతో పోరాడాలని జగన్ అనుకుంటే గనుక.. గాల్లో కత్తి తిప్పుతూ యుద్ధం చేసినట్టే ఉంటుందని ప్రజలు అనుకుంటున్నారు.

Anurag Kashyap Slams ‘Absurd’ CBFC Order

 The Central Board of Film Certification (CBFC) is under fire from several film industry figures following its objection to the name of a character in the Malayalam film Janaki vs State of Kerala. The board reportedly asked the filmmakers to change the name “Janaki”, citing that it is another name for Goddess Sita, prompting criticism over creative restrictions.

Bollywood actress Shreya Dhanwanthary and Tollywood filmmaker Tharun Bhascker were among the first to question the CBFC’s stance, calling it an overreach and a threat to artistic freedom. The directive has reignited debates around censorship and the limits of creative expression in Indian cinema.

Filmmaker-actor Anurag Kashyap also weighed in on the controversy, calling the objection “absurd.” Speaking on the issue, he remarked, “Are we now supposed to avoid all mythological names in storytelling? Should characters be named XYZ or 123 instead?” He added that such restrictions undermine the natural evolution of film narratives.

Kashyap further criticised the functioning of the CBFC, alleging that some officials based in Maharashtra lack adequate understanding of Hindi, which leads to frequent misinterpretations. He called for a serious conversation on the board’s role and the need to safeguard creative liberties in the film industry.

లింక్డిన్ ర్యాంకులు కూటమి సర్కారుకు కితాబులే!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయిదేళ్ల పదవీకాలంలో.. రాష్ట్రంలో విధ్వంసం తప్ప అభివృద్ధి జరగలేదు. ఒక్క ప్రాజెక్టు, పరిశ్రమ రాలేదు. ఒక్క ఉద్యోగం కల్పన జరగలేదు. అలాంటి దుర్మార్గమైన పాలనను ప్రజలు ఏమాత్రం సహించలేకపోయారు గనుకనే.. ఆయనను 11 సీట్లు మాత్రమే గెలిచిన పార్టీకి నాయకుడిగా, ఒక సాధారణ ఎమ్మెల్యేగా కూర్చోబెట్టారు రాష్ట్ర ప్రజలు. కానీ చంద్రబాబునాయుడు సారథ్యంలో ఎన్డీయే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే.. ఉపాధి, ఉద్యోగాల పరంగా రాష్ట్రం శరవేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. రాబోయే అయిదేళ్ల కాలంలో 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తామనే అదిపెద్ద  హామీతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. తొలిరోజు నుంచి ఆదిశగా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అనేక ప్రాజెక్టులు సాధించుకు వస్తున్నారు. ఈ ఫలితాలు.. నాయకుల మాటల్లో మాత్రమే కాదు.. లింక్డ్ఇన్ సంస్థ నిర్వహించిన నివేదికలో కూడా స్పష్టం అవుతుండడం గొప్ప విషయం.

ఉద్యోగాల కల్పన, ఉద్యోగార్థులకు సంధానకర్తగా వ్యవహరించే విషయంలో అంతర్జాతీయంగా విశ్వసనీయత ఉన్న లింక్డ్ ఇన్ సంస్థ తొలిసారిగా ‘సిటీస్ ఆన్ ది రైజ్ 2025’ పేరుతో ఒక నివేదికను రూపొందించారు. ఉద్యోగాల కల్పనలో అసాధారణ స్థాయిలో వృద్ధి చెందుతున్న నగరాల జాబితాను ఈ నివేదికలో పొందుపరిచారు. ఇందులో విశాఖపట్టణం నగరానికి మొదటి ర్యాంకు దక్కగా, విజయవాడకు మూడో ర్యాంకు దక్కింది. వాస్తవంగా గమనించినప్పుడు లింక్డ్ ఇన్ నివేదికలో ఈస్థాయి ర్యాంకులు ఏపీలోని రెండు కీలక నగరాలకు దక్కడం అనేది.. ఉద్యోగాల కల్పన పరంగా కూటమి ప్రభుత్వం పడుతున్న శ్రమకు అతిపెద్ద కితాబు అని విశ్లేషకులు భావిస్తున్నారు.

చంద్రబాబునాయుడు కూడా లింక్డ్ ఇన్ నివేదిక పట్ల హర్షం వ్యక్తం చేశారు. ‘ఈ ర్యాంకులు రాష్ట్ర ప్రభుత్వం దూరదృష్టితో కూడిన నూతన పారిశ్రామిక విధానాల ప్రభావాన్ని ప్రతిబింబిస్తున్నాయని’ ఆయన ఎక్స్ లో పేర్కొన్నారు. టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి పెద్ద సంస్థలు విశాఖలో తమ క్యాంపస్ లు ఏర్పాటుచేయబోతున్న సంగతి అందరికీ తెలుసు. అలాగే క్వాంట్ వ్యాలీ, ఏఐ యూనివర్సిటీ వంటివి కూడా ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో దేశానికి ఐటీ హబ్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలుస్తుందని చంద్రబాబునాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇప్పుడు విశాఖ, విజయవాడ నగరాలు లింక్డ్ ఇన్ జాబితాలో మొదటి, మూడో స్థానాల్ని దక్కించుకున్నాయి. అమరావతి రాజధాని నిర్మాణ వ్యవహారం కొన్నేళ్లలో ఒక కొలిక్కి వచ్చి.. ప్రభుత్వం చెబుతున్న స్మార్ట్ పరిశ్రమలు అన్నీ వస్తే గనుక.. అమరావతి నగరం కూడా ఈ జాబితాలో చోటు సంపాదించుకుంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

బిగ్ బాస్ పేరు రాలేదు గానీ.. ఆయన వాటా లెక్క తేలింది!

దేశం మొత్తం నిర్ఘాంతపోయేలా మూడున్నర వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కాజేసిన అతిపెద్ద కుంభకోణంలో అంతిమలబ్ధిదారు అయిన బిగ్ బాస్ ఎవరు? ఈ విషయం గురించి వివిధ సందర్భాల ప్రెస్ మీట్ లలో విలేకరులు అడిగినప్పుడు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఎంత డొంకతిరుగుడుగా, నర్మగర్భంగా మాట్లాడినప్పటికీ.. ప్రజలకు మాత్రం ఆ బిగ్ బాస్ సాక్షాత్తూ జగన్మోహన్ రెడ్డే అనే ఊహ కలుగుతూ వచ్చింది. జగన్ మార్గదర్శకత్వంలోనే పార్టీకోసం భారీగా నిధులు వసూలు అయ్యేలా మద్యం పాలసీ రూపకల్పన జరిగిందని విచారణ తొలిదశలోనే రాజ్ కెసిరెడ్డి చెప్పినట్టుగా సిట్ పేర్కొంది. అయితే క్రమేమీ ఎవరెవరికి ఎంత వాటాలు దక్కాయో కూడా లెక్కతేల్చారు.

ఈ ప్రకారం.. మొత్తం 3500 కోట్లలో 90 శాతం వసూళ్లు అంతిమ లబ్ధిదారు అయిన బిగ్ బాస్ కే చేరినట్లుగా సిట్ పోలీసులు లెక్క తేల్చారు. ఈ లిక్కర్ కుంభకోణంలో పాత్రధారులు అయిన మిగిలిన నాయకులు, ఇతరులు అందరూ కలిసి పంచుకున్నది పది శాతం వసూళ్లేనని నిగ్గు తేల్చారు.
3500 కోట్లలో పది శాతం అంటే తక్కువేమీ కాదు. ఆ ప్రకారం.. ఇతర నాయకులందరూ కలిసి  వాటాగా పంచుకున్న మొత్తమే 350 కోట్ల వరకు ఉంటుంది. ఈ సొమ్మును అవినీతి దందాల సొమ్మును వసూలు చేసిన నెట్వర్క్ లో కీలకంగా ఉన్న క్యాష్ కొరియర్లు, కాష్ హ్యాండ్లర్లు అందరికీ ఇవ్వడానికి, అలాగే ఈ స్కామ్ లో భాగస్వాములైన ఇతర వైసీపీ ముఖ్య నాయకులకు నెలవారీ ముడుపులుగా అందజేయడానికి, కొందరు అధికారులకు లంచాలుగా చెల్లించినట్టు సిట్ తేల్చింది.

నిందితుల సెల్ ఫోన్ల నుంచి కీలక సమచారాన్ని వెలికి తీసిన తర్వాత.. ఈ లెక్కలన్నింటినీ సిద్ధం చేశారు. మొత్తం పాపపు సొమ్ములో 90 శాతం అంటే దాదాపుగా 2970 కోట్లు బిగ్ బాస్ కు చేరాయని అంచనాకు వచ్చారు.
డొల్ల కంపెనీలను అడ్డు పెట్టుకుని హవాలా మార్గాల్లో ఈ అవినీతి సొమ్ములో సింహభాగం విదేశాలకు తరలించినట్టు, బెంగుళూరు, హైదరాబాదుల్లో భూములపై పెట్టుబడిగా పెట్టినట్టు  సిట్ గుర్తించింది.
ఈ లెక్కలు తేల్చడంలో వెలికి వచ్చిన మరో సంగతి ఏంటంటే.. వైసీపీకి చెందిన ఇద్దరు కీలక ఎంపీలకు వసూళ్ల సొమ్మునుంచి ప్రతినెలా 5 కోట్ల వంతున చేరవేసేవారిన సిట్ గుర్తించింది. ఆ ఇద్దరు ఎంపీల్లో ఒకరు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కాగా, రెండో వ్యక్తి  విజయసాయిరెడ్డి అని ప్రజలు అనుకుంటున్నారు.

ఎంపీ విజయసాయిరెడ్డికి కొంతకాలం తర్వాత ఈ ముడుపుల వాటాలు అందజేయడం మానేశారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి చెందిన కంపెనీల్లోకి నేరుగా 5 కోట్లు డిపాజిట్ కావడంతో ఆయన పాత్ర తేటతెల్లమైంది. ఆ డబ్బును తిరిగి వెనక్కు పంపినప్పటికీ..  మిథున్ రెడ్డి ఆ సొమ్ములకు జవాబుదారీతనం వహించవలసిన చిక్కుల్లో పడ్డారు. పైగా ఆయన ముందస్తు బెయిలు పిటిషన్ కూడా ఇప్పటికే తిరస్కరణకు గురైంది.

మొత్తానికి కుంభకోణానికి సహకరిస్తున్న కీలక అధికారులకు కూడా నెలకు 50లక్షలు, 20 లక్షల వంతున వాటాలు పంచినట్టుగా తేల్చారు. ఈ రకంగా.. నాయకులు, అధికారులు అందరూ కలిసి.. 350 కోట్లరూపాయలను వాటాలుగా పంచుకున్నారు. మిగిలిన 90 శాతం అనగా సుమారు 2970 కోట్ల రూపాయలను బిగ్ బాస్ కు అందజేశారు. మరి సిట్ పోలీసులు ‘బిగ్ బాస్’ ఎవ్వరో కూడా తేల్చిన తర్వాత.. లిక్కర్ స్కామ్ కీలక మలుపు తీసుకునే అవకాశం ఉంది. 

One Film with Pawan Kalyan Equals a Hundred: Nidhhi Agerwal

Actress Nidhhi Agerwal is all set to return to Telugu cinema after nearly three years with the much-anticipated period action film Hari Hara Veera Mallu: Part 1, starring Pawan Kalyan in the lead role. Speaking at a recent press meet ahead of the film’s July 24 release, Nidhhi shared insights into her role and working experience in the film.

Nidhhi revealed that she plays a powerful and layered character named Panchami. “It’s a grand film, and I’m thrilled to be a part of it. My character Panchami has multiple shades. The scenes between Pawan Kalyan and me will definitely entertain the audience,” she said.

Describing the film’s tone, she called it an Indian version of Indiana Jones. “There’s a major Bharatanatyam sequence which was a challenge for me. Set against the backdrop of the Mughal empire, the story is fictional, and Pawan Kalyan plays a Robin Hood-like character,” Nidhhi explained.

Reflecting on her co-star, she said, “One film with Pawan Kalyan is equivalent to doing a hundred. His stardom gives the film a wider reach. I learned a lot from him.” She also credited directors Krish and Jyothi Krishna for guiding her performance, and appreciated producer AM Rathnam for his dedication. “Some doubted the film’s progress, but the trailer cleared all speculation,” she concluded.

ఈ దఫా పేర్ని నాని అరెస్టు తప్పదా?

అయిదేళ్ల విధ్వంసక పాలన సాగించిన జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో మంత్రి పదవి దక్కినా కూడా సద్వినియోగం చేసుకోకుండా.. ఆయన తన సొంత నియోజకవర్గంలో ఎంత అపకీర్తిని మూటగట్టుకున్నారంటే.. ఆయనకు టికెట్ ఇస్తే పార్టీ సీటును కోల్పోతుందని భయపడి జగన్ కూడా పక్కన పెట్టారు. ఆయన కొడుకును రంగంలోకి దించారు. ఎటూ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. తన సొంత పార్టీలోనే తనకు  ఠికానా లేకుండా పోయినప్పటికీ.. మాజీ మంత్రి పేర్ని నానికి మాత్రం అహంకారం తగ్గలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. ఆయన ఎన్ని సందర్భాల్లో అత్యంత దారుణంగా మాట్లాడుతూ.. రెచ్చిపోతూ వచ్చారో అందరూ చూస్తున్నదే. ఇప్పటికే పలు సందర్భాల్లో అవినీతికేసుల్లో అరెస్టు కాకుండా తృటిలో తప్పించుకున్న పేర్ని నాని, ఈ దఫా అరెస్టు కాక తప్పదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేర్ని నాని కొన్నాళ్లపాటు జాగ్రత్తగానే ఉన్నారు. తన భార్య పేరిట ఉన్న గోడౌన్ల నుంచి ప్రభుత్వ రేషన్ బియ్యం టన్నుల కొద్దీ మాయం అయినప్పుడు.. ఆ కేసుల్లో అరెస్టు చేస్తారని భయపడి ఆయన కొన్నాళ్లపాటు భార్యతో సహా పరారయ్యారు. కోర్టునుంచి రక్షణ దక్కిన తర్వాత.. తిరిగి నియోజకవర్గంలో ప్రత్యక్షం అయ్యారు. అప్పటినుంచి మళ్లీ తన దురహంకార రాజకీయం నడిపిస్తున్నారు. ప్రత్యేకించి ఇటీవలి కాలంలో.. కూటమి ప్రభుత్వ నాయకుల మీద అడ్డగోలుగా రెచ్చిపోతూ బండబూతులు తిడుతున్నారు. ‘రప్పా రప్పా నరుకుతాం’ అనే వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా వివాదస్పదంగా మారిన తర్వాత.. వైసీపీ నాయకులు వాటిని సమర్థించుకునే పనిలో పడ్డారు. అయితే.. పేర్ని నాని మాత్రం.. ‘అరిచే కుక్క కరవదు.. కరిచే కుక్క అరవదు.. అయినా ఆ మాటలు అనడం ఏంటి.. రాత్రి కన్నుకొడితే తెల్లారేలోగా నరికేయాలి.. తెల్లారాక పరామర్శకు వెళ్లాలి’ అంటూ కార్యకర్తలను రెచ్చగొట్టేలా వివాదస్పదంగా మాట్లాడారు.

ఈ మాటలు ఘర్షణలను పెంచేలా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయంటూ తెదేపా నాయకుల ఫిర్యాదుతో కృష్ణా జిల్లా పామర్రులో కేసు నమోదు అయింది. ఆ తర్వాత కూడా పేర్ని నాని దూకుడు ఏ మాత్రం తగ్గలేదు గానీ.. ముందు జాగ్రత్తగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విషయంలో పోలీసులు తన మీద తొందరపాటు చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని ఆయన అభ్యర్థించారు. ఆయన పిటిషన్ ను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. విచారణను ఈనెల 22కు వాయిదా వేసింది.

హైకోర్టు ఆయన పిటిషన్ కొట్టివేసిన నేపథ్యంలో.. పోలీసులు నానిని అరెస్టు చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. పోలీసులను ఉద్దేశించి కూడా అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నాని.. ఈ దఫా అరెస్టు నుంచి తప్పించుకోలేరని అంటున్నారు. కాగా, గతంలో బియ్యం స్మగ్లింగ్ దందా బయటకు వచ్చినప్పుడు కుటుంబంతో సహా పరారైనట్టే.. కోర్టు తీర్పు తర్వాత నాని పరారయ్యే అవకాశం ఉన్నదని తదనుగుణంగా పోలీసులు ముందుగానే నిఘాపెట్టినట్టు, జాగ్రత్తలు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. అడ్డూ అదుపూ లేకుండా విచ్చలవిడిగా రెచ్చిపోతున్న నాని.. రేపో మాపో అరెస్టు కావల్సిందేనని పలువురు భావిస్తున్నారు.

Ramayana Makers Reveal Why Ranbir, Sai Pallavi, Yash Were Cast

The highly anticipated mythological epic Ramayana is shaping up to be one of the most ambitious projects in Indian cinema, with a reported budget of ₹4,000 crore. The film stars Ranbir Kapoor as Lord Rama, Sai Pallavi as Sita, and Yash as Ravana, and will be released in two parts — the first scheduled for Diwali 2026 and the second for Diwali 2027.

The makers have revealed the reasoning behind the lead cast selections. “Ranbir Kapoor was cast as Lord Rama for his calm demeanour and strong acting skills,” the team stated. “Sai Pallavi was chosen as Sita for her natural beauty and preference for performance-oriented roles over glamour. She has stayed away from cosmetic enhancements, which aligns with the film’s message that natural grace is more powerful than artificial beauty.”

Sunny Deol will be portraying Lord Hanuman, with the Vanara Sena sequences being developed using advanced motion capture technology and high-end VFX, similar to the standards seen in Planet of the Apes. Action sequences, particularly those involving Hanuman and the Vanara Sena, are being choreographed by Terry Notary, known for his work on The Lord of the Rings.

Initially, Hrithik Roshan was considered for the role of Ravana. However, the makers opted for Yash to strengthen the film’s reach in the South Indian market. Reports suggest Hrithik was also hesitant to take up the role.

Biopic ‘Garividi Lakshmi’ Creates Buzz Ahead of First Look Release

The upcoming Tollywood biopic Garividi Lakshmi is drawing considerable attention ahead of its official first look release. Based on the life of renowned Uttarandhra Burrakatha artiste Garividi Lakshmi, the film is being produced under the prestigious People Media Factory banner, raising expectations among cinegoers.

Actress Anandi is playing the lead role, while Rag Mayur, Naresh, Rashi, and Sharanya Pradeep will be seen in prominent roles. The film is being directed by Gouri Naidu Jammu and the shoot is currently progressing at a brisk pace.

The makers have announced that the first look poster will be unveiled on July 18 at 4:05 PM, through an official pre-look poster. Music for the film is being composed by Charan Raj.

ఇండోసోల్ ముందూ వెనుకా తానే అయి నడిపిస్తున్న జగన్!

ఇండోసోల్ సోలార్ ప్యానెళ్ల పరిశ్రమకు భూములు ఇవ్వడానికి కరేడు రైతులు వ్యతిరేకత వ్యక్తం చేస్తుండడం ఇవాళ రాష్ట్రంలోని హాట్ టాపిక్ లలో ఒకటి. రైతులకు అర్థమయ్యేలా పరిస్థితులను వివరించి.. భూసేకరణ జరుగుతుందని, భూసేకరణ విషయంలో ప్రభుత్వం వెనక్కు మళ్లలేదని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వ సంకల్పం నెరవేరకుండా.. రైతుల్ని రెచ్చగొట్టి ఇండోసోల్ కు భూములు ఇవ్వకుండా చేయడానికి జగన్ మరియు ఆయన అనుచర దళాలు శతవిధాలా ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఇండోసోల్ కంపెనీ జగన్మోహన్ రెడ్డికి బినామీ కంపెనీ అనే ప్రచారం ఆయన ముఖ్యమంత్రిగా వారికి చేవూరు వద్ద భూములు కేటాయించినప్పటినుంచి ఉంది. అయితే ఇప్పుడు రామాయపట్నం పోర్టుకు అనుబంధంగా ప్రతిష్ఠాత్మకంగా బీపీసీఎల్ ను కూడా రాష్ట్రానికి తీసుకురావడంలో కూటమి ప్రభుత్వం విజయం సాధించింది. వారికి విస్తారమైన భూములు కావాల్సి ఉన్నందున చేవూరు వద్ద ఉన్న భూముల్ని ఇవ్వడానికి నిర్ణయించారు. ఆ మేరకు ఇండోసోల్ కంపెనీకి ప్రత్యామ్నాయంగా కరేడు వద్ద భూములు సేకరించి ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. అంతవరకు బాగానే ఉంది. ఇండోసోల్ కంపెనీకి కర్త కర్మ క్రియ తానే అయిన జగన్మోహన్ రెడ్డి.. ఈ ప్రయత్నాన్ని ముందుకు సాగనివ్వకుండా అడ్డుకుంటున్నారు.

కరేడు రైతులు వ్యతిరేకత వ్యక్తం చేయడం వెనుక వైసీపీ నేతల కుట్రవ్యూహం ఉన్నదనే ప్రచారం వినిపిస్తోంది. ఇండోసోల్ కరేడుకు మారితే.. చేవూరు వద్ద బీపీసీఎల్ వస్తుంది. అది రాష్ట్రప్రభుత్వ ప్రతిష్ఠను పెంచుతుంది. అలా జరగడం జగన్ కు ఇష్టం లేదు. అందుకే ఆయన రైతులను రెచ్చగొడుతున్నారు. కడేరు రైతులు వ్యతిరేకత వ్యక్తం చేసిన తర్వాత.. కందుకూరు వైసీపీ పార్టీ ఇన్చార్జి  మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో కేవలం 12 మంది రైతులు వచ్చి తాడేపల్లిలో జగన్ ను కలిశారు. వారి పోరాటానికి తన మద్దతు ఉంటుందని జగన్ వారితో చెప్పారు. నిజానికి ఆయన ఉద్దేశం మద్దతివ్వడం కాదు. అసలు రాష్ట్రానికి బీపీసీఎల్ రాకుండా అడ్డుకోవడం.

ఇండోసోల్ కు జగన్ భూములిచ్చారే గానీ.. ఇప్పటిదాకా వారు అక్కడ తమ కార్యకలాపాలు ప్రారంభించనేలేదు. అందువల్లనే వాళ్లకు ప్రత్యామ్నాయ స్థలాలు చూపించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అది జరగకుండా జగన్ తన దళాలతో తెరవెనుకనుంచి అడ్డుకుంటున్నారు. ఇందుకోసం ఆయన ఇండోసోల్ కంపెనీ మీద తన ప్రెస్ మీట్ లో అవ్యాజమైన ప్రేమను కురిపిస్తున్నారు. వారి కంపెనీ 42 వేల కోట్ల పెట్టుబడి పెడుతుందని, 8 వేల ఉద్యోగాలు వస్తాయని అంటున్నారు. వారికిచ్చే స్థలం కరేడు వద్దకు మారినంత మాత్రాన ఆ ఉద్యోగాలు రావడం ఆగిపోదు కదా? అనేది ప్రజల సందేహం. అంతకంటె పెద్ద సంస్తకు ఎక్కువ స్థలం కావాలి గనుక.. బీపీసీఎల్ కు ఇవ్వడం ముఖ్యం అని, కానీ.. జగన్ దానిని అడ్డుకోడానికి ఇండోసోల్  ముసుగులో కపటప్రేమ చూపిస్తున్నారని పలువురు అంటున్నారు.