వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ గురించి విచారిస్తున్న సిట్ పోలీసుల ఎదుట ఇవాళ (శనివారం) విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇప్పటికే ఈ కేసులో ఒకసారి ఆయన సిట్ విచారణకు హాజరయ్యారు. అప్పట్లో ఆయనను సాక్షిగా వివరాలు అడిగి తెలుసుకోవడానికి సిట్ విచారణఖు పిలిచింది. అయితే మద్యం కుంభకోణం అనేదే జరగలేదని.. జరగని దాని గురించి వివరాలు అడిగితే తాను ఏం చెప్పగలను అని మిథున్ రెడ్డి అప్పట్లో వారికి జవాబులిచ్చారు. ఆ తరువాత.. ఆయన పేరు నిందితుల జాబితాలోకి కూడా వచ్చింది. ఆయనను సిట్ పోలీసులు ఏ4 గా చేర్చారు. ఏ4 అయిన తర్వాత.. మిథున్ రెడ్డి పోలీసులు విచారణకు హాజరవుతుండడం ఇదే తొలిసారి. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్లు.. ఇటు హైకోర్టులోను, అటు సుప్రీం కోర్టులోను తిరస్కరణకు గురైన తర్వాత.. ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులో కోర్టులో వారంటు కూడా సమర్పిస్తున్న తరుణంలో ఆయన శనివారం విచారణకు రానున్నారు. విచారణ పూర్తయని వెంటనే మిథున్ రెడ్డికి నోటీసులు ఇచ్చి పోలీసులు అరెస్టు చేస్తారని సమాచారం. శనివారం సాయంత్రం ఆయనను అరెస్టు చేస్తే.. ఆదివారం కోర్టులకు సెలవు గనుక.. సోమవారం నాడు రిమాండు నిమిత్తం కోర్టు ఎదుట ప్రవేశపెట్టే అవకాశం ఉందని అంతా అనుకుంటున్ానరు.
దాదాపు మూడున్నర వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కాజేసిన మద్యంకుంభకోణం వెనుక ప్రధానమైన మాస్టర్ మైండ్స్ లో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా ఒకరు. అలాగే.. అంతిమలబ్ధిదారుగా చెబుతున్న బిగ్ బాస్ తర్వాత.. ఈ కుంభకోణం ద్వారా అత్యధికంగా లబ్ధిపొందిన వ్యక్తి కూడా మిథున్ రెడ్డే అని సిట్ విచారణలో తేల్చారు.
ఈ కుంభకోణానికి సంబంధించి అనేకమందిని విచారించిన సిట్ పోలీసులు శనివారం నాడే ప్రిలిమనరీ చార్జిషీట్ దాఖలు చేశారు. కేసు విచారణ క్రమాన్ని పరిశీలిస్తే.. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా చేసిన వాసుదేవరెడ్డిని తొలిదశలో విచారించినప్పుడే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వకపోయినా.. కేవలం పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా ముందస్తు బెయిలుకోసం పిటిషన్లు వేసి ఆయన అప్పట్లోనే నవ్వులపాలు అయ్యారు. ఇప్పటిదాకా ఆయన ముందస్తు బెయిలు ప్రయత్నాలు నడుస్తూనే వచ్చాయి. చివరికి హైకోర్టు, సుప్రీం కోర్టు కూడా వాటిని తిరస్కరించాయి. కనీసం లొంగిపోవడానికి గడువు ఇవ్వడానికి కూడా సుప్రీం ఒప్పుకోలేదు. ప్రిలిమినరీ చార్జిషీటు దాఖలు చేయబోతున్న తరుణంలో చివరగా మిథున్ రెడ్ది విచారణకు హాజరు కాబోతున్నారు. విచారణ పూర్తయిన తర్వాత ఆయనకు నోటీసులు ఇచ్చి అరెస్టు చేస్తారని తెలుస్తోంది.
శనివారం నాడు కూడా ముందస్తుబెయిలు కోసం సుప్రీంలో మరో ప్రయత్నం చేయాలని లాయర్లను సంప్రదించినప్పటికీ అది సాధ్యం కాదని వారు చెప్పినట్టుగా తెలుస్తోంది. శనివారం అరెస్టు అయితే.. ఆ తరువాత బెయిలు రావడానికి అవకాశం ఉంటుందని న్యాయవాదులు చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి మిథున్ రెడ్డి ఇవ్వాళే కటకటాల్లోకి వెళ్లబోతున్నారని అంతా అనుకుంటున్నారు.
ఇవ్వాళే కటకటాల్లోకి : విచారణ అయ్యాక అరెస్టే!
పాపం స్వామీ.. బిడ్డ పుట్టనేలేదు పురిటివాసన పోలేదు..
సాధారణంగా ఒక పని చేసినప్పుడు.. ఆశించిన ఫలితం దక్కకపోగా, పని చెడిపోయినప్పటికీ కూడా ఆ పని తాలూకు కష్టనష్టాలు, చేదు పర్యవసానాలు మాత్రం అనుభవించాల్సి వచ్చినప్పుడు.. ‘బిడ్డ చచ్చినా పురిటివాసన పోలే’దనే సామెతతో వ్యవహరిస్తుంటారు. ఏదో ఆశించి ఒక పనిచేశారు.. వికటించింది.. అనుభవిస్తున్నారు.. అని వారి ప్రారబ్ధం గురించి సరిపెట్టుకోవచ్చు. కానీ.. అసలు ఏ పనీ చేయకుండానే.. కష్టనష్టాలు మాత్రం వచ్చి చుట్టుమడితే దానిని ఏం అనుకోవాలి. ‘బిడ్డ పుట్టనేలేదు.. పురిటివాసన మాత్రం పోలేదు’ అని అనుకోవాల్సిందే కదా. జగన్మోహన్ రెడ్డి జమానాలో డిప్యూటీ ముఖ్యమంత్రి అనే హోదాలో పనిచేసిన నారాయణ స్వామి పరిస్థితిని చూసినప్పుడు మనకు అలాగే అనిపిస్తుంది. అప్పట్లో ఎక్సయిజుశాఖకు మంత్రిగా కూడా చేసిన నారాయణస్వామిని.. ఇప్పుడు లిక్కర్ స్కామ్ ను విచారిస్తున్న సిట్ దర్యాప్తు బృందం విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చింది.
దాదాపు మూడున్నర వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో ఇప్పటిదాకా నలభై మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు. 11 మంది జైల్లోనే ఉన్నారు. 22 మందిని పైగా విచారించారు. ఇన్ని జరిగినప్పటికీ కూడా.. ఆ సమయంలో ఎక్సయిజు శాఖకు మంత్రిగా ఉన్నటువంటి నారాయణస్వామి పేరు ఎక్కడా వినిపించలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి జమానాలో మంత్రులను డమ్మీలుగా మార్చి.. డైరక్టుగా జగన్ మార్గదర్శకత్వంలోనే బయటి వ్యక్తులు, ఇతరులు ఏ రకంగా ప్రభుత్వ నిర్ణయాలను శాసిస్తూ ఉండేవారో తెలుసుకోవడానికి ఇది పెద్ద ఉదాహరణ. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. కొత్త లిక్కర్ పాలసీ తయారైంది. ఆ లిక్కర్ పాలసీ రూపకల్పన విధివిధానాలు, ఏ రకంగా డిస్టిలరీలనుంచి వేల కోట్లు దోచుకోగలమోననే మార్గాల అన్వేషణ తదితర చర్చల కోసం తొలిదశలోనే విజయసాయిరెడ్డి ఇంట్లో పలు విడతలుగా సమావేశాలు కూడా జరిగాయి. అప్పటి సీఎం జగన్ అనుంగు సహచరులు ధనంజయరెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, ఎంపీ మిధున్ రెడ్డి, రాజ్ కెసిరెడ్డి, అధికారులు వాసుదేవరెడ్డి తదితరులు కలిసి చర్చలు జరిపి పాలసీకి తయారుచేశారు. ఈ వ్యవహారం మొత్తం కనీసం ఎక్సయిజు మంత్రికి కూడా తెలియకుండా, ప్రమేయం లేకుండా ఆశ్చర్యం లేదు.
జగన్ మంత్రుల్ని డమ్మీలుగా మార్చి వారి అన్ని శాఖల నుంచి కూడా తన తరఫునే సింగిల్ విండో తరహాలో దోచుకునే వాడనే ఆరోపణలు కొత్త కాదు. ఆయన సొంత మామ బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా.. తాను మంత్రి అయినప్పటికీ కూడా అదానీ విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందాలు తన ప్రమేయం లేకుండానే జరిగాయని వాపోయిన సంగతి గుర్తుండే ఉంటుంది.
ఆ రకంగా పాపం లిక్కర్ స్కామ్ తో అప్పటి ఎక్సయిజు మంత్రికి ఏం సంబంధం లేకపోయినప్పటికీ.. ఇప్పుడు ఆయన సిట్ విచారణకు హాజరు కావాల్సి వస్తోంది. ఆయన చేసిందేమీ లేదు, ఆయనకు దక్కిందేమీ లేదు.. నిజానికి ఆయనకు తెలిసిన విషయాలు కూడా ఏమీ ఉండకపోవచ్చు.. ఎందుకంటే ఎవరూ ఆయనకు ఏమీ చెప్పి ఉండకపోవచ్చు. అయినా సరే.. పాపం నారాయణస్వామి సిట్ విచారణకు హాజరుకావాల్సి వస్తోంది. విచారణఖు వెళ్లినంత మాత్రాన వచ్చే ఇబ్బందేం లేదని, ఆయనను కేవలం సాక్షిగా కొన్ని వివరాలను ధ్రువీకరించుకోవడానికి మాత్రమే సిట్ పిలుస్తోందని పలువురు అంచనా వేస్తున్నారు.
శెభాష్.. నారా లోకేష్ అందరికీ ఆదర్శం కావాలి!
ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అత్యుత్తమ ఫలితాలు సాధించడం పెద్ద విశేషమేమీ కాదు. అలాంటివి జరిగినప్పుడు అక్కడి ప్రధానోపాధ్యాయుల్ని, టీచర్లను అందరూ ప్రశంసించడమూ, ఎవరు ఎక్కువ కృషిచేసి ఉంటే వారిని గుర్తించి సత్కరించడమూ కూడా వింత కాదు. సహజంగా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ప్రతి ఏటా ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి అవార్డులు అందజేసే క్రమంలో ఇలాంటి విజయాలన్నీ కూడా నమోదు అవుతూ ఉంటాయి. అయితే.. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఒక గొప్ప పని చేశారు. రాబోయే సెప్టెంబరు 5న గురుపూజోత్సవం నాడు ఒక మెమెంటో ఇవ్వడానికి వీలుగా అవార్డులు ప్రకటించే జాబితాలో పెట్టలేదు. ప్రత్యేకంగా తన నివాసానికి పిలిపించుకుని ఘనంగా సత్కరించారు. అంతే కాదు.. విద్యావ్యవస్థను మరింత మెరుగ్గా చేయడానికి, విద్యార్థులందరూ ప్రభుత్వ పాఠశాలలవైపే మొగ్గేలా చేయడానికి ప్రభుత్వం ఏం చేయాలో.. సలహాలు కూడా స్వీకరించారు. ఒక సాధారణ హెడ్మాస్టరు నుంచి విద్యాశాఖ మంత్రి వ్యక్తిగతంగా సలహాలు స్వీకరించడం నిజంగానే గొప్ప విషయం. అందరు మంత్రులు కూడా ఈ రకమైన పనితీరును ఆదర్శంగా తీసుకుంటే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి.
కృష్ణాజిల్లా పెనమలూరు లో ఈ ఏడాది అత్యుత్తమ ఫలితాలు సాధించారు. ప్రధానోపాధ్యాయురాలు దుర్గాభవాని ని నారా లోకేష్ ప్రత్యేకంగా తన ఉండవిల్లి నివాసానికి పిలిపించుకున్నారు. ఆమను ‘షైనింగ్ టీచర్’ పేరుతో ఘనంగా సత్కరించారు. రాబోయే నాలుగేళ్లలో ప్రెవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వచ్చి చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగాలంటే.. ప్రభుత్వ పాఠశాలల్లో ‘సీట్లు ఖాళీ లేవు’ అనే బోర్డులు పెట్టాలంటే ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆమెనుంచి సలహాలను కూడా స్వీకరించారు.
సాధారణంగా మంత్రి స్థాయికి చేరుకున్న తరువాత.. ‘తాము సర్వజ్ఞులం’ అనే అహంకారం చాలా మందికి వస్తుంది. తాము ఏం తలిస్తే అదే ఆ రంగానికి మేలు చేస్తుందని, ఆ రంగం బాగుపడాలంటే తమ ఆలోచనలు అమలైతే చాలునని అనుకుంటూ ఉంటారు. అలాంటిదేమీ లేకుండా.. క్షేత్రస్థాయిలో పనిచేసే ప్రధానోపాధ్యాయురాలినుంచి సలహాలు స్వీకరించడం అనేది చాలా అభినందనీయమైన విషయం. లోకేష్ తరహాలోనే తతిమ్మా అందరు మంత్రులు కూడా.. తమ తమ శాఖలకు సంబంధించి.. క్షేత్రస్థాయిలోని వారిని తరచూ కలుస్తూ వారి అభిప్రాయాలను తెలుసుకుంటూ ఉంటే.. ఆయా శాఖలు మరింతగా ప్రజాసేవ చేయడం వీలవుతుంది.
దుర్గాభవానికి సత్కారం చేసిన తర్వాత.. లోకేష్ ఈ విధంగా ట్వీట్ చేశారు: ‘‘తన నిబద్ధతతో కృష్ణా జిల్లా పెనమలూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో అద్భుత ఫలితాలు సాధించిన ప్రధానోపాధ్యాయురాలు యలమంచిలి దుర్గా భవాని గారిని ‘షైనింగ్ టీచర్’ పేరుతో ఉండవల్లి నివాసంలో ఘనంగా సత్కరించాను. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత పెంచి తద్వారా ప్రవేశాలు పెంచడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. వచ్చే నాలుగేళ్లలో ప్రైవేటు స్కూల్స్ అడ్మిషన్లు తగ్గాలి. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరగాలి. ప్రభుత్వ పాఠశాలల ముందు అడ్మిషన్స్ క్లోజ్డ్ అని బోర్డులు ఉండాలనేదే మా లక్ష్యం. ఇందుకోసం చిత్తశుద్ధితో పనిచేస్తామని ఈ సందర్భంగా వివరించాను. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం దుర్గా భవాని గారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాను.’’
నారాలోకేష్ అనుసరించిన ఈ మార్గాన్ని ఎందరు మంత్రులు ఆదర్శంగా తీసుకుంటారో వేచిచూడాలి.
రోజా తిట్లు వైఎస్ జగన్ కు టార్గెట్ చేసినట్టు ఉన్నాయే..
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ కు, మాజీ ఎమ్మెల్యే రోజాకు మధ్య డైలాగ్ వార్ నడుస్తున్న సంగతి అందరికీ తెలుసు. వీరిద్దరూ రాష్ట్రం మొత్తం దృష్టిని ఆకర్షించే విధంగా మాటలు రువ్వుకుంటున్నారు. తమాషా ఏంటంటే.. ఇదంతా కూడా నగరి నియోజకవర్గం మీదుగా.. అక్రమ రవాణా అవుతున్న ఇసుక లారీలను పోలీసులు పట్టుకోవడం వల్ల ప్రారంభం అయింది. అయితే తాజాగా గాలి భానుప్రకాష్ పై రెచ్చిపోయిన ఆర్కే రోజా.. ఆయనను విచ్చలవిడిగా తిట్టారు. కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఆమె తిట్లు అన్నీ కూడా.. అచ్చంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ తిట్టిన తిట్లు లాగా కనిపిస్తున్నాయి. జగన్ కు వర్తించేవిగా కనిపిస్తున్నాయి.
నగరిలో ఇటీవల పోలీసులు ఇసుక స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ఏడు లారీలను పట్టుకున్నారు. వాటితో పాటు కొందరిని అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు కూడా ఉన్నారు. తమ పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ కూడా.. ఏపీలో ఉచితంగా దొరుకుతున్న ఇసుకను అక్రమంగా సరిహద్దులు దాటించి అధికధరలకు అమ్ముకుంటూ వైసీపీ వారు ఇంకా దందా సాగిస్తున్నారన్నమాట. తమ పార్టీ స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేసేసరికి రోజాకు కోపం వచ్చింది. ఆమె తెగ రెచ్చిపోతూ ఇసుక సహా బియ్యం, లిక్కరు కూడా ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ స్మగ్లింగ్ చేయిస్తున్నారంటూ రకరకాల పసలేని ఆరోపణలు చేశారు. ఆమె ఆరోపణలు ఎంత కామెడీగా ఉన్నాయంటే.. వైసీపీ హయాంలో ఏపీలో లిక్కరు మంచి బ్రాండ్లు దొరికేవి కాదు.. పైగా ఇక్కడ నడ్డివిరిచేంత బీభత్సమైన ధరలుండేవి. ఆ పరిస్థితుల్లో సరిహద్దుల్లో వైసీపీ నాయకులే నిత్యం పొరుగురాష్ట్రాలనుంచి మద్యం స్మగ్లింగ్ చేస్తూ కోట్లకు కోట్లు గడించారు. కూటమి ప్రభుత్వం పాలన వచ్చిన తర్వాత.. మద్యం ధరలు దిగిరావడంతో పాటు, అన్ని బ్రాండ్లు దొరుకుతుండడంతో అసలు లిక్కర్ స్మగ్లింగ్ అనే దానికి అర్థమే లేకుండాపోయింది. అలాంటిది రోజా అమాయకంగా లిక్కర్ స్మగ్లింగ్ అని కూడా అంటున్నారు.
రోజా అవినీతి గురించి మాట్లాడుతూ.. ‘‘ఆమె పనులు చేయడానికి రెండువేల రూపాయలకు చేయి సాచేదని’’ ఆమె అవినీతిపై గాలి భానుప్రకాష్ ఆరోపణలు చేశారు. దీనికి జవాబుగా ఆమె గాలి భాను ప్రకాష్ రెడ్డిని ఉద్దేశించి.. నానా తిట్లు తిట్టారు. పోలీసు కంప్లయింటు ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ.. ‘‘నీ తల్లే నిన్ను ఛీత్కరించుకుంది. నీ తోడబుట్టిన వాళ్లే నీ చెల్లెలే నిన్ను ఛీత్కరించుకుంది’’ అంటూ రెచ్చిపోయారు. సరిగ్గా ఈ మాటలే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతున్నాయి. ఎందుకంటే.. గాలి భానుప్రకాష్ విషయం ఏమోగానీ.. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నట్టే ప్రజలకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. కన్న తల్లి మీద తనకు గతంలో ఉన్న ప్రేమ ఇప్పుడు లేదని, ఆమెకు అప్పుడు గిఫ్టు డీడ్ గా ఇచ్చిన షేర్లను తిరిగి ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి ట్రిబ్యునల్ లో కేసు నడుపుతున్నారు. ఆస్తులకు కక్కుర్తి పడి కూతురుకు దారుణమైన అన్యాయం చేశాడని, తన వాటాను తిరిగి అడిగే హక్కు లేదని వైఎస్ విజయమ్మ ట్రిబ్యునల్ లో దాఖలు చేసిన అఫిడవిట్ల సాక్షిగా జగన్ ను ఛీత్కరించుకుంటోంది. సొంత చెల్లెలు వైఎస్ షర్మిల.. జగన్మోహన్ రెడ్డిని ఒక రాక్షసుడిగా పేర్కొంటూ ఎన్ని రకాల విమర్శలకు దిగుతున్నారో లెక్కేలేదు. రోజా తిడుతున్న తిట్లు అచ్చంగా ఆమె పార్టీ అధినేత వైఎస్ జగన్ కు సరిపోతాయని ఆ పార్టీ వారే అనుకుంటున్నారు.
తమాషా ఏంటంటే.. తల్లి ఛీత్కరించుకుంటోంది.. చెల్లి ఛీత్కరించుకుంటోంది.. అని రోజా తిట్టిన తిట్లను కనీసం ఎడిట్ చేయకుండా.. సాక్షి చానెళ్లలో కూడా ప్రసారం చేస్తుండడం!
Tollywood Actor Fish Venkat Passes Away at 53
Popular Tollywood character actor Fish Venkat (53) passed away on Friday night while undergoing treatment for a kidney-related ailment at a private hospital in Hyderabad. He had been suffering from chronic kidney disease for some time and was recently admitted for dialysis after both his kidneys failed. Doctors had advised a kidney transplant, and his daughter had earlier appealed to the public for donor support, citing the family’s inability to afford treatment. Tragically, he passed away before further help could arrive.
Fish Venkat, whose real name was Mangalam Palli Venkatesh, earned the nickname “Fish” Venkat from his early days as a fish trader at the Musheerabad market. A resident of Ramnagar, he entered the film industry with the help of actor Srihari and was introduced as an actor by director V.V. Vinayak.
Over his career, Venkat appeared in more than 100 films as a comedian and character artist. He was known for his roles in popular films such as Aadi, Dil, Bunny, Attarintiki Daredi, Gabbar Singh, DJ Tillu, King, Don Seenu, Mirapakay, Daruvu, and Supreme. His final film was Coffee With a Killer.
TDP Parliamentary Party Charts Strategy Ahead of Parliament Session
Amaravati: Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu on Friday chaired a meeting of the Telugu Desam Party (TDP) Parliamentary Party at the camp office in Undavalli. The meeting was convened to formulate a strategic approach for the upcoming Parliament session, which is scheduled to begin on July 21.
During the meeting, the Chief Minister directed party MPs to focus on key issues concerning the state, including pending central funds, delayed infrastructure projects, and the need for timely approvals under various central schemes. A total of nine major subjects were identified as part of the party’s agenda for the session.
The discussions also covered concerns over delays in sanctioning loans under central programmes and the alleged derogatory online campaigns by YSRCP supporters targeting women public representatives.
Briefing the media after the meeting, TDP Parliamentary Party leader Lavu Sri Krishna Devarayalu said that the coalition government had already secured ₹15,000 crore for Amaravati. He added that the party would raise several critical issues in Parliament, including Operation Sindhoora Vijay, the 50th anniversary of the Emergency, the Quantum Valley project, Bharat Gaurav trains, and the national aerospace policy.
“We will also draw the Centre’s attention to the pending infrastructure projects in the state and urge for their swift completion,” he stated.
Only YouTubers Benefited Under Revanth’s Rule: KTR
Khammam: BRS working president K.T. Rama Rao on Friday alleged that the Congress government had filed numerous cases against him without presenting any credible evidence. Addressing a press conference in Khammam, KTR demanded that the state government publicly disclose whatever proof it claims to have against him.
“They say there are tons of cases against me, yet they haven’t produced even a needle’s worth of evidence. If someone dies in Dubai, how am I responsible? I’ve never even smoked a cigarette. People should stay away from bad habits,” he said.
Responding to various allegations made by Chief Minister Revanth Reddy, KTR said, “I’ve done nothing wrong. And even if I had met AP Minister Nara Lokesh, what’s the issue? He is a good friend, a responsible leader from the neighbouring state, and like a younger brother to me.”
He criticised the Congress government for failing to deliver on its promises during its 20-month tenure, accusing it of engaging in diversionary politics. “One day they link me to drugs, another day to car racing. The only people benefiting under Revanth Reddy’s leadership are YouTubers. Should we forget the six guarantees just because of gossip?” he asked.
KTR also alleged that the Chief Minister was caught misleading the public on the Banakacharla issue. “Revanth Reddy claimed it was not on the agenda during his Delhi visit, but it clearly was. This is yet another betrayal of the state at the national level. He has entered into a secret pact with Chandrababu Naidu. On the issue of 420 fake promises, Congress is clearly playing political football with the people,” he added.
“Nuvvunte Chaley” from Andhra King Taluka Steals Hearts with Soothing Melody
Ram Pothineni’s highly awaited Andhra King Taluka, directed by Mahesh Babu P, is finally getting into motion with the unveiling of its first single “Nuvvunte Chaley”. This romantic melody has instantly capturing listeners with its soft composition and emotional lyrics.
The tune was composed by Vivek-Mervin, who are known for their work. The song is beautifully sung by Anirudh Ravichander. Anirudh infused the song with a deeper layer with his expressions, making it richer and emotional. As the lyricist, Ram Pothineni brought his own emotions to the song and his poetic sense has struck right with many.
The visuals of the song pair nicely with the romantic sound, featuring Ram with Bhagyashri Borse, staring at the blue skies and green fields of a beautiful rural landscape which only helps to complement their romantic expressions. Their natural chemistry shows how easy and relatable the storytelling feels.
After its release, “Nuvvunte Chaley” has quickly gained acclaim from fans, especially those romantics who enjoy beautiful and meaningful love songs.
Produced by Mythri Movie Makers, Andhra King Taluka seems to be turning into a wholesome entertainer with romance, sweet music, and a great performance.
Uppada Coastal Erosion to Get Permanent Fix: Pawan Kalyan
Pithapuram: Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan on Friday announced that a permanent solution is in the works for the long-standing coastal erosion problem in the Uppada region of Pithapuram constituency.
Speaking on the matter, Pawan Kalyan said the NDA government at the Centre is actively reviewing a proposal to develop coastal protection structures in Uppada, with an estimated cost of ₹323 crore. The project is being pursued through the National Disaster Management Authority (NDMA) and the Union Ministry of Home Affairs.
“On average, the coastline has been eroding by 1.23 metres annually over the past five years, resulting in the loss of nearly 12 metres of coastal land. This has had a severe impact on nearby villages, especially the homes of fishermen. As part of our commitment to the NDA’s election promises, we are prepared to begin construction immediately upon receiving the required approvals,” the Deputy CM stated.
He added that the state government, led by Chief Minister N. Chandrababu Naidu, has already submitted the detailed project proposal to the Ministry of Home Affairs. Expressing confidence, Pawan Kalyan said, “We hope Prime Minister Narendra Modi and Union Home Minister Amit Shah will respond positively to the aspirations of the people of Kakinada. The Centre has consistently supported Andhra Pradesh, and we are optimistic that this project will be approved, bringing long-awaited relief to the affected communities.”