Home Blog Page 45

CM Chandrababu Makes Nominations For 66 Agricultural Market committees

Chief Minister Chandrababu Naidu filled the nominated posts of 66 agricultural market committees, allotted 9 posts to Jana Sena and 4 posts to BJP among the chairmen of the agricultural market committee. Allocations were made to 17 BCs and 10 SCs in the AMC chairman posts. Also, five STs and five minorities got opportunities in the AMC chairman posts. 35 women got opportunities in the agricultural market committee chairman posts.

Meanwhile, the government has issued orders appointing Kollu Peddiraju as the chairman of the AP Fisheries Development Corporation. He will continue as the chairperson for two years. He is from Narsapur constituency. On the other hand, Chief Minister Chandrababu Naidu has already announced the chairmen of the agricultural market committees in several phases.

In the first phase, chairmen were appointed for 47 committees, in the second phase, 38 committees. Similarly, in the third phase there were 30 committees and 66 market committees in the fourth phase. With this, a total of 181 people were replaced in 4 phases. In this too, priority was given to Jana Sena and BJP.

Chandrababu has already appointed chairman and directors to several public sector undertakings. On the other hand, the coalition government has undertaken a wide-ranging public consultation to select the chairmen and members of the market committee. For the past few months, it has collected details of leaders who have worked for the party through various channels including IVRS, online, and the party.

Giving priority to the sentiments of the party ranks, it sought opinions on who should be given what positions. All these were compiled and the names were announced. There are a total of 218 market committees in AP. The local MLA of the respective constituency acts as the honorary chairman of the governing body. Each committee, including the honorary chairman and chairman, has 20 members.

The local PACS president and three other officials are members. The remaining 14 people are appointed by the government through the nominated system. The tenure of the chairman and members is for a year. Usually, it is extended for another year. That is, one person every two years, so in four years, 436 people get the opportunity to serve as chairmen and 6104 people get the opportunity to serve as members.

CM Chandrababu says Now He Gained courage To Turn Rayalaseema Into Ratnalaseema

Stating that now all the reservoirs in Rayalaseema are flourishing, Chief Minister Chandrababu Naidu said that he has gained the courage to turn Rayalaseema into Ratnalaseema. CM Chandrababu, who visited Nandyal district, released water after the completion of the expansion work of Handri Neeva Phase-1 canals. He turned on three motors at the Mallyala pumping station in Nandikotkur mandal of the district after performing a water aarti.

With the release of water, the drinking and irrigation water problems of Rayalaseema will be solved. After 12 years, 40 TMC of water has become available to the region. The Chief Minister examined the project alignment, ayacut and Krishna River Basin maps. He watched the water release from the pumping station viewpoint.

Later, speaking, CM Chandrababu wished all the farmers who will benefit from Handri Neeva water. He said that he will never forget the satisfaction of providing water to Rayalaseema. He reminded that NTR had said that he would provide water to Chennai only after providing water to Rayalaseema. He said that he himself had initiated the Handree Neeva in the past.

The Handree Neeva water will flow for 550 km and will go to Chittoor and Kuppam. He said that 6 lakh acres will receive irrigation water through Handree Neeva and about 4 TMC of water can be carried through Mallayala. He said that SRBC, Muchumarri and Mallyala canals will come from Srisailam. He said that another canal will go to Anantapur, Pattikonda and Gollapalli from Handree Neeva.

Finance Minister Payyavula Keshav lamented that former CM Jaganmohan Reddy is trying to create anarchy in Rayalaseema, but CM Chandrababu is working to bring light into our lives. He recalled that the capacity of Handri Neva canal was increased to 12 pumps in just 100 days.

Irrigation Minister Nimmala Ramanaidu accused Jagan had betrayed Rayalaseema like no other CM had done. He said that Chandrababu had done in a year what Jagan could not do in five years in a year. He said that theirs is the government that kept its promise to provide water to Handri Neva. He said that they are providing water to 8 lakh acres by spending Rs. 3,890 crores for Handri Neva.

పోలవరం ఎత్తుపై అసలు పాపం ఎవరిదో తేలుస్తున్న చెల్లెమ్మ!

పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించేయడం గురించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మేధావులు గత కొన్ని రోజులుగా తెగ గగ్గోలు పెడుతున్నారు. 45.7 మీటర్ల ఎత్తు ఉండవలసిన పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్ల ఎత్తున కుదించడం వలన రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్రమైన విఘాతం కలుగుతుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దళాలన్నీ మొసలి కన్నీరు కారుస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అయితే ఇంకా ఒక అడుగు ముందుకేసి.. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తక్కువ ఉండడం కారణంగా నీటినిల్వ సామర్థ్యం బాగా తగ్గుతుందని.. అందువలన బనకచర్ల ప్రాజెక్టు కట్టినా కూడా వృధా అవుతుందని మోకాలికి బోడి గుండు కి ముడిపెట్టినట్లుగా మాట్లాడుతున్నారు. అసలు బనకచర్ల కట్టవలసిన అవసరమే లేదని అంటున్నారు. పోలవరం ప్రాజెక్టును ముందు అనుకున్నట్లుగా 45.7 మీటర్ల ఎత్తు వరకు కట్టాలని సూచిస్తున్నారు. అయితే అసలు పోలవరం ప్రాజెక్టు ఎత్తు సుమారు నాలుగున్నర మీటర్లు తగ్గి 41.15 మీటర్లకు కుదిరించబడడం వెనుక అసలు పాపం జగన్మోహన్ రెడ్డి దే అని ఏపీసీసీ సారథి వైఎస్ షర్మిల ఆరోపిస్తున్నారు.

వైయస్ రాజశేఖర్ రెడ్డి వారసుడిని అని చెప్పుకుంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు అనే వైయస్ కలను సాకారం చేయడానికి చేసిన ప్రయత్నం ఒక్కటి కూడా లేనేలేదని షర్మిల విమర్శిస్తున్నారు. వైయస్సార్ కలలుగన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో తన ఐదేళ్ల పదవీకాలంలో ఒక తట్ట మట్టి కూడా ఎత్తి పక్కన పోయలేదని జగన్మోహన్ రెడ్డి తీరును ఆమె తీవ్రంగా నిరసించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ పేరుతో రాష్ట్ర ఖజానాకు మేలు చేకూరుస్తున్నాను అనే మాయ మాటలు చెబుతూ.. అది వరకు చంద్రబాబు హయాంలో పనులు చేస్తూ వచ్చిన నిర్మాణ సంస్థను బలవంతంగా పక్కకు తప్పించి మెగా కృష్ణారెడ్డి చేతిలో పోలవరం పెట్టారు. అయితే ఐదేళ్లలో పోలవరం నిర్మాణ పనులు  ఏ మాత్రం చురుగ్గా సాగలేదు.
ఐదేళ్లు గడిచినా ఎక్కడి గొంగళి అక్కడనే అన్న సామెత చందంగా ఉండిపోయింది. జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ముఖ్యమంత్రి హోదాలో కొన్ని పదుల సార్లు ఢిల్లీ వెళ్లి, కేంద్రంలోని పెద్దలతో సమావేశం కావడానికి ప్రయత్నించారే తప్ప పోలవరానికి నిధులు తీసుకువచ్చి పనులు పూర్తి చేయడం గురించి శ్రద్ధ పెట్టలేదు. ఎంతసేపూ తన మీద ఉన్న సిబిఐ ఈడి కేసులలో ఉపశమనం కావాలని,   ఇలాగే తమ్ముడు అవినాష్ రెడ్డి మీద వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కు సంబంధించి ఉన్న ఆరోపణలు పక్కదారి పట్టించడానికి ఈ పర్యటనలను జగన్మోహన్ రెడ్డి వాడుకున్నా రని ప్రజలు నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే 2022లో పోలవరం ప్రాజెక్టు ఎత్తు 41.15 మీటర్ల ఎత్తున కుదిరించబడడానికి ప్రధాన కారకుడు జగన్మోహన్ రెడ్డే అని షర్మిల విరుచుకు పడుతున్నారు.

దొంగపిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ.. తనను ఎవరూ చూడడం లేదని అనుకుంటుంది అన్నట్టుగా.. వైఎస్ జగన్ కూడా.. పోలవరానికి తాను చేసిన ద్రోహాన్ని ఎవరు గుర్తించరులే అనే ఉద్దేశంతో.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద విరుచుకుపడుతున్నట్టుగా కనిపిస్తోంది.

తెలంగాణ ట్యాపింగ్ నిందితులకు, ఏపీ లిక్కర్ స్కాంలోను భాగం!

తెలంగాణ లో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వైఎస్ షర్మిల ఫోన్లను కూడా ట్యాప్ చేసి విన్నారని, ఏపీకి చెందిన ఇంకా అనేక మంది రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల ఫోన్లను కూడా ట్యాప్ చేశారనే సంగతులు బయటకు వచ్చిన తర్వాత.. అక్కడ ఆ ట్యాపింగ్ దందా సాగడంలో  వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎంత? ఆయన అందించిన సహకారం ఎంత? ఆయనకు ఒనగూరిన లబ్ధి ఏంటి? అనే దిశగా ప్రజల్లో అనుమానాలు రేగాయి. తన ఫోన్లు ట్యాప్ అయిన మాట నిజం అని.. బాబాయి వైవీ సుబ్బారెడ్డి తన ఫోను సంభాషణను తనకే వినిపించారని షర్మిల ధ్రువీకరించారు కూడా. తెలంగాణలోని ట్యాపింగ్ పాపంలో  వైఎస్ జగన్మోహన్ కు భాగం ఉండడం మాత్రమే కాదు.. ఏపీలో చోటుచేసుకున్న లిక్కర్ కుంభకోణంలో ట్యాపింగ్ నిందితుల్లో ఒకరైన శ్రవణ్ రావుకు కూడా భాగం ఉన్నట్టు ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. లిక్కర్ స్కాం పాపులు.. తాము పరారీలో ఉంటూ తలదాచుకోవడానికి ఆయనను వాడుకున్నట్టుగా కొత్త వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. తమాషా ఏంటంటే.. మరో కంటికి తెలిసే అవకాశం లేని ఈ వ్యవహారం శ్రవణ్ రావు చేసిన ఒక మోసం కారణంగా వెలుగులోకి రావడం. తాజాగా శ్రవణ్ రావును కూడా 22వ తేదీన విచారణకు రావాల్సిందిగా ఏపీ సిట్ పోలీసులు నోటీసులు పంపారు.

తెలంగాణ ఫోను ట్యాపింగ్ కేసులో ఒక కీలక నిందితుడు శ్రవణ్ రావుకు దుబాయిలోని అత్యంత ఖరీదైన, బిజినెస్ ఏరియాగా పరిగణించే బిజినెస్ బే ప్రాంతంలో ఒక విలాసవంతమైన లగ్జరీ ఫ్లాట్ ఉంది. ఆ ప్రాంతంలో 66 అంతస్తుల్లో  పారామౌంట్ టవర్ హోటల్ అండ్ రెసిడెన్సీస్ ఉంటాయి. అందులో 1నుంచి 34 అంతస్తుల వరకు బిజినెస్ క్లాస్ హోటల్ కాగా, ఆ పై అంతస్తుల లగ్జరీ నివాస ఫ్లాట్లు ఉంటాయి. అందులో ఫ్లాట్ నెంబరు 5801 శ్రవణ్ రావు భార్య స్వాతి రావు, హైదరాబాదులోని మరో వ్యాపారవేత్త ఆకర్ష్ కృష్ణ భార్య కావ్య పేరిట ఉంది. ఆస్తిపై ఇద్దరికీ చెరిసగం వాటా ఉన్నప్పటికీ.. కావ్య దంపతుల్ని మోసం చేసి.. ఆ ఫ్లాట్ ను డీలక్స్ హాలిడే హోమ్స్ అనే సంస్థకు లీజుకు ఇస్తూ తన భార్య స్వాతి రావు పేరుతో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఫ్లాట్ ను తన ఆధీనంలోనే పెట్టుకున్నారు.

కాగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి.. లిక్కర్ స్కామ్ పై దృష్టి సారించిన వెంటనే నిందితులు పలువురు దుబాయి పారిపోయారు. తూతేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, బూనేటి చాణక్య, సయీఫ్ అహ్మద్, ముప్పిడి అవినాష్ రెడ్డి, పురుషోత్తం వరుణ్ కుమార్, బొల్లారం శివకుమార్, సైమన్ ప్రసన్, ప్రణోయ్ ప్రకాశ్ తదితరులు దుబాయి చేరుకున్నారు. వారంతా శ్రవణ్ రావుకు చెందిన ఇదే ఫ్లాట్ లో తలదాచుకున్నారు. ఆ సంగతి తెలిసిన ఫ్లాట్ యజమానుల్లో ఒకరైన కావ్య భర్త ఆకర్ష్ కృష్ణ ఏపీ సిట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రవణ్ తన నుంచి ఈ ఫ్లాట్ ను ఎలా మోసంతో దక్కించుకున్నది తెలియజెబుతూనే.. ఆ ఫ్లాట్ లో మద్యం కేసు నిందితులు ఫిబ్రవరి 27 నుంచి ఏప్రిల్ 27 వరకు ఉన్నట్టుగా ఆధారాలను కూడా అందించారు. మద్యం స్కామ్ లో కాజేసిన సొమ్ములతో గోల్డెన్ వీసాలను కూడా ఏర్పాటుచేసుకుని దుబాయి చెక్కేసిన నిందితులు, శ్రవణ్ రావు ఫ్లాట్ తో పాటు, మరికొన్ని ఫ్లాట్ లను కూడా అద్దెకు తీసుకుని అక్కడ తలదాచుకున్నట్టుగా సిట్ పోలీసులు తేల్చారు. 22న శ్రవణ్ రావును విచారించిన తర్వాత.. మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని, నిందితులు తప్పించుకోజాలరని పలువురు అంచనా వేస్తున్నారు.

రోజా వెర్సస్ గాలి’: కాణిపాకం చేరిన సవాళ్లపర్వం!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఫైర్ బ్రాండ్ మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా, నగరి తెలుగుదేశం ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ రెడ్డిల మధ్య నగరి నియోజకవర్గాల్లో హాట్ హాట్ సవాళ్లు నడుస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా.. ఆర్కే రోజా చాలా తరచుగా మీడియాలో కనిపిస్తూ ఉండేవారు. నిత్యం చంద్రబాబునాయుడును, లోకేష్ ను తిట్టడానికి, పవన్ కల్యాణ్ ను ఎద్దేవా చేయడానికి ఆమె తన సమయాన్ని కేటాయిస్తూ ఉండేవారు. విధిగా ప్రతినెలా తిరుమలేశుని దర్శనాలకు వెళుతూ.. దర్శనానంతరం బయటకు వచ్చిన తర్వాత.. జగన్ పాలన రాష్ట్రానికి మేలు చేయాలని దేవుడిని కోరుకుంటున్నట్టుగా ప్రతినెలా చెబుతుండేవాళ్లు. అలాంటి రోజా ఇప్పుడు దాదాపుగా ఖాళీ అయిపోయారు. తాడేపల్లి నుంచి స్క్రిప్టులు వచ్చినప్పుడు  తప్ప మీడియా ముందుకు రావడం లేదు. అదే సమయంలో నగరిలో తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి అక్కడ అప్పుడప్పుడూ గొడవ చేస్తున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశానికి చెందిన ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ రెడ్డి మీద రోజా నిందలు వేయడం, వాటికి ఆయన ప్రతిస్పందించడం ఇప్పుడు నియోజకవర్గంలోనే హాట్ టాపిక్ గా మారుతోంది.

నగరి మీదుగా పొరుగు రాష్ట్రంలోనికి ఎమ్మెల్యే సహాయంతో విచ్చలవిడిగా స్మగ్లింగ్, అక్రమ రవాణా జరుగుతున్నదనేది రోజా ఆరోపణ. నగరి నియోజకవర్గం రాష్ట్రానికి సరిహద్దుల్లో ఉన్న ప్రాంతం గనుక.. అక్కడ ఇలాంటి ఆరోపణలు నిత్యం వస్తూనే ఉంటాయి. జగన్ జమానాలో ఇసుక ముసుగులో భారీ రేట్లకు ప్రజలను దోచుకున్న తరహాలో కాకుండా.. ఇప్పుడు ప్రజలకు ఇసుక పూర్తి ఉచితంగా అందుతూ ఉండడంతో.. నగరి మీదుగా ఇసుక లారీలు పొరుగు రాష్ట్రానికి తరలిపోతున్నాయని ఒకవేళ రోజా ఆరోపించినా కూడా.. దాని గురించి ఆలోచించవచ్చు. అలా జరిగే అవకాశం ఉన్నదని అనుకోవచ్చు. కానీ.. రోజా ఇంకా అనేక రకాల అక్రమ రవాణాలను తన ఆరోపణల్లో కలిపేస్తున్నారు. నగరి మీదుగా లిక్కర్ అక్రమరవాణాలు కూడా జరుగుతున్నట్టు చెబుతున్నారు. పొరుగున ఉన్న తమిళనాడు కంటె ఏపీలో లిక్కర్ ధరలు తక్కువగా ఏం లేవు. అలాంటప్పుడు అక్రమరవాణాకు చాన్సే లేదని ప్రజలు అనకుంటున్నారు. అందుకే ఆమె ఆరోపణలు గాలికి తేలిపోతున్నాయి.
అయితే ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ రెడ్డి మాత్రం సీరియస్ గానే తీసుకుంటున్నారు. ఆయన రోజాకు ప్రతిసవాళ్లు విసురుతున్నారు. ఆర్కే రోజా కుటుంబానికి ఇసుక స్మగ్లింగ్ లో కోట్లు కాజేయడం గతంలో అలవాటు అయిపోయిందని, ఇప్పుడు తమ ఆర్జన కోల్పోయేసరికి అందుకే తన మీద కూడా అలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన అంటున్నారు. రోజాకు ధైర్యముంటే ఆమె ఎమ్మెల్యేగా ఉండగా ఇసుక అక్రమ రవాణాతో ఆమెకు గానీ, ఆమె భర్తకు, ఆమె సోదరులకు గానీ ఎలాంటి సంబంధం లేదని.. కాణిపాకం వచ్చి ప్రమాణం చేయాలని గాలి డిమాండ్ చేస్తున్నారు. అలాగే తాను కూడా తన కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని కాణిపాకంలో ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన సవాలు విసురుతున్నారు. నిజం చెప్పాలంటే గతంలో ప్రతినెలా తిరుమలకు వెళ్లే రోజాకు దేవుడి పట్ల విశ్వాసం ఉన్నదనే అనుకోవాలి. అందుకే .. ఆమె తాను చేసిన ఆరోపణలను నమ్ముతోంటే.. తనకుటుంబానికి గతంలో ఇసుక స్మగ్లింగ్ తో సంబంధం లేదని కాణిపాకంలో ప్రమాణం చేయడానికి సిద్ధమేనా అని నియోజకవర్గ ప్రజలు చెవులు కొరక్కుంటున్నారు.

రాయలసీమ ద్రోహిగా జగన్ కు ముద్రపడనున్నదా?

వైఎస్ జగన్మోహన్ రెడ్డిలోని విధ్వంసక మనస్తత్వం రోజురోజుకూ జడలువిప్పి నాట్యం చేస్తున్నదా అనే అనుమానం ప్రజలకు కలుగుతోంది. ఎందుకంటే..  రాష్ట్రం బాగు కోసం కూటమి ప్రభుత్వం ఏం చేయదలచుకున్నా సరే.. ఆ పనులను అడ్డుకోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ దళాలు చేస్తున్న వికటప్రయత్నాలు అన్నీ యిన్నీ కావు. ఒక్కో విషయంలో ఒక్కో రకంగా తమ దుర్బుద్ధులను ప్రదర్శించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెనుకాడడం లేదు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి జాతీయ, అంతర్జాతీయ సంస్థలను కలిసి వారిని ఆహ్వానిస్తూ ఉండగా.. ఆ సంస్థలు రాష్ట్రానికి రాకుండా ఉండేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ దళాలు దాదాపుగా 200 ఈమెయిల్స్ నకిలీ పేర్లతో పంపి.. కంపెనీలను బెదిరించిన సంగతి ఇటీవలే చర్చకు వచ్చింది. అంటే పెట్టుబడిదారులు రాష్ట్రానికి రాదలచుకున్నప్పుడు.. ఆకాశరామన్న ఈమెయిల్స్ తో అడ్డుకోవడానికి ప్రయత్నించారన్నమాట. ఇప్పుడు.. చంద్రబాబునాయుడు రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి, గోదావరి వృథాజలాలను, ఆయకట్టు చివరిరాష్ట్రంగా ఏపీ వాడుకోగల హక్కుతో పోలవరం- బనకచర్ల ప్రాజెక్టును తలపెడితే.. దానిని అడ్డుకోవడానికి జగన్మోహన్ రెడ్డి డైరక్టుగానే రంగంలోకి దిగుతున్నారు. బనకచర్లకు మోకాలడ్డడానికి బినామీ పేర్ల వ్యవహారం కూడా కాదు.. జగన్ స్వయంగా రంగంలోకి దిగి విషం కక్కుతున్నారు. ఈ ప్రయత్నాలతో వైఎస్ జగన్ రాయలసీమ ద్రోహిగా ముద్రపడే అవకాశం ఉన్నదని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేషనల్ మీడియాతో మాట్లాడుతూ.. బనకచర్ల ప్రాజెక్టుపై విషం కక్కారు. ఒకవైపు ఈ ప్రాజెక్టుకు తీవ్రఅభ్యంతరాలు తెలుపుతున్న తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ఒప్పించి, నిధులు-అనుమతులు ఇవ్వాల్సి ఉన్న కేంద్రాన్ని కూడా ఒప్పించి.. ఆయకట్టు చివరి రాష్ట్రం గనుక.. వృథాజలాలను వాడుకోవడానికి ఉన్న హక్కును వారికి వివరించి.. బనకచర్లను సాధించాలని చంద్రబాబునాయుడు ఢిల్లీలో కీలక సమావేశాల్లో పాల్గొంటూ ప్రయత్నాలు సాగిస్తున్న సమయంలోనే.. ఇక్కడ రాష్ట్రంలో జగన్ ఇలా విషం కక్కడం గమనార్హం.
బనకచర్ల ఈ రాష్ట్రానికి అవసరం లేదని, గోదావరి మిగులు జలాల గురించి స్పష్టమైన లెక్కలు తేలకుండా.. 80 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ ప్రాజెక్టు నిర్మించడంలో అర్థం లేదని జగన్ వ్యాఖ్యానించారు. నిజానికి మూడువేల టీఎంసీలు ప్రతి ఏటా సముద్రంలో కలిసిపోతున్నట్టుగా.. చంద్రబాబు సర్కారు వందేళ్ల వెనక్కు వెళ్లి గణాంకవివరాలను కేంద్రానికి సమర్పించి మరీ అనుమతులు అడిగింది. అయితే.. రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి కూటమిప్రభుత్వం సంకల్పించిన ఈ ప్రాజెక్టు వద్దని అనడం ద్వారా.. జగన్ రాయలసీమ ద్రోహిగా ముద్రపడనున్నారని విమర్శలు వస్తున్నాయి. నంద్యాల జిల్లా మల్కాల పంపింగ్ స్టేషను వద్ద హంద్రీనీవా కాల్వకు చంద్రబాబు నీటిని విడుదల చేసిన సందర్భంగా.. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ ఇదే సంగతి వెల్లడించారు. రాయలసీమ జీవితాల్లో వెలుగులు నింపాలని చంద్రబాబునాయుడు చూస్తోంటే.. జగన్ మాత్రం ఇక్కడ అరాచకం సృష్టించాలని అనుకుంటున్నారని ఆయన ఆరోపించారు. 

తమరి పిలుపుకు పార్టీలో స్పందన ఉందా జగన్!

అధికారంలోకి వచ్చిన ఏడాదికాలంలో రాష్ట్రప్రజలకు ఏం చేశామో చెప్పడంతో పాటు, రాబోయే రోజుల్లో ఏమేం చేయబోతున్నామో వివరించడం, అలాగే వారి సమస్యలను కూడా తెలుసుకుని పరిష్కరించడం అనే లక్ష్యంతో చంద్రబాబునాయుడు ‘సుపరిపాలనలో తొలి అడుగు’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కూటమి పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు అందరూ గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను కలుస్తున్నారు. అయితే అధికార కూటమి ఇలా ప్రజల్లోకి వెళ్లడం కూడా చూసి ఓర్వలేకపోతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తొలిఅడుగుకు పోటీగా, ఒక కార్యక్రమానిక పిలుపు ఇచ్చారు. తన పార్టీ నాయకులు కూడా ఇంటింటికీ తిరుగుతూ చంద్రబాబునాయుడు ఏడాదిలో చేసిన మోసాలను (?) ప్రజలకు తెలియజెప్పాలని ఆయన పిలుపు ఇచ్చారు. ‘బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ.. చంద్రబాబు మ్యానిఫెస్టోను గుర్తు చేసుకుందాం’ అని ఈ కార్యక్రమానికి పేరు పెట్టారు. అయితే ఆ పార్టీ తరఫున ప్రజల్లోకి వెళ్తున్న నాయకుడు ఒక్కడు కూడా కనిపించడం లేదు. జగన్ మాత్రం తనకు గుర్తువచ్చినప్పుడు.. పార్టీ నాయకులతో సమావేశమై ఈ కార్యక్రమం ఎలా జరుగుతున్నదని అడగడం.. అంతటితో చేతులు దులుపుకోవడం జరుగుతోంది. అయినా ఇంతకూ తమరు ఇచ్చిన పిలుపునకు తమ సొంత పార్టీలో అయినా.. కనీసం ఒక్క నాయకుడైనా స్పందిస్తున్నాడా? ప్రజల్లో తిరుగుతున్నారా? తమ నిఘా వర్గాల ద్వారా.. తమ సొంత గూఢచారుల ద్వారా ఆ సంగతి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
‘జగన్మోహన్ రెడ్డి పిలుపు ఇచ్చిన ‘చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుచేసుకుందాం’ అనే కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ కావడానికి మొదటి కారణం.. ఆయనే’ అనే అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే వ్యక్తం అవుతోంది. ఎందుకంటే.. ‘సుపరిపాలనలో తొలి అడుగు’ అనే పేరుతో ప్రజల్లోకి వెళ్లాలనే ఒక కార్యక్రమానికి పిలుపు ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.. సాధారణ ఎమ్మెల్యేలకంటె చురుగ్గా తాను కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఊరూరా తిరుగుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి.. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత.. ఇప్పటిదాకా పిలుపు ఇచ్చిన ఏ ఒక్క కార్యక్రమంలో కూడా తాను స్వయంగా పాల్గొన్నది లేదు. ఆయనకే లేని శ్రద్ధ పార్టీ వారికి మాత్రం ఏముంటుంది? అని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కూటమి పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులందరూ ముమ్మరంగా తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సాక్షి మీడియా కు అవి కనిపించవు గనుక వారిని పక్కన పెడితే తక్కిన మీడియాల్లో తొలిఅడుగు కార్యక్రమాల గురించిన వార్తలు పుంఖానుపుంఖాలుగా వస్తూనే ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి పిలుపు ఇచ్చిన చంద్రబాబు వ్యతిరేక కార్యక్రమాన్ని వైసీపీ నాయకులు ప్రజల్లో నిర్వహిస్తూ ఉంటే.. ఆ వార్తలు కనీసం సాక్షి చానెల్లో అయినా కనిపించాలి కదా అనేది ప్రజల సందేహం. వైసీపీ నాయకులు ఎంతసేపూ ప్రెస్ మీట్లు పెట్టడం, లేదా, కార్యకర్తల సమావేశాలు పెట్టడం.. కూటమి ప్రభుత్వాన్ని తిట్టిపోయడం చేస్తున్నారు తప్ప.. జగన్ పిలుపును వారు బేఖాతరు చేస్తున్నారు. కూటమి ఏడాది పాలన తర్వాత ప్రజల్లోకి వెళ్లి బాబు సర్కారు పనిచేయడం లేదని నిందలు వేయాలంటే భయపడుతున్నారు.

తాను పిలుపు ఇచ్చిన కార్యక్రమం సొంత పార్టీ నాయకులు కూడా ఏమాత్రం పట్టించుకోకుండా దారుణంగా ఫ్లాప్ అయితే.. దానిని గుర్తించకపోవడం జగన్ వైఫల్యం అనే విమర్శలు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో తన సొంత పార్టీవారిలోనే లేని దృక్పథంతో పోరాడాలని జగన్ అనుకుంటే గనుక.. గాల్లో కత్తి తిప్పుతూ యుద్ధం చేసినట్టే ఉంటుందని ప్రజలు అనుకుంటున్నారు.

Anurag Kashyap Slams ‘Absurd’ CBFC Order

 The Central Board of Film Certification (CBFC) is under fire from several film industry figures following its objection to the name of a character in the Malayalam film Janaki vs State of Kerala. The board reportedly asked the filmmakers to change the name “Janaki”, citing that it is another name for Goddess Sita, prompting criticism over creative restrictions.

Bollywood actress Shreya Dhanwanthary and Tollywood filmmaker Tharun Bhascker were among the first to question the CBFC’s stance, calling it an overreach and a threat to artistic freedom. The directive has reignited debates around censorship and the limits of creative expression in Indian cinema.

Filmmaker-actor Anurag Kashyap also weighed in on the controversy, calling the objection “absurd.” Speaking on the issue, he remarked, “Are we now supposed to avoid all mythological names in storytelling? Should characters be named XYZ or 123 instead?” He added that such restrictions undermine the natural evolution of film narratives.

Kashyap further criticised the functioning of the CBFC, alleging that some officials based in Maharashtra lack adequate understanding of Hindi, which leads to frequent misinterpretations. He called for a serious conversation on the board’s role and the need to safeguard creative liberties in the film industry.

లింక్డిన్ ర్యాంకులు కూటమి సర్కారుకు కితాబులే!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయిదేళ్ల పదవీకాలంలో.. రాష్ట్రంలో విధ్వంసం తప్ప అభివృద్ధి జరగలేదు. ఒక్క ప్రాజెక్టు, పరిశ్రమ రాలేదు. ఒక్క ఉద్యోగం కల్పన జరగలేదు. అలాంటి దుర్మార్గమైన పాలనను ప్రజలు ఏమాత్రం సహించలేకపోయారు గనుకనే.. ఆయనను 11 సీట్లు మాత్రమే గెలిచిన పార్టీకి నాయకుడిగా, ఒక సాధారణ ఎమ్మెల్యేగా కూర్చోబెట్టారు రాష్ట్ర ప్రజలు. కానీ చంద్రబాబునాయుడు సారథ్యంలో ఎన్డీయే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే.. ఉపాధి, ఉద్యోగాల పరంగా రాష్ట్రం శరవేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. రాబోయే అయిదేళ్ల కాలంలో 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తామనే అదిపెద్ద  హామీతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. తొలిరోజు నుంచి ఆదిశగా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అనేక ప్రాజెక్టులు సాధించుకు వస్తున్నారు. ఈ ఫలితాలు.. నాయకుల మాటల్లో మాత్రమే కాదు.. లింక్డ్ఇన్ సంస్థ నిర్వహించిన నివేదికలో కూడా స్పష్టం అవుతుండడం గొప్ప విషయం.

ఉద్యోగాల కల్పన, ఉద్యోగార్థులకు సంధానకర్తగా వ్యవహరించే విషయంలో అంతర్జాతీయంగా విశ్వసనీయత ఉన్న లింక్డ్ ఇన్ సంస్థ తొలిసారిగా ‘సిటీస్ ఆన్ ది రైజ్ 2025’ పేరుతో ఒక నివేదికను రూపొందించారు. ఉద్యోగాల కల్పనలో అసాధారణ స్థాయిలో వృద్ధి చెందుతున్న నగరాల జాబితాను ఈ నివేదికలో పొందుపరిచారు. ఇందులో విశాఖపట్టణం నగరానికి మొదటి ర్యాంకు దక్కగా, విజయవాడకు మూడో ర్యాంకు దక్కింది. వాస్తవంగా గమనించినప్పుడు లింక్డ్ ఇన్ నివేదికలో ఈస్థాయి ర్యాంకులు ఏపీలోని రెండు కీలక నగరాలకు దక్కడం అనేది.. ఉద్యోగాల కల్పన పరంగా కూటమి ప్రభుత్వం పడుతున్న శ్రమకు అతిపెద్ద కితాబు అని విశ్లేషకులు భావిస్తున్నారు.

చంద్రబాబునాయుడు కూడా లింక్డ్ ఇన్ నివేదిక పట్ల హర్షం వ్యక్తం చేశారు. ‘ఈ ర్యాంకులు రాష్ట్ర ప్రభుత్వం దూరదృష్టితో కూడిన నూతన పారిశ్రామిక విధానాల ప్రభావాన్ని ప్రతిబింబిస్తున్నాయని’ ఆయన ఎక్స్ లో పేర్కొన్నారు. టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి పెద్ద సంస్థలు విశాఖలో తమ క్యాంపస్ లు ఏర్పాటుచేయబోతున్న సంగతి అందరికీ తెలుసు. అలాగే క్వాంట్ వ్యాలీ, ఏఐ యూనివర్సిటీ వంటివి కూడా ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో దేశానికి ఐటీ హబ్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలుస్తుందని చంద్రబాబునాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇప్పుడు విశాఖ, విజయవాడ నగరాలు లింక్డ్ ఇన్ జాబితాలో మొదటి, మూడో స్థానాల్ని దక్కించుకున్నాయి. అమరావతి రాజధాని నిర్మాణ వ్యవహారం కొన్నేళ్లలో ఒక కొలిక్కి వచ్చి.. ప్రభుత్వం చెబుతున్న స్మార్ట్ పరిశ్రమలు అన్నీ వస్తే గనుక.. అమరావతి నగరం కూడా ఈ జాబితాలో చోటు సంపాదించుకుంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

బిగ్ బాస్ పేరు రాలేదు గానీ.. ఆయన వాటా లెక్క తేలింది!

దేశం మొత్తం నిర్ఘాంతపోయేలా మూడున్నర వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కాజేసిన అతిపెద్ద కుంభకోణంలో అంతిమలబ్ధిదారు అయిన బిగ్ బాస్ ఎవరు? ఈ విషయం గురించి వివిధ సందర్భాల ప్రెస్ మీట్ లలో విలేకరులు అడిగినప్పుడు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఎంత డొంకతిరుగుడుగా, నర్మగర్భంగా మాట్లాడినప్పటికీ.. ప్రజలకు మాత్రం ఆ బిగ్ బాస్ సాక్షాత్తూ జగన్మోహన్ రెడ్డే అనే ఊహ కలుగుతూ వచ్చింది. జగన్ మార్గదర్శకత్వంలోనే పార్టీకోసం భారీగా నిధులు వసూలు అయ్యేలా మద్యం పాలసీ రూపకల్పన జరిగిందని విచారణ తొలిదశలోనే రాజ్ కెసిరెడ్డి చెప్పినట్టుగా సిట్ పేర్కొంది. అయితే క్రమేమీ ఎవరెవరికి ఎంత వాటాలు దక్కాయో కూడా లెక్కతేల్చారు.

ఈ ప్రకారం.. మొత్తం 3500 కోట్లలో 90 శాతం వసూళ్లు అంతిమ లబ్ధిదారు అయిన బిగ్ బాస్ కే చేరినట్లుగా సిట్ పోలీసులు లెక్క తేల్చారు. ఈ లిక్కర్ కుంభకోణంలో పాత్రధారులు అయిన మిగిలిన నాయకులు, ఇతరులు అందరూ కలిసి పంచుకున్నది పది శాతం వసూళ్లేనని నిగ్గు తేల్చారు.
3500 కోట్లలో పది శాతం అంటే తక్కువేమీ కాదు. ఆ ప్రకారం.. ఇతర నాయకులందరూ కలిసి  వాటాగా పంచుకున్న మొత్తమే 350 కోట్ల వరకు ఉంటుంది. ఈ సొమ్మును అవినీతి దందాల సొమ్మును వసూలు చేసిన నెట్వర్క్ లో కీలకంగా ఉన్న క్యాష్ కొరియర్లు, కాష్ హ్యాండ్లర్లు అందరికీ ఇవ్వడానికి, అలాగే ఈ స్కామ్ లో భాగస్వాములైన ఇతర వైసీపీ ముఖ్య నాయకులకు నెలవారీ ముడుపులుగా అందజేయడానికి, కొందరు అధికారులకు లంచాలుగా చెల్లించినట్టు సిట్ తేల్చింది.

నిందితుల సెల్ ఫోన్ల నుంచి కీలక సమచారాన్ని వెలికి తీసిన తర్వాత.. ఈ లెక్కలన్నింటినీ సిద్ధం చేశారు. మొత్తం పాపపు సొమ్ములో 90 శాతం అంటే దాదాపుగా 2970 కోట్లు బిగ్ బాస్ కు చేరాయని అంచనాకు వచ్చారు.
డొల్ల కంపెనీలను అడ్డు పెట్టుకుని హవాలా మార్గాల్లో ఈ అవినీతి సొమ్ములో సింహభాగం విదేశాలకు తరలించినట్టు, బెంగుళూరు, హైదరాబాదుల్లో భూములపై పెట్టుబడిగా పెట్టినట్టు  సిట్ గుర్తించింది.
ఈ లెక్కలు తేల్చడంలో వెలికి వచ్చిన మరో సంగతి ఏంటంటే.. వైసీపీకి చెందిన ఇద్దరు కీలక ఎంపీలకు వసూళ్ల సొమ్మునుంచి ప్రతినెలా 5 కోట్ల వంతున చేరవేసేవారిన సిట్ గుర్తించింది. ఆ ఇద్దరు ఎంపీల్లో ఒకరు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కాగా, రెండో వ్యక్తి  విజయసాయిరెడ్డి అని ప్రజలు అనుకుంటున్నారు.

ఎంపీ విజయసాయిరెడ్డికి కొంతకాలం తర్వాత ఈ ముడుపుల వాటాలు అందజేయడం మానేశారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి చెందిన కంపెనీల్లోకి నేరుగా 5 కోట్లు డిపాజిట్ కావడంతో ఆయన పాత్ర తేటతెల్లమైంది. ఆ డబ్బును తిరిగి వెనక్కు పంపినప్పటికీ..  మిథున్ రెడ్డి ఆ సొమ్ములకు జవాబుదారీతనం వహించవలసిన చిక్కుల్లో పడ్డారు. పైగా ఆయన ముందస్తు బెయిలు పిటిషన్ కూడా ఇప్పటికే తిరస్కరణకు గురైంది.

మొత్తానికి కుంభకోణానికి సహకరిస్తున్న కీలక అధికారులకు కూడా నెలకు 50లక్షలు, 20 లక్షల వంతున వాటాలు పంచినట్టుగా తేల్చారు. ఈ రకంగా.. నాయకులు, అధికారులు అందరూ కలిసి.. 350 కోట్లరూపాయలను వాటాలుగా పంచుకున్నారు. మిగిలిన 90 శాతం అనగా సుమారు 2970 కోట్ల రూపాయలను బిగ్ బాస్ కు అందజేశారు. మరి సిట్ పోలీసులు ‘బిగ్ బాస్’ ఎవ్వరో కూడా తేల్చిన తర్వాత.. లిక్కర్ స్కామ్ కీలక మలుపు తీసుకునే అవకాశం ఉంది.