Home Blog Page 42

నిన్న థియేటర్లో…ఈరోజు ఓటీటీలో…!

ఒకప్పుడు సినిమా థియేటర్స్ లో విడుదలైన తర్వాత ఓటీటీలోకి రావడానికి కనీసం రెండు మూడు వారాల గ్యాప్ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. తాజాగా రీల్‌లో నిన్నే వచ్చిన సినిమా, రియల్‌లో ఓటీటీలోకి వచ్చేసింది. అథర్వ ప్రధాన పాత్రలో నటించిన తమిళ థ్రిల్లర్ “డీఎన్‌ఏ” తాజాగా తెలుగులో “మై బేబీ” పేరుతో విడుదలైంది. ఇది జూలై 18న థియేటర్లలోకి వచ్చిన తర్వాత తక్కువ సమయంలోనే డిజిటల్ ప్లాట్‌ఫారంలోకి వచ్చేసింది.

హాట్‌స్టార్ ఈ సినిమాని తమ ఓటీటీ ప్లాట్‌ఫారంలో విడుదల చేసింది. ఇందులో ఒరిజినల్ తమిళ్ వెర్షన్‌తో పాటు తెలుగు డబ్బింగ్‌తో కూడిన వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. అంతేకాదు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్‌కి వచ్చింది. థియేటర్‌లో చూసే ఛాన్స్ మిస్ అయినవాళ్లు ఇంట్లోనే బాగస్వామ్యంగా ఈ థ్రిల్లర్‌ని ఆస్వాదించవచ్చు.

ఇక ఈ సినిమాకు దర్శకత్వం వహించిన నెల్సన్ వెంకటేశన్ తనకు ప్రత్యేకమైన కథానాయకునిగా గుర్తింపు తెచ్చుకున్న అథర్వను ప్రధాన పాత్రలో చూపించగా, తెలుగు ప్రేక్షకుల కోసం సురేష్ కొండేటి విడుదల చేశారు. ఓ మిస్టరీ, ఎమోషన్ మేళవించిన కథనంతో కూడిన ఈ సినిమా ఇప్పుడు హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది. మీరు థ్రిల్లర్ సినిమాల అభిమానులైతే ఓసారి చూసి తీరాల్సిందే.

కట్టప్ప చంపకపోతే…!

ఇప్పటివరకు భారతీయ సినిమాలోనే అత్యంత భారీగా చర్చకి వచ్చిన ప్రశ్న ఏదైనా ఉందంటే.. అదీ “కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?” అన్నదే. ఒక్క ఈ డౌటే బాహుబలి 2 సినిమాపై అంచనాలని ఏ స్థాయికి తీసుకెళ్లిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు ఇదే కథకి మరో క్రేజీ ట్విస్ట్ జతవుతోంది.

ఈ సారి మేకర్స్ వేయిస్తున్న ప్రశ్న మరింత ఆసక్తికరంగా ఉంది. అదేంటంటే.. ‘‘కట్టప్ప బాహుబలిని చంపలేదంటే ఏం జరిగేదీ?’’ అన్నదే. ఇప్పుడు ఇదే టాపిక్ చుట్టూ కొత్తగా ప్లాన్ చేస్తున్న మరో వెర్షన్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఇప్పటికే ‘బాహుబలి ది ఎపిక్’ పేరుతో బాహుబలి కథని రెండు పార్ట్స్‌లా మళ్ళీ గ్రాండ్‌గా అక్టోబర్ చివర్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు.

ఈసారి స్టోరీ కాస్త ఫ్రెష్‌గా, కొత్త కోణంలో ఉంటుందనే ప్రచారం ఇప్పటికే మొదలైపోయింది. దీనికి సంబంధించి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ముఖ్యంగా ‘‘కట్టప్ప బాహుబలిని చంపకపోతే..’’ అనే కొత్త అంశంతో మేకర్స్ ఇప్పుడు ఊహించని మలుపు తీసుకొచ్చారు.

ఈ ప్రశ్నకి సమాధానంగా ఓ ఇంట్రెస్టింగ్ వెర్షన్‌కి మూడ్ సెట్ చేసినట్టు తెలుస్తోంది. తాజాగా ఈ డైలమాకి సమాధానం నేడు వెల్లడిస్తామని టీమ్ చెప్పడంతో.. అభిమానులు మరింత ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

బాహుబలి ఫ్రాంచైజ్‌కి ఇప్పటికీ ఫాలోయింగ్ తగ్గలేదు అనే విషయం ఈ అప్డేట్ చుట్టూ ఏర్పడిన హైప్ చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పుడు వచ్చే కొత్త వెర్షన్ ఎలాంటి ట్రీట్ అందిస్తుందో తెలుసుకోవాలంటే.. మరికొద్ది గంటల వేచి చూడాల్సిందే.

చిరు సినిమా పై మేకర్స్‌ హెచ్చరిక!

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనీల్ రావిపూడి కలిసి చేస్తున్న కొత్త చిత్రం మొదటి నుంచే మంచి ఆసక్తి రేపుతోంది. నయనతార కీలక పాత్రలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌ను షైన్ స్క్రీన్స్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది. అభిమానులు సెట్స్‌ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్‌డేట్ కోసం ఎదురు చూస్తుండటంతో చర్చలు మరింత వేగం పుంజుకున్నాయి.

ప్రస్తుతం షూటింగ్ జోరుగా సాగుతోంది. ఇంతలోనే తాజా షెడ్యూల్ సమయంలో సెట్స్‌లో తీసినట్లు భావిస్తున్న చిరంజీవి మరియు నయనతారకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అవి ఎలా బయటకు వచ్చాయో స్పష్టత లేకపోయినా, కాసేపట్లోనే విస్తృతంగా షేర్ కావడంతో యూనిట్‌కు ఇదొక తలనొప్పిగా మారింది.

ఈ అనధికారిక లీక్స్‌పై నిర్మాతలు వెంటనే స్పందించారు. షైన్ స్క్రీన్స్ అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేస్తూ సెట్స్ నుంచి బయటకు వచ్చిన దృశ్యాలను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నామని తెలిపారు. భారీగా కష్టపడి, పెద్ద మోతాదులో పెట్టుబడులతో రూపొందిస్తున్న సినిమాకి సంబంధించిన ఏదైనా కంటెంట్ ముందుగానే బయటికి రావడం ప్రేక్షకుల థియేటర్ అనుభవాన్నే కాదు, ప్రాజెక్ట్ వ్యూహాలపై కూడా ప్రభావం చూపుతుందని హెచ్చరించారు.

బ్యానర్ స్పష్టం చేసింది: ఎవరైనా షూటింగ్ స్పాట్ విజువల్స్‌ను రికార్డ్ చేయడం, షేర్ చేయడం, లేదా ఇతర ప్లాట్‌ఫార్మ్‌లలో పోస్ట్ చేయడం చట్టపరమైన సమస్యలకు దారితీస్తుంది. అనుమతి లేకుండా కంటెంట్ బయటపెడితే అవసరమైన లీగల్ చర్యలు తీసుకోవడానికి వెనుకాడమని చెప్పింది. అభిమానులు, మీడియా, మరియు సోషల్ పేజ్‌ల నిర్వాహకులు అధికారిక అప్‌డేట్స్ వచ్చే వరకు ఓపికగా ఉండాలని నిర్మాతలు విజ్ఞప్తి చేశారు.

సినిమా టీం మాత్రం తమ షెడ్యూల్‌ను ఆపకుండా కొనసాగిస్తూ ఉంది. టైటిల్ అనౌన్స్‌మెంట్, ఫస్ట్ లుక్, లేదా ఇతర కీలక వివరాలు సిద్ధమైన వెంటనే అధికారికంగా విడుదల చేస్తామని సంకేతాలు ఇస్తున్నారు. అందరూ యూనిట్ కృషిని గౌరవించి, లీక్స్ కంటే నిజమైన అప్‌డేట్స్‌ కోసం వేచి చూస్తే మంచిదని సూచించారు.

మెగాస్టార్ 157గా పిలుస్తున్న ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలోనే రాబోతున్నాయి. ఇప్పటివరకు బయటకు వచ్చినప్పటి మాటల కంటే తెరపై చూపించదలచినది చాలా పెద్దది అనే నమ్మకం యూనిట్‌లో కనిపిస్తోంది. అభిమానులు కూడా ఆ ఉత్సాహాన్ని అలాగే కొనసాగిస్తూ అధికారిక సమాచారం కోసం కళ్లప్పగిస్తున్నారు.

ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ నుంచి సాలిడ్‌ ట్రీట్‌!

పవన్ కళ్యాణ్ ఈసారి తన అభిమానులకు చక్కటి ట్రీట్ ఇవ్వనున్నాడు. చాలా కాలం తర్వాత ఒకే ఏడాదిలో రెండు సినిమాలతో స్క్రీన్‌పైకి రావడమే కాకుండా, మరో మాస్ ఎంటర్‌టైనర్‌తో సిద్ధమవుతున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న “ఉస్తాద్ భగత్ సింగ్” అనే సినిమా ప్రస్తుతం ఫుల్ స్పీడ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది.

ఇప్పటికే పవన్ నటిస్తున్న “ఓజి” సినిమా గురించి బర్త్‌డే స్పెషల్ ట్రీట్ వస్తుందన్న ఊహాగానాలు ఉన్నాయి. అదే రోజు అంటే సెప్టెంబర్ 2న “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమా నుంచి కూడా ఒక భారీ అప్‌డేట్ ఉండే అవకాశం ఉందంటూ ఫిలింనగర్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఒకేసారి రెండు ప్రాజెక్టుల నుంచి అప్‌డేట్స్ వస్తే పవన్ అభిమానులకి ఇది రెండు రెట్లు సంబరమే.

ఈ సినిమాలో సంగీతం అందిస్తున్నది దేవిశ్రీ ప్రసాద్. అటు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ మాస్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోంది. పవన్ స్టైల్ కి తగిన యాటిట్యూడ్, డైలాగ్స్‌తో రూపొందుతున్న ఈ సినిమా బర్త్‌డే స్పెషల్ ట్రీట్ ఇస్తుందా అన్నది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కానీ అందుకు రంగం సిద్ధంగా ఉన్నట్టు ఫ్యాన్స్ ఆశాభావంతో ఉన్నారు.

ఫిష్‌ వెంకట్‌ మృతి!

టాలీవుడ్ నుంచి మరో విషాద వార్త వచ్చింది. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న సినీ నటుడు ఫిష్ వెంకట్ ఇక లేరు. ఆయన మృతితో తెలుగు సినీ పరిశ్రమలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి.

ఎప్పుడూ నవ్విస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో అలరిస్తూ వచ్చిన వెంకట్, కేవలం కామెడీ పాత్రలకే పరిమితం కాకుండా కొన్ని నెగిటివ్ రోల్స్ లో కూడా మెప్పించారు. కానీ అనారోగ్యం మాత్రం ఆయనను నెమ్మదిగా కబళించింది. చాలా కాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. చికిత్స కోసం డబ్బులు, అవయవాల కొరత కూడా ఎదురైంది. చివరికి శరీరం చికిత్సకు స్పందించక నిన్న రాత్రి ఆయన తుది శ్వాస విడిచారు.

ఫిష్ వెంకట్ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంతటి చిన్న పాత్ర అయినా తన స్టైల్‌తో, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను ఆకట్టుకునే శక్తి ఆయనలో ఉండేది. అలాంటి ఓ నటుడు ఇలా ఆకస్మికంగా వెళ్లిపోవడం తెలుగు ప్రేక్షకులను కలచివేస్తోంది.

వెంకట్ మృతితో సినిమారంగం ఒక్కసారి మూగబోయింది. ఆయనతో పని చేసిన నటీనటులు, డైరెక్టర్లు శోకంలో మునిగిపోయారు. చాలా మందికి ఇప్పటికీ ఈ వార్త నమ్మశక్యంగా అనిపించడం లేదు.

భాషా 2 సీక్వెల్‌!

టాలీవుడ్‌లో బింబిసార సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న దర్శకుడు వశిష్ట మల్లిడి తాజాగా తన కెరీర్‌లో జరిగిన ఓ ఆసక్తికర పరిణామాన్ని వెల్లడించారు. మొదటి సినిమా కే మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్న వశిష్ట, ఆ తర్వాతి ప్రాజెక్ట్‌కి కూడా భారీగా ప్లాన్ చేసుకున్నాడట.

వీరి తరువాతి సినిమా ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్‌లో రూపొందేలా ఉండేదట. అదీ కాకుండా, ఇందులో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌ని హీరోగా తీసుకోవాలని ఆలోచించారట. ఇంతకీ ఆ కథ ఏమిటంటే, 1995లో వచ్చిన రజినీకి మైలురాయిగా నిలిచిన ‘భాషా’ సినిమాకు ఇది సీక్వెల్‌గా ఉండేలా ప్లాన్ చేశారట.

వశిష్ట చెప్పిన వివరాల ప్రకారం, ఈ సీక్వెల్ కథ రజినీకాంత్‌కి చెప్పగా ఆయనకు కథ బాగా నచ్చిందట. అయితే, దర్శకుడిగా తాను పూర్తిగా సంతృప్తి చెందలేదట. కథలో ఏదో తక్కువుందని అనిపించిందని, అందుకే ఆ ప్రాజెక్ట్‌ను ఆపేశామని వశిష్ట వివరించారు.

ఈ ప్రకటనతో సినిమా అభిమానుల్లో ఆసక్తి రేకెత్తుతోంది. ఎందుకంటే భాషా చిత్రం రజినీ కెరీర్‌లో ఓ ఐకానిక్ సినిమాగా నిలిచింది. అటువంటి చిత్రానికి సీక్వెల్ చేయడం అంటే చిన్న విషయమేం కాదు. అయితే కథతో పాటు భావోద్వేగాలు కూడా సమంగా కలవాలి అనే విషయాన్ని వశిష్ట ఎత్తిచూపాడు.

తన సొంత స్టాండర్డ్స్‌కు తగ్గట్టు కధని తీర్చిదిద్దలేకపోవడంతోనే ఈ ప్రాజెక్ట్‌ను వెనక్కి వేశానని చెబుతున్న వశిష్ట, భవిష్యత్తులో ఇంకొక మంచి సందర్భం దొరికితే ఇలాంటిది సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.

వీరమల్లు వీడియో వాయిదా…అభిమానులకు మరోసారి నిరాశే!

పవన్ కళ్యాణ్ నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ మూవీ ‘హరిహర వీరమల్లు’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జూలై 24న ఈ సినిమాను గ్రాండ్ రిలీజ్ చేయాలని మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఇది పూర్తిగా చారిత్రాత్మక నేపథ్యం మీద ఆధారపడిన సినిమా. ఇందులో పవన్ కళ్యాణ్ పాత్ర చాలా శక్తివంతంగా ఉండబోతోందని, ఆయన అభిమానం ఉన్న మాస్ ప్రేక్షకులకు ఇది తప్పకుండా నచ్చుతుందని చిత్ర బృందం ధీమాగా చెబుతోంది.

ఈ సినిమాపై క్రేజ్ పెంచేందుకు నిర్మాతలు ఒక స్పెషల్ వీడియోను విడుదల చేయాలనుకున్నారు. షూటింగ్ సమయంలో తీసిన మేకింగ్ ఫుటేజీని రిలీజ్ చేసే ప్లాన్ వేసినప్పటికీ, కొన్ని సాంకేతిక సమస్యల వల్ల దాన్ని వాయిదా వేశారు. ఈ వీడియోను జూలై 19న విడుదల చేస్తామని తాజా సమాచారం.

ఇక ఈ ఆలస్యం వల్ల పవన్ అభిమానులు కొంత నిరాశ చెందారు. ఈ మేకింగ్ వీడియోలో పవన్ చేసిన యాక్షన్ సీక్వెన్సులు, గ్రాండ్ విజువల్స్ ఉంటాయని వారు ఆశగా ఎదురు చూస్తున్నారు. సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా కనిపించనుండగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలకమైన విలన్ పాత్రలో నటిస్తున్నాడు.

వాస్తవానికి చాలా కాలంగా ఈ చిత్రం నిలిచిపోయి ఉండటంతో అభిమానుల్లో ఉత్కంఠ ఏర్పడింది. కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ లాక్ కావడంతో మళ్లీ హైప్ మొదలైంది. సినిమా విడుదల తేదీకి ముందే మేకింగ్ వీడియోతో ఆ హైప్‌ను మరింత పెంచేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

అన్న అంటేనే…భావోద్వేగానికి గురయ్యా!

విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’ ఈ నెల 31న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే మంచి హైప్‌ను క్రియేట్ చేస్తోంది. తాజాగా విడుదల చేసిన ‘అన్న అంటేనే..’ అనే పాట మరింత ఎమోషనల్ కనెక్ట్‌ను తీసుకొచ్చింది. అన్నదమ్ముల బంధం చుట్టూ సాగిన ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ఈ పాటతో విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ ఎంతో భావోద్వేగానికి లోనయ్యాడు. తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు వచ్చాయని, అన్న విజయ్ తనకు ఎప్పుడూ మద్దతుగా ఉండేవాడని, తన మీద అతని నమ్మకం ఎంతో గొప్పదని ఆనంద్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌లో పంచుకున్నాడు. ఆ పోస్టులో చిన్నప్పుడు ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలను కూడా షేర్ చేశాడు.

ఇక ఈ సినిమాను గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్నాడు. భాగ్యశ్రీ బొర్సే ఈ సినిమాలో విజయ్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చున్ ఫోర్ సినిమాస్ కలిసి ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నాయి. ‘కింగ్డమ్’ యాక్షన్‌తో పాటు ఎమోషనల్ కనెక్ట్ కలిగిన కథతో ప్రేక్షకులను బాగా ఎంగేజ్ చేస్తుందని మూవీ యూనిట్ విశ్వాసంగా ఉంది.

Bandi Sanjay- Etela `cold war’ surfaced In Shamirpet, Exposes BJP Group Rivalries

The fight between the factions of Union Minister of State for Home Bandi Sanjay Kumar and Malkajgiri MP Etela Rajender has now come to light. The political class war that started in Huzurabad constituency has reached Shamirpet.

A large number of Etela followers from Huzurabad on Sunday reached his house in Shamirpet and deplored insults they are meeting in BJP, pointing their fingers towards Sanjay Kumar.

Speaking in Huzurabad constituency, two days ago Bandi Sanjay Kumar indirectly referring to Rajender, alleged that some people worked to get less votes for him in the last parliamentary elections, and he questioned whether such people should be given tickets in the local body elections? He made it clear that such people have no place in the party, and if anyone wants to create factionalism, it would be their stupidity.

He made it clear that we will support and support only those who have worked for the party and will provide funds. Indicating that Etela’s followers have no place in the party, he warned that some people are trying to encourage the factions by drawing a line and such things should not be tolerated from now on.

Sanjay Kumar’s comments created a big uproar among Etala’s supporters. His close associate Gautam Reddy resigned from the party. Etala Rajender’s supporters have been unhappy for some time. Particularly, they were unhappy after Rajender was pushed aside in state BJP chief selection. At this stage, Bandi Sanjay’s comments added fuel to the discontent of Rajender’s supporters.

Bandi Sanjay has reportedly been cultivating a grudge against Etela for a long time suspecting that he played a key role in removing him as state BJP chief a few years ago. As a result, he has tried his best to prevent him from becoming state party chief this time.

As a result, Etela’s supporters met him at his residence asking about their political future. They deplored that they have been with Etela for about 20 years, but they are not given priority in the BJP and deprived of any positions. Etela, assuring them that he would stand by them, called on leaders and activists to thwart the conspiracies being hatched against them. He said that many conspiracies have also been hatched on social media platforms.

He reminded that before he came to Huzurabad constituency, there was no BJP cadre, but after he came, BJP cadre came. He said that after he came, a majority of 50,000 came in the Karimnagar Parliament elections. He said that BJP got a lot of votes in the Huzurabad segment. He said that even though some leaders sold out in the 2021 by-elections, the people of Huzurabad made him win.

Sai Durgha Tej Collaborates with Director Vamsi For Upcoming Film

After a short sabbatical from the silver screen, actor Sai Durgha Tej is ready to make a strong return. With his stirring performance in Virupaksha, which became a blockbuster, and his captivating role in Bro, Tej had taken a brief break to pick his next scripts with great caution. Now, he’s returning with full force through his upcoming film Sambarala Yeti Gattu.

Directed by Rohith KP, this new project is being produced by the successful duo K. Niranjan Reddy and Chaitanya Reddy under the banner of Hanuman fame. Billed as a high-octane action entertainer, the movie promises a new avatar of Sai Durgha Tej. The actor has completely changed for the role, and his new, rugged appearance is already a discussion point among the fans and on social media.

Meanwhile, Sai Durgha Tej appears to be adding more films to his slate. Sources in the industry confirm that he’s approved another high-profile project under the People Media Factory banner. This is said to be directed by Vamasi Krishna Naidu, who was last seen with Tiger Nageswara Rao, in which Ravi Teja starred.

Though Tiger Nageswara Rao failed in the commercial aspect, the Tej-Vamasi Krishna Naidu collaboration news has got everyone talking online. While some netizens are uncertain about the combination, others feel this might prove to be a new chance for both the actor and director to reinvent their careers with a gripping, story-based movie.

As Sai Durgha Tej returns to center stage, his decisions self-evidently indicate a considered and tactical mind. By uniting mass popularity with substantial material, the actor seems set to ensure a robust second innings. His audience, not to mention trade observers, is holding its breath for what these strong and thrilling new developments have in store.