Home Blog Page 39

జూనియర్ కి ఏమాత్రం తగ్గని క్రేజ్‌!

టాలీవుడ్‌లో ఇటీవల విడుదలైన ‘జూనియర్’ సినిమా ఇప్పటివరకు మంచి స్పందనను అందుకుంటోంది. కిరీటీ అనే కొత్త హీరోతో వచ్చిన ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా మెరిసింది. వీరిద్దరి కాంబినేషన్‌కు తోడు సినిమాలోని పాటలు, టీజర్లు ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచాయి.

ఈ సినిమాకు రాధాకృష్ణ రెడ్డి దర్శకత్వం వహించగా, జూలై 18న థియేటర్లలో విడుదలైంది. రిలీజ్ అయిన మొదటి రోజే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చేసింది. ముఖ్యంగా కిరీటీ చేసిన యాక్షన్ సీన్స్, డాన్స్ మూవ్స్ గురించి చర్చ జరుగుతోంది.

ఇక ఈ సినిమాతో జెనీలియా టాలీవుడ్‌కి మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. ఆమె చేసిన పాత్ర స్ట్రాంగ్‌గా ఉండటంతో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. మొదటి వీకెండ్‌కి బుక్ మై షోలో వేల కొద్దీ టికెట్లు బుక్కవడం సినిమాపై ఉన్న క్రేజ్‌ను చూపిస్తోంది.

ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారం, ‘జూనియర్’ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాకి మరింత హైప్ తీసుకొచ్చింది. మొత్తంగా చెప్పాలంటే, కొత్త హీరో కిరీటీకి ఇది మంచి డెబ్యూట్ అయ్యిందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

వారమంతా వీరమల్లుదే!

జూలై 24న పవన్ కళ్యాణ్ నటించిన హిస్టారికల్ డ్రామా హరిహర వీరమల్లు థియేటర్లలోకి రావడంతో ప్రేక్షకుల దృష్టి అంతా ఈ సినిమాపైనే నిలిచింది. ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టించబోతుందో అనే ఉత్కంఠ అభిమానుల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

ఇక ఈ సినిమాను బాక్సాఫీస్ వద్ద ఎదుర్కొనే పోటీ దాదాపుగా లేదు. ఇప్పటికే ఇతర సినిమాలు తమ రిలీజ్ డేట్స్‌ను మార్చుకోవడంతో వీరమల్లు ఏకైక చిత్రంగా ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పెద్ద సినిమాలు లేవు, చిన్న సినిమాలు వెనక్కి తగ్గాయి. దీనివల్ల హరిహర వీరమల్లు సినిమా కు థియేటర్ల విషయంలో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా కోసం దాదాపు 90 శాతం థియేటర్లను బుక్ చేసినట్టు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎదురుచూపుల్ని చూస్తే ఈ సినిమా ఓపెనింగ్స్ భారీగా ఉండే అవకాశముంది.

అయితే తొలి రోజు కలెక్షన్లు, మౌత్ టాక్ ఎలా ఉండబోతున్నాయో అన్నదే ఇప్పుడు ముఖ్యమైన పాయింట్. సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే వారాంతం మొత్తం బాక్సాఫీస్‌ను హరిహర వీరమల్లు దున్నేయడం ఖాయం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు నిధి అగర్వాల్, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించగా, క్రిష్ మరియు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. నిర్మాతగా ఏఎం రత్నం వ్యవహరించారు.

ఈ సెటప్ అంతా చూస్తే హరిహర వీరమల్లు సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలా దూసుకెళ్తుందో చూడాల్సిందే.

వార్‌ 2 లో ఎన్టీఆర్‌ …ఆ అరగంట మాత్రమే!

మాస్ హీరో ఎన్టీఆర్ నటిస్తున్న బాలీవుడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వార్ 2 పైన ఇండియా మొత్తంలో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. యష్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ బిగ్ బడ్జెట్ మూవీలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నారు. ఇది ఎన్టీఆర్‌కు బాలీవుడ్‌లో చేస్తున్న ఫస్ట్ డైరెక్ట్ మూవీ కావడంతో సౌత్ ఫ్యాన్స్‌తో పాటు నార్త్ ఆడియన్స్‌లో కూడా ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది.

ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్‌లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ లుక్, యాక్షన్ మోమెంట్స్ చూసినవాళ్లు మరింత క్యూరియాసిటీతో సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా, సోషల్ మీడియాలో ఎన్టీఆర్ పాత్ర సినిమాలో పెద్దగా కనిపించదని కొన్ని రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి.

ఈ విషయంలో ఓ క్లారిటీ ఇచ్చాడు ప్రముఖ నిర్మాత నాగవంశీ. ఆయన చెప్పిన వివరాల ప్రకారం, ఎన్టీఆర్ పాత్ర సినిమాలో కేవలం 10 లేదా 15 నిమిషాలు మాత్రమే కనిపించదనేది తప్పుడు ప్రచారం. అసలు విషయమేంటంటే, ఎన్టీఆర్ దాదాపు 30 నిమిషాలకు పైగా స్క్రీన్ మీద కనిపించబోతున్నాడని ఆయన స్పష్టం చేశారు. ఇది వినగానే అభిమానుల్లో మళ్లీ నమ్మకంతో పాటు ఎగ్జైట్‌మెంట్ కూడా పెరిగింది.

చిత్ర యూనిట్ మాటల ప్రకారం, ఎన్టీఆర్ యాక్షన్, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను ఆశ్చర్యపరచడం ఖాయం. ఈ సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ ప్రేక్షకులను కూడా సొంతం చేసుకుంటాడని భావిస్తున్నారు. కియారా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుండగా, వార్ 2ను ఆగస్టు 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.

కాంతార చాప్టర్‌ 1 మేకింగ్‌ వీడియోతో ముగింపు!

కన్నడలో రూపొందిన ‘కాంతార’ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. హీరోగా, డైరెక్టర్‌గా రిషబ్ శెట్టి పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. యాక్షన్ థ్రిల్లర్‌ కథ, డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా హిట్ అయి, జాతీయ అవార్డు కూడా కొట్టేసింది.

ఇప్పుడు అదే ఫ్రాంచైజీకి ప్రీక్వెల్‌గా ‘కాంతార: అ లెజెండ్ చాప్టర్ 1’ తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ ఫుల్ స్పీడుతో జరిగిపోగా, ఇప్పుడు మేకర్స్ ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు – ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని అధికారికంగా ప్రకటించారు!

తాజాగా రిలీజ్ చేసిన మేకింగ్ వీడియోలో కాంతార ప్రపంచం ఎలా ఉండబోతుందో రిషబ్ శెట్టి క్లారిటీగా చూపించారు. కేవలం సినిమా కాదు.. తమ చరిత్రని చూపించేందుకు తాను ఎంత కష్టపడ్డానో ఈ వీడియోలో కనిపిస్తుంది. భారీ సెట్స్‌, స్టన్నింగ్ విజువల్స్‌, స్ట్రాంగ్ క్యాస్టింగ్ అన్నీ కనిపించాయి.

ఈ సినిమా హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర మళ్లీ ఓ సెన్సేషన్ ఖాయంగా కనిపిస్తోంది. అక్టోబర్ 2న వరల్డ్‌వైడ్ రిలీజ్ చేయబోతున్నారు.

మరోసారి లవ్‌ మాస్టర్‌ గా శేఖర్‌ కమ్ముల!

ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల తాజాగా తీసిన “కుబేర” చిత్రం మంచి విజయం సాధించింది. నాగార్జున, ధనుష్, రష్మిక ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా కథ, నటన, సంగీతం అన్నీ కలిసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. విడుదలైన కొన్ని రోజుల్లోనే ఇది ₹100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ అభిమానులకూ అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇది స్ట్రీమింగ్ అవుతోంది.

ఇక ఈ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల తన తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టాడు. న్యాచురల్ స్టార్ నాని‌తో కలిసి ఓ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. నానీ కూడా ఈ ప్రాజెక్ట్‌కి ఆసక్తి చూపించినట్టు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అయితే నానికి ఉన్న ప్రాజెక్టుల లైనప్ కారణంగా ఇది తక్షణమే ప్రారంభం కావడం కష్టం అని తెలుస్తోంది.

ఈ గ్యాప్‌లో శేఖర్ కమ్ముల మరో కొత్త కథపై పని మొదలు పెట్టాడట. ఇది ఓ ప్రేమకథగా ఉండే అవకాశం ఉంది. ఇందులో కొత్త నటీనటులను పరిచయం చేసే ఆలోచనలో ఉన్నారని ఫిల్మ్ వర్గాల్లో సమాచారం. అంతేకాక, నాని సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులను కూడా పక్కా ప్లాన్‌తో కొనసాగించాలని చూస్తున్నాడట.

ఇక ఈ కథనాల్లో నిజమెంతనేది తెలుసుకోవాలంటే శేఖర్ కమ్ముల అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే.

రాజా సాబ్‌ కోసం ఆ ఓటీటీ సంస్థ 100 కోట్ల డీల్‌!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రాల్లో “ది రాజా సాబ్” అనే సినిమా పై సినీ ప్రపంచంలో మంచి హైప్ ఏర్పడింది. ఈ సినిమాను మారుతీ తెరకెక్కిస్తుండగా, ఇది హారర్, రొమాన్స్, ఫన్ ఎలిమెంట్స్ మిక్స్ అయిన ఎంటర్టైనర్‌గా రాబోతోందని టీజర్ చూస్తే అర్థమవుతోంది.

ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడగా, తాజాగా ఓటీటీ డీల్స్ విషయంలో ఈ సినిమా మీద భారీ ఆసక్తి కనిపిస్తోంది. లేటెస్ట్ టాక్ ప్రకారం, ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాకు గట్టి ఆఫర్ ఇచ్చిందట. ఒక్క హిందీ వెర్షన్ హక్కులకే 100 కోట్లకు పైగా ఇవ్వాలని వారు భావిస్తున్నట్టు ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.

ఒకే భాష కోసం ఇంత పెద్ద ఆఫర్ రావడం చూస్తే, ఈ సినిమా మీద ఎంతటి క్రేజ్ ఉందో అర్థమవుతుంది. అయితే ఈ డీల్ ఎంతవరకు నిజమో అధికారికంగా తెలియాల్సి ఉంది.

ఇక సినిమాకు థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తయితే, డిసెంబర్ 5న థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేసే ప్లాన్ ఉన్నట్టు సమాచారం.

కింగ్డమ్‌ ట్రైలర్‌ ఎప్పుడంటే!

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా తెరకెక్కుతున్న భారీ చిత్రం “కింగ్డమ్” గురించి సినీ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ సినిమాను గౌతమ్ తిన్ననూరి రూపొందిస్తుండగా, ఇప్పటివరకు వచ్చిన గ్లింప్స్, పోస్టర్లతో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది.

ఇప్పటికే షూటింగ్ దాదాపుగా పూర్తయ్యేసరికి, ప్రమోషన్స్ వేగం అందుకోవాల్సిన తరుణంలో ట్రైలర్ రిలీజ్‌పై క్లారిటీ రాలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం ట్రైలర్‌ను జూలై 25న విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.  అధికారిక ప్రకటన రాకపోయినా, ఫ్యాన్స్‌లో ఇప్పటికే దీనిపై మంచి హైప్ నెలకొంది. ట్రైలర్ ద్వారా విజయ్ దేవరకొండ మరోసారి మాస్ అవతారంలో ఎలా కనిపించబోతున్నాడో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాకు సంగీతం అనిరుద్ రవిచందర్ అందించగా, ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత బలాన్నిచ్చే అవకాశం ఉంది. నిర్మాణ బాధ్యతలు సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు కలిసి చేపట్టిన ఈ సినిమా, విజువల్స్ పరంగా కూడా టెక్నికల్‌గా రిచ్‌గా ఉండేలా ప్లాన్ చేసినట్లు సమాచారం.

విజయ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న “కింగ్డమ్” సినిమా ప్రమోషన్లకు ఈ ట్రైలర్ ఒక మెయిన్ టర్నింగ్ పాయింట్ అవుతుందనడంలో సందేహం లేదు. ఒకవేళ ట్రైలర్ 25న విడుదలైతే, ఆ రోజు అభిమానులకు పక్కా ఫెస్టివల్ మూడ్ ఏర్పడటం ఖాయం.

CM Chandrababu Released Green Hydrogen Valley Amaravati Declaration

Chief Minister Nara Chandrababu Naidu released the Green Hydrogen Valley Amaravati Declaration on Monday. The declaration announced the necessary actions to transform AP into a Green Hydrogen Valley by 2030. The state government announced this declaration based on the issues discussed in the two-day Green Hydrogen Summit held recently in Amaravati.

600 representatives and industry experts participated in the summit held in Amaravati. CEOs, COOs and MDs of green hydrogen companies participated in this summit, which was held in 7 sessions. Discussions were held on experiments, technology and investments related to green hydrogen production.

This declaration was announced to formulate procedures for the production of clean fuels and green hydrogen manufacturing in India. The coalition government led by Chandrababu Naidu has aimed to create favorable conditions for the production of green hydrogen in the state. The declaration decided to develop it as a green energy corridor.

The main purpose of the declaration is to establish the largest ecosystem in the country for the production of green hydrogen in the state. The target is to manufacture 2 gigawatts of electrolyzers by 2027 and 5 gigawatts by 2029. The action plan is to produce 1.5 million metric tons of green hydrogen per year by 2029 and reduce the price of a kilo of hydrogen gas from Rs. 460 to Rs. 160.

It is planned to set up infrastructure for the distribution of 25 gigawatts of renewable energy by 2029. CM Chandrababu Naidu announced that the government will spend Rs. 500 crore for research in the field of green hydrogen. The declaration also stated that 50 startups that take the lead in this field will be encouraged.

Industry sources believe that through this declaration, Andhra Pradesh has the opportunity to gain special recognition on the global green energy map. Analysts believe that this is a strong step to position AP as a model state that will lead to green hydrogen manufacturing across the country.

Ram Charan Celebrates Upasana’s Birthday with Heartwarming Family Moment

Global Star Ram Charan, currently filming the high-profile project Peddi, took time off to celebrate a special occasion at home. Marking the birthday of his wife Upasana Konidela, Charan organized an intimate celebration with elegant decorations.

He shared a picture on social media featuring Upasana, himself, and their daughter Klin Kaara. The candid family moment, showcasing joy and togetherness, has quickly gone viral and is being hailed by fans as the “Pic of the Day.”

Supreme Court Seeks CBI’s Opinion on Further Probe In Viveka Murder Case

The Supreme Court has asked the Central Bureau of Investigation (CBI) for clarity on whether further investigation in the Y.S. Vivekananda Reddy murder case, a high-profile case, is still necessary or not. This was directed in a recent hearing of two main petitions—a one by Sunitha Reddy, daughter of the victim, seeking justice for her father and another by the CBI, requesting cancellation of the bail extended to YSRCP MP Avinash Reddy, one of the accused.

While hearing the case, the Supreme Court raised three significant questions before the CBI: Does the agency think a further investigation is needed? What is its opinion regarding the closure report filed by the Andhra Pradesh government in the Kadapa Sessions Court? And, can the trial going on and any possible probe in the future be conducted at the same time?

Though the court has postponed the issue, it still hasn’t announced a date for the next hearing. Interestingly, the Supreme Court had previously fixed a date for the completion of the investigation. Following that timeframe lapsed, the trial and investigation both were put on hold. In the meantime, some of the accused persons were released on bail, prompting fears that witnesses in the matter could be swayed.

With the CBI now set to file its position, everyone waits with bated breath for what happens next—whether it will urge an opening of a new phase of investigation, how it plans to proceed with the trial, and its take on the closure report. The Supreme Court’s forthcoming rulings could be critical in determining the course and fate of this politically charged and closely observed case.