Home Blog Page 35

Latest Update on Chiranjeevi’s ‘Viswambhara’ Release Date

Megastar Chiranjeevi’s upcoming film Viswambhara continues to generate buzz among fans, despite facing delays in production. Directed by Vassishta Mallidi, the film is a large-scale socio-fantasy drama being made with a massive budget under the UV Creations banner. However, the extended production timeline has led to growing impatience among fans, who are eager to see Chiranjeevi back on the big screen.

According to industry sources, the makers have now zeroed in on September 18 as the potential release date, aiming to capitalise on the Dussehra festive season. With Pawan Kalyan’s OG scheduled to release on September 25, the team reportedly believes that a one-week window will allow Viswambhara to maximise its box-office run.

The film features actress Trisha as the female lead, marking her reunion with Chiranjeevi, while M.M. Keeravani is composing the music. An official announcement regarding the release date is awaited.

Ajith Expresses Interest in Acting in Fast & Furious-Style Films

 Tamil actor Ajith Kumar, known for his versatile talents as both a professional racer and shooter, has expressed a strong desire to act in international-style racing action films similar to Fast & Furious. While his Tamil films consistently find an audience in the Telugu market as well, Ajith’s latest remarks during a conversation with his racing team have sparked interest online.

In a recent interaction, an anchor referenced Brad Pitt’s upcoming film F1: The Movie and asked if Ajith could be seen in a project like the 24H Series. Responding to the query, Ajith said, “I’ve always wanted to act in films like Fast & Furious or F1-themed sequels. I usually perform all my racing sequences and stunts myself. If the opportunity arises, I would definitely take it up.” A video clip of this response is now going viral on social media platforms.

Though Hollywood has produced several successful films based on racing themes, such attempts in Indian cinema have largely struggled to gain traction. However, Ajith’s real-life experience as a racer and his commitment to performing bike stunts without a double could offer filmmakers a unique opportunity to create an authentic racing film in the Indian context.

ఓజీ చూసిన పవన్‌!

పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతకాలంగా ఎదురు చూస్తున్నారో తెలిసిన విషయమే. చాలా గ్యాప్ తర్వాత ఆయన పూర్తి స్థాయిలో నటించిన స్ట్రెయిట్ తెలుగు సినిమా హరిహర వీరమల్లు ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమాపై మొదటి నుండి భారీ అంచనాలే నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విషయానికొస్తే, చివరి నిమిషంలో పవన్ స్వయంగా కొన్ని మార్పులు సూచించి ట్రైలర్‌ను ఆయన మార్క్ లోకి తీసుకెళ్లినట్టు సమాచారం.

ఇక ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ మరో ప్యాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ ‘ఓజి’ కోసం రెడీ అవుతున్నారు. దర్శకుడు సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే పవన్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తిగా పూర్తి చేసినట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఫస్ట్ హాఫ్‌ను పవన్ చూశారని, దానిలో కొన్ని సీన్లపై సలహాలు కూడా ఇచ్చినట్టు టాక్ వినిపిస్తుంది. ఈ మార్పులతో ఫస్ట్ హాఫ్ పై పవన్ సంతృప్తిగా ఉన్నట్టు అనిపిస్తోంది.

ఇక సంగీతం విషయంలో కూడా మంచి అంచనాలే ఉన్నాయి. థమన్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. సౌండ్ ట్రాక్ కూడా సినిమాలో ఓ బలమైన హైలైట్ గా నిలవబోతుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. డివివి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తుంది. మొత్తంగా చూసుకుంటే పవన్ ఫ్యాన్స్ కి వరుసగా రెండు సినిమాలు ఒకే సమయం లో అప్డేట్స్ తో వస్తుండటంతో ఈ మధ్యే ఫుల్ ఫెస్టివల్ మూడ్ లో ఉన్నారు.

చిరు పాటనే రీమిక్స్‌!

మెగాస్టార్ చిరంజీవి, త్రిషల కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న భారీ సినిమా విశ్వంభర మీద అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దర్శకుడు వశిష్ఠ ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారనే టాక్ ఇప్పటికే ఫ్యాన్స్ లోకి వెళ్లిపోయింది. షూటింగ్ నుంచి రిలీజ్ వరకు అన్ని విషయాల్లో ఈ సినిమా హైప్ పెంచుకుంటూ వస్తోంది.

ఇప్పుడు ఈ సినిమాతో సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ బజ్ ఫిల్మ్ నగర్ లో హల్‌చల్ చేస్తోంది. బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ మౌని రాయ్ ఈ సినిమాకో ప్రత్యేక పాటలో స్టెప్పులు వేయనుందని టాక్. ఇది కేవలం స్పెషల్ సాంగ్ మాత్రమే కాకుండా ఓ పాపులర్ పాట రీమిక్స్ అని కూడా చెబుతున్నారు.

మెగాస్టార్ గత హిట్ మూవీ అన్నయ్య లో వచ్చిన “ఆట కావాలా పాట కావాలా” అనే మాస్ సాంగ్‌ను ఈ సినిమా కోసం రీడిజైన్ చేస్తున్నారని వినిపిస్తోంది. అదే పాటను మౌని రాయ్ స్టెప్పులతో మరింత స్టైలిష్‌గా చూపించేందుకు ప్లాన్ చేస్తున్నారట.

ఇక ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే అధికారిక అప్డేట్ కోసం వేచి చూడాల్సిందే. కానీ ప్రస్తుతం ఈ బజ్ మాత్రం అభిమానుల్లో మరో స్థాయిలో ఉత్కంఠను రేపుతోంది. విశ్వంభర ఇప్పటికే భారీ లెవెల్లో తెరకెక్కుతుండగా, ఇప్పుడు ఈ రీమిక్స్ సాంగ్ టాక్ కూడా సినిమాపై క్రేజ్‌ను మరింత పెంచేలా మారుతోంది.

కాజల్..సాయిపల్లవి..రామాయణ ..!

ఇండియన్ సినిమాల్లో లేటెస్ట్‌గా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఎపిక్ ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే అది బాలీవుడ్‌లో రాబోతున్న భారీ చిత్రం రామాయణే అనే చెప్పాలి. అగ్ర నిర్మాతలు నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. ముఖ్యంగా ఈ సినిమా కోసం సెలెక్ట్ చేసిన తారాగణం గురించి ఇప్పుడే పెద్ద చర్చ జరుగుతోంది.

రామ్ పాత్రలో రణబీర్ కపూర్ నటిస్తుండగా, రావణుడిగా యష్ పాత్ర కోసం సిద్ధమవుతున్నారు. సీత పాత్రకు సాయి పల్లవిని తీసుకోవడం కూడా ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది. ఇప్పుడు ఇదంతా ఓ పక్క అయితే, మరోవైపు ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కూడా నటించనుందని సమాచారం బయటకు వచ్చింది.

ఇంతవరకూ కాజల్ పాత్రపై క్లారిటీ రాలేదుగానీ, ఆమె రావణుని భార్యగా కనిపించనున్నట్టు టాక్ ఉంది. ఈ రూమర్ వెలుగులోకి వచ్చిన తరువాత సాయి పల్లవి – కాజల్ మధ్య పాత్రల పోలికలపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ముందుగా సాయి పల్లవి ఎంపికపై ఎలాంటి కామెంట్స్ రాలేదు కానీ కాజల్ పేరు బయటకు వచ్చిన దగ్గర నుంచి ‘ఎందుకు ఆమె కాదు, ఈమెనే ఎందుకు’ అనే డిస్కషన్లు మొదలయ్యాయి.

ఇప్పుడు ఈ ఇద్దరు నటి పాత్రలు స్క్రీన్ మీద ఎలా ఉంటాయో చూడాలంటే సినిమా రిలీజ్‌ వరకు ఆగాల్సిందే. కానీ ఇప్పటి వరకు బయటకు వచ్చిన లుక్‌లు, కాస్టింగ్ డిటైల్స్ బట్టి చూసుకుంటే ఈ రామాయణ వెర్షన్ సినీ ప్రేమికులకు మరిచిపోలేని అనుభూతిని ఇచ్చేలా ఉంది.

వార్‌ 2 తెలుగు హక్కులు ఎవరు సొంతం చేసుకున్నారంటే..!

ఇప్పుడు బాలీవుడ్‌లో హృతిక్ రోషన్, టాలీవుడ్‌లో ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ “వార్ 2″పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మల్టీస్టారర్ సినిమాపై నార్త్ నుండి సౌత్ వరకు అభిమానుల్లో ఓ రేంజ్ లో హైప్ ఏర్పడింది. మాస్‌, యాక్షన్ సినిమాల అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ఎవరు రిలీజ్ చేయబోతున్నారు అనే విషయమై చర్చలు కొనసాగుతున్న వేళ, ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది. ఎన్టీఆర్‌కు క్లోజ్ ప్రొడ్యూసర్‌గా గుర్తింపు పొందిన సూర్యదేవర నాగవంశీ వార్ 2 తెలుగు హక్కులను సొంతం చేసుకున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అరవింద సమేత, దేవర లాంటి సినిమాలతో తారక్‌తో మంచి బాండ్ ఏర్పరచుకున్న నాగవంశీ, ఇప్పుడు వార్ 2 సినిమాను కూడా భారీగా తెలుగు ఆడియెన్స్‌కి అందించేందుకు రెడీ అవుతున్నారు.

ఈ అప్‌డేట్‌ను ఓ క్రేజీ వీడియో ద్వారా నాగవంశీ పబ్లిక్‌కి షేర్ చేయగా, అది సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. తారక్ అభిమానులు కూడా ఈ వార్తను చూసి తెగ సంబరపడిపోతున్నారు. ఇక సినిమా విషయానికి వస్తే, ఇప్పటికే షూటింగ్ దాదాపుగా పూర్తయినట్టు సమాచారం. అన్ని అంచనాల ప్రకారం ఈ సినిమా వచ్చే ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

మొత్తంగా చూసుకుంటే, ఈసారి బాలీవుడ్ హీరోతో కలిసిన తారక్ మరోసారి పాన్ ఇండియా స్థాయిలో దూసుకెళ్లనున్నాడు. నాగవంశీ తీసుకున్న ఈ కీలక నిర్ణయం వలన వార్ 2 తెలుగులో కూడా భారీ స్థాయిలో బిజినెస్ చేయబోతుందని ఇండస్ట్రీలో టాక్.

మరో క్రేజీ ఆఫర్‌ పట్టేసిన పూజా!

టాలీవుడ్‌లో ఓ టైంకి వరుస విజయాలతో స్టార్ హీరోయిన్ల లిస్టులో నిలిచిన పూజా హెగ్డే, కొంత గ్యాప్ తర్వాత మళ్లీ తన సినిమాలతో రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ మధ్యకాలంలో తెలుగు కంటే ఎక్కువగా తమిళ్ సినిమాలపై ఫోకస్ పెంచిన ఆమె, రీసెంట్‌గా సూర్య హీరోగా నటించిన “రెట్రో” సినిమాతో తెరపై కనిపించింది.

ఇక ప్రస్తుతం ఆమె తమిళ్ లోనే మరో రెండు ప్రాజెక్ట్స్ “కూలీ” మరియు “జన నాయగన్” లో కూడా నటిస్తోంది. ఈ రెండు సినిమాలూ మంచి క్రేజ్ ను తెచ్చుకున్న ప్రాజెక్ట్స్ కావడంతో, పూజా కెరీర్ మళ్లీ జోరందుకుంటుందని చెప్పొచ్చు.

ఇదిలా ఉంటే, తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. పూజా హెగ్డే త్వరలోనే నటుడు ధనుష్ తో జతకట్టబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇటీవలే “కుబేర” సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన ధనుష్, ఒక హిందీ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేశాడు. ఇప్పుడు తన తదుపరి చిత్రానికి ప్లానింగ్ చేస్తున్న సమయంలో పూజాను హీరోయిన్ గా తీసుకోవాలని టీం ప్లాన్ చేస్తోందన్న గాసిప్ బలంగా వినిపిస్తోంది.

ఇప్పటికి ఇంకా అధికారిక కన్ఫర్మేషన్ రావల్సి ఉన్నా, ఈ కాంబినేషన్ పై ప్రేక్షకుల్లో ఓ రేంజ్ లో ఇంట్రెస్ట్ ఏర్పడుతోంది. పూజా హెగ్డేకి ఇది మళ్ళీ మంచి టర్నింగ్ పాయింట్ కావచ్చన్న టాక్ కూడా వినిపిస్తోంది.

పాన్ వరల్డ్ అదిరిపోయే గ్లింప్స్‌ పై సాలిడ్‌ అప్డేట్‌!

ఇప్పటివరకు మన ఇండియన్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో హిట్ అవుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం అంతకు మించి, పాన్ వరల్డ్ స్థాయిలో పేరు తెచ్చుకునేలా రూపొందుతోన్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఒకటుంది. అదే సూపర్ స్టార్ మహేష్ బాబు – ఎస్ ఎస్ రాజమౌళి కలయికలో రూపొందుతున్న భారీ చిత్రం. ఎన్నో సంవత్సరాలుగా మహేష్ బాబు అభిమానులు ఎదురు చూస్తున్న కాంబో ఇది. ఇద్దరూ టాలెంటుతో పాటు వేరే స్థాయిలో ఫాలోయింగ్ కలవారు దీంతో ఆ కారణంగా ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి.

ఈ ప్రాజెక్ట్‌ను మేకర్స్ ఓ ఇంటర్నేషనల్ లెవెల్ సినిమాగా తీర్చిదిద్దేందుకు పెద్ద మొత్తంలో బడ్జెట్ కేటాయించి, అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. అందులో భాగంగా ఓ గ్లింప్స్ ని కూడా రూపొందిస్తున్నారని సమాచారం. ఆ గ్లింప్స్ విడుదలైతే మాత్రం సినిమా రేంజ్ ఇంకెక్కడికో వెళ్లిపోతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మహేష్ బాబు లాంటి స్టార్ కి, రాజమౌళి లాంటి మాస్టర్ డైరెక్టర్ తోడైతే అది అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఈ గ్లింప్స్ ఆగస్ట్ 9న, అంటే మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయని ఫిలింనగర్ లో జోరుగా చర్చ సాగుతుంది. ఇది నిజమైతే మాత్రం మహేష్ అభిమానులకు ఇది ఒక మైలురాయి కానుక అవుతుంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. కానీ ఇప్పటినుంచే ఈ అప్‌డేట్ పై అభిమానుల్లో హైప్ మొదలైపోయింది.

ఇవన్నీ చూస్తుంటే ఈ సినిమా కథే కాదు, ప్రతి చిన్న విషయమూ ఇంటర్నేషనల్ ఆడియెన్స్‌ని టార్గెట్ చేసినట్టే కనిపిస్తోంది. మరి ఎంతటి ప్రభావం చూపుతుందో చూడాలి.

మరోసారి వాయిదా పడ్డ అనుష్క మూవీ!

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఘాటీ గురించి కొత్త అప్డేట్ బయటకి వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించి ఎన్నాళ్లుగానో వెయిట్ చేస్తున్న అభిమానులకు మాత్రం కొద్దిగా నిరాశే ఎదురైంది. ఎందుకంటే ఈ మూవీ జూలై 11న థియేటర్లలోకి రావాల్సి ఉండగా మళ్లీ వాయిదా పడింది.

ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా స్పష్టం చేసింది. ఒక ప్రకటన ద్వారా ఈ సినిమా తమకు కేవలం సినిమా కాదని, భావోద్వేగంగా ముడిపడిన ప్రాజెక్ట్‌గా భావిస్తున్నామని చెప్పారు. అందుకే ప్రతి సన్నివేశాన్ని, ప్రతి ఫ్రేమ్‌ను ఎంతో కేర్‌ఫుల్‌గా డిజైన్ చేస్తుండటంతో కొంత టైం తీసుకుంటోందని తెలియజేశారు.

ఇక వాయిదాకు ప్రధాన కారణం మాత్రం విజువల్ ఎఫెక్ట్స్ పనులు ఇంకా పూర్తవకపోవడమే అని తెలుస్తోంది. ఈ పనులు పూర్తయ్యాకే రిలీజ్ డేట్ ప్రకటిస్తామంటూ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. దీంతో అభిమానులు ఇంకా కొద్దిరోజులు వేచి చూడాల్సి ఉంది.

ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుండగా, దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నాడు. అనుష్క మరోసారి ఒక విభిన్నమైన కథతో వెండితెరపై అలరించేందుకు రెడీ అవుతున్నట్టే కనిపిస్తోంది.

కింగ్డమ్‌ నుంచి పవర్‌ ఫుల్ అప్డేట్‌ ఎప్పుడంటే..!

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తాజా పాన్ ఇండియా చిత్రం కింగ్డమ్ ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ చుట్టూ భారీ అంచనాలతో తెరకెక్కుతోంది. ఈ సినిమాకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించగా, హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. మొదటి నుంచి ఈ సినిమాపై అద్భుతమైన బజ్ నెలకొంది. కానీ విడుదల విషయంలో మాత్రం కాస్త ఊహించని రీతిలో జాప్యం కొనసాగింది. మళ్లీ మళ్లీ డేట్ వాయిదా పడుతూ ఉండటంతో ఫ్యాన్స్ కొంత నిరాశకు గురయ్యారు.

ఇక ఫైనల్‌గా రిలీజ్ డేట్ ఎప్పుడు ఖరారవుతుందా అనే ఉత్కంఠే అందరిలోనూ కనిపిస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జూలై 7న చిత్ర యూనిట్ నుంచి ఓ స్పష్టమైన అప్డేట్ రాబోతుందంటూ టాక్ వినిపిస్తోంది. ఇక ఇదే నిజమైతే ఆగస్ట్ మొదటి వారం కింగ్‌డమ్ థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఈ సినిమా మ్యూజిక్‌ను అనిరుధ్ అందిస్తుండగా, నాగవంశీ మరియు సాయి సౌజన్య సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. గత సినిమాల్లో విజయ్ దేవరకొండ చూపిన ఎనర్జీకి గౌతమ్ తిన్ననూరి ప్రత్యేకంగా ఫీల్ కలిపి ఈ కథను తెరకెక్కించారని టాక్. ఇక జూలై 7న విడుదల తేదీపై పూర్తి క్లారిటీ రానున్న నేపథ్యంలో, ఫ్యాన్స్ మాత్రం ఫుల్ జోష్‌లో ఎదురుచూస్తున్నారు.