Home Blog Page 322

బర్త్‌ డే ట్రీట్‌ రెడీ చేస్తున్న అక్కినేని వారసుడు!

అక్కినేని యంగ్ హీరో అఖిల్ ప్రస్తుతం తన నెక్స్ట్ సినిమాని  తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు. దర్శకుడు మురళీ కృష్ణ అబ్బూరి డైరెక్షన్‌లో తన కెరీర్‌లోని 6వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు అఖిల్. ఇక ఈ సినిమాను అత్యంత ప్రెస్టీజియస్‌గా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

కాగా, ఈ సినిమా నుంచి ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ సిద్దమైయ్యింది. ఈ సినిమాను రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించనున్నట్లు చిత్ర యూనిట్‌ ఇప్పటికే వెల్లడించింది. ఇక ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టైటిల్‌ను ఏప్రిల్ 8న అఖిల్ బర్త్ డే కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినపడుతుంది.

మరి ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ ఫిక్స్ చేయనున్నారా.. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఎలా ఉండబోతుందా అనేది ఆసక్తికరంగా మారింది.

పెద్ది పై తాజా సమాచారం ఏంటంటే!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రం “పెద్ది” కోసం అందరికీ తెలిసిందే. ఒక మాస్ రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా నుంచి మేకర్స్ సాలిడ్ గ్లింప్స్ ని ఈ రామ నవమి కానుకగా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా గ్లింప్స్ పై కొన్ని రూమర్స్ వైరల్ గా మారాయి.

గ్లింప్స్ వీడియో కట్ బాగానే వచ్చింది కానీ రెహమాన్ స్కోర్ బాలేదు అంటూ కొన్ని మాటలు వైరల్ అవుతున్నాయి. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదట. రెహమాన్ క్రేజీ సౌండింగ్ ఈ గ్లింప్స్ కోసం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ 6న వీడియో వచ్చాక అందరికీ దీనిపై క్లారిటీ కూడా వస్తుంది అని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

‘మిరాయ్’లో పవర్ చూపెట్టనున్న నటుడు…ఎవరో తెలుసా!

‘హనుమాన్’ మూవీ తర్వాత తన స్థాయిని అమాంతం పెంచుకున్నాడు యంగ్ హీరో తేజ సజ్జా. ప్రస్తుతం తేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మిరాయ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా సూపర్ హీరో మూవీగా రానుంది.

ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ సినిమాలో మరో విలక్షణ నటుడు రానా దగ్గుబాటి ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ పాత్ర కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది.

అయితే, ఈ పాత్రకు తొలుత దుల్కర్ సల్మాన్‌ను తీసుకోవాలని మేకర్స్ భావించారట. కానీ, ఆయన బిజీ షెడ్యూల్ కారణంగా ఇప్పుడు ఈ సినిమాలో రానా దగ్గుబాటి జాయిన్ అయినట్లు చిత్ర యూనిట్ చెబుతోంది.

ట్రీట్‌ థియేటర్స్‌ లోనే!

ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి రాబోతున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రాల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా టాలెంటెడ్ దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “పెద్ది” కూడా ఒకటి. అయితే ఈ చిత్రం నుంచి రీసెంట్ గా వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ సాలిడ్ రెస్పాన్స్ ని కూడా అందుకోగా ఈ తర్వాత రామ నవమి కానుకగా మేకర్స్ గింప్స్ ని కూడా రిలీజ్ చేయనున్నట్టు కన్ఫర్మ్ చేశారు.

మరి ఈ గ్లింప్స్ ఇపుడు థియేటర్స్ లో కూడా ట్రీట్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ ఏప్రిల్ 6న గ్లింప్స్ ఆన్లైన్ లో వచ్చాక 10న థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న మైత్రి మూవీ మేకర్స్ చిత్రాలు జాట్ అలాగే గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలతో కలిపి పెద్ది గ్లింప్స్ అటాచ్ చేసే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎలాగో పెద్ది సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సో ఆ ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది.

పక్కా ప్లానింగ్‌ ప్రకారమే!

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన హ్యాట్రిక్ సెన్సేషనల్ హిట్ చిత్రం “అఖండ” కోసం అందరికీ తెలిసిందే. తెలుగు సినిమా దగ్గర ఒక బిగ్గెస్ట్ హిట్ అయ్యిన సినిమాల్లో భారీ లాంగ్ రన్ ని ఈ చిత్రం చూసింది. అయితే దీనికి సీక్వెల్ గా మేకర్స్ “అఖండ 2 తాండవం”ని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా ఓ ఇంట్రెస్టింగ్ టాక్ దీనిపై ఇపుడు వినిపిస్తుంది. దీని ప్రకారం అఖండ 2 షూటింగ్ ని మేకర్స్ పక్కా ప్లానింగ్ గా కంప్లెట్ చేస్తున్నారట. పార్ట్ 1 లో బాలయ్య డ్యూయల్ రోల్ లో చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఇవి పార్ట్ 2 లో కూడా కొనసాగనున్నాయి. అయితే మొదటిగా మేకర్స్ అఘోర గెటప్ లో టాకీ పార్ట్ మొత్తాన్ని కంప్లీట్ చేసేస్తున్నారట.

ఇక ఇది అయ్యాక బాలయ్య లోని మరో షేడ్ షూటింగ్ ని మొదలు పెట్టనున్నారట. ఈ షూటింగ్ తో జూన్ నాటికి మొత్తం సినిమాని పూర్తి చేసేయాలని మేకర్స్ టార్గెట్ పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. దీనితో అఖండ 2 మాత్రం అనుకున్నట్టు గానే సెప్టెంబర్ రిలీజ్ కి రానుందట. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా 14 రీల్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

జాట్‌ నుంచి ఫస్ట్‌ సింగిల్‌!

బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రం ‘జాట్’ కోసం అందరికీ తెలిసిందే. మన టాలీవుడ్ స్టార్ దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ చిత్రం ఇపుడు రిలీజ్ కి రాబోతుంది. ఇక ఈ సమయంలో మేకర్స్ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేశారు. టచ్ కియా అంటూ సాగే ఈ సాంగ్ ని థమన్ సాలిడ్ బీట్స్ తో కొట్టాడని చెప్పాలి. ఇక ఈ స్పెషల్ సాంగ్ లో ప్రముఖ బ్యూటీ ఊర్వశి రౌటేలా ఇందులో కనిపించడం విశేషం.

ఇక ఈ సాంగ్ కి జానీ మాస్టర్ డాన్స్ కంపోజ్ చేయగా తన కొరియోగ్రఫీ ఈ సాంగ్ కి పర్ఫెక్ట్ గా ఉందని చెప్పవచ్చు. ఇక ఈ సాంగ్ లో బాలీవుడ్ నటుడు రణదీప్ హూడా ఆలాగే యంగ్ నటి రెజీనా కాసాండ్రా కూడా కనిపిస్తున్నారు. మంచి పార్టీ అండ్ సెలబ్రేషన్ సాంగ్ గా ప్లాన్ చేసిన ఈ సాంగ్ లో సన్నీ డియోల్ ప్రెజెన్స్ అయితే లేనట్టే ఉందని చెప్పాలి. మొత్తానికి అయితే హిందీ ఆడియెన్స్ కి ఈ సాంగ్ నచ్చే రేంజ్ లో అనిపిస్తుంది. ఇక ఈ అవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ఈ ఏప్రిల్ 10న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.

మ్యాడ్‌ హీరోతో మెగా డాటర్‌!

మ్యాడ్ చిత్రానికి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ రెస్పాన్స్ దక్కిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘మ్యాడ్ స్క్వేర్’ రాగా, ఇది బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ సినిమాను దర్శకుడు కల్యాణ్ డైరెక్ట్ చేశారు. కాగా, ఇందులోని కామెడీ ఎలిమెంట్స్, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాయి. ఈ సినిమాలో హీరోలుగా నటించిన రామ్ నితిన్, నార్నె నితిన్, సంగీత్ శోభన్ తమ కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.

ఇక ఈ సినిమాలో నటించిన సంగీత్ శోభన్ ప్రస్తుతం ఓ కొత్త సినిమాను స్టార్ట్ చేశారు. మెగా డాటర్ నిహారిక ప్రొడక్షన్ కంపెనీ ది పింక్ ఎలిఫెంట్స్ బ్యానర్‌లో సంగీత్ శోభన్ తన నెక్స్ట్ మూవీని స్టార్ట్ చేశారు. నిహారిక సరసన సంగీత్ శోభన్ నటిస్తుండటంతో ఈ కాంబినేషన్ ఎంతమేర అలరిస్తుందో చూడాలి. ఇక ఈ సినిమాను మానసా శర్మ డైరెక్ట్ చేయనున్నారు.

మరి ఈ సినిమాలో నిహారిక, సంగీత్ శోభన్ కెమిస్ట్రీ ఎలా ఉండబోతుందో చూడాలి. ఈ చిత్ర షూటింగ్ త్వరలో షూటింగ్ ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది.

Nara Lokesh says AP Is changing Its Image with A Brand called Chandrababu

IT Minister Nara Lokesh said that the AP is changing its image with a brand called Chandrababu Naidu. He performed the ground-breaking ceremony for the compressed bio-gas plant (CBG) to be set up by Reliance in PC Pally mandal, Devarapalli, Prakasam district. This project will be crucial to making the state a leader in biofuel production, he said.

Reliance will invest Rs. 65,000 crores for this project. With these funds, a total of 500 CBG plants will be set up.  Minister Lokesh said that the first plant is being built in Kanigiri, and this investment will provide employment opportunities to 2.50 lakh people in AP. He said that he has kept the first promise given in Yuvagalam in Kanigiri.

He said that green and renewable electricity will be generated through these plants using agricultural waste. Each compressed biogas plant will have a production capacity of 22 tons per day. About 5 lakh acres of unused land will be used for energy plantation, he added.

The minister assured that efforts will be made for the railway project in Kanigiri. He praised the completion of the Veligonda project as the goal of the coalition government and said that Deputy Chief Minister Pawan Kalyan is a person who can achieve whatever he sets his mind to.

He deplored that “The last five years have been a destructive rule in AP. The previous government did nothing for Prakasam district and chased out existing companies. We have seen a situation where industries were chased out of the state because they were not given shares”.

“If a paper mill was brought to Prakasam district, the YSRCP government would chase it out. I am challenged to mention the name of at least one company brought in during the YSRCP regime?”, he added.

Lokesh said that so far, agreements have been made for investments worth Rs. 8 lakh crore and the government’s idea is to provide 20 lakh jobs in five years. “We are preparing the ground for the establishment of biogas plants. I am proud that we are fulfilling the promises made”, he said.

Reliance spokesperson Tripathi said that they have already invested Rs 1 lakh crore in the state. He said that biogas plants are being set up in many places in AP. He read out the message sent by Anant Ambani to this effect. He assured that the shape of this region will change in two years.

Jaat: Urvashi Rautela Adds Glam with her Sizzling Dance Moves in ‘Touch Kiya’

Following the massive hit of Dabidi Dibidi from Daaku Maharaaj, Bollywood diva Urvashi Rautela is back with another electrifying dance number to entertain audiences. This time, she brings her signature glamour and energy to ‘Jaat’ with the newly released song Touch Kiya.

The filmmakers have unveiled the latest dance number, Touch Kiya, today, featuring Urvashi Rautela alongside Randeep Hooda and Vineet Kumar Singh. The song showcases Urvashi’s sizzling dance moves to an electrifying and energetic beat, adding an extra spark to the movie.

Musical sensation SS Thaman composed this high-energy dance number, with powerful vocals by Madhubanti Bagchi and Shahid Mallya. The lyrics were penned by Kumaar.

Jaat is an action-packed entertainer featuring Bollywood action star Sunny Deol in the main lead with Regina Cassandra as the female lead. Directed by acclaimed Tollywood director Gopichand Malineni, the film is a grand production backed by Naveen Yerneni, Ravi Shankar, and TG Vishwa Prasad under the top banners of Tollywood, Mythri Movie Makers and People Media Factory.

The ensemble cast includes Randeep Hooda, Vineet Kumar Singh, Saiyami Kher, and Swarupa Ghosh. The film has generated significant buzz with its impressive teaser and is now set for a power-packed theatrical release on April 10, 2025.

CM Chandrababu’s pressure To Expand Amaravati ORR In view of Future Needs paid off

In view of future needs, Chief Minister Chandrababu Naidu’s pressure on the Center to expand the Amaravati Outer Ring Road (ORR) has paid off. The Central Government has agreed to acquire land with a width of 140 meters. It has also agreed to construct service roads on both sides of the ORR.

In 2018, the then Telugu Desam government proposed to acquire land with a width of 150 meters for the Amaravati ORR. It was also planned to build a railway line to run suburban trains in connection with the expansion of the ORR. Recently, the Alignment Approval Committee under the Central Government gave preliminary approval for the construction of a 189-kilometer-long 6-lane ORR.

However, it stated that land should be acquired only with a width of 70 meters. The committee suggested that the Railway Department be contacted, saying that they would not acquire land for the railway line or other needs. CM Chandrababu Naidu has written a letter to the Centre on this.

He also recently spoke to Union Minister Nitin Gadkari and explained to him that in the future the ORR will have to be expanded to 10 lanes and then there will be challenges in acquiring land. Keeping all this in mind, Chandrababu Naidu requested that land be acquired now with a width of 150 meters.

With this, Gadkari agreed to acquire land with a width of 140 meters. Recently, when the Alignment Approval Committee approved the Amaravati ORR, it approved the construction of a service road only towards the capital area. It was stated that the ORR does not need an outer side. CM Chandrababu discussed this with Gadkari as well.

He explained that only if there are service roads on both sides, the people of the villages and towns adjacent to the ORR can travel easily. Gadkari agreed to it. According to the preliminary approval of the Alignment Approval Committee, the cost of land acquisition for the 70-meter wide ORR is estimated to be Rs. 16,310 crore.

Now, the cost of land acquisition for the 140-meter wide ORR will increase. All the details will be included in the orders to be received by the state from the top officials of the central government soon.