Home Blog Page 296

‘విశ్వంభర’ .. ఫస్ట్ సింగిల్ డేట్ వచ్చేసింది..

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం విశ్వంభర కోసం అందరికీ తెలిసిందే. అయితే కొంత కాలం నుంచి సాలిడ్ అప్డేట్ లేదు అని బాధ పడుతున్న అభిమానులకి విశ్వంభర మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇప్పుడు తీసుకుని వచ్చారు. అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫస్ట్ సింగిల్ ని మేకర్స్ మెగాస్టార్ పై అదిరే పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.

రామ రామ అంటూ సాగే ఈ డివోషనల్ సెలబ్రేటింగ్ సాంగ్ ని మేకర్స్ ఈ ఏప్రిల్ 12న రిలీజ్ కి తీసుకొస్తున్నట్టు కన్ఫర్మ్ చేసేసారు. మరి ఇందులో మెగాస్టార్ సహా ఆంజనేయ స్వామి గెటప్ లో ఉన్న చిన్న పిల్లలతో చూస్తుంటే కలర్ ఫుల్ గా హిట్ సాంగ్ లా కనిపిస్తోంది.

ఇంటికి చేరుకున్న పవన్‌ తనయుడు!

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్  కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న పవన్, మెగాస్టార్ చిరంజీవి హుటాహుటిన సింగపూర్ వెళ్లారు. అయితే, అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు. ప్రస్తుతం అతను ఇంటికి చేరుకున్నట్లు మెగాస్టార్ చిరంజీవి తెలిపారు.

ఆయన సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు. అయితే ఇంకా కోలుకోవాలి. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో, మళ్ళీ మామూలుగా ఎప్పటిలానే ఉంటాడని చెప్పుకొచ్చారు. రేపు హనుమత్ జయంతి, ఆ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి, ఓ విషాదం నుంచి ఆ పసి బిడ్డను కాపాడి మా కుటుంబానికి అండగా నిలిచాడు.

ఈ సందర్భంగా  ఊళ్ళల్లో,  ప్రాంతాల్లో మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ మా కుటుంబానికి అండగా నిలిచారు. ఆ బిడ్డ కోసంచాలా మంది ప్రార్థనలు చేస్తున్నారు, ఆశీస్సులు అందచేస్తున్నారు. మీ అందరికీ నా తరపున, తమ్ముడు కళ్యాణ్ బాబు, మా కుటుంబం యావన్మంది తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము’ అంటూ చిరంజీవి తన పోస్ట్‌లో వెల్లడించారు.

జాతర మొదలు పెట్టిన రవితేజ!

మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాస్ జాతర’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు భాను బోగవరపు పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నాడు. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ఈ చిత్రంపై అంచనాలు ఒక్కసారిగా పెంచేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ‘తూ మేరా లవర్’ అంటూ సాగే ఈ మాస్ బీట్ సాంగ్‌ను ఏప్రిల్ 14న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యింది. ఈ మేరకు ఓ సరికొత్త పోస్టర్‌తో ఈ విషయాన్ని వారు రివీల్ చేశారు. ఇక ఈ పోస్టర్‌లో రవితేజ తనదైన స్వాగ్‌తో డ్యాన్స్ చేస్తూ కనిపిస్తున్నాడు.

ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

ఓటీటీలోకి నాని తాజా సినిమా!

నేచురల్ స్టార్ నాని హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా పలు సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అలా లేటెస్ట్ గా తాను నిర్మాణం వహించిన మూవీనే  “కోర్ట్”. యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు ప్రియదర్శి హీరోగా మరో యువ నటీనటులు హర్ష రోహన్ అలాగే శ్రీదేవిలు మెయిన్ లీడ్ లో దర్శకుడు రామ్ జగదీష్ తెరకెక్కించిన ఈ కోర్ట్ థ్రిల్లర్ సాలిడ్ హిట్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది.

ఇక ఫైనల్ గా ఈ సినిమా ఓటిటిలో ఆడియెన్స్ ని అలరించేందుకు వచ్చేసింది. ఈ చిత్రాన్ని కూడా నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా అందులో ఈ సినిమా నేటి నుంచి పాన్ ఇండియా భాషల్లో అందుబాటులోకి వచ్చేసినట్లు తెలుస్తుంది. మరి తెలుగు ఆడియెన్స్ ని అలరించిన ఈ చిత్రం ఇపుడు పాన్ ఇండియా ఆడియెన్స్ లో ఎలాంటి రెస్పాన్స్ ని అందుకుంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి బేబి సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ సంగీతం అందించగా నటుడు శివాజీ సాలిడ్ రోల్ ని పోషించిన సంగతి తెలిసిందే.

ఆ ఓటీటీలోకి ఛావా..కానీ!

బాలీవుడ్ టాలెంటెడ్ హీరో విక్కీ కౌశల్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన భారీ హిస్టారికల్ హిట్ చిత్రం “ఛావా” కోసం అందరికీ తెలిసిందే. బాలీవుడ్ లో ఈ ఏడాదికి భారీ హిట్ గా నిలిచిన ఈ చిత్రం అక్కడ అనేక రికార్డులు తిరగరాయడమే కాకుండా ఎమోషనల్ గా కూడా దేశ వ్యాప్తంగా ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. ఇక ఇలా ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకి ఓటిటిలో కి వచ్చేసింది.

ఈ సినిమా హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ తీసుకోగా అందులో నేటి నుంచి వచ్చేసింది కానీ అనుకున్నదే జరిగింది. ఈ చిత్రం కేవలం హిందీలో మాత్రమే నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చింది. థియేట్రికల్ గా మన తెలుగులో కూడా వచ్చినప్పటికీ ఓటిటిలో చాలా మంది పాన్ ఇండియా భాషల్లో ఎదురు చూసారు. కానీ ఈ సినిమా కేవలం హిందీలో మాత్రమే వచ్చి రీజనల్ ఆడియెన్స్ ని నిరాశ పరిచింది. మరి నెట్ ఫ్లిక్స్ ఏమన్నా దీనిని ఇతర భాషల్లో కూడా తీసుకొస్తారో లేదో అనేది వేచి చూడాలి.

బన్నీ..అట్లీ సినిమాలో ఆ క్రేజీ ముద్దుగుమ్మ!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ’ సినిమా ఎప్పుడు మొదలు కాబోతుంది ?, ఎప్పుడు విడుదల అవుతుంది ? అంటూ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే, ఈ సినిమాలో ప్రియాంక చోప్రా నటిస్తున్నారని టాక్ నడిచింది. ఇప్పుడు మరో క్రేజీ హీరోయిన్ పేరు వినిపిస్తోంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ ను కూడా తీసుకునే ఆలోచనలో టీమ్ ఉందని తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి. ఇక బన్నీ కోసం అట్లీ ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను పూర్తి చేసినట్లు సమాచారం.

మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఓ డాన్ చుట్టూ ఈ కథా నేపథ్యం సాగుతుందట. ఈ సినిమా మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని.. మొత్తానికి బన్నీ – అట్లీ నుంచి ఓ పవర్ ఫుల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా రానున్నట్లు టాక్ నడుస్తుంది. అన్నట్టు జీ స్టుడియోస్ కంపెనీ, ఈ ప్రాజెక్టును నిర్మిస్తుంది. త్వరలోనే ఈ సినిమా షూట్ ను మొదలు పెట్టే  ప్లాన్ లో మేకర్స్‌ ఉన్నట్లు సమాచారం. అట్లీ సినిమా తర్వాత బన్నీతో త్రివిక్రమ్ మూవీ ఉంటుందని సమాచారం.

‘‘5 – 1 = 3’’ వారెవ్వా జగన్ గణిత పాండిత్యం!

అయిదులోంచి ఒకటి తీసివేస్తే.. మిగిలేది ఎంత? ఒకటో తరగతి పిల్లవాడు కూడా ‘నాలుగు’ అని జవాబు చెబుతాడు. కానీ జగనన్న చదువుకున్న లెక్కల పుస్తకంలో మాత్రం ‘మూడు’ అనే జవాబే ఉంటుంది. తొందరగా మళ్లీ ముఖ్యమంత్రి అయిపోవాలనే తాపత్రయం ఆయన కళ్లకు బైర్లు కమ్మేలా చేస్తోందో, బుద్ధిని మసకబారేలా చేస్తోందో తెలియదు గానీ.. ఆయన మాత్రం.. ఇంకో మూడేళ్లలో తాను ముఖ్యమంత్రిని అయిపోతానని మైకు దొరికిన ప్రతిసందర్భంలోనూ పదేపదే చెప్పుకుంటున్నారు. తాజాగా ఉమ్మడి కర్నూలు జిల్లా స్థానిక ప్రజాప్రతినిధులతో భేటీ సందర్భంగా కూడా ఆయన ఇదే సంగతి చెప్పుకున్నారు. మన దేశంలో అయిదేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయనే సంగతి ఆయనకు తెలుసు. కూటమి ప్రభుత్వం ఏర్పడి నిండా ఒక్క సంవత్సరం కూడా పూర్తికాలేదని కూడా ఆయనకు తెలుసు. కానీ ఫైనల్ గా డైలాగ్ దగ్గరకు వచ్చేసరికి.. మూడేళ్లలో జగన్ 2.ఓ ప్రభుత్వాన్ని మీరు చూస్తారు.. అంటూ ఆయన సెలవిస్తున్నారు.

జగన్మోహన్ రెడ్డి వద్ద పార్టీ కార్యకర్తలతో మాట్లాడడానికి కొన్ని స్టాక్ సబ్జెక్టులు ఉంటాయి.  ఆయన కొన్ని వందల వేల సార్లు అవే విషయాలు మాట్లాడి ఉంటారు. ఆ సంగతులు ఆయన పార్టీ వారందరికీ కూడా కంఠతా వచ్చేసి ఉంటాయి. ఫరెగ్జాంపుల్- మనం రాష్ట్రంలో ఏ ఇంటికైనా సరే గర్వంగా తలెత్తుకుని వెళ్లగలం. ఎందుకంటే మేనిఫెస్టోలో చెప్పిన అన్ని పనులు మనం చేసి చూపించాం. చంద్రబాబు మేనిఫెస్టో లో హామీలు పట్టించుకోరు.. సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అన్నారు.. ఏవీ చేయలేదు. ఆయన పాలనలో ఈ కొద్దికాలంలోనే వ్యవస్తలన్నీ నిర్వీర్యం అయిపోయాయి… ఇలాంటి ఆయన చేసే రొటీన్ విమర్శలు.

ఈసారి మాత్రం ఎంపీపీ ఎన్నికల సందర్భంగా జరిగిన వ్యవహారాల నేపథ్యం ఉన్నది గనుక.. రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని, న్యూటన్స్ లా ప్రకారం ప్రతిచర్య ఉంటుందని.. చంద్రబాబు బంతిని ఎంత గట్టిగా కొడతారో అంతే వేగంతో అది పైకిలేచి ఆయనకే తగులుతుందని అంటున్నారు. ఈ క్రమంలోనే కళ్లుమూసుకుంటే మూడేళ్లయిపోతుంది. ఈ మూడేళ్లు నాకు, ప్రజలకు గట్టిగా తోడుగా నిలబడండి.. తర్వాత వైసీపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది.

హామీలు ఇతర వ్యవహారాల గురించి ఆయన వేసే నిందలన్నీ పక్కన పెడితే.. ఈ మూడేళ్లలో అధికారంలోకి రావడం అనే పిచ్చి జగన్ కు ఎలా పట్టుకున్నదబ్బా.. అనే సందేహం పలువురిలో మెదలుతుంది. ఆయన నమ్మే, పాదనమస్కారాలు చేసే స్వామీజీలు ఎవరైనా మూడేళ్ల తర్వాత.. నువ్వు ముఖ్యమంత్రి అయిపోతావు అని జోస్యం చెప్పారా.. దాన్ని నమ్ముకుని లాజిక్ లేకుండా ప్రజల ముందు ప్రతిసారీ.. మూడేళ్లలో జగన్ 2.0 పాలన అని చెప్పుకుంటూ ఆయన అపహాస్యం పాలవుతున్నారా? అని ఆయన పార్టీ కార్యకర్తలకే సందేహాలు కలుగుతున్నాయి. జగన్ అధికారంలోకి మళ్లీ రావాలనే కోరికను, వస్తాననే నమ్మకాన్ని చాటుకోవచ్చు గానీ.. మూడేళ్లు అంటూ నవ్ల్వులపాలవడం దండగ అని వారు పేర్కొంటున్నారు.

“Akkada Ammayi Ikkada Abbayi” Telugu Movie Review

Movie Name : Akkada Ammayi Ikkada Abbayi

Release Date : April 11, 2025

Cast : Pradeep Machiraju, Deepika Pilli, Vennela Kishore, Getup Srinu, Muralidhar Goud, John Vijay, Bodupalli Srinu, Rohini, Jhansi etc.

Director : Nitin – Bharath

Music Director : Radhan

Telugumopo.com Rating :  2.25/5

Story:

In a village steeped in superstition, a baby girl is born after many years — Rajakumari (played by Deepika Pilli). Her arrival is seen as a divine blessing. Crops flourish, rains arrive on time, and fortunes turn. Convinced that she brings luck, the village elders declare that she must never leave — and must one day marry one of the sixty boys born before her in the same village.

Her father, hesitant but helpless against tradition, agrees.From that day on, the sixty boys are raised with a singular purpose — to win Rajakumari’s heart. She grows up admired, adored, and surrounded by constant competition. The village builds a wall around her life, both literally and emotionally. No outsiders are allowed — especially not men.

Years later, an outsider arrives.Krishna (played by Pradeep Machiraju), a young civil engineer, steps into the village to oversee a government project. He’s respectful, curious, and doesn’t quite fit the mold — which only draws Rajakumari closer. In quiet corners and stolen glances, their friendship deepens into love. They try to keep their relationship a secret, but eventually the villagers find out.

What happens next? How do they overcome the strict village tradition? What kind of obstacles do they face? These questions form the rest of the story.

Review:

Pradeep Machiraju, who had proven himself with his lively anchoring skills, takes on a lead role with a pleasant change of rhythm in Akkada Ammayi Ikkada Abbayi. His Krishna is understated, natural, and endearing. Rather than take the clichéd over-the-top hero track, Pradeep plays it down — and that’s what makes his act appeal to the masses. His comic timing shines without ever feeling forced, making Krishna a very relatable character.

Deepika Pilli, in her debut, delivers a surprisingly confident performance. She brings a strong screen presence and handles emotional and fun scenes with equal ease. Her chemistry with Pradeep is a definite highlight — their pairing feels effortless and endearing, giving the story its emotional core.

Comedian Satya steals the show in the first half with laugh-out-loud moments. Getup Srinu also lands solid punches, keeping the momentum going. In the second half, Vennela Kishore and Brahmaji step in with comic relief, though their scenes aren’t quite as impactful.

The movie begins on a positive note. The transition from the modern city infrastructure to the old-fashioned village, where people live in ignorance of the world outside their borders and have superstitions, is smooth, and the pace of the story picks up. The first half is hilarious, containing satirical one-liners and interesting sequences. The love story of Krishna and Rajakumari is treated with a lighthearted, carefree brush that suits.

The interval twist, where the villagers discover the secret romance, sets up the conflict for the second half. Unfortunately, this is where the film loses some of its spark. Once the narrative returns to the city, the writing becomes less focused, and the pacing dips. While the performances still try to hold things together, the screenplay feels a bit flat and predictable in parts.

Despite the second half not matching the charm of the first, the film never becomes dull. The early comedy, fresh pairing, and rustic backdrop make for an entertaining watch overall — especially considering its modest budget.

On the technical front, Radhan’s music supports the film well. The songs might not be chartbusters, but they’re tuneful and mix well with the narrative. The background score is in sync with the mood, and Ball Reddy’s cinematography captures the picturesque beauty of the village with elegance. The visual aesthetics are plain but pleasant, and the production values are good for the scale of the film.

Newcomers directors Nitin and Bharat take the film in hand quite confidently. They are able to get good performances and maintain a light tone. Writer Sandeep Bolla develops a straightforward story with good cultural base, infusing it with contemporary dialogues and situational comedy that appeals to the youth.

Akkada Ammayi Ikkada Abbayi is a warm, light romantic comedy with natural performances, wholesome humor, and a warm village backdrop. Although the second half could have done with tighter writing, the film still has enough charm and humor to be worth watching — especially for fans of light-hearted Telugu cinema.

CM Chandrababu says A special Law soon For The protection of BCs

Chief Minister Nara Chandrababu Naidu said that a special law is going to be brought soon for the protection of BCs. He said that 55 corporations have been set up for BCs and a special plan has been brought for BCs. CM Chandrababu emphasized that the government’s goal is to take BCs ahead of all other communities.

Stating that the backbone of TDP has been the BC community since the beginning, he said that he will work tirelessly for the development and welfare of BCs. The Chief Minister said that along with PM Modi and Pawan Kalyan, they are working together for the upliftment of the backward communities.

CM Chandrababu spoke at a `Praja Vedika’ organized with BC communities in Vadlamanu village of Agiripalli mandal, Eluru district. He said that justice was not done to the weaker communities until the TDP came and the TDP is the only party that has done justice to them.

CM Chandrababu announced that he would give an honorarium of Rs. 25,000 to the Nayi Brahmins working in temples. He said that a committee has been formed to draft a law for the protection of BCs. He said that the law will be brought as soon as the committee report comes. He assured that he would support Minister Parthasarathy to fully develop Nuzvid.

He recalled that during NTR’s regime, BCs got Gurukul schools and 9 Gurukul schools have been set up for fishing families and Rs. 15 lakhs are being provided to those studying abroad.

He said that he is supporting those writing the Civil and Group exams. He revealed that a Civils coaching center is being set up in Amaravati and coaching will be provided to 500 per batch. He said that Rs. 1,000 crores will be spent annually under Adarana-3.

Chandrababu said that steps have been taken to increase the reservation of BCs from 26 to 34 percent.  He said that 33 percent reservation has been provided in jobs and 34 percent in local bodies, and BC Bhavans have been inaugurated district-wise. 

He said that the goal is to turn one lakh women into entrepreneurs this year, that they will support farmers and encourage commercial crops. He revealed that farmers will be given Rs. 20,000 in installments from May.

గోరంట్ల అంత ఓవర్ యాక్షన్ చేసింది అందుకేనా?

పోలీసుగా ఉంటూ జేసీ బ్రదర్స్ ను నానా బూతులు తిట్టినందుకు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసన్నుడు కావడం వలన.. టికెట్ దక్కించుకుని హిందూపురం ఎంపీగా నెగ్గిన పోలీసు అధికారి గోరంట్ల మాధవ్. ఒక టర్మ్ పదవిని వెలగబెట్టి.. మధ్యలో ఒక మహిళకు నగ్నంగా వీడియో కాల్ చేసి, రొమాంటిక్ ముచ్చట్లు పెట్టడం.. అదికాస్త లీక్ కావడంతో.. పార్టీని కూడా భ్రష్టు పట్టించడం జరిగింది. 2024 ఎన్నికల్లో మాధవ్ ను పక్కన పెట్టేసి జగన్ శాంతకు టికెట్ ఇచ్చారు. మాధవ్ అదృష్టం కొద్దీ ఆమె ఓడిపోయింది. రాబోయే ఎన్నికల నాటికి మళ్లీ తనకు టికెట్ దక్కేలాగా.. పార్టీ అధినేతను ప్రసన్నం చేసుకోవాలంటే ఎలాగ? ఏదో ఒకటి ప్రత్యేకంగా చేసి పార్టీ అధినేత కళ్లలో పడితేనే కదా అలా కుదురుతుంది- అని ఆయన ఫిక్సయినట్లుంది. అందుకే ఇంతగా ఓవర్ యాక్షన్ చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు.

వైఎస్ భారతి మీద అసభ్య పోస్టులు పెట్టిన చేబ్రోలు కిరణ్ అనే ఐటీడీపీ కార్యకర్తను పోలీసులు అరెస్టు చేసి మంగళగిరికి తరలించారు. అక్కడినుంచి గుంటూరు తీసుకువెళ్లే క్రమంలో.. అనూహ్యంగా గోరంట్ల మాధవ్ తన అనుచరులతో కలిసి పోలీసు వాహనాన్ని వెండించాడు. దానిని అడ్డగించి.. కిరణ్ పై దాడి చేసి కొట్టడానికి ప్రయత్నించాడు. పోలీసులు అడ్డుకోబోగా వారి మీద కూడా దౌర్జన్యం చేశాడు. మొత్తానికి అతడిని వదిలించుకుని పోలీసులు ఎస్పీ కార్యాలయంలోకి వెళ్లిన తర్వాత కూడా ఆ ప్రాంగణంలో కిరణ్ మీద మళ్లీ దాడికి ప్రయత్నించాడు గోరంట్ల! విసిగిపోయిన పోలీసులు అతడిని, అనుచరుల సహా అరెస్టు చేశారు.

గోరంట్ల చేసిందే ఓవరాక్షన్ అని అంతా అనుకుంటుండగా.. ఇలాంటి ఓవరాక్షనే కావాలి.. ఇలా చేసే వాళ్లనే మేం సపోర్టు చేస్తాం.. అన్నట్టుగా.. ఆయనను పోలీసులు తీసుకువెళ్లిన వెంటనే.. అంబటి రాంబాబు తదితర వైసీపీ నాయకులు పోలీసు స్టేషనుకు కూడా వచ్చారు. పోలీసుల్లోనే ఒక వైసీపీ కోవర్టు లాంటి అధికారి.. కిరణ్ ను మంగళగిరి నుంచి గుంటూరు తీసుకువెళుతున్న సమాచారం పార్టీ వారికి అందించాడని, దానిని బట్టి ఆ పోలీసు వాహనాన్ని మాధవ్ వెంబడించి ఈ గందరగోళం సృష్టించాడని అంటున్నారు.

అయినా.. జగనన్న కళ్లలో ఆనందం చూడడానికి, భారతిని దూషించిన వాడి మీద దాడిచేస్తే తనకు ఎక్కువ మార్కులు పడతాయని.. ఆల్రెడీ పార్టీ లూప్ లైన్ లో ఉన్న ఈ ప్రజాదరణ లేని మాజీ ఎంపీ తలపోసినట్టుగా ఉంది. అయితే ఇలాంటి దుడుకు చర్యలకోసం జగన్ ఎందరినైనా వాడుకోవచ్చు గాక.. తీరా ఎన్నికలు వచ్చిన తర్వాత.. తాను చేయించుకునే సర్వేల్లో గెలుపుగుర్రంగా తేలితే తప్ప టికెట్ ఇవ్వరు అని తెలుసుకోవాలి! ప్రజల్లో తన ప్రతిష్ట పెంచుకునే పనులు చేయకుండా.. జగనన్న ప్రాపకం కోసం అతి వేషాలు వేస్తే పోలీసు కేసులు తప్ప మరేం దక్కవని గోరంట్ల మాధవ్ గ్రహించాలి.