Home Blog Page 291

తమన్నా కోసం ఆ హీరో!

మిల్కీ బ్యూటీ తమన్నా మెయిన్ లీడ్ లో తెలుగులో చాలా కాలం తర్వాత ఎంట్రీ ఇస్తున్న మోస్ట్‌ అవైటెడ్ మూవీనే “ఓదెల 2”. తన రచ్చ దర్శకుడు సంపత్ నంది దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కించిన ఈ చిత్రం హారర్ కం డివోషనల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కి ఇపుడు రిలీజ్ కి రాబోతుంది. ఇక ఈ చిత్రం రిలీజ్ కి ముందు ప్రమోషన్స్ ని కూడా ఫుల్ స్వింగ్ లో చేసుకుంటూ ఉండగా ఇపుడు ప్రీరిలీజ్ ఈవెంట్ కి సిద్ధం అయ్యింది.

మరి మేకర్స్ ఈ ఏప్రిల్ 14న ప్రీరిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేసుకోగా ఈ ఈవెంట్ కోసం సంపత్ నంది నెక్స్ట్ సినిమా హీరో చార్మింగ్ స్టార్ శర్వానందన్ ముఖ్య అతిధిగా వస్తున్నట్లు సమాచారం. దీనితో ఈ యువ హీరో ప్రెజెన్స్ తో ఈ సినిమా ఈవెంట్ జరగనుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అశోక్ తేజ దర్శకత్వం వహించగా ఈ సినిమాకి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించాడు. అలాగే ఈ ఏప్రిల్ 17న గ్రాండ్ గా ఈ చిత్రం రిలీజ్ కి రాబోతుంది.

అనుపమ పెళ్లి ఆ హీరోతోనా!

తమిళ స్టార్ చియాన్ విక్రమ్ కుమారుడు ‘ధృవ్’, ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ తో తమిళంలో హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి పేరు సంపాదించాడు. క్యారెక్టర్ కోసం బాడీని ఎలాగైనా మార్చుకోగలిగే స్కిల్ తో మంచి పేరు తెచ్చుకున్నాడు. పైగా మొదటి సినిమాతోనే వేరియేషన్స్ చూపిస్తూ యాంగ్రీ యంగ్ మ్యాన్ అనిపించుకున్నాడు. అయితే, అనుపమ పరమేశ్వరన్ తో పాటు ధృవ్ ప్రేమ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

పైగా అతనితో అనుపమ పెళ్లికి రెడీ అవుతోందనే వార్తలు కూడా బాగా వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలు నిజమా..? లేదా ? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగానే అనుపమ-ధృవ్ ల నడుమ మంచి సాన్నిహిత్యం వుందని చాలా రోజుల నుంచి టాక్ వినిపిస్తోంది. ఈ ఇద్దరూ కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూట్ లో ఇద్దరు దగ్గర అయ్యారట. ఐతే, ఆ దగ్గరితనం ఎంతవరకు అనేది చూడాలి.

“Mass Alert! Ravi Teja & Sreeleela Groove to ‘Tu Mera Lover’”

The buzz for Ravi Teja’s new action flick, Mass Jathara, keeps growing closer to the release date. As a way of building up momentum, the film makers have released a brand-new energetic track titled “Tu Mera Lover” that will grab the attention of viewers and trend as a bestseller.

The number features Ravi Teja and Sreeleela, and their chemistry on screen lifts the performance to an altogether new level. Catchy beats, upbeat choreography, and an electric energy characterize this commercial hit which is cut specifically for the masses.

Composed by Bheems Ceciroleo, the song features lyrics by Bhaskarabhatla, perfectly capturing the film’s mass appeal. One of the most notable features of the song is the AI recreation of the late music director Chakri’s voice, which serves as a heartfelt tribute to his iconic track “Choopultho Guchi Guchi Champake” from Idiot. This special touch is bound to strike a chord with fans who remember the classic.

Directed by Bhanu Bogavarapu, Mass Jathara will be a glimpse of a pulsating blend of action and drama, a total entertainer for every viewer. Bankrolled by Naga Vamsi and Sai Soujanya on Sithara Entertainments, Fortune Four Cinemas, and Srikara Studios, the movie will be a top-class cinema experience.

With the launch of “Tu Mera Lover” creating further excitement around the movie’s hype, Mass Jathara is ready to make its mark on the audience when it releases on the big screen.

డ్రాగన్‌ లో స్పెషల్‌ రోల్‌!

ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న సినిమా పై రోజుకొక రూమర్ వినపడుతుంది. అయితే తాజాగా ఈ సినిమా గురించి వినిపిస్తున్న అప్ డేట్ ప్రకారం ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్ ను డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ రోల్ కోసం ఓ బాలీవుడ్ స్టార్ హీరోని ఎంపిక చేయాలని ప్రశాంత్ నీల్ ప్లాన్ అనుకుంటున్నాడంట. ఆ హీరో బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ అని తెలుస్తుంది. ఓ పోలీస్ పాత్రలో రణ్ వీర్ సింగ్ కనిపించబోతున్నాడని సమాచారం.

ఇక ఈ మూవీ టైటిల్ ‘డ్రాగన్‌’ అని ప్రచారంలో ఉంది. అయితే ‘డ్రాగన్‌’ సినిమాని ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా చేయాలని ప్రశాంత్ నీల్ అనుకుంటున్న విషయం తెలిసిందే. అందుకే, ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ప్రశాంత్ నీల్ చాలా టైమ్ తీసుకున్నాడు. కాబట్టి, ఇప్పటి వరకూ ప్రశాంత్ నీల్ తీసిన అన్ని సినిమాల్లోకల్లా బెస్ట్ సినిమా ఇదే అవుతుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు . ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

అఖిల్‌ క్యారెక్టర్‌ పై క్రేజీ బజ్‌!

అక్కినేని యంగ్ హీరో అఖిల్ ప్రస్తుతం తన నెక్స్ట్ చిత్రాన్ని ‘లెనిన్’ సినిమాని దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి (నందు) డైరెక్షన్‌లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ ఇప్పటికే రిలీజ్ అయ్యి సినిమా పై అంచనాలను భారీగా పెంచేసింది. అయితే, ఈ సినిమాలో అఖిల్ పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలుస్తోంది. అఖిల్ క్యారెక్టర్ లో రెండు షేడ్స్ ఉంటాయని.. ఈ షేడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇంటర్వెల్ లో ట్విస్ట్ కూడా ఉంటుందని తెలుస్తోంది.

కాగా ఈ సినిమా.. రాయలసీమ బ్యాక్‌ డ్రాప్‌ తో చిత్తూరు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కుతుంది. అఖిల్ మాడ్యులేషన్ కూడా పూర్తిగా చిత్తూరు యాసలోనే ఉండబోతుంది. ఇక ఈ సినిమాలో అందాల భామ శ్రీలీల హీరోయిన్‌గా నటించనుందట. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

దాని మీదే కమల్‌ ఫుల్‌ ఫోకస్‌!

క్లాసికల్ దర్శకుడు మణిరత్నం డైరెక్షన్‌లో ‘థగ్ లైఫ్’ షూటింగ్ పూర్తి అయింది. దీంతో కమల్ హాసన్ మరో చిత్రంపై ఫుల్ ఫోకస్ పెట్టారు. అన్బు-అరీవు దర్శకత్వంలో ‘కమల్ హాసన్ 237’ సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పుడున్న అప్ డేట్ ప్రకారం జులై లేదా ఆగస్టులో ఈ సినిమా సెట్స్‌ పైకి వెళ్తుందని తెలుస్తోంది.

అన్నట్టు యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం కమల్ తన బాడీ లుక్‌ను మార్చుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన “కల్కి 2898 ఏడీ” బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించింది.  దీనికి కొనసాగింపుగా ‘కల్కి 2’ రానున్న విషయం తెలిసిందే. ‘కల్కి 2’ షూట్ కోసం కూడా కమల్ హాసన్ జూన్ నుంచి డేట్స్ ఇస్తాడని, మొదటి షెడ్యూల్ లో కమల్ హాసన్ పై కీలక సన్నివేశాలను షూట్ చేస్తారని తెలుస్తోంది.

వార్ 2 పై ఆసక్తికర వ్యాఖ్యలు!

‘ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌’ కలయికలో రాబోతున్న మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మూవీ ఏదైనా ఉంది అంటే అది ‘వార్ 2’. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 14 న థియేటర్స్ లోకి రాబోతుంది. ఇప్పటికే, ఈ చిత్రం భారీ బజ్‌ను సృష్టించింది. ఐతే, లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం, హృతిక్ – ఎన్టీఆర్ ఇద్దరూ నటించిన మొదటి మోషన్ పోస్టర్ 2025 మే రెండవ వారంలో విడుదల కానుంది. ఈ వార్తకు సంబంధించి అధికారిక అప్ డేట్ కోసం అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.

కాగా, మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్స్ లో ‘వార్ 2’ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. పైగా ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌ కలయిక అనగానే ఆడియన్స్ లో కూడా భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పై ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. నిర్మాత ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. 90% చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉంది.

నేర్చుకో జగన్.. భక్తి ఒక ఎగ్జిబిట్ కాదు!

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమైన కొన్ని సందర్భాల్లో తిరుమల వెకంటేశ్వరుని దర్శనానికి వెళ్లారు. ముఖ్యమంత్రిగా ఉన్న అయిదేళ్ల కాలంలో హోదాకు, స్థాయికి ప్రతీక గనుక.. బ్రహ్మోత్సవాల సమయంలో ప్రతిసారీ తిరుమల వెళ్లి పంచ ధరిచి, కండువా వేసుకుని స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు కూడా సమర్పించారు. కానీ జన్మతః, ఆచరణతః క్రిస్టియను అయిన ఆయనలో హిందూత్వం పట్ల భక్తిగాని, వేంకటేశ్వరుని పట్ల విశ్వాసం గానీ ఉన్నాయా? ఉన్నట్టుగా ఆయన ఎన్నడూ నిరూపించుకోలేదు. స్వామివారికి వస్త్రాలు సమర్పణ కార్యక్రమాలన్నీ కూడా కేవలం తన అధికార దర్పం  హోదా ప్రదర్శించే అవకాశంగా మాత్రమే చేస్తూ వచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి.. తిరుమల దేవుడి ఆలయ సాంప్రదాయాలను, ఆగమవిధులను తన అధికార దర్పంతో దారుణంగా భంగపరిచారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి.. ఇవాళ్టి కూటమి ప్రభుత్వ నేతలను, వారి కుటుంబాలను చూసి.. భక్తి విశ్వాసాలు అంటే ఏమిటో తెలుసుకోవాలని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భార్య  అన్నా లెజినోవా.. తిరుమల వేంకటేశ్వరుని దర్శనానికి వెళ్లారు. తమ కుమారుడు మార్క్ శంకర్ సింగపూరులో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడడంతో, త్వరగా కోలుకోవాలని క్షేమంగా ఉండాలని ఆమె మొక్కుకున్నారు. నాలుగురోజుల్లో మార్క్ శంకర్ ఆరోగ్యం కుదుటపడడంతో సింగపూరు నుంచి పవన్ కుటుంబం స్వదేశానికి వచ్చిన వెంటనే ఆమె తిరుమలకు వచ్చారు. తిరుమలలో అడుగు పెట్టిన దగ్గరినుంచి ఆమె ప్రతి పనిని నిబంధనలకు అనుగుణంగా శాస్త్రోక్తంగా చూశారు. ఆమె జన్మతః క్రిస్టియను గనుక.. అన్యమతస్తులు సంతకం చేయాల్సిన డిక్లరేషన్ ఫారం మీద తొలుత సంతకం చేసిన తర్వాత.. విధ్యుక్తంగా వరాహస్వామిని తొలుత దర్శించుకున్నారు. మొక్కు చెల్లించుకునేందుకు ఆమె స్వామివారికి తలనీలాలు సమర్పించారు. శ్రీవారి అన్నప్రసాదం వితరణకు ఒక రోజు మధ్యాహ్నం భోజనానికి సరిపడా విరాళం రూ.17 లక్షల రూపాయలను ఆమె తమ కుమారుడు మార్క్ శంకర్ పేరిట అందజేశారు. తరిగొండ వేంగమాంబ అన్నదానసత్రంలో తాను స్వయంగా పాల్గొని కొందరు భక్తులకు వడ్డించారు. అక్కడే అన్నప్రసాదం స్వీకరించారు. సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకున్నారు.

చంద్రబాబునాయుడు కుటుంబం కూడా చాలా తరచుగా అన్నదాన సత్రంలో సేవలు అందిస్తుంటారు. ప్రతి సంవత్సరం ఒకరోజుకు సరిపడా అన్నదానానికి విరాళం ఇస్తుంటారు. అలాగే భువనేశ్వరి, బ్రాహ్మణి తదితరులు స్వయంగా అన్నదానసత్రంలో భక్తులకు వడ్డించే పనిలో కూడా పాల్గొంటూ ఉంటారు.

తాను క్రిస్టియను అయినప్పటికీ.. తిరుమలలో ఆగమ విధులను గౌరవిస్తూ డిక్లరేషన్ ఫారం మీద సంతకం చేయడానికి ఒప్పుకోని అహంకారపూరిత వ్యక్తి అయిన జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక్కసారైనా అన్నదాన సత్రంలో అన్నప్రసాదం స్వీకరించారా? అనేది ఇప్పుడు ప్రజలు అడుగుతున్న ప్రశ్న. ఆగమ శాస్త్రోక్తంగా సీఎం దంపతులు వచ్చి స్వామికి పట్టువస్త్రాలు సమర్పించాల్సి ఉండగా.. జగన్ అయిదేళ్లలో ఒ క్కసారి కూడా భార్య భారతితో కలిసి తిరుమలకు రానేలేదు. అన్నదాన సత్రంలో సేవలు చేయడం గానీ, టీటీడీకి ఒక్క రూపాయి అయినా సొంత డబ్బు విరాళం ఇవ్వడం గానీ ఇక ఊహకు కూడా అందని సంగతులు. అందుకే జగన్ చంద్రబాబు కుటుంబం, పవన్ కల్యాణ్  కుటుంబాలను చూసి బుద్ధి తెచ్చుకోవాలని ప్రజలు అంటున్నారు.

Jr. NTR To Make A Fierce Bollywood Debut with A Shirtless Action Entry In ‘War 2’  

Jr. NTR, who made a nation-wide sensation with his powerful portrayal of Komaram Bheem in RRR, is all set to make his entry into Bollywood with the eagerly awaited sequel War 2. With the unprecedented success of RRR, his popularity has reached dizzying heights, charming people with his emotional act and strong screen presence.

Now, with War 2, helmed by Ayan Mukerji, Jr. NTR is all set to prove his mettle in a new, electrifying avatar. The film, which is being produced by Yash Raj Films as part of their growing Spy Universe, is already generating tremendous buzz across India, particularly since NTR is going to share screen space with Bollywood biggie Hrithik Roshan. The film will be released pan-India grandly on August 14, 2025.

What is causing further buzz among enthusiasts is the buzz that NTR will be appearing in a dark role in War 2—for the first time in his acting career, not to mention as his first Hindi negative role ever. Gossips are coming out saying his role can potentially be even greater and intense compared to Hrithik Roshan’s, further stoking the anticipation fire.

Another thrilling update that has the fans abuzz is that NTR will be seen in an action sequence where he will be shirtless for a significant part of the scene, which could last 10 to 20 minutes. This is similar to his shirtless entry in Aravinda Sametha, and it’s likely to be a showstopper in War 2 too. The fight scene will apparently feature NTR’s rippling six-pack abs and will be one of the most eye-catching scenes in the movie.

With the movie already creating ripples, particularly in South India, War 2 is likely to make a record-breaking opening in the entire nation. With the excitement for Jr. NTR’s Bollywood debut building further, the fans are looking forward to the first teaser and formal announcements regarding the movie, which is generating more buzz for this high-octane action thriller.

TTD EO says Many Irregularities In TTD’s Goshala During YCP Regime, Deaths of cows kept out

TTD EO Shyamala Rao said that during the previous YSRCP regime, vigilance reports indicated many irregularities took place in TTD’s Goshala between 2021-24, and details of the cows that died  were hidden. He said that funds were misused in the name of fodder for cow shelters that did not have cows.

Speaking about alleged deaths of cows at SV Goshala at a media conference, he said during the last 10 months many cleansing programs were undertaken and infrastructure was improved in accordance with the sentiments of devotees. He said that the rules were violated in the appointment of high-level officers in the TTD IT department and irregularities were committed in the appointment of GM-level officers.

It was stated that massive irregularities had taken place due to the failure of the IT department and that a broker had obtained the service ticket 50 times. The TTD EO said that irregularities had taken place in the purchase of cow ghee and that the quality of Anna Prasadam was poor. He revealed that the supply of adulterated ghee has now been stopped.

Shyamala Rao said that  many irregularities had been committed in the name of organic prasadam to the Lord. He alleged that Rs. 25 crores had been paid for goods worth Rs. 3 crores. He said that vigilance officials were not allowed to enter the Goshala in 2023 fearing that irregularities would be exposed and that former TTD board chairman Karunakar Reddy made comments to hurt the sentiments of devotees.

The EO deplored that by making baseless accusations of 100 cow deaths during the last three months only to tarnish the image of the TTD  by spreading lies. He revealed that on an average, 15 cows die per month, and 43 cows have died in the past three months. He clarified that some of the cows taken from donors died of illness, and that it was untrue to say that no postmortem was done on the dead cows.