Home Blog Page 14

Vijay Deverakonda’s ‘KINGDOM’ Locks Release Date, Promo Raises Expectations  

Fans of Vijay Deverakonda have something to celebrate as his long-awaited action drama Kingdom is guaranteed to be released in theaters everywhere on July 31, 2025. After many delays, the makers have finally set a release date and it comes with much excitement.

To bring back that excitement, the team just recently released a pulse-pounding promo that showcases lots of action, interesting visuals, and the talent of Vijay playing multiple different intense avatars demonstrating his strong screen presence. Adding to the visuals is Anirudh Ravichander’s powerful background score which certainly adds to the adrenaline fueled promo.

The film also features Bhagyashri Borse in a leading role and is said to be based on the ethos of rebirth by using emotional depth and action. Kingdom is directed by Gowtam Tinnanuri,and this project is produced by Naga Vamsi and Sai Soujanya under Sithara Entertainments and Fortune Four Cinemas.

Kingdom seems to have everything going for it-a gripping story, solid performances and a large-scale film production that will position it to be one of the best Telugu films of 2025.

తీర్పు చిన్నదే.. సంకేతం పెద్దది: బయటకు రావడం కష్టం!

ఏపీలో సంచలనం సృష్టిస్తున్న మూడున్నర వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో తాజాగా సోమవారం నాడు ఒక తీర్పు వెలువడింది. మిగిలిన వాటితో పోల్చినప్పుడు.. నిజానికి ఇది చాలా చిన్న తీర్పు. కానీ ఈ కుంభకోణంలో పాత్రధారులైన నిందితులకు సంబంధించి ఈ తీర్పు ఇస్తున్న సంకేతం చాలా పెద్దది అని పలువురు భావిస్తున్నారు. మద్యం కుంభకోణంలో ఏ 1 నిందితుడు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డికి ప్రధాన అనుచరుడు చాణక్య. లిక్కర్ కంపెనీల నుంచి ముడుపుల వసూళ్ల నెట్వర్క్ నడిపించడంలో రాజ్ కేసిరెడ్డి తో సమానంగా కీలకంగా వ్యవహరించాడు. ఇతడిని ఏ8 గా కేసులో చేర్చగా ప్రస్తుతం అతను విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. తాజాగా అతని బెయిలు పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది.

ఇది ఒక్కరి బెయిలుకు సంబంధించిన పిటిషన్ గానీ.. లిక్కర్ స్కాం నిందితులు ఏ ఒక్కరు కూడా అంత తొందరగా బయటకు రాలేరని చెబుతున్న సంకేతం అని పలువురు విశ్లేషిస్తున్నారు.

ఈ కుంభకోణంలో ఇప్పటికే అనేక మంది బెయిలు పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. చాణక్య కేవలం రాక్ కేసిరెడ్డి ఆదేశాలకు అనుగుణంగా వసూళ్లు నడిపిస్తూ ఉండేవాడనేది కేసు. కేసులో మిగిలిన చాలామంది పెద్దలు.. ఇంతకంటే చాలా పెద్ద స్థాయిలో స్కాంలో పాత్ర పోషించిన వారే. చాణక్య కే బెయిల్ రాలేదంటే వారెవరికీ అంత సులువుగా రాదనే అర్ధం అని పలువురు వాదిస్తున్నారు. కొత్తగా జైలులో జత కలిసిన చెవిరెడ్డి లాంటి వాళ్ళు ఇంకా పలు దఫాలుగా బెయిలు పిటిషన్ వేయాల్సి ఉంది. అయినా ఫలితం మాత్రం ఉండదని అనడానికి ఈ తీర్పు నిదర్శనం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

వైఎస్ జయంతి: తల్లికి ఎదురుపడకుండా జగన్ సెపరేట్ టైమింగ్!

కడుపులో కత్తులు పెట్టుకుని పైకి మాత్రం చిరునవ్వులు చిందిస్తూ ఉండడం అని తెలుగులో ఒక సామెత ఉంటుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని చూసిన చాలా సందర్భాల్లో  ప్రజలకు అలా అనిపిస్తుంటుంది. ప్రత్యేకించి ఒకటి రెండేళ్లుగా.. ఇడుపులపాయలో వైఎస్సార్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలు జరిగేప్పుడు జగన్ ప్రజలకు ఇలా కనిపిస్తారు. కన్నతల్లి వైఎస్ విజయమ్మతో ఆయనకు కొన్నేళ్లుగా తీవ్రమైన విభేదాలు నడుస్తున్నాయి. అయినా సరే.. ఇడుపులపాయలో తల్లి ఎదురు పడినప్పుడు ఆయన చాలా కృతకమైన చిరునవ్వులు చిందిస్తారు.

ఆమె ఆయన నుదుట ముద్దులు పెడతారు. ఇద్దరి మధ్య ఈ దృశ్యం..  తొలిరోజుల్లో హృద్యంగానే ఉండేది గానీ.. ఇప్పుడు తల్లి మీద జగన్ కేసు నడుపుతున్న వివరం కూడా తెలిసిన వారికి నాటకీయంగా ఉంటుంది.  అయితే ఈ ఏడాది జూలై 8న వైఎస్సార్ జయంతి సందర్భంగా అలాంటి పరిస్థితి కూడా రాకుండా ఉండేందుకు జగన్ ముందే ప్లాన్ చేసినట్టు సమాచారం.

తండ్రి వైఎస్సార్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆల్రెడీ పులివెందుల నివాసానికి చేరుకున్నారు. మంగళవారం ఉదయం ఇడుపులపాయ వెళ్లి తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించాలనేది కార్యక్రమం. అయితే సాధారణంగా ఈ కార్యక్రమానికి వైఎస్ విజయమ్మ, షర్మిల కూడా హాజరు అవుతారు.  అయితే వారు వచ్చే టైమింగ్ కాకుండా.. వారు ఎదురు పడకుండా తన టైమింగ్ ప్లాన్ చేయాలని జగన్ తన అనుచరులను ఆదేశించినట్టు సమాచారం. 

ఇప్పటికే తల్లీ కొడుకుల మధ్య విభేదాలు తీవ్రంగా ఉన్నాయి. తల్లికి ఇచ్చిన షేర్ల గిఫ్ట్ డీడ్ రద్దు చేయాలని జగన్ దావా నడుపుతున్నారు. జగన్ మోసం చేస్తున్నాడని, అతనికి రద్దు చేసే హక్కు లేదని విజయమ్మ వాదిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కనీసం ఆమెకు ఎదురుపడడం కూడా ఇష్టం లేక జగన్ ఇలా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

మామిడి రైతులకు ఆశ చూపిస్తున్న వైఎస్సార్ సీపీ నేతలు!

చిత్తూరు జిల్లాలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇప్పుడు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. తోతపురి మామిడి రైతులను పరామర్శిస్తారు.. అనే సాకు చూపించి.. బంగారుపాలెంలో జగన్ మోహన్ రెడ్డి పర్యటించబోతున్నారు. కానీ.. జగన్ అక్కడకు వచ్చి పార్టీ తరఫున రైతులను ఆదుకోవడానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించబోతున్నారని వారు రైతులను మభ్యపెడుతున్నారు. కాబట్టి రైతులు అందరూ జగన్ పర్యటనకు ఇతోధికంగా హాజరు కావాలని నాయకులు  రైతులకు ఆశ చూపిస్తున్నారు.

జగన్ పర్యటనలకు జనాన్ని పోగేయడం స్థానిక నాయకులకు తలకు మించిన భారం అవుతోంది. అందుకే రైతులకు కిరాయి డబ్బు ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకు నేతలు కొత్త ఎత్తుగడ వేసారు. జగన్ మామిడి రైతులకు పార్టీ తరఫున భారీ సాయం ప్రకటిస్తారు అని చెబుతున్నారు. జగన్ పర్యటనకు వచ్చిన వాళ్లకు మాత్రమే ఈ సాయం అందు అందుతుందని అంటున్నారు.

మామిడి మార్కెట్ కు జగన్ రాకకోసం రైతులందరూ ఎదురు చూస్తున్నారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి చెప్పడం గమనార్హం. రైతులు జగన్ మీద కోటి ఆశలతో ఉన్నారన్నట్టుగా పెద్దిరెడ్డి చెప్పడం గమనార్హం.

జగన్ మీద రైతులు ఆశలు పెట్టుకోవటానికి రీజన్ ఏముంది. ఆయనతో మొర పెట్టుకుంటే ఒరిగేది ఏమీ లేదని వారికి తెలుసు. అందుకే వారు విముఖంగా ఉంటారని.. నాయకులు డైరెక్ట్ గా జగన్ నుంచి సాయం అందుతుందని మోసపూరిత మాటలతో రైతులను కార్యక్రమానికి తీసుకు రావాలని ప్రయత్నిస్తున్నారు.

ఆల్ ఆపరేషన్స్ ఫ్రమ్ యలహంక ప్యాలెస్ ఓన్లీ!

ఎంతచెడ్డా జగన్మోహన్ రెడ్డి రూటు సెపరేటు. ఆయన ఎదుటివాళ్ళ ఎలాంటి నిందలు వేస్తారో.. సరిగ్గా తను అలాంటి పనులే చేస్తున్నారు. ఎన్నికలకు ముందు.. చంద్రబాబును, పవన్ కళ్యాణ్ లను ఉద్దేశించి జగన్ ఒక విమర్శ చాలా తీవ్ర స్థాయిలో చేస్తుండేవారు. ఈ ఇద్దరు నాయకులకు రాజధానిలో ఇళ్లు లేవని.. వీళ్లను గెలిపిస్తే ఇక్కడ ఉండి రాజకీయం చేస్తారు తప్ప ఓడిపోతే హైదరాబాదుకు పారిపోతారని అంటుండే వాళ్ళు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? అచ్చంగా రివర్స్ జరుగుతోంది.

ఎన్నికల్లో ప్రజలు తనను అత్యంత నీచంగా ఓడించిన తరువాత.. జగన్ ఇంచుమించుగా బెంగళూరులోని యలహంక ప్యాలెస్ కి పరిమితం అయిపోయారు. పార్టీ నిర్వహణ పరంగా, వ్యక్తిగతంగా కూడా ఆయన ఆపరేషన్స్ అన్నీ అక్కడినుంచే నడిచిపోతున్నాయి. జిల్లాల యాత్ర అనే ప్రతిపాదన ఎటూ అటకెక్కి పోయింది. ఎక్కడికైనా పరమర్శలకు వెళ్ళినా కూడా..ముందురోజు బెంగళూరు నుంచి రావడం.. పని పూర్తి చేసుకుని వెళ్లిపోవడం జరుగుతోంది. చివరకు జగన్ రాజకీయ జీవితానికి మూలపురుషుడు అయిన వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని కూడా  అంతే మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు.

ఏడో తేదీ సాయంత్రం 5 గంటలకు బెంగళూరు నుంచి పులివెందుల చేరుకుని అక్కడి నివాసంలో రాత్రికి బసచేస్తారు జగన్. 

 మంగళవారం ఉదయం పులివెందుల నుంచి బయలుదేరి  గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు. అక్కడ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఘాట్‌లో ఆయన జయంతి సందర్భంగా నిర్వహించనున్న ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం పులివెందుల చేరుకుని క్యాంప్‌ కార్యాలయంలో స్ధానిక ప్రజలకు అందుబాటులో ఉంటారు. సాయంత్రం అక్కడి నుంచి తిరుగుపయనమవుతారు. అంటే తిరిగి బెంగళూరు వెళ్ళిపోతారన్నమాట.

బుధవారం మళ్లీ బెంగళూరు నుంచి హెలికాప్టర్లో రైతులను పరామర్శించాడానికి.. హెలికాప్టర్ లో వెళతారు.అంటే మొత్తంగా బెంగుళూరులోనే ఉంటున్నారన్నమాట. తనేదో కన్నడ రాష్ట్రంలో వ్యక్తి అయినట్టుగా ఆయన వ్యవహార సరళి ఉన్నదనే విమర్శ వినిపిస్తోంది. తండ్రి జయంతి సందర్భంగా కూడా టైం ఇవ్వలేనంత బిజీగా జగన్ ఉన్నారా అనే చర్చ వస్తోంది.

ఇలాంటి భరోసాను కదా ప్రజలు కోరుకునేది..

ఒకసారి ఎన్నికల్లో గెలిచిపోయిన తరువాత.. మళ్లీ ప్రజల ఎదుటకు రావడానికి నాయకులు ఇష్టపడరు గానీ.. నిజానికి ప్రజలు చాలా ఉదార స్వభావులు. అల్పసంతోషులు కూడా. నాయకులు వారికి కనిపించి, వారితో మాట్లాడి.. వారికి ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకుని.. వాటిని పరిష్కరించడానికి తాము శ్రద్ధగానే ఉన్నాం అని చెబితే  చాలు.. వారు తృప్తిగా ఉంటారు. నాయకులు తమను గెలిచిన తర్వాత అసలు పట్టించుకోలేదు అనే దిగులు లేకుండా ఉంటారు.

ఇప్పుడు చంద్రబాబు నాయుడు సంకల్పానికి ప్రతిరూపంగా.. టీడీపీ, కూటమి పార్టీల నాయకులు అందరూ.. సుపరిపాలనలో తొలిఅడుగు పేరిట నియోజకవర్గాల్లో ఇంటింటికీ తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా పల్లెల్లో పర్యటిస్తున్న ఎమ్మెల్యేలు ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను, నెరవేర్చిన హామీలను ప్రజలకు తెలియ చెబుతూన్నారు. అలాగే ప్రజలు కూడా స్థానికంగా వాటికి ఉన్న సమస్యలను నాయకులకు నివేదిస్తున్నారు. కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరిస్తూ.. కొన్నిటి విషయంలో సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇస్తూ నాయకులు ముందుకు సాగుతున్నారు. 

మొత్తానికి సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం పూర్తిగా సుహృద్భావ వాతావరణంలో ప్రశాంతంగా జరుగుతోంది. కూటమిపార్టీల నాయకులు కూడా తమ ఎన్నికల హామీల్లో ఏమేం పెండింగ్ ఉన్నాయో.. ముందుగానే చెప్పి.. వాటిని ఎప్పటిలోగా అమలు చేస్తామో కూడా ప్రజలకు చెబుతున్నారు. సూపర్ సిక్స్ హామీలకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని తమ చిత్తశుద్ధిని నాయకులు ప్రకటిస్తున్నారు. ఎన్నికలు దగ్గరపడినప్పుడు మళ్ళీ ప్రజల వద్దకు రావడం కాకుండా.. ఏడాదికే నాయకులు తమ ఇళ్ల వద్దకు వచ్చి సమస్యలు అడిగి తెలుసుకోవడం ప్రజల్లో సంతోషం నింపుతోంది.

కాంతారా చాప్టర్‌ 1 పోస్టర్‌ విడుదల..!

కన్నడ సినిమాల్లో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కాంతార చిత్రం దేశవ్యాప్తంగా ఎంతటి ప్రభావం చూపిందో తెలిసిందే. ఈ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా రిషబ్ శెట్టి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. అతను రూపొందించిన అద్భుతమైన నాటురల్ బేస్డ్ కథనం, నేపథ్యం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఆ విజయాన్ని మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్లేందుకు ఇప్పుడు ఈ చిత్రానికి ప్రీక్వెల్ రూపొందిస్తున్నారు.

ప్రస్తుతం ఈ ప్రీక్వెల్ చిత్రానికి సంబంధించిన షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. అయితే జూలై 7న రిషబ్ శెట్టి పుట్టినరోజు సందర్భంగా మూవీ టీం ఒక స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది. అందులో ఆయన యుద్ధవీరుడిగా కనిపిస్తున్నాడు. ఒక చేతిలో గొడ్డలి, మరో చేతిలో కవచం పట్టుకుని సిద్ధంగా ఉన్న తీరు పోస్టర్‌ను చూడగానే ఆసక్తిని కలిగిస్తోంది. ఈ పాత్ర కోసం రిషబ్ శెట్టి పూర్తిగా శారీరకంగా, మానసికంగా తన్ను తాను మార్చుకున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.

ఈ సినిమాలో కూడా కాంతార స్టైల్‌ను కొనసాగిస్తూ, మరింత డీప్‌గా కథను తీసుకెళ్లేలా దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు. ఎమోషన్, ఆధ్యాత్మికత, యాక్షన్ మిక్స్‌తో ప్యాన్ ఇండియా ప్రేక్షకులను కదిలించేలా చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు.

ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా అజనీష్ లోక్‌నాథ్ మరోసారి పని చేస్తున్నారు. ఆయన అందించిన మ్యూజిక్‌ ఇప్పటికే కాంతారలో ఎంత గట్టిగా పని చేసిందో గుర్తుండే ఉంటుంది. అలాగే ఈ ప్రాజెక్టును హొంబాలే ఫిలింస్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇప్పుడు ఈ సినిమాను అక్టోబర్ 2న థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు.

ఇదంతా చూస్తుంటే రిషబ్ శెట్టి ‘కాంతార చాప్టర్ 1’తో మరొసారి దేశవ్యాప్తంగా ఒక పెద్ద ప్రభంజనాన్ని లేచ్చేందుకు రెడీగా ఉన్నట్టు స్పష్టమవుతోంది.

షూటింగ్‌ మొదలు పెట్టిన పూరి-సేతుపతి మూవీ!

టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చాలా కాలం తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌కి శ్రీకారం చుట్టారు. మరీ విశేషంగా చూస్తే తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతితో కలిసి ఈ సినిమా చేయటం విశేషమే. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ అధికారికంగా అనౌన్స్ అయిపోయింది. ప్రస్తుతం యూనిట్ షెడ్యూల్ ప్రకారం ముందుకెళ్తోంది. నటీనటుల ఎంపిక పనులు పూర్తయ్యి, షూటింగ్ కూడా మొదలు పెట్టారు.

హైదరాబాద్‌లో స్పెషల్‌గా రూపొందించిన సెట్లో సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను తాజాగా మొదలు పెట్టారు. మొదటి షెడ్యూల్‌లో విజయ్ సేతుపతితో పాటు సంయుక్త మీనన్ కూడా పాల్గొంటున్నారు. వీరిద్దరిపై కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. యాక్షన్‌, డ్రామా మిక్స్‌గా కొన్ని ముఖ్యమైన సీన్లను ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించబోతున్నట్టు సమాచారం.

ఇందులో టాలెంటెడ్ నటి టబు, విలన్‌గా దునియా విజయ్ వంటి నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను పూరి జగన్నాథ్ తన బ్యానర్ పూరి కనెక్ట్స్ మీద ఛార్మితో కలిసి నిర్మిస్తున్నారు. విజయ్ సేతుపతి టాలెంట్‌కు, పూరి డైరెక్షన్‌కు ఫ్యాన్స్‌లో భారీగా ఆసక్తి నెలకొంది. ఈ కాంబినేషన్ నుంచి ఏ రేంజ్ ఎంటర్టైనర్ వస్తుందో అని ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతున్నాయి.

సరికొత్త విడుదల తేదీతో రానున్న ‘కింగ్డమ్’ ప్రోమో..!

విజయ్ దేవరకొండ ప్రస్తుతం నటిస్తున్న “కింగ్డమ్” సినిమా చుట్టూ భారీ క్రేజ్ కొనసాగుతోంది. గతంలో ఈ సినిమా రిలీజ్‌ను పలు కారణాల వల్ల వాయిదా వేయడంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ప్రస్తుతం ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా, యాక్షన్‌, ఎమోషన్‌ కలగలిపిన ఓ ఇంటెన్స్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. విజయ్ ఈ సినిమాలో పూర్తి భిన్నమైన గెటప్‌లో కనిపించనున్నాడు. ఇప్పటివరకు అతడు చేసిన పాత్రలకు భిన్నంగా ఈ సినిమాలో ఆయన నటన మరో స్థాయిలో కనిపించనుందని చిత్ర బృందం చెబుతోంది.

ఇక చాలా రోజులుగా ఎదురుచూస్తున్న రిలీజ్ డేట్ విషయాన్ని క్లారిఫై చేస్తూ, మేకర్స్ ఓ స్పెషల్ ప్రోమో ద్వారా రిలీజ్ డేట్‌ను రివీల్ చేయబోతున్నట్టు వెల్లడించారు. ఈ ప్రోమోను ఈరోజు సాయంత్రం 7.03కి విడుదల చేయనున్నారు. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందో అనే విషయంపై తేలిపోయే అవకాశం ఉంది.

ఈ సినిమాలో విజయ్ సరసన భాగ్యశ్రీ బొర్సె కథానాయికగా నటిస్తుండగా, సంగీతాన్ని అనిరుధ్ రవిచందర్ అందిస్తున్నాడు. ఇక ఈ ప్రాజెక్ట్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై ఉన్న అంచనాలు, క్యూరియాసిటీ చూస్తుంటే ఇది విజయ్ దేవరకొండ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనుందని చెప్పవచ్చు.

బాలయ్యతో వెంకీ మామ!

టాలీవుడ్‌లో మల్టీస్టారర్ సినిమాలకు ఎప్పటినుంచో ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అందులోనూ బడా హీరోలు కలసి ఒకే సినిమాలో కనిపించబోతున్నారని తెలిసితే, ఆ ప్రాజెక్ట్‌ మీద అభిమానుల్లో తక్కువ ఆసక్తి ఉండదు. ఇప్పుడు అలాంటి ఓ మల్టీస్టారర్ మూవీకి సంబంధించి టాలీవుడ్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి.

నందమూరి బాలకృష్ణ, వెంకటేష్ కలిసి ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. ఇటీవల అమెరికాలో జరిగిన తానా ఈవెంట్‌లో వెంకటేష్ పాల్గొన్న సమయంలో, తన నెక్స్ట్ సినిమాల లైన్‌ప్ గురించి ఓమారు చెప్పేసాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తానని, చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్నట్లు తెలిపాడు. అలాగే మీనా నటించే ‘దృశ్యం 3’లో కూడా భాగం అవుతున్నట్లు చెప్పాడు. అంతేకాదు, అనిల్ రావిపూడితో మరో సినిమాతో పాటు బాలకృష్ణతో కలిసి మల్టీస్టారర్ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు ప్రకటించేశాడు.

ఈ విషయాలు బయటకు రాగానే వెంకటేష్ ఫ్యాన్స్‌తో పాటు బాలయ్య అభిమానుల్లో కూడా పండుగ వాతావరణం నెలకొంది. ఇప్పుడు ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడుతున్నాయి. అయితే ఈ ఇద్దరు స్టార్ హీరోలను స్క్రీన్‌పై చూపించనున్న దర్శకుడు ఎవరు అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. దర్శకుడు ఎవరైనా అయిపోకుండా మంచి కథ, బలమైన స్క్రీన్‌ప్లే ఉంటే మాత్రం ఈ మల్టీస్టారర్ సినిమాను మిస్ అవ్వలేని అద్భుతంగా మలచవచ్చని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.

ఇకపోతే బాలకృష్ణ, వెంకటేష్ ఇద్దరూ గతంలో ఒక్కట్రెండు సందర్భాల్లో కలిసి ఫ్రేమ్‌ షేర్ చేసుకున్నా, ఒక ప్రాపర్ మల్టీస్టారర్‌గా మాత్రం స్క్రీన్‌పై కనిపించడం ఇదే ఫస్ట్ టైం అవుతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ కాంబినేషన్‌కి స్క్రిప్ట్ ఎలా ఉండబోతుందో, నిర్మాతలు ఎవరు అనే విషయాలు త్వరలో బయటకొచ్చే అవకాశముంది.