ఎలాంటి శషబిషలకు ఆస్కారం లేదు. ఆయన ఎవరి మెహర్బానీ కోసం ప్రయత్నించడం లేదు. తన బృందాల పరిశీలనలో, తన అనుభవంలో తన బుద్ధికి తోచినదేదో విస్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టుగా చెబుతున్నారు. ఆయన ఎన్నికల వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా విస్తృతమైన కీర్తి ప్రతిష్టలను ఆర్జించిన ప్రశాంత్ కిషోర్ కాగా- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన ఆయన వెల్లడిస్తున్న తాజా సంగతి జగన్ మళ్ళీ గెలవడం అసాధ్యం అనేదే! గత 2019 ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించి అధికారం ఏర్పాటు చేయడంలో కీలకంగా నిలిచి, అవసరమైన వ్యూహాలను తమకు అందించిన వ్యక్తే.. ఈసారి తాము గెలవడం లేదని బహిరంగ వేదికల మీద చెప్పేస్తుండడంపై జగన్ కోటరీలో భయం మొదలవుతోంది. జగన్ కూడా పీకే వ్యాఖ్యలపట్ల విపరీతమైన అసహనానికి గురవుతున్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది.
జగన్మోహన్ రెడ్డి ఓటమి గురించి ప్రశాంత్ కిశోర్ జోస్యం చెప్పడం ఇది మొదటి సారి కాదు. గతంలో ఇండియాటుడే వారి కార్యక్రమంలో కూడా ఆయన జగన్ గురించి ఇదే అంచనాలను వెల్లడించారు. జగన్ తనను తాను ఒక రాజులా భావించుకుంటున్నారని, ప్రజలకు అవసరమైనవన్నీ తాను ఇచ్చేస్తే చాలునని, ఇక రాష్ట్ర అభివృద్ధి గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదని ఆయన భావిస్తున్నారని పీకే అంచనా వేశారు. ప్రజలు తనకు ఎన్నటికీ విధేయులుగా పడి ఉండాలని జగన్ కోరుకుంటున్నారని, తనను ప్రజలు దేవుడిగా చూడాలని కూడా అనుకుంటున్నారని ప్రశాంత్ కిశోర్ ఆయన విశ్లేషణను వెల్లడించారు. అయితే ఇలాంటి వైఖరి ప్రజాస్వామ్యంలో పనిచేయదన్న పీకే.. జగన్ ఓటమి తథ్యం అని గతంలో అన్నారు.
ఈదఫా పీటీఐ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంకాస్త విపులంగా ఛత్తీస్ గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ పతనాన్ని జగన్ కు జరగబోయే దానికి ఉదాహరణగా చెప్పడం విశేషం. ఆయన కూడా కేవలం తాయిలాలు ఇవ్వడమే తప్ప యువతకు ఉద్యోగాల కల్పేన గురించి గానీ.. అభివృద్ధి గురించి గానీ పట్టించుకోలేదని అన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులకు ఒక సహజమైన అలవాటు ఉంది. ఎవరి గురించి అయినా వారు భయపడినప్పుడు, ఆ భయంలో విపరీతంగా విమర్శల దాడికి దిగుతారు. పచ్చి బూతులు లంకించుకుంటారు.
గతంలో పీకే మాట్లాడినప్పుడు కూడా ఇదే జరిగింది. ఆయనకు పిచ్చి పట్టిందని, చెల్లని నాణెం అని రకరకాల నిందలు వేశారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారం సమయంలో.. పీకే మాటలు రాష్ట్రంలోని తటస్థ ఓటర్లలను ఎంతో కొంత మేర ప్రభావితం చేయగల అవకాశం ఉన్న తరుణంలో జగన్ బ్యాచ్ లో అసహనం తారస్థాయికి చేరుతున్న్టట్టు తెలుస్తోంది. రాబోయే కొన్ని రోజుల పాటు పీకేను తిట్టడం కూడా ఎజెండాగా పెట్టుకున్నట్టుగా పార్టీ వర్గాలద్వారా తెలుస్తోంది.
పీకే పునరుద్ఘాటన : జగన్ కోటరీలో భయం భయం!
కౌంటర్లు ఇచ్చే కొద్దీ చెలరేగిపోతున్న షర్మిల!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అధినేత మళ్లీ ఒక్కచాన్స్ ముఖ్యమంత్రి అయితే చాలు.. ఇంకో ముప్పయ్యేళ్ల పాటు ముఖ్యమంత్రి పీఠం మీద నుంచి తనను ఎవ్వరూ కదలించలేరు అనే ఆశితో అడుగులు వేస్తున్న జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ షర్మిల తన మాటల బాణాలతో భయం పుట్టిస్తున్నారు. చిన్నాన్న వివేకానందరెడ్డి హంతకులు మళ్లీ పార్లమెంటులో అడుగుపెట్టకుండా అడ్డుకోవడానికి, హంతకులకు మద్దతు ఇస్తున్న అన్న జగన్మోహన్ రెడ్డి అరాచకాలను ప్రశ్నించడానికి మాత్రమే తాను కడప ఎంపీ సీటు నుంచి పోటీచేస్తున్నాలని షర్మిల గట్టిగానే చెబుతున్నారు. చెల్లెళ్లను తనమీదికి చంద్రబాబునాయుడు ఉసిగొల్పారని జగన్ చెబుతున్న మాటలు పెద్దగా పనిచేయడం లేదు. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డిని కాపాడుకోవడానికి, తమ అనుచరులు, సలహాదారుల ద్వారా షర్మిల మీద విమర్శలు చేయిస్తున్నారు జగన్. అయితే.. తనకు జగన్ పార్టీనుంచి కౌంటర్లు వస్తున్న కొద్దీ.. షర్మిల మరింతగా చెలరేగిపోతుండడం గమనార్హం.
వివేకానందరెడ్డి హత్యలో అవినాష్ రెడ్డి ప్రమేయం ఏమీ లేనేలేదని, వివేకా హత్య తరువాత ఎర్ర గంగిరెడ్డి రక్తపు మరకలను తుడిచేస్తూ ఉంటే అవినాష్ రెడ్డి కేవలం చూస్తూ పక్కన నిల్చున్నాడని.. షర్మిల మేనమామ రవీంద్రనాధ్ రెడ్డి ఆయనకు కితాబు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనికి షర్మిల ఒక రేంజిలో కౌంటర్ ఇచ్చారు.
నెత్తుటిమరకలు తుడిచేస్తోంటే చూస్తూ నిల్చోవడానికి అవినాష్ ఏమైనా పాలుతాగే పసిబిడ్డా అని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఎంపీ గా పోటీచేయాలనుకుంటున్న వ్యక్తికి ఆమాత్రం తెలియదా అని అంటున్నారు. తెలంగాణను వదిలేసి తాను ఇక్కడకు వచ్చానని మేనమామ రవీంద్రనాధ్ రెడ్డి అన్నందుకు.. ‘అక్కడ కేసీఆర్ ను ఓడించానని, ఏపీలోనూ జగన్ ను ఇంటికి పంపడానికే ఇక్కడకు వచ్చానని’ షర్మిల కౌంటర్ ఇవ్వడం గమనార్హం.
జగన్ తరఫున ఆయన వాయిస్ ను వినిపిస్తూ ఉండే సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ వివేకానందరెడ్డి హత్య వ్యక్తిగత వ్యవహారం అంటూ చేసిన వ్యాఖ్యలపై కూడా షర్మిల ఫైర్ అయ్యారు. సీఎంగా చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి తమ్ముడు, మాజీ ఎంపీ, మాజీ మంత్రి దారుణంగా హత్యకు గురైతే అది వ్యక్తిగత విషయమా? అని ఆమె కౌంటర్ ఇచ్చారు.
మొత్తానికి బంతిని నేలకేసి కొడితే.. అది ఆకాశానికేసి ఎగిరినట్టుగా షర్మిలతో వ్యవహారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా పరిణమిస్తోంది. ఆమె విమర్శలను పట్టించుకోకుండా ఉంటే నష్టం తప్పదు. అలాగని.. వాటికి పార్టీ నాయకులతో కౌంటర్లు ఇప్పిస్తే ఆమె మరింతగా రెచ్చిపోతూ ఆ కౌంటర్లను కూడా ప్రచారానికి వాడుకుంటూ చెలరేగుతున్నారు. షర్మిల విషయంలో వైసీపీ ఇరకాటంలో పడుతున్నదని ప్రజలు అనుకుంటున్నారు.
గద్దె ఎక్కించినవాడే.. పతనానికి జోస్యం చెప్పాడు!
2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రజలను నమ్మించడంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వ్యూహచతురత చాలా ఉన్నదని అప్పటి వ్యవహారాలు తెలిసిన చాలామంది అంటూ ఉంటారు. ‘ఒక్క ఛాన్స్’ వంటి నాటకీయ అభ్యర్థనల నుంచి, ‘రావాలి జగన్ కావాలి జగన్’ వంటి నినాదాల రూపకల్పన వరకు , పాదయాత్ర ఆలోచనతో సహా ప్రజలను ఆకర్షించిన అనేకానేక హామీల ప్రకటన వరకు- వాటి వెనుక ప్రశాంత్ కిశోర్ నైపుణ్యాలు ఉన్నాయని చాలా మంది అంటుంటారు. ఆ స్థాయిలో జగన్ కోసం పనిచేసి, ఆయనను గద్దె మీద కూచోబెట్టిన వ్యూహకర్తే ఇప్పుడు జగన్ కు ఓటమి తప్పదని తెగేసి చెబుతున్నారు. జగన్ ఈ అయిదేళ్లలో అనుసరించిన విధానాలే ఆయన పతనాన్ని శాసిస్తున్నాయని కూడా అంచనా వేస్తున్నారు.
జగన్ తో కొంతకాలం పనిచేసిన తర్వాత గానీ.. ఆయనలో మోనార్క్ వైఖరి ఉన్నదని ప్రశాంత్ కిశోర్ కు అర్థమైనట్లు లేదు. ఆయన ముఖ్యమంత్రి లాగా కాకుండా, మోనార్క్ లాగా పరిపాలన సాగిస్తున్నారని పీకే అంటున్నారు. అధికారంలోకి వచ్చిన నాటినుంచి ప్రభుత్వం సొమ్మును తాయిలాల రూపంలో పంచిపెట్టడం తప్ప.. జగన్ ప్రజలకు చేసిన మంచి మరేమీ లేనేలేదని చెప్పడం విశేషం. రాష్ట్రంలో ఏ చిన్న అభివృద్ధి పని కూడా జరగలేదని అంటున్నారు.
జగన్ పతనం ఎలా ఉంటుందో చెప్పడానికి పీకే, ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ ఉదాహరణ తీసుకోవడం గమనార్హం. ఆయన మాదిరిగా ప్రజలకు తాయిలాలు ఇచ్చారు తప్ప ప్రజల ఆకాంక్షలను ఏమాత్రం పట్టించుకోలేదని.. కేవలం నగదు బదిలీ తప్ప ఉద్యోగాల కల్పన వంటి పనులు జరగలేదని.. ఈ వైఖరి ఎన్నికల్లో గెలిపించదని ప్రశాంత్ కిశోర్ వివరించారు.
బఘేల్ తో పోల్చి తాయిలాల రాజకీయాల వల్ల జగన్ కూడా ఓడిపోతున్నారని ప్రశాంత్ కిశోర్ అంచనా వేయడం బాగానే ఉది గానీ.. వాస్తవానికి ఆయన గుర్తించని సంగతులు ఇంకా చాలా ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన నాటినుంచి జగన్ సాగించిన విధ్వంసం అరాచకాల మాటేమిటి? ఇసుక రూపేణా గానీ, లిక్కర్ వ్యాపారం రూపేణా గానీ.. ప్రతినెలా వేల కోట్ల రూపాయలు దోచుకుంటూ వస్తున్న మాటేమిటి? అని ప్రజలు విస్తుపోతున్నారు. ఇవన్నీ కూడా ఏపీ ప్రజలు గమనిస్తున్న విషయాలే. కాకపోతే.. మధ్యలో తీర్పు చెప్పే అవకాశం వారికి ఉండదు. ఇప్పుడు తీర్పు చెప్పే సమయం వచ్చింది గనుక.. ఇన్నాళ్లు తాము గమనించిన పాపాలన్నింటికీ కలిపి ఒకే తీర్పు ఇవ్వబోతున్నారు అనే సంగతిని పీకే మిస్సయినట్లున్నారు.
షర్మిల వ్యూహం.. జగనన్న జట్టునుంచే మద్దతు!
వైఎస్ షర్మిల కడప ఎంపీ ఎన్నికల బరిలో నెగ్గడానికి బహుముఖ వ్యూహంతో ముందుకెళుతున్నారు. సిటింగ్ ఎంపీ, వైసీపీ తరఫున పోటీచేస్తున్న అవినాష్ రెడ్డిని.. తన చిన్నాన్న వివేకానందరెడ్డిని చంపిన హంతకుడు- కాబట్టి అవినాష్ ను రెండోసారి చట్టసభలో అడుగుపెట్టకుండా చూడడం తన లక్ష్యం అంటూ షర్మిల అడుగడుగునా తన ప్రసంగాల్లో చెబుతున్నారు. కడప ఎంపీ నియోజకవర్గం పరిధిలోని ఓటర్లలో వివేకా హత్య గురించి అసలు సంగతులను వెల్లడించడం ద్వారా.. వారి ఆలోచన మార్చి తాను గెలవాలనేది ఆమె ప్రయత్నం.
అదొక్క వ్యూహంతో ఆమె ఊరుకోవడం లేదు. వివేకా కూతురు సునీతను కూడా పూర్తిస్థాయిలో ప్రయోగిస్తున్నారు.
సునీతా రెడ్డి దాదాపుగా ఎన్నికల ప్రచారంలో ప్రతిరోజూ షర్మిల వెంట పాల్గొంటున్న సంగతి అందరికీ తెలిసిందే. తన తండ్రిని చంపిన వారికి శిక్ష పడే వరకు తాను నిద్రపోనని, అవినాష్ రెడ్డిని, జగన్ రెడ్డిని ఓడించాలని ఆమె సింగిల్ పాయింట్ ఎజెండాతో షర్మిలకు ప్రచారంలో సహకరిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు కాగా.. ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల నుంచి కూడా తన పోరాటానికి మద్దతు కోరడం విశేషం.
సునీతా రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నియోజకవర్గంలో కీలకంగా ఉన్న నాయకులను కూడా వారి ఇళ్లకు వెళ్లి కలుస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో తాను ఎంపీగా గెలిచేందుకు మద్దతు ఇవ్వాలని ఆమె వారిని కోరుతున్నారు. ఇవి కూడా కొంతమేరకు షర్మిలకు అనుకూలంగా పనిచేసే అవకాశం ఉన్నదని పలువురు అంచనా వేస్తున్నారు.
సునీతా తాజాగా పులివెందుల నియోజకవర్గం పరిధిలోని వేంపల్లెలో ఉన్న మాజీ ఎమ్మెల్సీ సతీష్ కుమార్ రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు రవికుమార్ రెడ్డి, జడ్పీటీసీ మాజీ సభ్యుడు ఎస్.ఎఫ్. బాషా నివాసాలకు వెళ్లారు. సునీత పులివెందుల పరిధిలోని ఇంటింటికీ వెళ్లి.. తన తండ్రిని ఎంత దారుణంగా చంపారో, తనకు ఎలాంటి అన్యాయం జరిగిందో వివరిస్తున్నారు. అదే క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలను కూడా కలిసి ఆమె మద్దతు అభ్యర్థించడం..
షర్మిలకు అనుకూలంగా ఎన్నికల్లో పనిచేయాలని, ఆమెను గెలిపించాలని కోరడం విశేషమే. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో టెక్నికల్ గా ఉన్నప్పటికీ.. అందరూ వైస్ రాజశేఖర రెడ్డి భక్తులే కాబట్టి.. వివేకా హత్య అనే అంశం మీద జరుగుతున్న ఈ ఎన్నికల్లో సునీతకు మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నదని, బహిరంగంగా కాకపోయినా.. తెరవెనుక నుంచి అయినా షర్మిల విజయానికి వైసీపీ నాయకులు పలువురు దోహదం చేయవచ్చునని పలువురు భావిస్తున్నారు.
BJP Facing Rough Weather With Anaparthy Seat
In most of the seats, where BJP is contesting in Andhra Pradesh after finalizing seat adjustments with TDP and Jana Sena, the party has nominal presence. Mostly depending upon support receiving from TDP and Jana Sena.
Though BJP never seen as a potential player in Anaparthy assembly constituency, it got the seat and announced ex-servicemen Sivaramakrishnam Raju as its candidate. Traditionally, after Prakasam district to Srikakulam, this is the only constituency where Reddys are having considerable presence and whichever party may be fielding a Reddy candidate.
Ironically, even before reaching into alliance with BJP in its first list TDP announced Nallamilli Ramakrishna Reddy as its candidate from here and he has already started his poll campaign. Now, giving this seat naturally receiving resistance from his supporters. Moreover, BJP candidate was earlier failed even to get deposit by contesting as Sarpanch in his village.
BJP is more worried as this assembly segment is part of Rajamahendravaram Lok Sabha constituency, from where state party chief and former union minister D Purandeswari is contesting. BJP fearing that fielding a weak candidate in Anaparthy may have its impact on Lok Sabha seat also.
According to sources, Purandeswari personally met TDP candidate Ramakrishna Reddy and asked him to join BJP and contest as BJP candidate. But, he has bluntly refused her invitation and made it clear he has not need to leave TDP.
Even after the BJP announced its candidate, Ramakrishna Reddy extensively campaigning in villages. Two days ago, he also met party chief Chandrababu Naidu and requested him to do justice to him. His followers are insisting him to contest even as an independent, if BJP is adamant to contest from here.
Manwhile, as section of BJP are suggesting that TDP may take this seat and may allot another seat for BJP in Chittoor district or elsewhere.
Rahul Gandhi Warns Truth Of Phone Tapping Will Come Out Soon
Accusing that BRS chief and former chief minister K Chandrasaekhar Rao in Telangana and Prime Minister Narendra Modi in India tapped phones of political opponents, Congress former chief Rahul Gandhi warned that truth will come out soon.
Addressing a Congress election rally Jana Jatara Sabha in Thukkuguda near Hyderabad, he alleged “Like how your former CM (KCR) resorted to phone tapping in Telangana, Prime Minister Narendra Modi tapped phones in India.”
He accused Rao of misusing police and intelligence systems as Chief Minister. He alleged that thousands of phones were tapped and the BRS regime resorted to destruction of data pertaining to the snooping operation immediately after the change in government in December.
He said that the Congress government in Telangana has initiated an inquiry into the phone tapping issue and the truth will come out soon. He accused that KCR had shattered the dreams of the people with his misrule for 10 years.
“The People of Telangana dreamt of statehood with a hope that they will get justice. The Congress has fulfilled this dream. But Chandrashekar Rao has shattered their dreams with his misgovernance,” Gandhi said.
In a scathing attack against the BJP-led Central government, former AICC president alleged that the electoral bonds scheme was the “world’s biggest scam” and claimed that Prime Minister Narendra Modi had appointed “his people” in the Election Commission. He said under the BJP regime, the Enforcement Directorate had become an ‘extortion directorate’.
Rahul Gandhi alleged that nearly 30 farmers were committing suicides in India every day. The Modi government waived loans to the tune of Rs 16 lakh crore of the rich, while he did not waive off even a single rupee of farmers’ loans. He also alleged that after Modi’s government assumed office, crores of people became poor in the country.
Chief Minister Revanth Reddy said KCR is destined to go to Charlapalli jail. The government will construct a double bed room house for him on the jail premises so that his entire family can be in jail, he said.
AAP Holds ‘Mass Fast’ To Protest Arvind Kejriwal’s Arrest
Aam Aadmi Party (AAP) leaders and workers are observing a ‘samuhik upwas’ (mass) fasting to protest against the arrest of Delhi Chief Minister and party national convener Arvind Kejriwal in the Delhi liquor policy on Sunday. The Delhi ruling party held an agitation at Jantar Mantar.
While AAP ministers, including Atishi, gathered at Jantar Mantar for the fast, protests were being held in other states too. AAP leaders, including Delhi Assembly Speaker Ram Niwas Goel, Deputy Speaker Rakhi Bila, ministers Atishi, Gopal Rai and Imran Hussain attended the day-long ‘Samuhik Upwas’ at Jantar Mantar in the national capital from 11 am.
Atishi, who arrived at the Jantar Mantar, told reporters that the people of Delhi wanted Kejriwal’s release. “People of Delhi love Arvind Kejriwal. They don’t think of him as a chief minister but as their son, or brother. They want Kejriwal to be out on bail,” she said.
Delhi Minister Gopal Rai said, “Ever since Delhi Chief Minister Arvind Kejriwal was arrested, there has been anger against it in the entire country. From the day of arrest on March 21 to till now, people are on the streets, getting themselves arrested even today, people across the country and the world are observing a mass fast for Kejriwal.”
Meanwhile, the AAP asked party workers to post their photos while observing fasts on a website and also post on X. “Today from 10 AM onwards, the entire nation will observe a fast against the conspiratorial arrest of @ArvindKejriwal ji. Send us your photos and messages while fasting on this website – kejriwalkoaashirvaad.com. Do not forget to tag us with the photos of your fast on Twitter. Dictatorship will lose, democracy will win,” the post read.
Meanwhile, Punjab Chief Minister Bhagwant Mann joined a collective fast at freedom fighter Bhagat Singh’s village Khatkar Kalan. He paid tributes to the freedom fighter before embarking on the fast.
Protests were being held by Indians abroad too, including at Harvard Square in Boston, the Hollywood Sign in Los Angeles, outside the Indian Embassy in Washington DC, in New York Times Square and Toronto, London and Melbourne among others, party leaders said.
Meanwhile, the Delhi unit of the BJP countered the fast by holding a ‘Sharab sheesh mahal’ campaign. BJP Delhi president Virendraa Sachdeva told reporters that the campaign aimed at “unveiling the corruption model of Kejriwal.”