Home Blog Page 1052

విజయ్‌ దేవరకొండ తరువాత సినిమాలో హీరోయిన్‌ ఎవరంటే!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ గురించి ఇండస్ట్రీకి పెద్దగా పరిచయం అక్కర్లేదు… స్నేహితుడి పాత్రలు చేస్తూ నెమ్మది నెమ్మదిగా హీరోగా ఎదిగి సినీ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని…ఫ్యాన్‌ బేస్‌ ని ఏర్పరచుకున్నాడు. తన డైలాగ్‌ డెలివరీ, నటనతో అమ్మాయిల మనసులు దోచుకున్నాడు.

తాజాగా విజయ్ సినిమా ఫ్యామిలీ స్టార్‌ అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయినా నిరాశ చెందని విజయ్‌ తన తరువాత సినిమా మీద ఫుల్‌ ఫోకస్‌ పెట్టినట్లు తెలుస్తుంది.  విజయ్‌ తన తరువాత సినిమాని డైరెక్టర్‌ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాకి వీడీ 12 అనే వర్కింగ్‌ టైటిల్‌ ని పెట్టారు.. త్వరలోనే సినిమా పేరును ఖరారు చేస్తారనే టాక్‌. ఇక్కడ వరకు బాగానే ఉన్నా… ఈ సినిమాలో విజయ్‌ సరసన కథానాయికగా ఆడిపాడేది ఎవరూ అనే సందేహం అందరిలోనూ ఉంది. ఈ క్రమంలోనే దీనికి సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

అది ఏంటంటే.. ప్రేమలు సినిమాలో నటించిన మమితా బైజుని ఈ సినిమాలో హీరోయిన్‌ గా తీసుకుంటున్నట్లు ఓ వార్త ప్రచారం చేస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం మరో హీరోయిన్‌ పేరు కూడా పరిశీలనలో ఉది. ఆమె ఎవరో కాదు మిస్టర్ బచ్చన్‌ హీరోయిన్‌ భాగ్యశ్రీ బోర్స్‌ పేరు కూడా తెర మీదకు వచ్చింది.

మరి ఏ ముద్దుగుమ్మ విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేసే అవకాశం దక్కించుకుంటుందో వేచి చూడాలి. ఈ స్పై థ్రిల్లర్ ను సితార ఎంటర్టైన్మెంట్స్,  ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై నిర్మిస్తున్నారు.

మెగాస్టార్…పవర్‌ స్టార్‌ మధ్యలో ముద్దుగుమ్మ!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ..బింబిసార డైరెక్టర్ వశిష్ట కాంబోలో వస్తున్న సినిమా విశ్వంభర. ఈ సినిమా సోషియో ఫాంటసీ యాక్షన్‌ చిత్రంగా తెరకెక్కుతున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తుండగా … ఈ సినిమాలో అందాల తార త్రిష హీరోయిన్‌ గా నటిస్తుంది.

సుమారు 18 సంవత్సరాల తరువాత చిరంజీవి, త్రిష కాంబోలో రాబోతున్న సినిమా కావడంతో మెగా అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ ఎంతో వేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా అభిమానుల ముందుకు తీసుకుని వచ్చేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది.

అసలు విషయం ఏంటంటే… తాజాగా హైదరాబాద్‌ లో షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా సెట్స్‌ లోకి పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ వచ్చారు. ఈ సందర్భంగా పవన్‌, చిరుతో  కలిసి దిగిన ఓ పిక్‌ ని త్రిష తన సోషల్‌ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. దీనిని చూసిన అభిమానులు తెగ సంబరపడతున్నారు.

త్రిష గతంలో పవన్‌ తో కలిసి  తీన్ మార్ మూవీలో సందడి చేసిన విషయం తెలిసిందే. ఇక వారు ముగ్గురి పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

సలార్‌ 2 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జగ్గుభాయ్‌!

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా నటించి సూపర్‌ హిట్‌ ని అందుకున్న చిత్రం సలార్ మూవీ.  ఈ సినిమాని  హోంబలె ఫిలిమ్స్ సంస్థ పై ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంలో శృతి హాసన్‌ హీరోయిన్‌ గా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రాజమన్నార్‌ అనే కీలక పాత్రలో జగపతి బాబు తన సూపర్‌ పెర్ఫార్మన్స్‌ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

తాజాగా జగపతి బాబు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ  క్రమంలో ఆయన సలార్‌ 2 గురించి ప్రస్తావించారు. సలార్‌ 2 పార్ట్‌ 1 ని మించి ఉంటుందని అన్నారు.  ఈ సినిమాలో ప్రభాస్‌ కు తనకి మధ్య బోలేడు సన్నివేశాలుంటాయని .. అవి కూడా భారీ సన్నివేశాలని ఆయన వివరించారు.

ఆ మ్యాజిక్‌ ని ఆడియెన్స్‌ ఎంతో ఎంజాయ్ చేస్తారని ఈ సందర్భంగా జగ్గుభాయ్‌ అన్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ సగం వరకు అయ్యిందని … మిగిలిన సన్నివేశాలను ఈ ఏడాది చివర్లో ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. సలార్‌ 2 సినిమా వచ్చే ఏడాది చివర్లో విడుదల అయ్యే అవకాశాలున్నట్లు తెలిపారు.

నెగిటివిటికీ విజయ్‌ దేవరకొండ బలైపోయాడు!

వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయినటువంటి జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఆయన ది ఫ్యామిలీ స్టార్‌ సినిమా మీద జరిగిన నెగిటివ్‌ పబ్లిసిటీ గురించి మాట్లాడారు. కొత్త సంవత్సరం కారణంగా ఆయన ఓ యూట్యూబ్‌ ఛానల్‌ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.

అందులో భాగంగానే ముందు ఆయన మహేష్‌ బాబు నటించిన గుంటూరు కారం సినిమా విషయంలో నెగిటివ్‌ పబ్లిసిటీ పెద్ద ఎత్తున మూవీని నష్టపరిచిందని తెలియజేశారు. అంతేకాకుండా నిన్న కాక మొన్న వచ్చిన విజయ్‌ దేవరకొండ ఫ్యామిలీ స్టార్‌ సినిమా మీద కూడా పెద్ద ఎత్తున నెగిటివ్‌ పబ్లిసిటీ జరగడం వల్లే సినిమా విడుదల కాకముందే రివ్యూలు పెట్టడం మొదలు పెట్టారు.

ఇది బేకార్‌ సినిమా అని చూడాల్సిన అవసరం లేదని పెద్ద ఎత్తున నెగిటివ్‌ రివ్యూలు బయటకు రావడంతో విజయ్‌ దేవరకొండ బలైపోయాడని వేణుస్వామి సంచలన వ్యాఖ్యాలు చేశాడు. సినిమా విడుదల కాకముందే ఇలా నెగిటివిటీని ప్రచారం చేయడం వల్ల సినిమాను చూసేందుకు పెద్దగా ఎవరూ ఆసక్తి చూపలేదని వేణు స్వామి అన్నాడు.

అలా విజయ్‌ దేవరకొండకి పెద్ద నష్టం వచ్చి పడిందని వేణు స్వామి వ్యాఖ్యానించారు.

వాలంటీర్లను బురిడీ కొట్టించే జగన్ వరం!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో కేవలం వాలంటీర్ల మీదనే ఆధారపడి రాజకీయం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. సంక్షేమము, పథకాలు లాంటి మాటలన్నీ ఉత్త ట్రాష్.. వాలంటీర్లను మభ్యపెట్టడం, వారిద్వారా లబ్ధిదార్లను మభ్యపెట్టడం అంతిమంగా ప్రజలు ఆ మాయంలో ఉండగానే వారితో ఓట్లు వేయించుకోవడం, నెగ్గడం అనేదే వైఎస్సార్ కాంగ్రెస్ ప్లాన్ చేసుకున్న రూట్ మ్యాప్ అని అర్థం అవుతోంది. దానికి తగ్గట్టుగానే వాలంటీర్లను లోబరచుకోవడానికి వారికి అభ్యర్థులు భారీగా నగదు ముట్టజెబుతున్న సంగతి అందరికీ తెలుసు. అదే సమయంలో.. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లను మాయచేసేలా ఒక దొంగ హామీని ప్రకటించారు. తను మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే.. వాలంటీరు వ్యవస్థను పునరుద్ధరించడం కోసమే తాను సీఎంగా తొలిసంతకం చేస్తానని జగన్ ప్రకటించారు. ఈ మాట ద్వారా వారందరినీ బురిడీ కొట్టించడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు.

వాలంటీర్లు అనే వ్యవస్థ పింఛన్ల పంపిణీకి దూరంగా ఉండాలని మాత్రమే కేంద్ర ఎన్నికల సంఘం చాలా స్పష్టమైన ఆదేశం ఇచ్చింది. అంతే తప్ప వారిని ఉద్యోగాలనుంచి తొలగించాలని చెప్పలేదు. ఆ వ్యవస్థను రద్దు చేయాల్సిందిగా చెప్పలేదు. కానీ.. వైసీపీ వారు మాత్రం.. చంద్రబాబు మీద బురద చల్లడానికి ఈసీ ఆదేశాలను రకరకాలుగా వక్రీకరించారు. చంద్రబాబు కారణంగా వాలంటీరు వ్యవస్థ రద్దు అయిపోయిందని కూడా అన్నారు. కానీ.. ఇప్పటిదాకా వాలంటీరు వ్యవస్థను రద్దు చేసినట్లుగా ఎలాంటి ఆదేశాలు కూడా ప్రభుత్వం నుంచి రాలేదు. వారిని పింఛను పంపిణీ విధులకు దూరంగా పెట్టినంత మాత్రాన వారికి వచ్చేనెల జీతాలు ఇవ్వాల్సిందే. అలాగే మే 13 నాటికి పోలింగు పూర్తియపోతుంది కాబట్టి.. జూన్ 1 న పంపిణీచేసే పింఛన్లు వాలంటీర్ల చేతులమీదుగానే ఇవ్వడానికి అవకాశం ఉంది.

అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం.. వాలంటీర్లు వ్యవస్థ ఇప్పటికే రద్దయిపోయిందనే సంకేతాలు పంపుతున్నట్టుగా.. తాను మళ్లీ అధికారంలోకి రాగానే.. వాలంటీరు వ్యవస్థను పునరుద్ధరించడానికే తొలిసంతకం పెడతానని అంటున్నారు. ఇంతకూ జగన్ ఆ వ్యవస్థను రద్దు చేసేయాలని, ఆ బురద చంద్రబాబు మీద వేయాలని కుట్ర పన్నుతున్నారా? అనే అనుమానాలు కొత్తగా కలుగుతున్నాయి. ఇప్పటికీ వాలంటీర్లతో రాజీనామాలు చేయించి.. ఈ రెండు నెలల పాటు వారి వేతనాలు తామే ఇస్తూ ఎన్నికల ప్రచారానికి వాడుకోవాలని, వారిని పోలింగ్ ఏజంట్లుగా వాడుకోవాలని వైసీపీ భావిస్తున్నట్టు వార్తలున్నాయి. రాజీనామాలు చేసినా సరే.. వారిని పోలింగ్ ఏజంట్లుగా అనుమతించకూడదని సిటిజన్ ఫోరం ఫర్ డెమాక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈసీకి లేఖ కూడా రాశారు. దానితో భయపడిన జగన్, ఇలాంటి తలనొప్పులేమీ లేకుండా.. వాలంటీరు వ్యవస్థను రద్దు చేసేస్తే రెండు లాభాలుంటాయని అనుకుంటున్నట్టు సమాచారం. ఒకటి- ఆ పాపం చంద్రబాబు మీద నెట్టేయవచ్చు. రెండు- వారిని నిరభ్యంతరంగా ఎన్నికల ప్రచారంలోనూ, పోలింగ్ ఏజంట్లుగానూ వాడుకోవచ్చు… అలా చూస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.

చంద్రబాబు వరం: వాలంటీర్లంతా ఇటు మొగ్గుతారా?

ఏపీలో వాలంటీర్లు దాదాపుగా అందరూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలే అనే సంగతి అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికే  వారందరూ కంకణం కట్టుకుని పనిచేస్తున్న సంగతి కూడా అందరికీ తెలుసు. ఇప్పుడు పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను దూరం పెట్టడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతున్నది. అదే సమయంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే గనుక.. వాలంటీర్ల మీద ఈసీ వేటు వేసేస్తుండడంతో వారు చేతులు కట్టేసినట్టుగా ఉంటున్నారు. ఇలాంటినేపథ్యంలో రాష్ట్రంలోని మొత్తం వాలంటీర్ల మీద చంద్రబాబునాయుడు సమ్మోహక అస్త్రం ప్రయోగించారు. తమ ప్రభుత్వం ఏర్పడితే వారి నెలజీతాన్ని రూ.పదివేలకు పెంచుతామని చంద్రబాబు పేర్కొన్నారు.

నిజానికి ఈ జీతం పెంపు అనే వరం.. వాలంటీర్ల మీద తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం వాలంటీర్లకు అన్నీ కలిపి సుమారు 6 వేల వరకు మాత్రమే ముట్టుతోంది. ఆ మొత్తానికే వారు నెలపొడవునా సేవలు అందిస్తున్నారు. జీతం పెంపు గురించి గతంలో వాలంటీర్లు అనేక ఆందోళనలు కూడా నిర్వహించారు గానీ.. ప్రభుత్వం పట్టించుకోలేదు. అదే ఎన్నికల సమయం వచ్చేసరికి, ఓటర్లను, లబ్దిదారులైన ముసలివాళ్లను ప్రలోభ పెట్టడానికి వాలంటీర్లు బాగా పనికొస్తారనే ఉద్దేశంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వాలంటీర్లకు భారీగా తాయిలాలు, నగదు కానుకలు ఇచ్చి వారితో తమకు అనుకూలంగా పనిచేయించుకునే ఉద్దేశంతో ఉన్నారు. చంద్రబాబునాయుడు గెలిస్తే వాలంటీర్ల వ్యవస్థ రద్దవుతుందని, మీ ఉద్యోగాలు పోతాయని వారిని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ఒకవైపు ఇలాంటి కుట్రలు నడుస్తుండగా చంద్రబాబునాయుడు మాత్రం ఏకంగా.. తన ప్రభుత్వం ఏర్పడగానే.. రూ.పదివేల జీతం చేస్తానని ప్రకటించి.. వాలంటీర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. వాలంటీర్లు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వారు. వారికి 6 వేలనుంచి 10వేలకు ఒకేసారి జీతం పెరగడంఅనేది చాలా పెద్ద వరం కింద లెక్క. వైసీపీ అభ్యర్థులు ఎన్నికల సీజన్లో ఇచ్చే దొంగచాటు కానుకల కంటే.. చంద్రబాబు గెలిస్తే.. అధికారికంగా తమకు పదివేల జీతం వస్తుందనే హామీ వారిని బాగా ఊరించగలదు.

ఈ నేపథ్యంలో వాలంటీర్లను అడ్డగోలుగా తమ పార్టీ ప్రచారానికి వాడుకోవాలనుకుంటున్న వైసీపీ వ్యూహాలు ఫలించకపోవచ్చునని పలువురు అంచనా వేస్తున్నారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ వాలంటీర్లతో ప్రస్తుతానికి రాజీనామా చేయించి అయినా తమ ప్రచారానికి వాడుకోవాలనిచూస్తోంది. రాజీనామా చేస్తే ఎన్నికలయ్యేదాకా తామే జీతాలు ఇస్తామని కేండిడేట్లు చెబుతున్నారు. పోలింగ్ ఏజంట్లుగా వాడాలని కూడా చూస్తోంది. అయితే చంద్రబాబునాయుడు ఈ కొత్త వరం ప్రకటించిన తర్వాత.. వాలంటీర్లు ఎవ్వరూ రాజీనామా చేయకపోవచ్చు. పైగా వారు చంద్రబాబు గెలవాలని కోరుకునే అవకాశం ఉంది. అదే జరిగితే.. వైఎస్సార్ కాంగ్రెస్ నోట మట్టే అని పలువురు విశ్లేషిస్తున్నారు.

ప్రచారం చివరి విడతలో మెగస్టార్ ఎంట్రీ!?

ఏపీ ఎన్నికల పర్వంలో ఎన్డీయే కూటమి గెలవాలని కోరుకునే వారికి ఒక శుభవార్త. తెలుగు ప్రజల్లో తిరుగులేని విస్తృతమైన ప్రజాదరణ కలిగి ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఈ కూటమికి అనుకూలంగా ఎన్నికల ప్రచారంలోకి రావడానికి సూత్ర ప్రాయంగా అంగీకరించినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. అయితే.. ప్రచారాన్ని ఇప్పుడు సాగుతున్న తీరులోనే ముందుకు తీసుకువెళ్లాలని, ప్రచారం చివరి దశకు వచ్చిన తర్వాత.. అప్పటి సమీకరణాలను పరిశీలించి.. తాను కూడా రాష్ట్రంలో రెండు మూడు సభల్లో ప్రసంగిస్తే ఇంకా ఎడ్వాంటేజీ అవుతుందనే భావన ఉంటే గనుక.. తప్పకుండా ఎన్నికల ప్రచారానికి వస్తానని చిరంజీవి, తమ్ముడు పవన్ కల్యాణ్ కు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర షూటింగ్ లో ఉన్నారు. హైదరాబాదు సమీపం ముచ్చింతల్ వద్ద షూటింగు జరుగుతోంది. జనసేనాని పవన్ కల్యాణ్, తన అన్నయ్య నాగేంద్రబాబుతో కలిసి.. సోమవారం నాడు చిరంజీవిని షూటింగ్ లొకేషన్లో కలిశారు. ప్రస్తుత రాజకీయ వాతావరణం, జరుగుతున్న పరిణామాలు, పరిస్థితులు గురించి వారు కొద్ది సేపు చర్చించుకున్నారు. పవన్ కల్యాణ్ రాజకీయ జీవితం విజయవంతంగా సాగడానికి హీరో చిరంజీవి తన ఆశీస్సులు అందజేశారు. తన కాళ్లు మొక్కి ఆశీస్సులు కోరిన తమ్ముడిని ఆయన మనస్ఫూర్తిగా దీవించారు.
కేవలం దీవెనలు మాత్రమే కాదు. తమ ఇంటిదైవం ఆంజనేయస్వామి విగ్రహం ఎదురుగా నిల్చుని.. జనసేన పార్టీకి మెగాస్టార్ చిరంజీవి ఏకంగా అయిదు కోట్ల రూపాయల విరాళం కూడా ఇచ్చారు.

నిజం చెప్పాలంటే.. జనసేన పార్టీకి గానీ, చిరంజీవి స్థాయికి గానీ.. అయిదు కోట్లరూపాయల విరాళం అనేది పెద్ద విషయం కాదు. కానీ, ‘మెగాస్టార్ చిరంజీవి జనసేన పార్టీకి అండగా ఉన్నారు’ అనే మాట ద్వారా .. ప్రజల్లో రాగల సానుకూలత చాలా పెద్దది అని విశ్లేషకులు భావిస్తున్నారు. కాపు సామాజిక వర్గంలో ఓటు చీలకుండా, గంపగుత్తగా కూటమికి అనుకూలంగా మారడానికి చిరంజీవి మద్దతు ఉపయోగపడగలదని ఒక అంచనా. అలాగే కులమతాలతో నిమిత్తం లేకుండా చిరంజీవి ఫ్యాన్స్ లో కూడా ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్రమంత్రిగా పనిచేసిన తర్వాత.. రాజకీయంగా ఏ పార్టీతోనూ అనుబంధం కొనసాగించకుండా సైలెంట్ గా ఉంటున్నారు. కేవలం సినిమాలకే పరిమితం అయ్యారు. మధ్యలో సినీ పరిశ్రమ సమస్యల గురించి ముఖ్యమంత్రి జగన్ ను కలవడానికి వెళ్లినప్పుడు, ఆయనను పొగిడారు గానీ.. ఆ తర్వాత అదే సైలెన్స్ ను కొనసాగిస్తున్నారు.

వీటన్నింటికి అదనంగా.. చిరంజీవి ఎన్నికల ప్రచారంలోకి రావాలని పవన్ కల్యాణ్ కోరినట్టు సమాచారం. అయితే తక్షణం అందుకు ఓకే అనకుండా.. ఇప్పుడు సాగుతున్నది యథాతథంగా చేస్తూ పోతే.. ప్రచారం చివరి దశలో అవసరమైతే వస్తానని చిరంజీవి హామీ ఇచ్చినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది.

తన అభ్యర్థుల గురించి జగన్ కు తెలిసిందే రెండే!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ‘మేమంతా సిద్ధం’ అంటూ సాగిస్తున్న ఎన్నికల ప్రచార సభలను గమనించారా? ఏ సభలోనైనా ఆయన ప్రసంగాన్ని పూర్తిగా చూశారా? అందులో చాలా చిత్రాలు ఉంటాయి.

సాధారణంగా జగన్ ప్రసంగంలో 75 శాతం వరకు చంద్రబాబునాయుడును, పవన్ కల్యాణ్, కూటమిని పురందేశ్వరిని తిట్టడానికి కేటాయిస్తారు. ఆ 75 శాతంలోనూ తెలుగుదేశం 2014 నాటి మేనిఫెస్టో బ్రోషర్ లాకు తాను బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నట్టుగా.. వాటిని ఒకచేత్తో పైకెత్తి చూపుతూ.. ఆ హామీలను నిలుపుకోలేదని విమర్శించడంతో గడచిపోతుంది. 75 పోగా మిగిలిన దానిలో 23 శాతం తన గురించి చెప్పుకుంటారు. తాను ఏమేం చేసేశానో చెబతారు. ఇక పోగా, రెండుశాతం సమయాన్ని మాత్రం.. మీటింగు వేదిక పరిసారల్లోని నియోజకవర్గాల నుంచి పోటీచేస్తున్న అభ్యర్థులందరినీ సభలో పరిచయం చేసి వారికి ఓటు వేయాలని కోరుతారు. అప్పటిదాకా వారంతా వేదికమీద వెనగ్గా నిల్చుని ఉంటారు. ప్రసంగం ముగించే ముందు ఒక్కొక్కరినీ తన పక్కకు పిలిచి, ఒక్కొక్కరి గురించి 20-30 సెకండ్లు ప్రజలకు చెబుతారు. ఇంతా కలిపి.. ప్రతి అభ్యర్థి గురించి కూడ ప్రజలకు జగన్ చెప్పే మాటలు రెండే రెండు.. ‘మంచివాడు.. సౌమ్యుడు’! రాష్ట్రంలోని 175 మంది అభ్యర్థులకు కూడా ఈ రెండు లక్షణాలు తప్ప మరో లక్షణం లేదా, లేదా మరో లక్షణం జగన్ కు తెలియదా? అని జనం విస్తుపోతుంటారు.

జగన్ ప్రతి సభలోనూ.. అభ్యర్థిని తన వద్దకు పిలిచి.. ‘అన్న మంచి వాడు సౌమ్యుడు. తప్పకుండా గెలిపించండి’ అనే మాట చెబుతారు. మహా అయితే కొందరు నాయకుల గురించి ఇంకో మాట ఉంటుంది. ‘నాకు చాలా ఆత్మీయుడు’ అనేది! అలాగే.. కొందరి గురించి చెప్పడానికి మరొక మాట కూడా ఉంటుంది.. ‘మీలో ఒకడు’ అని! అంటే పేద వారు అని జగన్ ముద్రవేసిన వారినందరినీ మీలో ఒకడు అని జగన్ అంటూ ఉంటారు. తద్వారా, మిగిలిన అభ్యర్థులంతా.. జనానికి దూరంగా మెలిగేవాళ్లు అనే అర్థం వస్తుందని ఆయనకు తెలుసో లేదో మరి.

అలాగే ఏ ఒక్క అభ్యర్థి గురించి కూడా.. మంచి వాడు, సౌమ్యుడు అనే పదాలు తప్ప.. ఆ పర్టిక్యులర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నుకోవడానికి ఆయన ఏ రకంగా అర్హుడో జగన్ ఒక్క మాట కూడా చెప్పరు. ఓట్లు వేసే వాళ్లు తనని చూసి, తన పథకాల్ని, తాను పంచే డబ్బులను చూసి ఓటు వేయాలే తప్ప.. అభ్యర్థుల వ్యక్తిగత అర్హతలను చూసి ఓటు వేయాల్సిన అవసరం లేదు అనేది జగన్ అహంకారపూరిత ధోరణి అని పలువురు విశ్లేషిస్తున్నారు. అందుకే అభ్యర్థులకు సొంతంగా అర్హతలు ఉండాలని కూడా ఆయన అనుకోవడం లేదనే విమర్శలు కూడా వినవస్తున్నాయి. టికెట్ ఇచ్చేప్పుడు ధనబలాన్ని మాత్రమే ప్రాతిపదికగా చూస్తున్నారని, నియోజకవర్గంతో ఉండే అనుబంధం, చేయగల సేవాభిలాష గురించి.. జగన్ మాట మాత్రంగా కూడా పట్టించుకోవడం లేదని, ప్రజలకు కూడా చెప్పడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తునన్నారు. అసలు జగన్ చేసే పరిచయం అభ్యర్థులకు అవమానకరంగా కూడా ఉంటోందని కొందరు అంటున్నారు. 

మూడు నియోజకవర్గాలను శాసిస్తున్న సికె!

చిత్తూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే సికె జయచంద్రారెడ్డి అలియాస్ సికె బాబు.. విస్తృతంగా ప్రజాసంబంధాలు, ప్రజల్లో ఆదరణ ఉన్న నాయకుడు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆయన ఎమ్మెల్యేగా నెగ్గి రాజకీయం చేశారు. వైఎస్సార్ అనుచరుడే అయినప్పటికీ.. ఆయన హవా రాజ్యమేలిన ఎన్నికల్లో తనకు టికెట్ దక్కకపోయేసరికి, ఇండిపెండెంటుగా పోటీచేసి, వైఎస్ హవాను తట్టుకుని నెగ్గిన చరిత్ర సికెబాబుది. అలాంటి సికె బాబు ఇప్పుడు చిత్తూరు నియోజకవర్గ ఎన్నికల్లో  తెలుగుదేశం అభ్యర్థి గురజాల  జగన్మోహన్ కు అనుకూలంగా పనిచేస్తున్నారు. సికె బాబు చాలా కష్టపడి తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేస్తుండడం వల్ల.. తెలుగుదేశం ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే అంచనాలు సాగుతున్నాయి. అయితే ఇంకో ట్విస్టు ఏంటంటే.. కేవలం చిత్తూరు మాత్రమే కాదు.. చిత్తూరు పార్లమెంటు పరిధిలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశాన్ని గెలిపించే బాధ్యతను సికెబాబు భుజానికెత్తుకున్నట్టుగా తెలుస్తోంది. ఆమేరకు ఆయన తన మాటగా పార్టీకి హామీ ఇచ్చినట్టు సమాచారం.

చిత్తూరు నియోజకవర్గ పరిధిలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ఇక్కడ తెలుగుదేశం తరఫున గురజాల జగన్మోహన్ పోటీచేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున సిటింగ్ ఎమ్మెల్యే, కాపు కులానికి చెందిన ఆరణి శ్రీనివాసులును పక్కన పెట్టి.. ఆర్టీసీ ఛైర్మన్ బాధ్యతలు నిర్వర్తించిన ఎంసి విజయానందరెడ్డిని జగన్ ఎంపిక చేశారు. ఆరణి శ్రీనివాసులు అలిగి.. జనసేనలో చేరి, ఆ పార్టీ తరఫున తిరుపతినుంచి పోటీచేస్తున్నారు.


ఆ రకంగా వైఎస్సార్ కాంగ్రెస్ లో ఆరణి శ్రీనివాసులు వర్గం వైసీపీకి వ్యతిరేకంగా తయారైంది. పైగా సికె బాబు.. తెదేపా జగన్మోహన్ కోసం చాలా కష్టపడి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. చిత్తూరుతోపాటు, పూతలపట్టు, గంగాధర నెల్లూరుల్లో కూడా పార్టీని గెలిపిస్తానని ఆయన హామీ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. ఆ రెండు నియోజకవర్గాల మీద కూడా సికెబాబుకు మంచి పట్టు ఉంది. అక్కడ తన వర్గానికి చెందిన నాయకులు అందరినీ పిలిపించుకుని, వారిని తరచూ కలుస్తూ తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేయాల్సిందిగా చెబుతున్నట్లు తెలుస్తోంది. సికె వర్గంలోని కీలక నాయకులు.. ఆ రెండు నియోజకవర్గాల్లో కూడా పర్యటిస్తున్నారు. మొత్తానికి సీనియర్ నాయకుడు సికెబాబుకు చంద్రబాబు ఎలాంటి హామీ ఇచ్చారో తెలియదు గానీ.. ఆయన మాత్రం తెలుగుదేశం విజయం కోసం గట్టిగా రంగంలో పనిచేస్తున్నారు.

Jr.NTR Joins Tillu Square Success Meet With Trivikram, Vishwak Sen: A Star-Studded Event

The Siddhu Jonnalagadda and Anupama Parameswaran starrer ‘Tillu Square’ has been winning hearts for its comic timing. The film was critically and commercially acclaimed and became the biggest blockbuster in Siddhu Jonnalaggada’s career. Siddhu Jonnalagadda joined the 100 crore club, and the film is still running successfully in theaters.

To celebrate the film’s success and for achieving the milestone, the makers conducted a special success meet event. Man of Masses Jr.NTR graced the event as the chief guest. Mass Ka Das Vishwak Sen, Trivikram, and Neha Shetty also attended the success meet and made it a star-studded event. 

The event was made even more special by the stars’ presence. Jr. NTR congratulated the team for its success and appreciated Siddu Jonnalagadda’s performance and comedy timing. The actor claimed he enjoyed the movie and laughed thoroughly at Siddhu’s comic timing and one-liners.

Additionally, Jr.NTR also praised Siddhu Jonnalagadda and Vishwak Sen for their contribution to the cinema industry, saying that the industry requires these two daredevils to push new-age films, new ideas, and new tales.

The makers took to Instagram and shared some of the candid moments from the Double Blockbuster Success Meet of Tillu Square.

In the event, Jr.NTR donned a green shirt paired with an off-white trouser. Siddhu was seen in a white shirt with a pink suit. Vishwak Sen wore a floral black shirt and black trousers. Anupama Parameswaran exudes charm in a black saree, while Neha Shetty was seen in a light blue saree.

The film Tillu Square is a sequel to the 2022 romantic crime comedy DJ Tillu. The film is helmed by Mallik Ram and backed by Suryadevara Naga Vamsi under Sithara Entertainments and Fortune Four Cinemas. Bheems Ceciroleo composed the tunes for this film.