భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నందుకు.. తెలుగుదేశం పార్టీకి, మొత్తం ఎన్డీయే కూటమికి కూడా ముస్లిం వర్గం సమూలంగా దూరం అవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ ఆశపడింది. కానీ వాస్తవంలోకి వస్తే.. వారి ఆశలు అడియాసలే అవుతున్నాయి. ఎలాంటి పరిస్థితుల్లో మూడు పార్టీలు జట్టుకట్టాయో.. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు తెలియజెప్పడంలో కూటమి పార్టీలు విజయం సాధించాయి. ప్రత్యేకించి ముస్లిం ఓటు బ్యాంకు తమకు దూరం కాకుండా.. చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ ప్రత్యేక చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. అదే సమయంలో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక మంది ముస్లిం నాయకులు, ప్రజాప్రతినిధులు బయటకు వస్తున్నారు. జగన్ తమకు అన్యాయం చేశాడని అంటున్నారు. పదవులు ఆశించకుండా, బేషరతుగా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఈ పరిణామాలన్నీ వైసీపీకి, వారి నీలిప్రచారాన్ని కొనసాగిస్తూ ఉండే సోషల్ మీడియా దళాలకు మింగుడుపడడం లేదు. తెలుగుదేశం కూటమికి ముస్లిం ఓటును ఎలా దూరం చేయాలా అనే కుట్రల్లో భాగంగా బిజెపి సారథి పురందేశ్వరికి ముడిపెట్టి కొత్త దుష్ప్రచారాన్ని ప్రారంభించారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు ఆపాదించి అబద్ధాలు చెబితే ముస్లింలు కూడా నమ్మరనే ఉద్దేశంతో నీలిదళం సోషల్ మీడియా వర్గాలు పురందేశ్వరిని ఎంచుకున్నట్టుగా కనిపిస్తోంది. ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలో ముస్లింలకు కల్నిస్తున్న 4 శాతం రిజర్వేషన్ ను ఎత్తివేస్తామని పురందేశ్వరి చెప్పినట్టుగా వార్తలు పుట్టించారు.
అయితే.. ఈ పుకార్లను పురందేశ్వరి స్వయంగా ఖండించారు. తనకు సంబంధంలేని , తాను ఎన్నడూ అనని మాటలను తన పేరుతో ప్రచారంలో పెట్టడం వెనుక పెద్ద కుట్ర ఉన్నదని ఆమె వ్యాఖ్యానించారు. మోడీ సర్కారు ముస్లింల సంక్షేమానికి ఎన్నెన్ని అద్భుత నిర్ణయాలు తీసుకున్నదో కూడా ఆమె ఏకరవు పెట్టారు. అయితే, గమనించాల్సింది ఏంటంటే.. వైసీపీ దళాలు తొలినుంచి కూడా.. పురందేశ్వరిని టార్గెట్ చేస్తున్నాయి. ఆమె చంద్రబాబునాయుడు కోవర్టుగా భాజపాలో పనిచేస్తున్నదని ఏకంగా సజ్జల వంటి వారే దుష్ప్రచారాన్ని సాగించిన తీరు అందరూ గమనించారు. అలాంటిది ఇప్పుడు ముస్లిం ఓటు బ్యాంకును దూరం చేసేందుకు ఇలాంటి లేకికుట్రలకు పాల్పడడం హేయంగా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
మతం చిచ్చు పెట్టేందుకు నీలిదళం కుట్రలు!
తెదేపా తరఫున క్షేత్రస్థాయి ప్రచార సారథులు!
తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు క్లిష్టమైన సమస్యను అధిగమించే ప్రయత్నంలో ఉంది. పార్టీ సాగించే ఎన్నికల ప్రచారం తరహాలో కాకుండా.. సమూహాలుగా, ఆర్బాటంగా వెళ్లే బృందాలు కాకుండా.. ఒక్కొక్కరుగా విడివిడిగా ప్రజల వద్దకు వెళ్లి.. చంద్రబాబు నాయకత్వం గురించి తెలియజెప్పి.. వారిని ప్రభావితం చేసి.. వారితో పార్టీకి అనుకూలంగా ఓట్లు వేయించగల వారికోసం పార్టీ వెతుకులాడుతోంది. భిన్నమైన వ్యూహంతో పార్టీకి అనుకూల వాతావరణం సృష్టించుకోవాలని ఆరాటపడుతోంది.
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు.. ప్రజలను ఆకర్షించడానికి.. ఓటు బ్యాంకును గంపగుత్తగా తనవైపు మరల్చుకోవడానికి అనేక హామీలను ప్రకటించారు. సంక్షేమ పథకాల డబ్బు పొందుతున్న ఏ లబ్ధిదారులనైతే జగన్ తన స్థిరమైన ఓటు బ్యాంకుగా భావిస్తున్నారో.. ఆ ఓటు బ్యాంకును మొత్తం టోకుగా తనవైపు తిప్పుకోగల అద్భుతమైన వరాలను చంద్రబాబునాయుడు ప్రకటించారు.
వృద్ధులకు 3వేలు పెన్షన్ అందుతుండగా.. తాను అధికారంలోకి రాగానే 4 వేలు ఇస్తానని చంద్రబాబు అన్నారు. జగన్ ఇలాంటి హామీ ఇవ్వలేని స్థితిలో ఉన్నారు. పైగా.. తాను జూన్ లో అధికారంలోకి వచ్చినాసరే.. ఏప్రిల్, మే, జూన్ నెలలకు అరియర్స్ కూడా జులై నెల నాలుగువేలతో పాటు చెల్లిస్తానని చంద్రబాబు చెప్పడం వృద్ధుల మీద ఆకర్షణీయమైన అస్త్రమే. అలాగే వికలాంగులకు తమ ప్రభుత్వంలో 6 వేల రూపాయల పెన్షను అందిస్తానని కూడా చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇది కూడా చిన్న సంగతి కాదు. ఇవన్నీ ఇళ్లవద్దకే చేరవేస్తానని కూడా చెప్పారు.
హామీలైతే గొప్పగా ఉన్నాయి గానీ.. ఇవన్నీ లబ్ధిదారుల వద్దకు చేరడం, వారు నమ్మేలా వారికి తెలియజెప్పడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే.. జగన్ తీసుకువచ్చిన వాలంటీరు వ్యవస్థ ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులను కలుస్తూ.. వారిని జగన్ కు అనుకూలంగా ప్రభావితం చేయడానికి చాలా కాలంగా పనిచేస్తూ వస్తోంది. అలాంటిది వారి మాటలను తోసి రాజని, చంద్రబాబు అదే లబ్ధిదారులకు అంత కంటె గొప్ప మేలు, అంతకంటె మెరుగైన విధానంలో అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాడని, అలాంటి చంద్రబాబుకు మద్దతుగా నిలవాలని వారికి అర్థమయ్యేలా తెలియజెప్పడం చాలా కీలకం. పైగా పని మీద ఇతర ఊర్లలో ఉండే బిడ్డల వద్దకు వెళ్లే వృద్ధులు పింఛను సమయానికి ఉరుకులు పరుగుల మీద ప్రతినెలా స్వగ్రామానికి తిరిగిరావాల్సిందే. జగన్ పాలనలో ఒక్కనెల పింఛను తీసుకోకపోయినా అది రద్దయిపోతుంది. అయితే చంద్రబాబు మాత్రం రెండు నెలలు తీసుకోకపోయినా కూడా మూడో నెలలో మొత్తం ఇస్తానని ప్రకటించడం అలాంటి చాలా మందికి నమ్మకం కలిగిస్తుంది. ఆశ పుట్టిస్తుంది. అయితే ఈ హామీలను ప్రజల వద్దకు తీసుకువెళ్లడానికి తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయి ప్రచార సారథులకోసం చూస్తున్నట్టుగా తెలుస్తోంది.
పెద్దిరెడ్డి కుట్రలతో చిత్తూరు జిల్లాలో లాస్ ఎంత?
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చాలా బలమైన నాయకుల్లో ఒకరు. ఆ పార్టీలో జగన్ కంటె బలమైన, జగన్ ను కూడా శాసించగల నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది పెద్దిరెడ్డే అని పలువురు చెబుతుంటారు. అలాంటి పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లాలో కూడా జిల్లా వ్యాప్తంగా రాజకీయాలను తన కనుసన్నల్లో శాసిస్తుంటారు. అయితే ఆయన పార్టీ గెలవాలనే లక్ష్యంతో కాకుండా.. చిత్తూరు జిల్లాలో తన ఆధిపత్యం శాశ్వతంగా ఉండాలనే ఉద్దేశంతో కొన్ని నియోజకవర్గాల్లో కుట్ర రాజకీయాలు చేస్తున్నారనేది తాజా గుసగుస. పెద్దిరెడ్డి దెబ్బకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైఎస్సార్ సీపీ గణనీయంగానే స్థానాలు కోల్పోయే ప్రమాదం ఉన్నదని పలువురు అంచనా వేస్తున్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ కుప్పం మినహా మిగిలిన అన్ని స్థానాలను కైవశం చేసుకుంది. అయితే ఈ ఎన్నికల్లో కనీసం సగమైనా నిలబెట్టుకోగలుగుతుందా అనే అనుమానాలు, భయాలు ఆ పార్టీలోనే ఉన్నాయి. కుప్పంలో చంద్రబాబు సంగతి సరే సరి, మదనపల్లెలో షాజహాన్, పలమనేరులో అమర్ నాధ్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తారనే అభిప్రాయం జనంలో ఉంది. అలాగని మిగిలిన స్థానాలన్నీ వైసీపీ గెలుస్తుందని కాదు. పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది. తిరుపతి, చంద్రగిరి కూడా సానుకూలత ఉందని అంటున్నారు. కానీ.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. జిల్లాలో తన హవాకు అడ్డులేకుండా ఉండేందుకు పలువురు సొంత పార్టీ నాయకులను ఓడించేందుకు తెరవెనుక తన వర్గాన్ని పనిచేయిస్తున్నట్టు సమాచారం.
చిత్తూరులో ఆర్టీసీ పదవిలో ఉన్న విజయానంద్ రెడ్డికి జగన్ టికెట్ ఇచ్చారు. అయితే ఆయనకు ఇవ్వడం పెద్దిరెడ్డికి ఇష్టం లేకపోయినప్పటికీ.. చెవిరెడ్డి ప్రాపకం ద్వారా విజయానంద్ రెడ్డి టికెట్ దక్కించుకున్నారు.
ఆయన పట్ల పెద్దిరెడ్డికి కినుక ఉంది. అలాగే గంగాధర నెల్లూరు లో డిప్యూటీ సీఎం నారాయణస్వామి కూతురు కృపాలక్ష్మి పోటీచేస్తోంది. ఈమె కూడా పెద్దిరెడ్డి ఇష్టంతో నిమిత్తం లేకుండి టికెట్ తెచ్చుకున్నదనే పేరుంది. ఇక నగరి సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్ కె రోజా ను ఓడించడానికి పెద్దిరెడ్డి వర్గం మొత్తం తమ శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారు. ఆమె మంత్రిగా ఉండగా కూడా.. పెద్దిరెడ్ది వర్తం నియోజకవర్గంలో ఆమెకు కంటిమీద కునుకు లేకుండా చేశారు. అలాగే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం సుధీర్ రెడ్డికి అనుకూలంగా పెద్దిరెడ్డి వర్గం పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. బొజ్జల కుటుంబంతో ఉండే బంధుత్వం కారణంగా.. ఆ నియోజకవర్గంలోని తన వర్గం నాయకులందరినీ సుధీర్ కు అనుకూలంగా పనిచేయాలని పెద్దిరెడ్డి సూచించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇవన్నీ పరిగణించి చూస్తే.. కేవలం పెద్దిరెడ్డి కారణంగా.. చిత్తూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కనీసం నాలుగు నియోజకవర్గాల్లో దెబ్బ తప్పదని పలువురు అంచనా వేస్తున్నారు.
కడపలో జగన్ అరాచక వ్యూహానికి చెక్!
ప్రచారాలు, పథకాలు, వరాలు ఇవన్నీ ఎలా ఉన్నా కూడా.. ఎన్నికల పోలింగ్ నాడు పోల్ మేనేజిమెంట్ ఎవరు అద్భుతంగా చేయగలిగారు అనేది విజయావకాశాల్ని చాలా వరకు నిర్దేశిస్తుంటుంది. ఆ రోజున బూత్ లను మేనేజ్ చేయడానికి చాలా మార్గాలుంటాయి. వాటిలో పోలీసు వర్గాల సహకారం ద్వారా సాగించే అరాచకాలు కూడా ముఖ్యమైనవి. ఇలాంటి నేపథ్యంలో కడప జిల్లాలో పోలీసుల ద్వారా ఈ ఎన్నికల్లో అరాచకాలు కొనసాగించడానికి, అయిదేళ్ల కిందటి నుంచి వ్యూహాత్మకంగా జగన్ రచించిన వ్యూహాన్ని ఇప్పుడు తెలుగుదేశం భగ్నం చేస్తోంది. అలాంటి అరాచకత్వపు వ్యూహాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తోంది.
కడప జిల్లాలో 2019 తర్వాత పోలీసు శాఖలో నియమితులైన హోంగార్డులను ఇప్పుడు ఎన్నికల సమయంలో ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాలని తెలుగుదేశం ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా కు లేఖ రాశారు. జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజుల్లో ఆయనకు ప్రెవేటు సెక్యూరిటీగా ఉన్నవారిని, జగన్ దగ్గర పనిచేసిన వారిని అందరినీ, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత.. పోలీసు శాఖలో హోంగార్డులుగా నియమించారని భూమిరెడ్డి ఆరోపించారు.
ఎన్నికల సమయంలో వీరందరూ కూడా అధికారులను తప్పుదోవ పట్టించే అవకాశం ఉంటుందని, బూత్ క్యాప్చరింగ్ వంటి అరాచకాలు జరగడానికి సహకరించే అవకాశం ఉందని, అలాగే కీలక సమాచారాన్ని వైకాపా నాయకులకు చేరవేసే ప్రమాదమూ ఉంటుందని భూమిరెడ్డి ఫిర్యాదు చేశారు. వీరిని ఇతర జిల్లాలకు బదిలీ చేయాలని, అలా కుదరకపోతే.. 2019 తర్వాత నియమితులైన హోంగార్డులు అందరినీ ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఆయన కోరారు.
భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి డిమాండ్ చాలా సబబుగానే కనిపిస్తోంది. ఎందుకంటే.. ఎన్నికల వేళ క్షేత్రస్థాయిలో ఉండే పోలీసుల నుంచి సహకారం ఉంటే.. ఎన్ని అరాచకాలనైనా సునాయాసంగా చేయవచ్చు. జగన్ ప్రెవేటు సెక్యూరిటీ మొత్తం ఇప్పుడు కడప జిల్లాల్లో హోంగార్డులుగా నియమితులైఉన్నమమాట కూడా వింత కాదు.
అసలు ఎన్నికలు పారదర్శకంగా జరగాలంటే.. వాలంటీర్లను కూడా వేర్వేరు ప్రాంతాలకు బదిలీ చేయాలని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఈసీని కోరిన సంగతి పాఠకులకు గుర్తుండే ఉంటుంది. అలాంటిది.. వాలంటీర్లనే బదిలీ చేయాలని అంటోంటే.. హోంగార్డులను ప్రత్యేకంగా భూమిరెడ్డి చెప్పినట్టు 2019 తర్వాత కడప జిల్లాలో నియమితులైన వారిని ఆ జిల్లాలోనే ఉంచడం అనేది చాలా దారుణం అని ప్రజలు కూడా అనుకుంటున్నారు.
Niharika Konidela’s Production No. 1 Titled ‘Committee Kurrollu’
Niharika Konidela consistently forges her career in the industry, showcasing not just her acting prowess but also her knack for selecting engaging and diverse projects. In her latest venture, the actress is poised to introduce a captivating new endeavor, ushering in a fresh array of talent onto the silver screen.
On the occasion of Ugadi, the producer of the film, Niharika Konidela, announced the title of her debut film as a producer. Supreme hero Sai Dharam Tej took to his social media handle, X, and released the title announcement video, which is titled ‘Committee Kurrollu’. He wrote, “ప్రతీ ఊర్లో ఉన్న కుర్రోల్లందరు రెడీ గా ఉండండమ్మ మన కమిటీ కుర్రోళ్ళు వచ్చేత్నారు. Elated to announce 3CommitteeKurrollu Proud of you @IamNiharikaK. Bangaru thalli and the entire team for creating this new and fresh piece!”
The producer of this flick, Niharika Konidela took to her Instagram handle and shared, “First ever feature film from Pink elephant pictures! Gear up to witness some madness along with it My Committee Kurrollu! #CK #committeekurrollu”
The film Committee Kurrollu, helmed by Yadhu Vamsi and backed by Pink Elephant Pictures and Shree Radha Damodar Studios. The film boasts a talented cast, including names like Eshwar Rachiraju, Sandeep Saroj, Yashwant Pendyala, Sivakumar Matta, Raghuvaran, Prasad Behara, Manikanta, Sharanya Suresh, Tejaswi Rao, Teena Sravya, Vishika, Shanmukhi, Akshay Srinivas, Lokesh Kumar, and others.
Adding to that, Anudeep Dev is composing the music for this youthful and vibrant film. Raju Edurolu handles the film’s cinematography, while Anwar Ali handles the editing.
నా లైఫ్ ఇంతలా మారుతుందనుకోలేదు!
షార్ట్ ఫిల్మ్ ల నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ, తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య. చేసిన మొదటి సినిమా బేబీ కే ఈ అమ్మడికి మంచి మార్కులు పడ్డాయి.దీంతో ఆమెకు యూత్ లో ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ఆమెకు వరుస ఆఫర్లు కూడా రావడంతో ఆమె బిజీగా మారింది.
ఆమె తాజా చిత్రం ‘లవ్ మీ’ థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా, త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి ఈ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమం జరిగింది. ఈ వేదికపై నటి వైష్ణవి చైతన్య మాట్లాడింది.
‘లవ్ మీ’ సినిమా టీమ్ చాలా ఫాస్టుగా .. చాలా ఎనర్జిటిక్ గా వర్క్ చేసింది. ఈ సినిమా ఇంత స్పీడ్ గా ఆడియో ఫంక్షన్ వరకూ రావడం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఒకప్పుడూ మా అమ్మ తో కలిసి నేను ఆడియో ఫంక్షన్స్ కి వచ్చేదాన్ని సినిమా వాళ్లు కనిపిస్తే ఫోటో దిగడానికి వెయిట్ చేసేదాన్ని కానీ ఇప్పుడు నేనే ఓ ఆడియో ఫంక్షన్ స్టేజ్ పై ఉన్నాను. నిజంగా ఇది చాలా గొప్ప విషయంలా నాకు అనిపిస్తోందంటూ పేర్కొంది
“సినిమా వాళ్లది వేరే ప్రపంచం .. అక్కడికి వెళ్లడం నాలాంటి వారి వలన కాదని నేను అనుకునేదాన్ని కానీ ఈరోజున ఇండస్ట్రీలో ఇంతమంది పెద్దవారితో కలిసి ఈ ఫంక్షన్ లో ఉన్నాను. నా లైఫ్ ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్లిందో నాకే తెలియదు. ఈ క్షణం నా సంతోషానికి అవధులు లేవు అంటూ చెప్పుకొచ్చింది.
ఆ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి శ్రుతి ఔట్!
నటి శ్రుతి హాసన్ ప్రస్తుతం మంచి జోరు మీద ఉంది. గతేడాది సంక్రాంతికి రెండు సినిమాలతో భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుంది. దీంతో గత రెండు సంవత్సరాలు అన్ని భాషాల్లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ తో మరో హిట్ తన అకౌంట్ లో వేసుకుంది.
ఇక ప్రస్తుతం సలార్ పార్ట్ 2లోనే కాకుండా అడవి శేష్‌తో కూడా ఓ మూవీ చేస్తుంది. అయితే శ్రుతి ఇటీవల ‘బాఫ్టా’ విజేత ఫిలిప్ జాన్ దర్శకత్వంలో ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ ‘చెన్నై స్టోరీ’లో నటిస్తున్నట్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం సినిమా షూటింగ్ కూడా మొదలైంది. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు ఓ షాకింగ్ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ ప్రాజెక్ట్ నుంచి శ్రుతి హాసన్ తప్పుకున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. అయితే దీనికి గల కారణాలు ఇంకా బయటికి రాలేదు. ఇదే నిజమైతే ఆమె స్థానంలో ఎవరిని తీసుకుంటారనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో ఈ ప్రాజెక్ట్ కోసం స్టార్ హీరోయిన్ సమంతను సంప్రదిస్తున్నట్లుగా వార్తలు వినపడుతున్నాయి. మరి ప్రస్తుతం బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలపైనే సమంంత ఎక్కువ కాన్సట్రేషన్ చేస్తుండటంతో ఈ ప్రాజెక్టుకి ఓకే చెప్పే అవకాశాలే బాగా కనిపిస్తున్నాయి.
రొమాంటిక్ కామెడీగా ఈ చిత్రం రూపొందుతున్నట్లు టాక్. ‘చెన్నై స్టోరీ’లో వివేక్ కల్రా, నిమ్మి హరస్గమా, సహానా వాసుదేవన్‌లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Transgender person Tamanna Move To Against Pawan Kalyan
As finally Jana Sena chief Pawan Kalyan declared that he will be contesting from Pithapuram constituency to the AP Assembly and also initiated his poll campaign for four days, the constituency has suddenly risen to limelight in Andhra Pradesh. As Pawan Kalyan was defeated in 2019 polls after contesting in two constituencies and this time he is particular to enter the state assembly at any cost, the ruling YSRCP also took it as a prestige and made all out efforts to defeat him.
Resourceful Rajampet MP Mithun Reddy was assigned the task of defeating him, while his father and senior minister Peddireddi Ramachandra Reddy took the task of defeating TDP chief Chandrababu Naidu in Kuppam.
Moreover, former minister and veteran Kapu leader Mudragada Padmanabham, who was claiming to be keeping away from party politics for the last ten years, has suddenly joined the ruling party and concentrated only on Pithapuram so as to defeat Pawan Kalyan.
Under these circumstances, the constituency is also attracting another reason that as a transgender person Simhadri Tamanna has decided to contest from Pithapuram constituency. She will contest on behalf of the Bharata Chaitanya Yuvajana (BCY) Party.
The transgender had contested the 2019 elections in Mangalagiri assembly constituency against TD general secretary Nara Lokesh. The BCY party announced Tamanna’s contest from Pithapuram. As the party is politically insignificant and hardly matters from an electoral point of view, her contest seems to be only to become a news maker.
She hails from Avanigadda of combined Krishna district and shifted to Hyderabad seeking opportunities in the film world. Somehow she managed to enter the Big Boss TV programme with wild card entry and get some prominence.
In fact, earlier she worked for Jana Sena, but deplored that she could not get an opportunity to meet the party chief Pawan Kalyan. Even she tried for a party ticket in the 2019 polls. As the party ignored her request, she left the party. Now, she is getting ready to contest against the party chief itself.