Home Blog Page 1046

మీరు ఇస్తూ ఉంటే.. నేను చేస్తూ ఉంటా!

టాలీవుడ్‌ స్టార్‌ నటీమణుల్లో సమంత ఒకరు. ఆమె నటించిన సినిమాలన్ని దాదాపు సూపర్‌ హిట్లే. ఈ క్రమంలోనే దర్శకుడు సుకుమార్‌ సమంతని ఓ రేంజ్‌ పొగిడేశాడు. అంతే కాకుండా ఆమె కు ఓ లైఫ్‌ లాంగ్‌ ఆఫర్‌ కూడా ఇచ్చాడు.

అసలు మేటర్ ఏంటంటే.. కొద్ది రోజుల క్రితం ఓ  ఇంటర్వ్యూలో సుకుమార్‌ మాట్లాడుతూ ‘ ‘రంగస్థలం’లో రామలక్ష్మి పాత్రకు ముందు సమంతను అనుకోలేదు. ఎందుకంటే హీరోహీరోయిన్లు ఇద్దరు సూపర్‌ స్టార్లయితే హ్యాండిల్‌ చేయలేనేమోనని భయపడ్డాను. కానీ అనుకోని పరిస్థితుల్లో సమంతను ఈ ప్రాజెక్టులోకి తీసుకున్నాము.

అయితే మొదటి రోజు నుంచే లొకేషన్లో ఆమె యాక్టింగ్‌ చూసి  ఆశ్చర్యపోయాను. ఈ రోజు చెబుతున్నాను.. నేను సినిమాలు తీస్తున్నంతకాలం నా ప్రతి సినిమాలో సమంతను ఏదో ఒక పాత్రలో తీసుకుంటూనే ఉంటాను అంటూ సుక్కు సామ్‌ కి ఓ బంపరాఫర్‌ ఇచ్చేశాడు.

సామ్‌ కు ఏ వయసు వచ్చినా ఆ వయసుకు తగ్గ పాత్ర ఇస్తూనే ఉంటాను అంటూ భారీ ఆఫర్‌ ఇచ్చేశారు. దీనిపై సమంత కూడా స్పందించారు. ‘థాంక్యూ సుక్కూసార్‌.. మీరిస్తూ ఉండండి.. నేను చేస్తూనే ఉంటాను’ అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. సుక్కు అన్న మాటలు చూస్తే ‘పుష్ప-2’లో కూడా సమంత ఉందనే క్లారిటీ వచ్చేసింది.   ‘పుష్ప’లో ‘ఊ అంటావా.. మావా ఊ ఊ అంటావా..’ అంటూ మెరుపులు మెరిపించిన సామ్‌.. మరి ‘పుష్ప -2’లో ఎలా ఉంటుందో..ఏ పాత్రలో చేస్తుందో చూడాలి మరి.

Mrunal Thakur Shares Glimpses Of Her Moments As Indu In Family Star

Mrunal Thakur garnered significant success in Telugu with her films Sita Ramam and Hi Nanna. She was acclaimed for her astounding performances, and audiences fell in love with her portrayals as Sita in Sita Ramam, Yashna in Hi Nanna, and Indu in Family Star.

The actress shared some of her moments as Indu in the film Family Star. Mrunal took to her Instagram handle, posted several images of herself, and wrote a sweet note, “Moments of me as Indu, moments of Indu as me. Can you tell who’s who? Every character I play on-screen leaves a mark on my heart. In order to do justice to Indu’s role, I need to be Indu and not just put on her shoes, but walk a mile in them.”

She further added, “Bringing her to life was a little challenging at first but I slowly started to understand her and once I got a hang of it, there was no looking back… and I don’t think I want to let go of that just yet. Hope you enjoyed watching Indu as much as I enjoyed walking in her shoes.”

Speaking of Family Star, the film is helmed by Parasuram Petla and backed by Dil Raju and Sirish under the banner of Sri Venkateswara Creations. The film hit theaters on April 5. The film spent a week in theaters but failed to gross a total of 25 crore in India. Critics and audiences alike gave ‘The Family Star’ lackluster reviews.

On the work front, Mrunal Thakur was recently seen in Family Star alongside Vijay Deverakonda. In her upcoming endeavors, the Family Star actress will feature in the Hindi film Pooja Meri Jaan, helmed by Navjot Gulati and Vipasha Arvind. 

విసుగు ఓటు’తో రోజాకు పొంచిఉన్న ప్రమాదం!

సాధారణంగా ఎన్నికల్లో సానుభూతి ఓటు, సెంటిమెంటు ఓటు అంటూ రకరకాల ఓట్లు ఉంటాయి. అలాంటి వాటిలో ఒక రకం.. ‘విసుగు ఓటు’! ఒకే అభ్యర్థిని ఒకటికంటె ఎక్కువసార్లు గెలిపించిన తరువాత.. ఎంతకాలమూ అదేమొహం చూస్తూ ఉండాలా? అనే అభిప్రాయం ఓటర్లలో కలుగుతుంది. ‘పండగ పూట  కూడా పాత మొగుడేనా అనే సామెత మాదిరిగా అన్నమాట! ఒకసారి వేరే వారికి చాన్స్ ఇద్దాం అనే అభిప్రాయమూ ప్రజల్లో కలుగుతుంది. పెద్దగా వ్యతిరేకత ఉండదు.. అలాగని అదే సిటింగ్ ప్రజాప్రతినిధిని మళ్లీ గెలిపించాలనే కోరిక కూడా ఉండదు. అలాంటి దాని పేరే విసుగుఓటు. అలాంటి విసుగుఓటు దెబ్బ ఇప్పుడు నగరి నియోజకవర్గంలో వైసీపీ తరఫున పోటీచేస్తున్న మంత్రి రోజాకు పడేలా కనిపిస్తోంది.

నిజానికి ఒకటికంటె ఎక్కువ సార్లు ఒకే స్థానం నుంచి గెలిచిన అభ్యర్థులు అదే నియోజకవర్గంలో ఎప్పటికీ తిరుగులేని నాయకులుగా పాతుకు పోయే అవకాశాలు చాలా ఎక్కువ. మనకు అలాంటి దృష్టాంతాలు అనేకం కనిపిస్తూ ఉంటాయి. అయితే అలా రెండుసార్లయినా గెలిచిన నాయకులు ఆ నియోజకవర్గం వ్యాప్తంగా విస్తృతమైన ప్రజా సంబంధాలను కలిగిఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యం అవుతుంది. అలాకాకుండా.. గెలిచిన తర్వాత.. గెస్టులాగా నియోజకవర్గానికి వచ్చిపోతూ.. అధికారిక కార్యక్రమాల్లో తప్ప ప్రజలకు కనపడకుండా తిరుగుతూ ఉంటే అంత బలమైన నేతగా పాతుకుపోవడం జరగదు. అలాంటప్పుడు ‘విసుగు ఓటు’ అనేది మొదలవుతుంది.

ఆర్కే రోజా నగరి నియోజకవర్గం నుంచి రెండుసార్లు గెలిచారు. 2014 లో గెలిచారు గానీ.. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడడంతో ఇక చేసేదేమీ లేదన్నట్టుగా నియోజకవర్గంలో పెద్దగా యాక్టివ్ గా ఉండకుండా మిన్నకున్నారు. అయినా సరే.. ప్రజలు 2019 ఎన్నికల్లో మళ్లీ గెలిపించారు. జగన్ సర్కారు ఏర్పడిన నాటినుంచి ఆమె మంత్రి పదవిని ఆశిస్తూ వచ్చారు. దానికి తోడు నియోజకవర్గంలో ముఠా రాజకీయాలు నడపడం ప్రారంభించారు. ఆమె వ్యతిరేక వర్గం ఆమెకంటె బలమైన వర్గంగా పార్టీలో ముద్రపడింది. రోజా వ్యతిరేక వర్గానికి జిల్లాలోని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండదండలు ఉండడంతో ఆమె ఉక్కిరి బిక్కిరి అయ్యారు. అధికారిక కార్యక్రమాల్లో కూడా ఎమ్మెల్యేకు విలువ ఇవ్వకుండా ఆమె వ్యతిరేక వర్గం నడిపిస్తూ వచ్చిందంటే ఆమె పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దానికి తోడు ప్రజలతో పూర్తిస్థాయిలో మమేకం కాలేదు. మంత్రి పదవి దక్కిన తర్వాత కూడా అసమ్మతి మాత్రం సద్దుమణగ లేదు.

ఇప్పుడు ఎన్నికల సమయంలో  అసమ్మతి నాయకులు ఆమెకు చేయగల కీడు ఎంత అనేది ఒక భాగమైతే.. ఆమె ఓడిపోతే గనుక.. ప్రజల్లోని విసుగు ఓటు కూడా ఒక కారణం అవుతుందని అంతా అంటున్నారు. గాలి ముద్దుకృష్ణమ కొడుకు గాలి భానుప్రకాష్ రెడ్డికి ఒక్క చాన్స్ ఇచ్చి చూద్దాం అనే భావన ప్రజల్లో వ్యక్తమవుతున్నట్టుగా కనిపిస్తోంది. 

జగన్.. రంజాన్ ఐసొలేషన్.. నైరాశ్య చిహ్నమే!

ఎన్నికల సమయంలో ఏదో ఒకమతానికి సంబంధించి ఏదైనా పండగ వచ్చిందంటే.. నాయకులు మాత్రం నిజంగానే పండగ చేసుకుంటారు. ఆ పండుగ సందర్భాన్ని తమ తమ పొలిటికల్ ఎడ్వాంటేజీగా మార్చుకోవడానికి గరిష్టంగా వాడుకుంటారు. అంతే తప్ప పర్వదినం రోజున ఐసొలేషన్ లో గడపరు. ప్రజలకు దూరంగా ఒంటరిగా ఉండాలని అనుకోరు. కానీ ఒక మతాన్ని మొత్తం ఇంప్రెస్ చేయగల అవకాశం రంజాన్ పండగ రూపంలో వస్తే.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ అవకాశాన్ని వాడుకోకుండా విశ్రాంతి పేరుతో తనను తాను ఐసొలేషన్ లో బంధించేసుకున్నారు. పండగపూట ఇలా ఒంటరిగా, ఒకరిద్దరిని మాత్రమే కలుస్తూ గడపడం అనేది.. జగన్ లో వ్యక్తమౌతున్న నైరాశ్యభావనలకు చిహ్నం అని పలువురు అభిప్రాయపడుతున్నారు.


రంజాన్ పర్వదినం నాడు ముఖ్యమంత్రి జగన్ పూర్తిగా విశ్రాంతి తీసుకున్నారు. ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజెప్పడంతో చేతులు దులుపుకున్నారు తప్ప..  ముస్లిం సోదరులతో కలిసి రంజాన్ ప్రార్థనల్లో పాల్గొనడం, వారితో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి ఏ పనీచేయలేదు.

మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ధూళిపాళ్ల వద్ద బుధవారం రాత్రి విడిది కేంద్రానికి చేరుకున్నారు. అదే రాత్రి సీఎం భార్య భారతీరెడ్డి అక్కడకు వచ్చారు. గురువారం రంజాన్ కారణంగా బస్సు యాత్రకు విరామం అని ముందే ప్రకటించారు. గురువారం ఉదయం సత్తెనపల్లి అభ్యర్థి అంబటి రాంబాబు, గుంటూరు మార్కెట్ యార్డు ఛైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ శిబిరంలోకి వెళ్లి అరగంటసేపు జగన్ తో గడిపి వచ్చారు. గురువారం జగన్ పూర్తిగా విశ్రాంతిలో ఉంటారని ఎవరినీ కలవరని నాయకులు ముందే ప్రకటించారు. దాంతో ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు ఎవ్వరూ శిబిరం వద్దకు కూడా రాలేదు. శుభాకాంక్షలు తెలియజేయడానికి కొందరు ముస్లిం కార్యకర్తలు పార్టీ జెండాలు పట్టుకుని శిబిరం వద్దకు రాబోతే.. పోలీసులు అనుమతి లేదని వారిని తిప్పి పంపేశారు. రోజంతా విశ్రాంతి పేరుతో ఎవరినీ కలవకుండానే గడిపారు.


సాధారణంగా.. రంజాన్ వంటి పర్వదినం వచ్చినప్పుడు ముస్లింలతో కలిసి ఆ సమయాన్ని గడిపి, ఆ ఫోటోలతో ఆ వర్గంలో మైలేజీ పొందడానికి ఎవరైనా ప్రయత్నిస్తారు. సహజం కూడా. జగన్ అలాంటి పనేమీ చేయలేదంటే.. ఆయనలో నైరాశ్యం తాండవిస్తున్నదని పలువురు అంచనా వేస్తున్నారు. రెండు రోజుల కిందట ఉగాది పర్వదినం నాడు నామమాత్రంగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఉగాది పంచాగ శ్రవణం రద్దుచేశారు. ఇదంతా కూడా ఆయనలోని ఓటమి భయం కారణంగా పుట్టిన డిప్రెషన్ ఎఫెక్టే అని పలువురు అంటున్నారు. 

అమెరికా నుంచి విజయమ్మ వీడియో ప్రచారం !!

0

అన్నా చెల్లెళ్ల మధ్య విమర్శల సమరంలో ప్రత్యక్షంగా తాను కూడా భాగం కావడం ఇష్టం లేక అమెరికా వెళ్ళిపోయిన వైఎస్ విజయమ్మ అక్కడి నుంచే ఎన్నికల ప్రచారం చేసే అవకాశం కనిపిస్తోంది. తన కుమార్తె వైఎస్ షర్మిలను.. తన భర్తకు వారసురాలిగా కడపనుంచి ఎంపీ గా చేయడానికి విజయమ్మ కూడా శక్తి వంచన లేకుండా ప్రయత్నించనుంది. ఎన్నికల ప్రచార పర్వం ఇంకా కీలక దశకు చేరుకున్న తరువాత విజయమ్మ ప్రతిరోజూ వరుస వీడియోలను విడుదల చేయడం ద్వారా షర్మిల అనుకూల ప్రచారం చేస్తారని విశ్వసనీయంగా తెలుస్తోంది.

కడప బరిలో ప్రధానంగా పోటీ అన్నా చెల్లెళ్ళ మధ్యనే అన్నట్టుగా జరుగుతోంది. వైసీపీ అధినేత జగన్ ను, చెల్లెలు షర్మిల ఒక రేంజిలో ఆడుకుంటున్నారు. చిన్నాన్న వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి అసలు హంతకుడు అంటూ షర్మిల నిర్దాక్షిణ్యంగా విమర్శలు సంధిస్తున్నారు. హంతకుడిని కాపాడుతున్న దుర్మార్గుడు జగన్ అంటూ ప్రజల ముందు నిలబెడుతున్నారు. ఇప్పటికే వైసీపీ శిబిరంలో ఆమె దడ పుట్టిస్తున్నారు. రెండు మూడు వారాల తర్వాత తల్లి విజయమ్మతో కూడా అమెరికా నుంచి ప్రచార వీడియోలు చేయించి.. వదలాలని ప్లాన్ చేస్తున్నారట.

షర్మిల,  జగన్ తో గొడవ పడి విడిపోయిన తర్వాత విజయమ్మ వైసీపీ గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అప్పటినుంచి ఆ పార్టీ గురించి పట్టించుకోలేదు. జగన్ కూడా తల్లిని పట్టించుకోలేదు.

కానీ ఏపీసీసీ సారథిగా, కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల రంగంలోకి దిగిన తరువాత జగన్ తల్లిని తన పార్టీ తరఫున ప్రచారం చేయాలని కోరినట్లు సమాచారం. అది ఇష్టం లేక ఆమె అమెరికా లోని షర్మిల కొడుకు తన మనవడు వద్దకు వెళ్లిపోయారు. 

అయితే షర్మిల మాత్రం వ్యూహాత్మకంగా తన కొడుకు ద్వారా తల్లితో, తనకు అనుకూలంగా ప్రచార వీడియోలు చేయించి వదలబోతున్నారు. నిజానికి ఇది జగన్ చూపించిన మార్గమే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. షర్మిల సునీతలను తిట్టడానికి జగన్ తమ మేనత్త విమలమ్మ తో వీడియోలు చేయించి వదిలారని, అదే బాటలో షర్మిల తల్లితో చేయిస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విజయమ్మ వీడియోలలో కేవలం అవినాష్ మీద మాత్రం నిందలు వేస్తుందా.. జగన్ ను కూడా విమర్శిస్తుందా అనేది చూడాలి.

అవినాష్‌కు మొండిచెయ్యి : షర్మిలకు జడుస్తున్నారా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థులుగా ప్రకటితమైన వాళ్లందరూ మురిసిపోవడానికి ఇంకా వీల్లేదు. నామినేషన్ల ఉపసంహరణ కూడా పూర్తయ్యేవరకు వారి బతుకులు డైలమాలోనే ఉండేలా కనిపిస్తోంది. ఎందుకంటే  జగన్మోహన్ రెడ్డి ఇంకా అభ్యర్థుల మార్పు గురించి కసరత్తు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా మూడు నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒకటిరెండు ఎంపీ నియోజకవర్గంలో అభ్యర్థులను మార్చడానికి ఆలోచిస్తున్నారట. ఎమ్మెల్యే అభ్యర్థిత్వాల మార్పు విషయంలో రకరకాల కారణాలు ఉన్నప్పటికీ.. ఎంపీ అభ్యర్థి మార్పు విషయంలో చెల్లెలు వైఎస్ షర్మిల విమర్శలకు జడుసుకునే ఆ నిర్ణయానికి వచ్చారని అంటున్నారు.

కొత్తగా వినిపిస్తున్న సమాచారాన్ని బట్టి.. కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డిని తప్పించే అవకాశం ఉందని అంటున్నారు. ఆయన స్థానంలో అభిషేక్ రెడ్డిని పోటీకి దించుతారనే ప్రచారం జరుగుతోంది. షర్మిల కాంగ్రెస్ తరఫున ఎంపీ అభ్యర్థిగా బరిలోకిదిగి.. ఊరూరా తిరుగుతూ.. ఏ స్థాయిలో జగన్ వ్యతిరేక ప్రచారం సాగిస్తున్నారో అందరికీ తెలుసు. చిన్నాన్న చంపిన హంతకులను పార్లమెంటుకు పంపుతావా? అంటూ జగన్ ను సూటిగా ప్రశ్నిస్తున్నారు. చిన్నాన్న హంతకులను కాపాడడంలో ఆంతర్యం ఏమిటి? హత్య వెనుక నీ పాత్ర ఎంత? అంటూ జగన్ ను విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు. ఎక్కువగా సర్వేల మీద ఆధారపడే జగన్మోహన్ రెడ్డి, తాజాగా కడపలో చేయించిన సర్వేలో ఓటమి గ్యారంటీ అని తేలినట్టుగా సమాచారం. నియోజకవర్గ ప్రజలు షర్మిలకు అనుకూలంగా మొగ్గుతున్నారని, వైసీపీ నాయకుల్లో కూడా పలువురు లోలోపల ఆమెకు అనుకూలంగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయనకు అర్థమైంది. దీంతో అవినాష్ రెడ్డి బరిలో ఉంటే ఓటమి తప్పదని, అదే జరిగితే.. పార్టీ పరువు మాత్రమే కాకుండా, చెల్లెలి చేతిలో పరాజయానికి వ్యక్తిగతంగా తన పరువు కూడా పోతుందని జగన్ భయపడుతున్నారు. అందుకే అవినాష్ ను మారుస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

దీంతో పాటూ గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ఉన్న కిలారు రోశయ్యను గుంటూరు వెస్ట్ కుబదిలీ చేసి, అక్కడ అభ్యర్థిగా ఉన్న మంత్రి విడదల రజనిని గుంటూరు ఎంపీగా పోటీచేయిస్తారని కూడా ప్రచారం ఉంది. కిలారు రోశయ్య ఎంపీ స్థానానికి ఖర్చు పెట్టగలిగేంత నిధులు తన వద్ద లేవని చేతులెత్తేసినట్టుగా కొన్ని రోజుల కిందట ప్రచారం జరిగింది. ఇప్పుడు సీటు మార్పు గురించిన ప్రచారం జరగుతోంది. అయితే ఇలాంటి ప్రచారాన్ని రోశయ్య ఖండిస్తున్నారు. గుంటూరు ఎంపీగా తానే బరిలో ఉంటానని అంటున్నారు.

అలాగే మైలవరంలో తెదేపా తరఫున ఉన్న వసంతకృష్ణ ప్రసాద్ ను ఢీకొనేందుకు, పెనమలూరు అభ్యర్థిగా ఉన్న జోగి రమేష్ ను తీసుకువస్తారనే ప్రచారం ఉంది. అలాగే విజయవాడ వెస్ట్ స్థానానికి ఆసిఫ్ ను జగన్ ప్రకటించారు. ఇప్పుడు ఆ స్థానంలో జనసేన నుంచి వచ్చి చేరిన పోతిన మహేష్ కు కట్టబెడతారని ప్రచారం జరుగుతోంది. పోతిన మహేష్ అయితే పవన్ కల్యాణ్ ను తిట్టడానికి బాగా ఉపయోగపడతారని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
మరి ఈ సరికొత్త మార్పు చేర్పుల గురించిన సమాచారం ఎప్పుడు అధికారికంగా వెల్లడవుతుందో, వైసీపీకి ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో చూడాలి. 

గోపిచంద్‌ ఈజ్‌ బ్యాక్.. ఈసారి ఇరగదీసేట్టే ఉన్నాడుగా!

మాచో స్టార్‌ గోపీచంద్‌… తెలుగు ఇండస్ట్రీలో కి విలన్‌ గా ఎంట్రీ ఇచ్చి హీరోగా మారాడు. తాజాగా ఆయన డైరెక్టర్‌ శ్రీనువైట్ల తో కలసిఇ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రంజాన్‌ సందర్భంగా సినిమా నుంచి ఫస్ట్‌ స్ట్రైక్‌ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సినిమాని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ పై టీజీ విశ్వ ప్రసాద్‌, చిత్రాలయ స్టూడియోస్‌ పై వేణు దోనేపూడి నిర్మిస్తున్న మాస్‌ ఎంటర్‌టైనర్‌ ఈ చిత్రం.

 #గోపీచంద్32కి ‘విశ్వం’ అనే పవర్ ఫుల్ టైటిల్ ఖరారు చేశారు. తాజాగా విడుదల చేసిన ఫస్ట్ స్ట్రైక్ వీడియో చూస్తే వధూవరులు పెళ్లి మండపంలోకి రావడం, సంగీత విద్వాంసుల బృందం వివిధ వాయిద్యాలు వాయిస్తూ, పూజారి మంత్రాలు చదవడం , రుచికరమైన ఆహారాన్ని సిద్ధం చేస్తున్న చెఫ్‌లు.. ఇలా వివాహ వేడుకలతో ఫస్ట్ స్ట్రైక్ వీడియో మొదలైంది.

గోపీచంద్ పెద్ద గిటార్ కేస్‌ లాంటి దానిని భుజంపై వేసుకుని పెళ్లి మండపం వైపు నడుస్తూ ఎంట్రీ ఇవ్వగా  కొద్ది సేపటికీ అది గిటార్ కాదు, మెషిన్ గన్ అని చూపడం ఆసక్తి రేపుతోంది. ఇక ఆశ్చర్యకరంగా అతను వధూవరులను, వివాహానికి వచ్చిన అతిథులందరినీ కాల్చడం ప్రారంభించి అక్కడ ఫుడ్ ని ఆస్వాదిస్తూ, “దానే దానే పే లిఖా, ఖానే వాలే కా నామ్… ఇస్పే లిఖా మేరే నామ్..’ అని చెప్పడం చాలా పవర్‌ ఫుల్‌ గా అనిపించింది.

చాలా పవర్ ఫుల్ గా అనిపిస్తోంది. లైట్ గా ఉన్న గడ్డంతో, డార్క్ కళ్లద్దాలు పెట్టుకుని స్టైలిష్‌గా కనిపించిన గోపీచంద్‌ని ఇలా నెగెటివ్‌ షేడ్‌లో చూడటం నిజంగా థ్రిల్లింగ్‌  గా అనిపిస్తోంది. గోపీచంద్‌ డైలాగ్ చెప్పిన విధానం, క్యారెక్టర్ గ్రే షేడ్స్ లో ఉన్నట్టే కనిపిస్తోంది. 

Peoples Pulse Researcher Predicts Massive Edge Towards TDP

As the election notification to be issued in Andhra Pradesh in two days, one of the major poll research organisations in Telugu states, Peoples Pulse researcher EV Murali Krishna Sharma predicts that TDP and its allies have a massive edge in the polls.

According to him, TDP alliance with Jana Sena and BJP is likely to bring back 2014 combination and transfer of vote share, which itself will make a difference in about 70 assembly constituencies. Moreover, change in the perception of YS Jaganmohan Reddy politics among various sections like employees and youth makes a difference.

Above all, this image of `Rajanna Rajyam’ will be no more helpful to YS Jagan and he has to depend upon the government’s performance only. To examine the likelihood of transfer of votes, Murali Krishna Sharma examined CSDS- LokNiti data.

In 2014, when three parties were together, the TDP got 44.5 percent votes, the ally BJP got 2.18 percent votes and got a total of 46.68 percent votes, while the YSRCP got 44.12 percent votes. TDP came to power with a margin of just 2.56 percent.

In the 2019 assembly elections, TDP got 39.26 percent votes, Jana Sena got 5.15 percent votes, BJP got 0.84 percent votes, YSRCP got 49.95 percent votes and took the reins of power with 151 seats. TDP won 24 seats.

If the votes obtained by the TDP-Janasena-BJP parties, which contested separately, were combined, they would have had a chance to win 34 more seats. Similarly, there are 10 seats which were lost by 1 to 2 per cent votes and 11 seats which were lost by 3 to 5 per cent votes.

Considering the current situation in the state, there are chances of this alliance winning most of these 21 seats which were lost with a low percentage of votes.

As part of the scientific study, if we consider the current political situation along with the statistics of 2019, there is a possibility that TDP, Janasena and BJP will win more than 70 of the above mentioned 79 seats. In this way, there are good chances of this coalition easily achieving the simple majority required to form the government.

In 2019, YCP got 45.55 percent and TDP got 27.32 percent of the postal ballots. At present government employees who are known as opinion makers are unhappy with YCP. They are unable to digest the cancellation of CPS, non-payment of salaries on time and non-receipt of benefits.

These ‘opinion makers’ are likely to make a significant influence on the out-come of the present polls. In addition to them, the unemployed youth are angry with the Jagan government for not announcing the job calendar and not giving jobs as stated in the YSRCP election manifesto.

ఏంటి ఇది నిజమా…? పుష్ప 2 లో పవర్ స్టార్ నటిస్తున్నారా?

జాతీయ నటుడు అల్లు అర్జున్‌, లెక్కల మాస్టర్‌ సుకుమార్‌ కాంబోలో తెరకెక్కిన చిత్రం పుష్ప. దాని సీక్వెల్‌ గా రాబోతున్న చిత్రం పుష్ప 2 . ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టు 15న వరల్డ్‌ వైడ్‌ గా విడుదల కాబోతుంది. ఈ సినిమా పై ముందు నుంచి కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

బన్నీ బర్త్‌ డే కానుకగా .. విడుదలైన టీజర్‌ ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. విడుదలైన కొద్ది గంటల్లోనే కొన్ని మిలియన్ల వ్యూస్‌ ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి  ఇప్పుడు మరోవార్త ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. అది ఏంటంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో భాగం కాబోతున్నారని తెలుస్తోంది.

 అంటే ఆయన ఈ సినిమాలో నటిస్తున్నారా? అనే డౌట్ వస్తుంది కదూ.. ఈ సినిమాలో కథానాయికున్ని ఇంట్రడ్యూస్ చేస్తూ సినిమా ప్రారంభంలో  కొన్ని డైలాగులను పవన్ చెప్పబోతున్నారట. పవన్ తన వాయిస్ ను ఇవ్వనున్నారని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఇక ఇటీవల అల్లు అర్జున్ కి బర్త్ డే రోజు విషెస్ చెబుతూ పవన్ విషెస్‌ చెబుతూ ఓ ట్వీట్ ని కూడా చేశారు..

ఈ సినిమాకు మరింత హైప్ ను క్రియేట్ చేసేందుకు సుక్కు పవన్ కళ్యాణ్ ను రంగంలోకి దించబోతున్నారని సమాచారం. దీని గురించి క్లారిటీ రావాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే. ఏది ఏమైనా ఈ వార్త అల్లు అర్జున్‌ ఫ్యాన్స్ కు సంతోషాన్ని ఇస్తుంది. 

Gopichand’s Next With Sreenu Vaitla, Titled ‘Viswam’

Tollywood’s Macho Star Gopichand’s next Gopichand32 is now titled ‘Viswam’. The moviemakers of Gopichand32 unveiled the film’s title and released their ‘First Strike’ teaser on the occasion of Eid.

Gopichand took to his social media handles (Instagram and X) shared the teaser and wrote, “Presenting the First Strike of my Next on this Auspicious day of #Ramzan. #Viswam it is..! A film by #SreenuVaitla”

The teaser begins with stunning visuals of North India, where locals were seen celebrating. However, the tranquil scene becomes interrupted by Gopichand’s presence, who unleashes gunfire and brings the celebrations to a halt. With the teaser, “Viswam” promises to be a gripping action thriller, showcasing Gopichand in a compelling anti-hero persona.

Gopichand, renowned for his captivating action sequences and his mass appeal, and Sreenu Vaitla, celebrated for his action comedy, united for the first time for this riveting action-packed thriller, Viswam.

Speaking of Viswam, the action-thriller is helmed by Sreenu Vaitla, who is making a comeback after his last film, Amar Akbar Anthony, which was released in 2018. Viswam is backed jointly by Venu Dondepuri of Chitralayam Studios and TG Vishwaprasad of People Media Factory. Kavya Thapar is romancing with Gopichand in this action flick.

Chaitan Baradwaj is composing music for this action entertainer. The film’s cinematography was handled by KV Guhan, while editing was covered by Amar Reddy Kudumula. The release date of the film is yet to be revealed. So stay tuned for further updates!!