ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లుగా పనిచేస్తున్న వారి జీవితాలు ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి. వారి ఉద్యోగాల మీద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కత్తి వేలాడుతోంది. వారిని తమ రాజకీయ అవసరాల కోసం వాడుకోవడానికి ఇప్పుడు వారందరితో బలవంతంగానైనా సరే రాజీనామాలు చేయించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు వ్యూహరచన చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లను వాడుకుంటూ ఉంటే కేసులు నమోదవుతున్న నేపథ్యంలో, వారితో రాజీనామాలు చేయించేస్తే ఏ గొడవా ఉండదని భావిస్తున్నారు. వాలంటీర్లకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఒత్తిడి చేసి ఉద్యోగాలు ఊడగొట్టాలని ప్రయత్నిస్తున్నారు. ‘వాలంటీర్లు అందరూ మన పార్టీ కార్యకర్తలే కదా ప్రస్తుతానికి వాళ్ళందరితో రాజీనామాలు చేయించి ఎన్నికల ప్రచారానికి వాడుకుందాం. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారి సంగతి మళ్ళీ ఆలోచిద్దాం’ అనే వ్యూహంతో నాయకులు ముందుకు సాగుతున్నారు.
ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉండేలాగా వ్యవస్థను రూపు దిద్దినప్పుడే వీరి ద్వారా ఎన్నికల సమయంలో అనుచిత ప్రయోజనాలు పొందడానికి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేశారని అందరూ ఊహించారు. దానికి తగ్గట్టుగానే వాలంటీర్లు వ్యవస్థ నడుస్తూ వచ్చింది. వాలంటీర్లు తమ సొంత పార్టీ కార్యకర్తలే అంటూ వారి ద్వారా జగన్ మళ్ళీ రాకపోతే పెన్షన్లు పథకాలు ఏవి కూడా రావు అనే మాటలు గత ఐదేళ్లుగా ప్రతి లబ్ధిదారునికి ప్రతినెలా చెప్పిస్తూ వచ్చారు. ఎన్నికల సమయంలో కూడా ఇదే ప్రచారాన్ని కొనసాగించాలని, ప్రభుత్వపరమైన ఎన్నికల విధులలో వాలంటీర్లను వాడుకోవడం ద్వారా అనుచిత లబ్ధి పొందవచ్చునని వైఎస్ఆర్సిపి భావించింది. కానీ వాలంటీర్లు ఎన్నికల విధులలో పాల్గొనకుండా బ్రేక్ పడింది. చివరికి వారి ద్వారా లబ్ధిదారులను ప్రలోభపెట్టే అవకాశం లేకుండా పింఛన్ల పంపిణీ నుంచి కూడా ఈసీ వారిని దూరం పెట్టింది. వాలంటీర్లు వైసిపి నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారానికి వెళితే కేసులు నమోదు అవుతున్నాయి. ఇలాంటి చికాకులన్నీ తప్పించుకోడానికి ఏకంగా వారందరితోనూ రాజీనామాలు చేయించాలని వైసీపీ పెద్దలు నిర్ణయించారు.
చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని వాలంటీర్లకు తమ ప్రభుత్వం లో వేతనం 10000 రూపాయలకు పెంచుతానని ప్రకటించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ లో భయం పెరిగింది. వాలంటీర్లలో చంద్రబాబు నాయుడు పట్ల అభిమానం ఏర్పడింది. ఇన్నాళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్కు ఎంతగా సేవలు చేస్తున్నా వేతనాలు పెంచమని అడిగితే పట్టించుకోని జగన్ సర్కారు పట్ల విముఖత ఏర్పడింది. అలాంటి పరిస్థితుల్లో వాలంటీర్లు తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేస్తారేమో అనే భయం అధికార పార్టీలో పుట్టినట్లుగా కనిపిస్తుంది.
వాలంటీర్లతో తక్షణం రాజీనామా చేయించి వారు తమ కను సన్నల్లోంచి పక్కకు జారిపోకుండా ఉండేలా ఆ పార్టీ చర్యలు తీసుకుంటుంది. రాజీనామాల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా నిత్యం తిప్పుకుంటూ ఉంటే సరిపోతుంది అని భావిస్తున్నారు. సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. వాలంటీర్లందరూ మన వాళ్లే కదా.. అందరితో రాజీనామాలు చేయించి.. ప్రచారంలో వాడుకుందాం అని చెప్పడం కూడా ఈ పోకడకు నిదర్శనం.
వాలంటీర్ల మెడపై వైసీపీ కత్తి
అన్నా చెల్లెళ్ల పోరు తాళలేక అమెరికాకు విజయమ్మ!
తల్లిదండ్రులు విడిపోయే సందర్భాలలో ఊహ తెలిసిన పిల్లలు ఎవరి దగ్గర ఉండడానికి ఇష్టపడితే వారివైపు న్యాయం ఉన్నట్టు లెక్క. అదే తరహాలో పిల్లలు విడిపోయినప్పుడు.. తల్లిదండ్రులు ఎవరి వెంట ఉండదలచుకుంటే వారివైపు న్యాయం ఉన్నట్టు లెక్క. ఆ ప్రకారం చూసినప్పుడు.. గత కొన్ని సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డికి దూరంగా, షర్మిల వెంట మాత్రమే ఉంటూ, షర్మిల కోసం రోడ్డెక్కి ధర్నాలు కూడా చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి భార్య విజయమ్మ రాష్ట్రప్రజలకు స్పష్టమైన సంకేతాలే ఇచ్చారు. న్యాయం ధర్మం షర్మిలవైపు ఉన్నట్టుగానే ఆమె ఇన్నాళ్లూ అన్యాపదేశంగా చెప్పేశారు. అయితే ఇప్పుడు ఎన్నికల సీజను వచ్చింది.
జగన్మోహన్ రెడ్డి ఎలాంటి చిన్న అవకాశాన్ని కూడా చేజార్చుకోవడానికి ఇష్టపడరు. అలాంటిది తల్లి ప్రచారం ద్వారా రాగల ఎడ్వాంటేజీని ఎందుకు వద్దనుకుంటారు. ఇన్నాళ్లుగా తల్లిని విస్మరించినప్పటికీ.. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో వైసీపీ తరఫున ప్రచారం చేయాలంటూ జగన్ ఒత్తిడి చేయడంతో.. అన్నాచెల్లెళ్ల మద్య పోరులో తాను తాళలేక.. విజయమ్మ అమెరికాలోని బంధువుల వద్దకు వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది.
2019 ఎన్నికల తర్వాత.. జగన్ షర్మిల మధ్య విభేదాలు పెరిగి వారు ఎడంగా ఉండిపోయిన సంగతి తెలిసిందే. జగన్ సీఎం అయ్యాక కొన్నాళ్లు ఆయనతో పాటు ఉన్న విజయమ్మ తర్వాత హైదరాబాదులోని కూతురు దగ్గరకు వచ్చేశారు. తాడేపల్లిలో ఉండగా.. అమరావతి రాజధాని నిర్మాణానికి ఆమె అనుకూలంగా ఉన్నారని కూడా వినిపించింది. సగంలో ఉన్న అమరావతి రాజధాని భవనాలను ఆమె స్వయంగా ఆ ప్రాంతంలో తిరిగి పరిశీలించి.. పూర్తిచేయాల్సిందిగా జగన్ కు చెప్పినట్టు కూడా వినిపించింది. తర్వాత కొడుకునుంచి దూరం జరిగారు. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టాక.. వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేసి, ఆ పార్టీకి పూర్తిగా గుడ్ బై చెప్పేసి, కూతురు వెంట ఉన్నారు.
తీరా ఇప్పుడు షర్మిల కడప ఎంపీగా బరిలో ఉండడం, జగన్ మీద విమర్శలు కురిపిస్తూ ఉండడంతో విజయమ్మకు సంకట స్థితి ఎదురైంది. తనతో ప్రచారానికి రావాల్సిందిగా కూతురు, తమ పార్టీ తరఫున ప్రచారం నిర్వహించాలని కొడుకు ఇద్దరి నుంచి ఆమె మీద ఒత్తిడి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఒత్తిడి తట్టుకోలేక విజయమ్మ అమెరికాలోని బంధువుల వద్దకు వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది.
తిరుపతి అసంతృప్తులను సెట్ చేసేసిన పవన్!
జనసేనకు దక్కిన 21 ఎమ్మెల్యే స్థానాల్లో తిరుపతి నియోజకవర్గంలోని స్థానిక నేతల అసంతృప్తి పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే. పొత్తుల్లో తిరుపతి సీటు తీసుకున్న జనసేనాని.. పలుదఫాలుగా అక్కడ సర్వేలు నిర్వహించిన తర్వాత.. విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయనే ఉద్దేశంతో చిత్తూరు సిటింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులును అభ్యర్థిగా ఎంపిక చేశారు. అయితే.. ఆరణి ఎంపిక తిరుపతి జనసేనలో ప్రకంపను పుట్టించింది. ఆరణి గోబ్యాక్ అంటూ ఫ్లెక్సిలు వెలిశాయి. ఆయనకు సహకరించేది లేదని స్థానికనేతలు పెద్దఎత్తున ఆందోళనలు చేశారు. చివరికి స్వయంగా తిరుపతికి వచ్చి అక్కడి నాయకులు అందరితోనూ సమావేశమైన పవన్ కల్యాణ్.. అసంతృప్తులందరినీ బుజ్జగించి ఆరణి విజయం కోసం పనిచేసేలా ఒక్కతాటిమీదకు తెచ్చేశారు.
పవన్ కల్యాణ్ తన రాజకీయ అనుభవాన్ని, తెలివితేటలను తిరుపతి నియోజకవర్గం బుజ్జగింపుల విషయంలో నిరూపించుకున్నారని సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. ఎందుకంటే.. ఎన్నికల సమయంలో ఇలాంటి అసంతృప్తులు ప్రతి నియోజకవర్గంలోనూ వ్యక్తం అవుతూ ఉండడం చాలా సహజం. ఇలాంటి పరిస్థితి దాదాపుగా అన్ని పార్టీల్లోనూ ఉంటుంది. పార్టీ అధినేతలు తమ నివాసాలకు అసంతృప్త నేతల్ని పిలిపించుకుని వారిని ఊరడిస్తుంటారు. కానీ.. పవన్ కల్యాణ్ తిరుపతి విషయంలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు.
శుక్రవారం నాడు ఉండవిల్లిలోని చంద్రబాబునాయుడు నివాసంలో మూడు పార్టీల నాయకుల కీలక భేటీ జరిగింది. సీట్లపంపకాల్లో ఉండే చిన్న చిన్న చికాకుల గురించి నేతలు చర్చించుకున్నారు. పునఃపంపంకం గురించి కూడా మాట్లాడుకున్నారు. ఆ భేటీ ముగిసిన వెంటనే.. పవన్ కల్యాణ్ నేరుగా తిరుపతికి వచ్చేశారు. స్థానికంగా ఉన్న పార్టీ నాయకులందరితోనూ విడివిడిగానూ, ఉమ్మడిగానూ సమావేశం అయ్యారు. తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మను కూడా పిలిపించి మాట్లాడారు. తిరుపతిలో వైసీపీని ఓడించి తీరాలని.. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే.. పార్టీని నమ్ముకుని ఉన్న వారందరికీ తగిన న్యాయం చేస్తామని పవన్ వారికి హామీ ఇచ్చారు.
అంతా ముగిసిన తరవాత.. అక్కడ పార్టీలో ఇన్నాళ్లూ అసంతృప్త వర్గానికి నాయకత్వం వహించిన కిరణ్ రాయల్ మీడియాతో.. పవన్ కల్యాణ్ తనను కుటుంబసభ్యుడిగా భావిస్తున్నారని, ఆయన ఆదేశాల మేరకు అందరమూ ఆరణి శ్రీనివాసులు విజయానికి పనిచేస్తామని చెప్పడం విశేషం. తిరుపతిలో జనసేన పార్టీలో చీలిక తీసుకురావడం ద్వారా కాపు ఓటుబ్యాంకును చీల్చి లబ్ధిపొందాలని వైసీపీ వ్యూహాత్మకంగా పనిచేస్తోంది. అయితే.. పవన్ స్వయంగా వచ్చి సర్దిచెప్పడంతో జనసేన, తెలుగుదేశం, బిజెపి శ్రేణులన్నీ ఒక్కతాటిపైకి వచ్చాయి. ఇది పార్టీ అభ్యర్థికి శుభపరిణామం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
కమలం ఆ త్యాగం చేస్తే మేలు పురందేశ్వరికే!
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు నివాసంలో కూటమిలోని మూడు పార్టీలకు చెందిన కీలక నేతలు భేటీ నిర్వహించారు. ఎన్నికల ప్రచారపర్వంలో ముందుకు సాగాల్సిన వ్యూహాలు, ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనకు ప్రణాళిక, ఇప్పటికే అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసినప్పటికీ.. ఒకటిరెండు మార్పులు చేసుకోవడానికి గల అవకాశాలను గురించిన చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, పురందేశ్వరిలతో పాటు బిజెపి జాతీయ నాయకులు కూడా పాల్గొన్న ఈ భేటీలో ప్రధానంగా అనపర్తి ఎమ్మెల్యే స్థానాన్ని బిజెపి వదులుకోవడం గురించి కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది.
అయితే ఈ మూడు పార్టీల నాయకుల మధ్య ఎలాంటి చర్చ జరిగిందో, ఎలాంటి ఒడంబడిక ఏర్పడిందో తెలియదు గానీ.. అనపర్తి స్థానాన్ని త్యాగం చేయడం కమలదళానికే ఎక్కువ లాభం అనే వ్యాఖ్యలు స్థానికంగా రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. రాజమండ్రి ఎంపీ సీటును బిజెపి గెలుచుకోవడానికి, పురందేశ్వరి ఎంపీగా సభలో అడుగుపెట్టడానికి ఈ త్యాగం ఉపయోగపడుతుందని వారు అంచనా వేస్తున్నారు.
నిజానికి బిజెపి తమకున్న బలానికి మించి ఆరు ఎంపీ స్థానాలను పది ఎమ్మెల్యే స్థానాలను ఒప్పందంలో భాగంగా తమ వాటాగా పుచ్చుకుంది. వారికి ఎంపీసీట్లు ప్రధానంగనుక.. 6 స్థానాల సంగతి పక్కన పెడితే.. తెలుగుదేశం 8 ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే ఇవ్వడానికి మొగ్గు చూపించినప్పటికీ.. బిజెపి చాలా గట్టిగా పట్టుపట్టి 10 స్థానాలు తీసుకుంది. అందులో అనపర్తి కూడా ఉంది. నిజానికి అనపర్తి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి ఉన్న సొంత బలం సున్నా అనే చెప్పాలి. కానీ తెలుగుదేశానికి బలమైన అభ్యర్థి ఉన్నారు. ఒప్పందాల్లో ఇలా జరుగుతుందనే అంచనా లేక ఆయన ముమ్మరంగా ప్రజల్లో ఉంటూ ప్రచారం చేసుకుంటున్నారు. బిజెపికి ఆ సీటు దక్కిన తర్వాత అతి కష్టమ్మీద అక్కడకు అభ్యర్థిని ఎంపిక చేశారు. కానీ.. బలహీనమైన అభ్యర్థి కావడం వలన.. కనీసం గట్టిపోటీ ఇవ్వలేరనేది ఆ పార్టీలోనే అంతర్గతంగా వినిపిస్తున్న సంగతి.
అదే సమయంలో.. అనపర్తి స్థానాన్ని తెలుగుదేశానికి కేటాయిస్తే.. అక్కడ ఓట్లు బాగా పడతాయని, ఆ ప్రభావం వల్ల రాజమండ్రి ఎంపీగా పోటీచేస్తున్న పురందేశ్వరికి కూడా అనపర్తి సెగ్మెంటునుంచి ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉన్నదనేది స్థానికుల విశ్లేషణ. బిజెపి తమకు బలం లేని సీటు కూడా కావాలంటూ పట్టుదలకు పోకుండా.. అనపర్తి స్థానాన్ని త్యాగం చేస్తే.. అంతిమంగా రాజమండ్రి ఎంపీ రూపంలో వారి పార్టీనే లాభపడుతుందని.. అలా చేయకపోతే ఉభయులూ నష్టపోతారని ప్రజలు అంటున్నారు.
పులివెందుల పూలంగళ్ల దగ్గర పంచాయతీకి సిద్ధమా?
వైఎస్ షర్మిల .. తన ప్రచారపర్వంలో జగన్మోహన్ రెడ్డికి, ఆయన అనుచర గణాలకు ఊపిరి ఆడనివ్వని పరిస్థితి క్రియేట్ చేయడం, ఆమె ప్రచారాన్ని వైకాపా శ్రేణులు ప్రతిఘటిస్తుండడం వంటి వ్యవహారాలు కడప జిల్లాలో సెకండ్ ఫేజ్ కు చేరుకున్నాయి. అసలు షర్మిలకు ప్రతిఘటనలు మొదలు కాకముందు.. ఆమె సభల్లో ఏకపక్షంగా వివేకా హత్య గురించి, హంతకుడని అంటూ అవినాష్ గురించి, హంతకులను కాపాడుతున్నారంటూ జగన్ గురించి తీవ్రమైన విమర్శలు చేస్తూ వచ్చారు. ప్రతిఘటనల ఫస్ట్ ఫేజ్ లో.. జగన్ అభిమాని ఒకరు షర్మిల ప్రసంగిస్తుండగా వచ్చి ఆమె పక్కన నిల్చుని.. ఆమె కడప రాజకీయాల్లోకి రావడం తమకు ఇష్టంలేదని, తామంతా జగన్ తోనే ఉంటాం అని మైకుతీసుకుని మరీ ప్రకటించడం జరిగింది. ఇప్పుడు పులివెందుల నియోజకవర్గ పరిధిలోని లింగాల మండలంలో షర్మిల బస్సు యాత్ర పర్యటిస్తున్నప్పుడు.. వైసీపీ శ్రేణులు ఇంకా తీవ్రస్థాయిలో ప్రతిఘటించాయి. వైకాపా జెండాలు పట్టుకుని వచ్చిన కార్యకర్తలు.. షర్మిలకు వ్యతిరేకంగా, జగన్ కు అనుకూలంగా నినాదాలు చేశారు. పోటీగా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నినాదాలకు దిగడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఈలోగా పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితి సద్దుమణిగేలా చేశారు.
అయితే షర్మిల మాత్రం వైసీపీ కార్యకర్తల ప్రతిఘటనలకు బెదిరిపోలేదు. ‘అవినాష్ రెడ్డికి ఓడిపోతానని భయం పట్టుకుంది. అందుకే తనను అడ్డుకునేందుకు మనుషుల్ని పంపుతున్నారంటూ’ రెచ్చిపోయారు. బాబాయిని చంపిన సంగతి కుటుంబ విషయం కాదు. ప్రజానాయకుడు వివేకా హత్య విషయం. చంపిన వారిని జగన్ పక్కన పెట్టుకున్నారు. వారిని కాపాడడానికి ప్రయత్నిస్తున్నారు. హంతకులకు జగన్ అండగా నిలబడినందుకే కడప ఎంపీగా పోటీచేస్తున్నా అంటూ షర్మిల సూటిగా పేర్కొన్నారు.
తన పర్యటనలో అల్లర్లు చేస్తున్న వైసీపీ కార్యకర్తలను ఉద్దేశించి.. ‘అల్లరి చేసేవాళ్లు పులివెందులకు రండి. పూల అంగళ్ల వద్ద పంచాయతీ పెడదాం. వివేకాను ఎవరు హత్య చేశారో తేల్చుకుందాం..’ అంటూ షర్మిల వారికి సవాలు విసిరారు.
సాధారణంగా తెలుగుదేశం, జనసేన పార్టీలు కూడా తమ తమ ఎన్నికల ప్రచార సభల్లో జగన్ మీద తీవ్రమైన నిందలు వేస్తున్నాయి. చంద్రబాబునాయుడు కడప జిల్లా పర్యటనలో.. వివేకా హత్య వ్యవహారాన్ని ప్రముఖంగానే ప్రస్తావించారు. షర్మిల తరహాలోనే.. హంతకులను కాపాడడానికి జగన్ ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. అయితే వారెవ్వరికీ కూడా వైసీపీ దళాలనుంచి ప్రతిఘటన ఎదురు కాలేదు. వారి సభల్లో వైసీపీ నిరసనలు వ్యక్తం కాలేదు. అయితే షర్మిల సభలను మాత్రం వైసీపీ వారు టార్గెట్ చేస్తున్నారంటే ఆమె సభలకు భయపడుతున్నట్టుగా అనిపిస్తోంది. అవినాష్ రెడ్డిలోనే ఓటమి భయం మొదలైందని.. అందుకే షర్మిల సభలను భగ్నం చేయడానికి తమ పార్టీ వారిని పంపుతున్నారని కడప జిల్లా ప్రజలు అనుకుంటున్నారు.
బాలినేని కోడలు చుట్టూ చెలరేగిన వివాదం!
అభ్యర్తులకు అనుకూలంగా వారి కుటుంబసభ్యులు ప్రచారం చేయడం కొత్త విషయం కాదు. కానీ అనవసరమైన వివాదంలో చిక్కుకోవడం, గోటితో పోయేదానికి గొడ్డలిదాకా తెచ్చినట్టుగా వివాదాన్ని పెద్ద రాద్ధాంతంగా మార్చుకోవడం ఒంగోలులోనే జరిగింది. ఒంగోలులో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ తరఫున పోటీచేస్తున్నారు. ఆయన తరఫున కోడలు శ్రీకావ్య ఎన్నికల ఇంటింటి ప్రచారానికి వెళ్లింది.
అయితే.. ప్రతి ఇంటికీ జగనన్న చేసిన మేలు, ఇచ్చిన డబ్బు వివరాలు మొత్తం ఏకరవు పెట్టాలని అనుకున్నదో ఏమోగానీ.. తన వెంట స్థానిక వాలంటీరును కూడా వెంటబెట్టుకుని వెళ్లింది. వాలంటీరు ప్రచారంలో రావడానికి తెలుగుదేశం వారు ప్రశ్నించడం, వైసీపీ కార్యకర్తలు వారి ఇంటిమీద పడి విధ్వంసం సృష్టించడం, ప్రశ్నించిన తెలుగుదేశం వారిపై హత్యాయత్నానికి తెగబడడం, ఇవన్నీ చేసిన తర్వాత తిరిగి తెలుగుదేశం వారే దాడికి దిగారంటూ లేకి ఆరోపణలు చేయడం అవన్నీ ఆటోమేటిగ్గా జరిగిపోయాయి. బాలినేని అనవసరంగా ఈ వివాదంలో ఇరుక్కున్నారని ప్రజలు అనుకుంటున్నారు.
ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి అసలే గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. ఎంపీగా మాగుంట శ్రీనివాసులు రెడ్డికి టికెట్ ఇవ్వాల్సిందేనని, లేకపోతే ఆ ప్రభావం తన ఎన్నిక మీద కూడా పడుతుందని.. ఆయన జగన్ వద్ద చాలా గట్టిగా పట్టుపట్టారు. కానీ ఆయన మాటను జగన్ ఇసుమంత కూడా ఖాతరు చేయనేలేదు. చివరికి మాగుంట తెలుగుదేశం టికెట్ దక్కించుకున్నారు. బాలినేని ఎమ్మెల్యేగా సుదీర్ఘమైన బుజ్జగింపుల తర్వాత బరిలోకి దిగారు.
అసలే కష్టకాలం. కోడలు ప్రచారం చేస్తోంటే.. ఆమె వెంట ఉన్న వాలంటీరును ఫోటో తీయడానికి తెలుగుదేశం కార్యకర్త చప్పిడి ప్రభావతి ప్రయత్నించారు. దీనిని వైసీపీ నాయకులు అడ్డుకుని రచ్చరచ్చ చేశారు. వారి మీద దాడికి దిగారు. కొట్టారు. ఈ వీడియోలన్నింటినీ తెదేపా అబ్యర్థి దామచర్ల జనార్దన్, ఎంపీ అభ్యర్థి మాగుంట జిల్లా ఎస్పీకి చూపించారు కూడా. అయితే బాలినేని మాత్రం తన కోడలిమీద దాడికి వచ్చారంటూ ఆరోపణలు చేయడం విశేషం.
నిజానికి వైసీపీ అభ్యర్థులు చాలా మంది.. వాలంటీర్లను ప్రచారంలో వాడుకుంటూనే ఉన్నారు. వారితో రాజీనామాలు చేయించి.. వేతనాలు తాము సొంతంగా చెల్లిస్తున్నారు. బాలినేని కూడా వాలంటీర్ల అవసరం ఉందని భావించి ఉంటే అలాచేస్తే సరిపోయేది. అలా కాకుండా.. వారితో రాజీనామా చేయించకుండా, ప్రచారాంలో వాడుకోవాలని చూడడం వల్లనే రాద్ధాంతం జరిగిందని తెలుస్తోంది.
హీరోలేమి తోపులు కాదు..వారుంటే సినిమాలు హిట్ కావడానికి!
కృతి సనన్, టబు , కరీనా కపూర్ ముఖ్య పాత్రలుగా తెరకెక్కిన హిందీ సినిమా ‘క్రూ’ మార్చ్ 29న రిలీజయి మంచి విజయం సాధించింది. ఈ సినిమా రెండు వారాల్లోనే 100 కోట్ల కలెక్షన్స్ సాధించింది. దీంతో ఈ చిత్రయూనిట్ తాజాగా సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించగా కృతి సనన్ ఈ ప్రెస్ మీట్ లో సంచలన వ్యాఖ్యలు చేసింది.కృతి సనన్ మాట్లాడుతూ.. సినిమాలో ఒక స్టార్ హీరో ఉన్నంత మాత్రాన ప్రేక్షకులు పరిగెత్తుకుంటూ రారు.
కథ బాగుండాలి. దురదృష్టం ఏంటంటే ఇండస్ట్రీలో కొంతమంది దర్శకులు, నిర్మాతలకు కూడా ఈ విషయం అర్ధం కావట్లేదు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రేక్షకులు రారు, పెట్టిన డబ్బు రాదు అని అనుకుంటున్నారు. ఇది అబద్దం. స్టార్ హీరోలెవ్వరూ లేకపోయినా కూడా మా ”క్రూ” సినిమా మంచి పేరు తెచ్చుకుని ముందుకు దూసుకుపోతుంది. ఇప్పటికే 100 కోట్లు కలెక్ట్ చేసింది. ఇది మాత్రమే కాదు అంతకుముందు అలియాభట్ మెయిన్ రోల్ లో వచ్చిన గంగూభాయ్ కతీయవాడి సినిమా కూడా పెద్ద హిట్ అయి కలెక్షన్స్ తెచ్చింది. అందులో కూడా స్టార్ హీరోలు లేరు.
లేడీ ఓరియెంటెడ్ సినిమాలు హిట్స్ కొడుతున్నా హీరోయిన్స్ సినిమాలకు బడ్జెట్ పరిమితులు ఎందుకు పెడుతున్నారో అర్ధం కావట్లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.అలాగే కృతి సనన్ బాలీవుడ్ నటీనటుల గురించి మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో మొహమాటానికి ఒకర్నొకరు పొగుడుతున్నారు. అంతకంటే ఆపదలో ఉన్న తోటి నటీనటులకు సాయంగా నిలబడితే బాగుంటుంది. ఇక్కడ నటీనటుల మధ్య యూనిటీ అంతగా లేదు. ఒక సినిమా హిట్ అయినప్పుడు ఎంతమంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారో, ఎంతమంది ఏడుస్తున్నారో అర్ధం కావట్లేదు అని సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో కృతి సనన్ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో మాత్రమే కాకుండా టాలీవుడ్ లో కూడా చర్చగా మారాయి.
PM Modi Says J&K Will Get Statehood Soon
Prime Minister Narendra Modi on Friday said the upcoming Lok Sabha polls will take place in Jammu and Kashmir without the fear of terrorism, strikes, stone-pelting and cross-border firing.
Addressing a poll rally in Kashmir’s Udhampur, Modi said Assembly elections will be held soon in the state. “Jammu and Kashmir will get the status of statehood. You will be able to share your dreams with your MLA and your ministers,” he said.
The prime minister said he demolished the wall of Article 370 and buried it in the ground. Modi dared the Opposition to restore Article 370. He challenged the Congress and other opposition parties to bring back Article 370 of the Constitution, which was revoked by the BJP-led Centre in August 2019.
Modi lamented that People’s Democratic Party, National Conference and Congress want to take J & K back J&K to the old days. “I challenge any political party in India, especially Congress, to announce that they will bring back Article 370. This country won’t even look at them,” he said. Modi charged, “Here political party means the family, by the family and for the family.”
“After decades, this election is taking place without the fear of terrorism, separatism, stone-pelting, strikes and cross-border terrorism, which are no more election issues. There used to be a concern regarding the security of the Vaishno Devi and Amarnath pilgrimages, but the situation has changed altogether. Jammu and Kashmir is witnessing development and the people’s faith in the government is getting strengthened,” Modi added.
“Please trust me, I will get rid of the problems plaguing Jammu and Kashmir for the last 60 years. I have fulfilled my promise as Jammu and Kashmir has completely transformed in the last 10 years,” he added.
Seeking votes for Bharatiya Janata Party (BJP) candidates Singh (from Udhampur) and Jugal Kishore (from Jammu), Modi said the upcoming election is meant to provide a strong government at the Centre that can take on the challenges facing the country head-on.
AAP Sees Plot To Impose President’s Rule In Delhi
Delhi Cabinet minister Atishi on Friday alleged that a big political conspiracy is being hatched by the BJP-led central government to impose President’s Rule in the national capital.
“Arvind Kejriwal’s arrest is a political conspiracy to topple his government. We have learnt from reliable sources that in the coming days, the President’s Rule will be imposed in Delhi. But imposing President’s Rule in Delhi will be illegal and against the mandate of the people,” she said at a press conference here.
The minister said that in the last few months, no senior IAS officer has been posted in Delhi. “Posts are lying vacant in departments but no postings have taken place. Bureaucrats have stopped attending meetings called by ministers, citing the Model Code of Conduct. The lieutenant governor has been writing letters to the MHA over the functioning of the Delhi government,” she alleged.
The minister said the BJP already knew that it “cannot come to power” in the national capital. “AAP has defeated the BJP in the Delhi Assembly elections in 2015 and 2020. That is why they want to topple the Delhi government. But the imposition of the President’s Rule will be illegal since the Delhi government enjoys a majority. We proved our majority through a floor test on February 17 this year,” she said.
However, refuting AAP leader’s charge, Delhi BJP chief Virendra Sachdeva said it was surprising that the “fear of President’s Rule” was haunting the Aam Aadmi Party, which has 62 MLAs in the Assembly.He also demanded the resignation of Kejriwal from the post of chief minister. He slammed Atishi over this and charged that Kejriwal was feeling the heat of the Delhi High Court’s rebuke.