Home Blog Page 10

Siddhu Jonnalagadda Goes Rogue In ‘BADASS’ – First Look Out Now

After the massive success of DJ Tillu and Tillu Square, actor Siddhu Jonnalagadda is back in action once again, collaborating once again with producer Naga Vamsi for their much-awaited third outing. Directed by BADASS, the film is already making waves due to its defiant title and highly dramatic first-look poster.

The poster presents Siddhu in a never-before-seen tough avatar—cigarette in hand, brooding in expression, and amidst mayhem. It’s unpolished and earthy, and the indication is of a drastic departure from his previous light-hearted performances. The bold feel is further added by the tagline, “If middle finger was a man,” and the tone is thus set for a defiant, no-holds-barred story.

Contrary to the playful and lighthearted nature of the Tillu franchise, BADASS offers Siddhu a darker, edgier character, hinting at an entire shift in style and story. The development has left fans question-marked, awaiting how Siddhu brings this brooding character to life on screen.

The film is directed by director Ravikanth Perepu. The movie is being produced by producer Naga Vamsi on the banner Sithara Entertainments, with Fortune Four Cinemas and Srikara Studios joining the production as co-producers.

Currently in production, BADASS is scheduled for a big theatrical release in 2026. Backed by its uncompromising visuals, unpolished idea, and a ferociously talented team of creatives handling the business behind the camera, the film is being touted as the career-changing moment for Siddhu Jonnalagadda.

ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతటి దుర్మార్గమైన మనస్తత్వంతో వ్యవహరిస్తారంటే.. తన సొంత చెల్లెలితో ఆస్తుల గురించి తగాదా పెట్టుకుని, ఆ చెల్లెలి గురించి అసభ్యమైన రాతలు తన వందిమాగధులతో సోషల్ మీడియాలో పోస్టు చేయిస్తారు. తన సొంత చెల్లెలి కేరక్టర్ అసాసినేషన్ చేస్తూ.. తప్పుడు పోస్లులు పెట్టేవారి మీద తాను ముఖ్యమంత్రిగా ఉండగా ఎలాంటి చర్యలు తీసుకోకపోగా వారిని ప్రోత్సాహించిన వ్యక్తి బహుశా జగన్ ఒక్కరే ఉంటారు. తన సొంత చెల్లెలి గురించి, ఆమె కేరక్టర్ గురించి అత్యంత అసహ్యమైన పోస్టులు పెట్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సొంత తల్లి గురించి కూడా సోషల్ మీడియాలో అసభ్యపు రాతలు రాయించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.

ఆవు చేలో మేస్తే దూడగట్టున మేస్తుందా? అనే సామెత చందంగా.. జగన్ ఎలాంటి అసభ్యపు తప్పుడు పనులు చేస్తుంటారో.. ఆయన అనుచర గణాలు కూడా అదే దుర్మార్గానికి పాల్పడుతున్నాయి. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వ్యవహారం చూసిన ప్రతి ఒక్కరూ అదే అనుకుంటున్నారు.
వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మీద ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయనలోని నీచమైన బుద్ధిని బయటపెట్టేలా ఉన్నాయని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే.. ఆయనకు ప్రశాంతిరెడ్డి వరుసకు చెల్లెలు అవుతారు. అలా చెల్లెలు వరుస అయ్యే మహిళ మీద, ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

అయితే ఇలాంటి నీచత్వానికి పాల్పడే ధైర్యం ప్రసన్నకు ఎలా వచ్చింది.. అనే ప్రశ్నకు ప్రజలు సమాధానం సరిగ్గానే ఊహిస్తున్నారు. ఆ పార్టీ నాయకుడే అలాంటి వ్యక్తి కావడం వలన.. అనుచరులు కూడా అదే నీచత్వానికి దిగుతున్నారనేది వారి విశ్లేషణ. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీద పార్టీ పరంగా చర్య తీసుకోకపోతే.. జగన్మోహన్ రెడ్డికి పరువు తక్కువ అవుతుందని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. లేదా, తెలుగుదేశం పార్టీలోని మహిళల గురించి ఇలాంటి నీచపు కూతలు కూస్తున్న తన అనుచరుల్ని చూసి.. జగన్మోహన్ రెడ్డి తన మనసులో లోలోన పండగ చేసుకుంటున్నారేమోనని అందరూ భావించాల్సి వస్తోంది.
మహిళల పట్ల అనుచితంగా మాట్లాడడం అనే విషయంలో జగన్ కు అత్యంత ప్రీతిపాత్రుడైన దువ్వాడ శ్రీనివాస్ కూడా చాలా లేకిగా వ్యవహరించారు. ఆయన తన భార్య గురించి చాలా చులకనగా మాట్లాడుతూ.. పార్టీ పరవు బజారుకీడ్చారు. అలాంటి దువ్వాడ శ్రీనివాస్ ను మాత్రం పార్టీనుంచి సస్పెండ్ చేశారు. అక్కడ దువ్వాడ భార్య కూడా వైసీపీ నాయకురాలు గనుక, అతని మీద చర్య తీసుకున్నారు. అంతకంటె నీచమైన కామెంట్లు తెలుగుదేశం ఎమ్మెల్యే గురించి చేసినప్పుడు.. జగన్మోహన్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీద చర్యలు తీసుకోకపోతే.. జగన్ ను కూడా ప్రజలు అసహ్యించుకుంటారని అంతా అనుకుంటున్నారు.

పాపం కొమ్మినేని.. జనం కొడతారనే భయం తగ్గలేదు!

జీవితం అంతే. ఒక తప్పుడు పని చేస్తే.. దాని తాలూకు అపరాధభావం జీవితాంతం వెన్నాడుతూనే ఉంటుంది. ఒకతప్పుకే అంతగా భయం పుడుతుందని అనుకుంటున్నప్పుడు.. ప్రతిరోజూ పదేపదే, అనగా వందల వేల తప్పులు చేస్తూ ఉండే వారి పరిస్థితి ఏమిటి? వారికి అనునిత్యం భయమే కదా? ఇప్పుడు సాక్షి చానెల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు కూడా అదే పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అమరావతిని వేశ్యల రాజధాని అని తన లైవ్ షోలో అతిథిద్వారా చెప్పించి.. చేసిన పాపానికి .. తాను కనిపిస్తే చాలు జనం కొడతారని ఆయన భయపడుతూ బతుకుతున్నారు. హైకోర్టులో ప్రత్యేకంగా పిటిషన్ వేసి..  తన బెయిల్ ఉత్తర్వ్లులో చిన్న సవరణ పొందడమే ఇందుకు నిదర్శనంగా ఉంది.

అమరావతిని వేశ్యల రాజధానిగా అభివర్ణించిన జర్నలిస్టు కృష్ణంరాజు వ్యాఖ్యల నేపథ్యంలో నమోదు అయిన కేసులో కొమ్మినేని శ్రీనివాసరావు కూడా కీలక నిందితుడు. కాకపోతే ఆయనకు ముందుగా బెయిలు వచ్చింది. పోలీసులు ఈ కేసులో చార్జీషీటు దాఖలు చేసేవరకు ప్రతి నెల రెండో, నాలుగో శనివారాల్లో తుళ్లూరు పోలీసు స్టేషనకు వచ్చి సంతకాలు చేసి వెళ్లాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అయితే కొమ్మినేనికి తుళ్లూరు దాకా వెళ్లాలంటే ఒంట్లో వణుకు పుడుతున్నట్టుగా ఉంది. తాను చేయించిన వ్యాఖ్యలకు ఆగ్రహంతో మండిపడుతున్న జనం.. రాజధాని అమరావతి నడిబొడ్డున ఉన్న తుళ్లూరు వరకు తాను వెళితే.. తన మీద పడి కొడతారని ఆయన ఆందోళన చెందుతున్నారు. అందుకే కోర్టుకు ప్రత్యేకంగా విన్నవించుకున్నారు. కోర్టు కాస్త సడలింపు ఇచ్చి.. తుళ్లూరు దాకా రానవసరం లేదని, తాడేపల్లి స్టేషనుకు వచ్చి సంతకాలు పెడితే సరిపోతుందని తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది.

అడుసు తొక్కనేల కాలు కడగనేల అన్న సామెత చందంగా ఉంది కొమ్మినేని పరిస్థితి. తన లైవ్ షోలో అసందర్భంగా అమరావతి ప్రస్తావన తీసుకువచ్చి.. జర్నలిస్టు కృష్ణంరాజుతో.. ‘అమరావతి వేశ్యల రాజధాని’ అనే తప్పుడు మాటలు మాట్లాడించిన వ్యక్తి ఈ కొమ్మినేని. ఆ వ్యాఖ్యల తర్వాత వాటిని ఖండించకపోగా.. అలా మాట్లాడితే మీమీద ట్రోలింగ్ చేస్తారేమో.. అంటూ వెకిలినవ్వులతో కూడిన సానుభూతిని జర్నలిస్టు కృష్ణంరాజు మీద చూపించిన వ్యక్తి ఆయన. తీరా ఈ వ్యాఖ్యల వివాదం నానా రచ్చా అయిన తర్వాత.. పోలీసు కేసులు నమోదు అయ్యాక, ప్రజలు సాక్షికి వ్యతిరేకంగా ఉద్యమాలు కూడా ప్రారంభించిన తర్వాత.. కొమ్మినేని శ్రీనివాసరావు.. తన వైఎస్ భారతికి, వైఎస్ జగన్ కు క్షమాపణ చెప్పారే తప్ప తన తప్పు తెలుసుకుని, మనస్తాపం చెందిన అమరావతి ప్రజలకు ఆయన పొరబాటున కూడా క్షమాపణ చెప్పలేదు. ఈ పాపాలన్నింటికీ కలిపి.. ఇప్పుడు ఆయన పోలీసుస్టేషనుకు వెళ్లి సంతకాలు పెట్టడానికి కూడా భయపడుతూ బతకాల్సిన పరిస్థితి. అయినా.. ఆయన ఏదో యాగీ చేయాలని చూస్తున్నారు తప్ప.. ప్రజలు నిజంగా ఆయనను కొట్టాలనుకుంటే గనుక.. హైదరాబాదు వచ్చి కొట్టలేరా? అని జనం నవ్వుకుంటున్నారు. 

నల్లపురెడ్డి గలీజు మాటలకు ఆ శాస్తి తక్కువే కదా?

ఒక మహిళా ఎమ్మెల్యే గురించి మరొక మాజీ ఎమ్మెల్యే ఇంత నీచంగా మాట్లాడడం అనేది బహుశా ఎవ్వరి ఊహకు అందే విషయం కాకపోవచ్చు.  రాజకీయంగా ఎంతో కీలకం అయినప్పటికీ.. ప్రశాంతంగా ఉండే నెల్లూరు జిల్లాలో అలాంటి సంచలనాన్ని నమోదు చేశారు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి వంటి విలువలున్న నాయకుడి కొడుకుగా రాజకీయ రంగప్రవేశం చేసి.. జగన్ పంచన చేరి భ్రష్టుపట్టిపోయిన ప్రసన్న కుమార్ రెడ్డి.. తనకు చెల్లెలి వరస అయ్యే మహిళా ఎమ్మెల్యే మీద అసభ్యంగా తప్పుడు మాటలు మాట్లాడడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. వేమిరెడ్డి కుటుంబం రాజకీయాలతో నిమిత్తం లేకుండా ప్రజాసేవలో ఎంత చురుగ్గా, ఉదారంగా ఉంటారో తెలిసిన ప్రజలు.. స్వానుభవంలో వారి మంచితనాన్ని ఎరిగిన ప్రజలు.. ఆవేశంతో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిమీదికి వెళ్లి ఆయన ఇంట్లో ఫర్నిచర్ ను ధ్వంసం చేస్తే దానిని కూడా రాజకీయం చేయడానికి ఆయన సిగ్గుమాలిన ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. నల్లపురెడ్డి ప్రసన్న మాట్లాడిన మాటలకు ఈ శాస్తి తక్కువే కదా.. అని ప్రజలు వ్యాఖ్యానిస్తుండడం విశేషం.

మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అవినీతి గురించి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రస్తావించారు. నిజానికి ఈ ఇద్దరు నాయకుల మధ్య మాటల యుద్ధం  సుదీర్ఘకాలంగా నడుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి వెళ్లిపోయి కోవూరులో తనను ఓడించిన ప్రశాంతిరెడ్డి మీద ప్రసన్న కుమార్ రెడ్డికి.. దుగ్ధ ఉంది. అయితే.. ప్రశాంతి రెడ్డి కేవలం ఆయన అవినీతి గురించి మాత్రమే మాట్లాడారు. వైసీపీ పాలన కాలంలో ఆయన తన నియోజకవర్గంలో సాగించిన దందాల గురించి మాత్రమే ప్రస్తావించారు. ఆయన అవినీతిలో పీహెచ్డీ చేశారని ఆమె ఎద్దేవా చేశారు.

నిజానికి ప్రసన్న కుమార్ రెడ్డి.. విలువలు ఉన్న రాజకీయ నాయకుడే అయితే గనుక.. ఆమె విమర్శలకు రాజకీయంగానే సమాధానం చెప్పి ఉండాలి. ఆమె పాల్పడుతున్న, కావలిస్తే.. ఆమె భర్త , ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి అవినీతికి పాల్పడుతూ ఉంటే.. వాటి గురించి మాత్రమే మాట్లాడాలి. అయినా వారి అవినీతి గురించి మాట్లాడడం తనకు చేతకాదన్నట్టుగా.. ప్రసన్న కుమార్ ఆమెను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడడం చవకబారుతనం. ఆమె వేమిరెడ్డిని బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి చేసుకున్నారని, ఆమె చరిత్ర మొత్తం తనకు తెలుసునని చాలా చవకబారుగా ప్రసన్న మాట్లాడారు.

ప్రశాంతి చాలా స్పష్టంగా ఒక సవాలు విసిరారు. వైసీపీ నాయకులు ఎవ్వరైనా సరే.. ప్రసన్న తన గురించి మాట్లాడిన మాటల వీడియోను తమ ఇళ్లలో భార్య, చెల్లెళ్లు, అమ్మలకు చూపించండి. వారు గనుక.. ఆ వీడియో చూసి చెప్పుతో కొట్టకుండా ఉంటే.. అప్పుడు ఆయనను సమర్థించండి అని ఆమె సవాలు విసిరారు. ఆ సవాలును స్వీకరించే దమ్ము ఎవ్వరికీ లేదు. కానీ ప్రసన్నను వెనకేసుకు వస్తున్నారు.
అదే సమయంలో ప్రసన్న ఇంటిమీద జరిగిన దాడిని రాద్ధాంతం చేస్తున్నారు. నిజం చెప్పాలంటే.. ఆయన మాట్లాడిన మాటలకు ఆయన ఇంటిమీద జరిగిన దాడి చాలా చిన్నదే కదా అని పలువురు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. ఇలాంటి చవకబారు మాటలు మరోసారి మాట్లాడితే.. పరిణామాలు దారుణంగా ఉంటాయని కూడా  హెచ్చరిస్తున్నారు.

Atchannaidu Urged Union Minister Chouhan To set up Chilli, Cashew, Mango Boards In AP

AP Agriculture Minister K. Atchannaidu has requested Union Agriculture Minister Shivraj Singh Chouhan to set up a chilli board in Guntur, a cashew board in Srikakulam and a mango board in Chittoor. He has requested that a Central Agriculture University be set up in Srikakulam district as per the AP Reorganization Act.  

Atchannaidu, who is on a visit to Delhi, met the union minister in the chamber, along with Union Civil Aviation Minister K Ramamohan Naidu. On this occasion, he was briefed on the farmers’ issues in AP and requested the Union Minister to extend full cooperation to the central government for the development of agriculture in the state.

Atchannaidu specifically mentioned the problems faced by mango farmers and appealed to the Center to stand by the farmers who grew Totapuri mangoes in Chittoor district. He said that the farmers are suffering due to the fall in the price of Totapuri mangoes. He said that the AP government had to intervene as the price had fallen to Rs. 8.

Minister Atchannaidu explained that the AP government had fixed a price of Rs. 12 as the support price under the Price Deficit Payment Scheme. He revealed that 6.5 lakh metric tons of Totapuri have to be purchased and the state government is spending Rs. 260 crores. He asked for the Center’s participation in market intervention by contributing half of the amount, Rs 130 crore.

To protect the interests of farmers, the AP Minister sought the release of financial assistance of Rs. 260 crore under the Market Support Scheme (MIS) in the wake of the price collapse. He appealed for an increase in subsidy for micro irrigation schemes for eight backward districts of North Coast and Rayalaseema in the state.

Minister Atchannaidu requested the central government to provide additional assistance to AP on the lines of Bundelkhand. Union Minister Shivraj Singh Chouhan responded positively to Minister Atchannaidu’s requests. He assured that the problems would be resolved soon.

ఇంత సిగ్గుమాలిన చకవబారు వక్రప్రచారాలా?

వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారుపాళెం వద్ద మామిడిరైతులను పరామర్శించడానికి వెళుతున్నాననే మిషమీద ఎంత గందరగోళం సృష్టించాలనుకుంటున్నారో అంతా చేస్తున్నారు. పోలీసులు వద్దు వద్దని చెబుతున్నా కూడా.. వేల మందిని పోగేయడానికి జగన్మోహన్ రెడ్డి దళాలు ప్రయత్నించాయి.  పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా.. కిరాయికి మనుషుల్ని తోలించడంతో వారు అనుకున్నట్టుగానే జనం బాగానే వచ్చారు. జగన్ దళాలు.. బంగారుపాళెం మార్కెట్ యార్డు వద్ద పోలీసులను తోసేస్తూ.. లోపలకు చొరబడి నానా యాగీచేశారు. దారిపొడవునా కూడా.. జనం పెద్దసంఖ్యలో జగన్ కాన్వాయ్ తో పాటుగా రచ్చ చేశారు. అయితే.. ఈ క్రమంలో ఒక వ్యక్తి గాయపడడంతో  దాని గురించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీగానీ, సాక్షి మీడియా గానీ చేస్తున్న ప్రచారాలు అసహ్యం పుట్టిస్తున్నాయి. ఒక దుర్ఘటన జరిగితే వక్రభాష్యాలు చెప్పడం ఇవాళ్టి రాజకీయాల్లో మామూలైపోయింది. అందులో కూడా ఇంత సిగ్గుమాలిన చవకబారు వక్రప్రచారాలు మరొకటి ఉండవేమో అనే స్థాయిలో వారు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.

విషయం ఏంటంటే.. హెలిపాడ్ నుంచి జగన్ ప్రయాణిస్తున్న వాహనం మీదికి ఎగబడడానికి వైసీపీ కిరాయి మూకలు ప్రయత్నించారు. ఆ క్రమంలో పోలీసులు వారిని నియంత్రించేందుకు తమ వంతు ప్రయత్నం తాము చేశారు. అయితే కార్యకర్తల మధ్యనే తోపులాటలు జరిగాయి. అందులో ఒక వ్యక్తి కింద పడిపోయాడు తల మీద దెబ్బతగిలింది. నెత్తురు కూడా వచ్చింది. కట్టు కూడా కట్టారు.

ఒక వ్యక్తికి దెబ్బ తగిలిన క్షణంనుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దళాలు రెచ్చిపోయి వక్రప్రచారాలకు దిగాయి. పోలీసులే కొట్టి గాయపరిచారంటూ విపరీతమైన దుష్ప్రచారం ప్రారంభించారు. ఒకవైపు సాక్షి ఛానెల్లోనే లైవ్ వార్తల కార్యక్రమంలో.. పోలీసుల లాఠీ చార్జిలో గాయపడ్డాడని చెప్పడం ప్రారంభించారు. అదే సమయంలో స్థానిక రిపోర్టరును కాల్ లోకి తీసుకుని అతడిని అడిగినప్పుడు.. అతను చాలా స్పష్టంగా.. తోపులాటలో కార్యకర్త కిందపడిపోయినందువలన అతనికి తలపై గాయమైందని చెప్పినప్పటికీ.. చానెల్ యాంకర్ మాత్రం శాంతించడం లేదు. అతను లాఠీచార్జీలోనే గాయపడ్డాడా.. అని పదేపదే అడిగి.. చివరికి అతనితో అదే మాట చెప్పించారు.

వ్యక్తి గాయపడిన మాట నిజం. అయితే అతను కార్యకర్తల తోపులాటలోనే కిందపడి దెబ్బతగిలితే.. పోలీసుల లాఠీచార్జీ అంటూ ఆరోపించడం చవకబారుతనం.
పైగా జగన్మోహన్ రెడ్డి ఈ నాటకాన్ని మరింత రక్తి కట్టించడానికి ప్రయత్నించారు. తాను ప్రయాణిస్తున్న కారు దిగి.. గాయపడిన కార్యకర్త వద్దకు వెళ్తానని ఆయన ప్రయత్నించడంతో.. జిల్లా ఎస్పీ ఆయనను అడ్డుకుని తిరిగి కారులో కూర్చోబెట్టి పంపడం కూడా జరిగింది. ఇంతటి దుర్మార్గాలకు వైసీపీ దళాలు పాల్పడుతుండడం పట్ల ప్రజలు చీదరించుకుంటున్నారు.

Samantha Spotted with Raj Nidimoru In The U.S  

Since her break-up with Naga Chaitanya, actress Samantha Ruth Prabhu has been making headlines—not only for her daring professional decisions, but also for her speculated personal life updates. The recent gossip among entertainment industry insiders is all about her increasing friendship with The Family Man co-creator and director, Raj Nidimoru.

Their friendship is said to have started on the set of The Family Man Season 2, where Samantha featured in the award-winning character Raji. That working relationship is said to have grown over time, with latest reports indicating that the pair could be more than friends now. Some publications have even gone ahead to speculate that their relationship could already be official.

Fuel to the fire was added by Samantha and Raj collaborating together once more for Citadel: Honey Bunny’s Indian adaptation, adding to their mutual understanding. Industry sources say Raj is now a good emotional and creative support system in Samantha’s life, particularly as she enters film production and looks at new horizons as a career opportunity.

Their proximity has not been ignored. The two have been seen together on several public occasions, posing for photographs and reveling in the company of one another. Samantha’s social media posts—showing candid photos with Raj—have only fueled the rumors.

The most recent controversy to set social media abuzz was at the recent TANA convention in Detroit. A photo of Raj with his arm spontaneously laid on Samantha’s shoulder went viral and had netizens and fans wondering about the dynamics of their relationship. The two appeared relaxed and contented, lending credibility to relationship rumors that had been making the rounds.

In a icing to it all, additional photos from a private dinner in America, with Samantha, Raj, and their inner circle of friends, have been making the rounds on social media—fueling yet more fan interest.

Even as the furor grows, both Samantha and Raj have been mum over their relationship status. While nothing concrete has been officially announced, fans keep their antennae twitching, watching every step they take.

Row over Revanth Reddy’s sudden cancellation of Meet Union Minister on Bankacharla

As part of his Delhi visit, leaks have come from the CMO that Chief Minister Revanth Reddy will meet Union Minister CR Patil once again and clarify the state government’s objections to the Banakacharla project and strongly request that permissions not be given for the construction of the project.

Accordingly, an appointment was also taken with Union Water Resources Minister CR Patil in Delhi on the 7th. But since the CM canceled the meeting with the Union Minister at the last minute, many doubts are being expressed in political circles. There is a serious discussion in the state Congress Party and on the other hand in government circles.

Why was the meeting canceled? What is the reason? They are deeply inquiring. It is known that CM Revanth Reddy had finalized his schedule and left for Delhi to meet the Water Resources Minister in the Monday afternoon. Reliable sources have revealed that the CM suddenly changed his mind without meeting the Union Minister after going to Delhi and the appointment has been cancelled.

On this occasion, allegations are being made that the Chief Minister did this due to pressure from government leaders in Andhra Pradesh. Moreover, Revanth Reddy’s going to Delhi alone to meet the Water Resource Minister is also causing a stir in Congress and government circles.

The opposition parties are already making allegations centered on Revanth Reddy over the Banakacharla controversy. Sources close to the CM said that if he meets the Union Minister alone at such a time without the State Irrigation Minister, it will give more strength to these allegations. That is why the appointment is being cancelled.

Those close to the Irrigation Minister, however, say that the Minister was not even asked to come with him, and the CM directly spoke to the irrigation officials and took a brief note and went to Delhi. He said that there is no question of canceling the appointment due to the absence of the Irrigation Minister.

 It is known that Banakacharla was temporarily put on hold in the wake of the objections of the Central Expert Committee. Now, the Telangana Chief Minister is officially complaining and it is believed that the AP chief minister has sent an embassy stating that the project will become even more controversial if objections are raised at this juncture. Unless the CM and Minister Uttam open their mouths, the truth may not come out.

మెగా మూవీ నుంచి మరో సర్‌ప్రైజ్‌!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న ప్రాజెక్టులలో ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న చిత్రం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా సాగుతోంది. అనిల్ రావిపూడి సినిమాలకు ఒక ప్రత్యేకత ఉంటే, అది అతను చేసే ప్రమోషన్లు. ఆయన తరహాలో వచ్చే ప్రచార కార్యక్రమాలు సినిమాకే కాదు, ప్రేక్షకుల ఊహలకు కూడా మించినవే.

ఇప్పుడు చిరంజీవితో చేస్తున్న ఈ సినిమాలో ఆయన ప్రమోషన్ డోస్ కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. సినిమాకి సంబంధించిన షూటింగ్ పూర్తికాకముందే ప్రేక్షకులకు ఆకట్టుకునే విధంగా ఒక్కొక్కసారిగా సర్ప్రైజ్‌లను వెలుగు లోకి తీసుకొస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌ను మొదట ప్రకటించినప్పటినుంచి నయనతార పాత్రను పరిచయం చేసినంతవరకు అన్నీ అతని స్టైల్లోనే జరిగాయి.

ఇటీవల మరో ప్రత్యేకమైన అంశం కూడా వెలుగులోకి వచ్చింది. ప్రముఖ జీ తెలుగు ఛానెల్‌లో ఓ కార్యక్రమంలో చిరంజీవి స్పెషల్ గెస్ట్‌గా పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రోగ్రాం కోసం రూపొందించిన ప్రోమో ఇప్పటికే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇది మెగా అభిమానులకు మంచి గిఫ్ట్‌లా మారింది. త్వరలోనే ఈ ఎపిసోడ్ బుల్లితెర ప్రేక్షకుల ముందుకి రానుంది.

ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన వివరాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుండటంతో సినిమా మీద అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇప్పటిదాకా చిరుతో చేసిన ప్రమోషన్ ప్లాన్‌లు చూస్తే, రిలీజ్ సమయానికి ఇంకెన్ని సర్ప్రైజ్‌లు ఉండబోతున్నాయో అని మెగా ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వారిద్దరికీ అదిరిపోయే రెమ్యునరేషన్‌!

బాలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య రూపొందుతున్న మైథలాజికల్ పాన్ ఇండియా మూవీ “రామాయణ”పై దేశవ్యాప్తంగా ప్రేషకులలో భారీ ఆసక్తి నెలకొంది. ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు. ఎప్పుడో వచ్చిన పౌరాణిక ఇతిహాసాన్ని ఈ తరం ప్రేక్షకులకు అద్భుతంగా చూపించేందుకు రూపొందిస్తున్న ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ పరంగానూ ఆశ్చర్యం కలిగించే రీతిలో ఉండబోతోంది.

ఈ సినిమాలో రామ్ పాత్రలో రణ్‌బీర్ కపూర్ నటిస్తుండగా, సీత పాత్రలో సాయి పల్లవి కనిపించనున్నారు. ఈ కాంబినేషన్ పట్ల ఇప్పటికే సినీ ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ ఏర్పడింది. ఉత్తరాదినే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా చుట్టూ మంచి బజ్ నడుస్తోంది. ముఖ్యంగా సినిమాకు సంబంధించిన వార్తలన్నీ వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ సినిమా కోసం వినిపిస్తున్న సమాచారం ప్రకారం మొత్తం బడ్జెట్ దాదాపు రూ.1600 కోట్లు అంటున్నారు. ఇది విన్నవెంటనే అందరి దృష్టి ఈ సినిమాలో నటించే తారల పారితోషికాల మీదకి వెళ్లింది. తాజా బజ్ ప్రకారం, రామ్ పాత్రలో కనిపించనున్న రణ్‌బీర్ కపూర్ ఈ రెండు పార్టులకు కలిపి రూ.150 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. సీత పాత్రలో నటిస్తున్న సాయి పల్లవికి రూ.15 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇచ్చినట్టు టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమా నటుల రెమ్యునరేషన్ విషయంలో బయటకి వచ్చిన ఈ రేట్లు బాలీవుడ్ వర్గాల్లో చర్చకు మార్గం వేశాయి. ప్రధాన తారలే కాకుండా ఇతర కీలక పాత్రల్లోనూ ఆసక్తికర నటీనటులు ఎంపికయ్యారు. రాక్షస రాజు రావణుడి పాత్రలో కేజీఎఫ్ ఫేమ్ యష్ కనిపించనున్నాడు. లక్ష్మణుడిగా రవి దూబె, హనుమాన్ పాత్రలో సన్నీ డియోల్ నటించనున్నట్లు తెలిసింది.

ఇక ఈ భారీ ప్రాజెక్ట్‌ని రెండు భాగాలుగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మొదటి భాగాన్ని 2026లో దీపావళికి, రెండో భాగాన్ని 2027 దీపావళికి విడుదల చేసేలా పనులు జరుగుతున్నాయి. మొత్తం మీద, శృతిప్రాయం కధను కొత్తగా చెప్పేందుకు బాలీవుడ్ ప్రయత్నిస్తున్న ఈ రామాయణం ప్రాజెక్ట్‌పై ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది.