పుట్టిన రోజు కానుక! మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా సినిమా ‘మాస్ జాతర’ . ఈ మూవీ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలను పెంచేసింది. ఈ సినిమాను దర్శకుడు భాను భోగవరపు డైరెక్ట్ చేస్తుండగా పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని తీర్చిదిద్దుతున్నారు.
ఇక ఈ సినిమాలో రవితేజ తన పాత్రతో అభిమానులకు మాస్ జాతర తీసుకురావడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. అయితే, ఈ సినిమా నుంచి రవితేజ తన పుట్టినరోజు జనవరి 26న ఓ సాలిడ్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్దమవుతున్నాడు. జనవరి 26న ‘మాస్ జాతర’ మూవీకి సంబంధించి మాస్ ర్యాంపేజ్ గ్లింప్స్ విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఈ ట్రీట్ అభిమానులకు ఫుల్ మీల్స్ ఇచ్చేలా ఉండబోతుందని ఓ కొత్త పోస్టర్ ద్వారా మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ సినిమాలో రవితేజ లుక్ కూడా స్టైలిష్‌గా ఉండనుండటంతో ఈ మూవీపై అంచనాలను భారీగానే ఉన్నాయి. ఇక ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా భీమ్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.