బిగ్‌బాస్‌ లో డేంజర్‌ జోన్‌ లో ఆమె!

బిగ్ బాస్ తెలుగు షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడే ప్రారంభమైన తొమ్మిదో సీజన్ రెండు రోజులు పూర్తిచేసుకుంది. కానీ ఈ చిన్న గ్యాప్ లోనే ఇంట్లో పెద్ద చర్చకు దారి తీసిన విషయం ఒకటి బయటకు వచ్చింది. మొదటి వారంలోనే కంటెస్టెంట్స్ అందరూ కలసి ఒకరిని నామినేట్ చేశారు.

ఆ నామినేషన్ లో టార్గెట్ అయిన పేరు సంజనా గల్రాని. అందరూ ఒక్కసారిగా ఆమె పేరునే చెప్పడంతో వీక్షకుల్లో ఆసక్తి పెరిగింది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో కూడా సంజనా డేంజర్ జోన్ లో కనిపించడం తో ఆమెనే మొదటి వారం ఎలిమినేషన్ కి దగ్గరైనట్టుగా చర్చ జరుగుతోంది.

ఇక సోషల్ మీడియాలో కూడా సంజనానే షో నుంచి తొలుత బయటికివెళ్ళే అవకాశం ఉందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. కానీ నిజంగా ఏం జరుగుతుందో మాత్రం వచ్చే ఎపిసోడ్ లోనే తెలుస్తుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories