రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, స్టార్ మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ సలార్ మూవీ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టి, సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా సెకండ్ పార్ట్ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
అయితే మొదటి పార్ట్ లో ప్రభాస్ కి ఎక్కువగా డైలాగ్స్ లేవు. అది ఫ్యాన్స్ ను కాసింత నిరాశకి గురి చేసింది. దీనిని దృష్టిలో ఉంచుకుని దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ కోసం కొన్ని పవర్ ఫుల్ డైలాగ్స్ ను పార్ట్ 2 లో పెట్టాడు. సలార్ 2లో ప్రభాస్ భారీ డైలాగ్ ఉందని, ఇది ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తుంది అని చిత్ర బృందం ప్రకటించింది. పృథ్వీరాజ్ సుకుమారన్ మెయిన్ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా చేస్తుంది. హోంబలే ఫిలిమ్స్ మరో రెండు నెలల్లో సలార్ 2ని సెట్స్ పైకి తీసుకు వెళుతోంది. ప్రస్తుతంఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.