రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “పెద్ది” మీద ఇప్పుడు సోషల్ మీడియాలో మంచి హైప్ ఉంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేసింది. ఫస్ట్ లుక్ వచ్చిందినుంచి ఈ సినిమా మీద ఆసక్తి మరింత పెరిగింది.
ఇప్పుడో క్రేజీ విషయం ఏమిటంటే, ఈ సినిమా క్రికెట్ నేపథ్యం మీద ఉండటంతో ఐపీఎల్ టోర్నీలో పాల్గొంటున్న జట్లు కూడా పెద్ది గ్లింప్స్ ని తమ స్టైల్లో రీక్రియేట్ చేస్తున్నాయి. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్లు కూడా ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో పెద్ది హిందీ వెర్షన్ ని ఫాలో అవుతూ కొన్ని కీలక సన్నివేశాలు మళ్లీ enact చేశారు.
ఇందులో అశుతోష్ అనే యువ క్రికెటర్ రామ్ చరణ్ వేసిన మట్టి షాట్ ని అద్భుతంగా మిమిక్రీ చేయడంతో వీడియో తెగ వైరల్ అవుతోంది. చివరి సీన్ ని కూడా ఆయన ఎంతో స్టైలిష్‌గా రీప్లికేట్ చేశారు. ఇది చూసిన వాళ్లంతా తెగ ఫిదా అవుతున్నారు.
ఐపీఎల్ జరుగుతున్న సమయంలోనే ఇలా సినిమాతో కలిపి ప్రమోషన్ జరగటం సినిమాకి ఇంకాస్త బజ్ తీసుకొచ్చింది. అంటే చెప్పాల్సిందే, పెద్ది ఫీవర్ ఇప్పుడు మైదానాల్లోనూ, సోషల్ మీడియాలోనూ జోరుగా నడుస్తోంది.