భయం గుప్పిట్లో భూమన తండ్రీ కొడుకులు!

అధికారం ఉన్నది కదా అని అడ్డగోలుగా చెలరేగిపోయిన పాపానికి.. తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కొడుకు ఓడిపోయిన అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి ఇద్దరూ ఇప్పుడు భయం గుప్పిట్లో గడుపుతున్నారు. గత ఐదేళ్లలో తండ్రీకొడుకులు తిరుపతి ఎంఎల్ఏ, డిప్యూటీ మేయర్ గా పదవులు అనుభవించారు. తండ్రి చివరి దశలో టీటీడీ చైర్మన్ కూడా వెలగబెట్టారు. ఆయా పదవుల ముసుగులో పాల్పడిన అవినీతి, అరాచక వ్యవహారాలపై ఇప్పటి ప్రభుత్వం దృష్టి సారిస్తే తమ పాపం పడుతుందని వారు భయపడుతున్నారు.

కరుణాకర్ రెడ్డి ఎంఎల్ఏ గా ఉండగా తిరుపతిలో ప్రభుత్వ స్థలం ఖాళీగా కనిపిస్తే చాలు కబ్జా చేసేసారని ఆరోపణలు ఉన్నాయి. సజ్జల రామకృష్ణ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర రెడ్డి తో కలిసి అన్ని ఖాళీ స్థలాలు దిగమింగారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, కొడుకు డిప్యూటీ మేయర్ అయిన తరువాత.. తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి తాము కబ్జా చేసిన అన్ని స్థలాలకు రోడ్లు వేయించుకున్నారు. తిరుపతి నగరంలో రోడ్లు దారుణంగా ఉండగా.. కబ్జా స్థలాలకు మాత్రం పక్కా రోడ్లు వేయించుకున్నారు.

టీడీఆర్ బండ్ల రూపంలో తిరుపతిలో జరిగిన వందల కోట్ల అవినీతి వెనుక ఈ తండ్రీ కొడుకుల పాత్ర ఉందనేది స్థానికంగా వినిపిస్తున్న మాట.

కొడుకును ఎంఎల్ఏ గా పోటీ చేయించాలని డిసైడ్ అయిన తర్వాత, భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ పదవి తీసుకున్నారు. ఆ పదవిలో చేసిన అక్రమాలన్నీ ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ఉదయాస్తమాన సేవల టికెట్ల విక్రయాలు మాత్రమే కాకుండా.. భూమన నిర్ణయాలు అనేకం వివాదాస్పదం అవుతున్నాయి.

మొత్తానికి తండ్రీ కొడుకులు ఇద్దరూ ఇప్పుడు ఏ క్షణాన తమమీద ఎలాంటి కేసులు నమోదు అవుతాయో అనే భయం గుప్పిట్లో బతుకుతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories