టాలీవుడ్‌లో బింబిసార సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న దర్శకుడు వశిష్ట మల్లిడి తాజాగా తన కెరీర్‌లో జరిగిన ఓ ఆసక్తికర పరిణామాన్ని వెల్లడించారు. మొదటి సినిమా కే మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్న వశిష్ట, ఆ తర్వాతి ప్రాజెక్ట్‌కి కూడా భారీగా ప్లాన్ చేసుకున్నాడట.
వీరి తరువాతి సినిమా ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్‌లో రూపొందేలా ఉండేదట. అదీ కాకుండా, ఇందులో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌ని హీరోగా తీసుకోవాలని ఆలోచించారట. ఇంతకీ ఆ కథ ఏమిటంటే, 1995లో వచ్చిన రజినీకి మైలురాయిగా నిలిచిన ‘భాషా’ సినిమాకు ఇది సీక్వెల్‌గా ఉండేలా ప్లాన్ చేశారట.
వశిష్ట చెప్పిన వివరాల ప్రకారం, ఈ సీక్వెల్ కథ రజినీకాంత్‌కి చెప్పగా ఆయనకు కథ బాగా నచ్చిందట. అయితే, దర్శకుడిగా తాను పూర్తిగా సంతృప్తి చెందలేదట. కథలో ఏదో తక్కువుందని అనిపించిందని, అందుకే ఆ ప్రాజెక్ట్‌ను ఆపేశామని వశిష్ట వివరించారు.
ఈ ప్రకటనతో సినిమా అభిమానుల్లో ఆసక్తి రేకెత్తుతోంది. ఎందుకంటే భాషా చిత్రం రజినీ కెరీర్‌లో ఓ ఐకానిక్ సినిమాగా నిలిచింది. అటువంటి చిత్రానికి సీక్వెల్ చేయడం అంటే చిన్న విషయమేం కాదు. అయితే కథతో పాటు భావోద్వేగాలు కూడా సమంగా కలవాలి అనే విషయాన్ని వశిష్ట ఎత్తిచూపాడు.
తన సొంత స్టాండర్డ్స్‌కు తగ్గట్టు కధని తీర్చిదిద్దలేకపోవడంతోనే ఈ ప్రాజెక్ట్‌ను వెనక్కి వేశానని చెబుతున్న వశిష్ట, భవిష్యత్తులో ఇంకొక మంచి సందర్భం దొరికితే ఇలాంటిది సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.