భారతీయుడు 2 ఫస్ట్‌ సింగిల్‌ ప్రొమో బీట్‌!

లోక నాయకుడు కమల్‌ హాసన్‌  కథానాయకునిగా ఐకానిక్ దర్శకుడు శంకర్ సారథ్యంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా సూపర్‌ హిట్ చిత్రం “ఇండియన్” తెలుగులో “భారతీయుడు” అందుకున్న విజయం కోసం తెలిసిందే. అయితే ఈ సినిమాకి సీక్వెల్ గా “భారతీయుడు 2” ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇక ఈ క్రేజీ సీక్వెల్ నుంచి ఆల్రెడీ ప్రమోషన్స్ స్టార్ట్ కాగా మేకర్స్ మొదటి పాటపై అప్డేట్ కూడా ఇచ్చారు.

ఇక తాజాగా ఫస్ట్ సింగిల్ తాలూకా ప్రోమోని 3 భాషల్లో రిలీజ్ చేయగా మన తెలుగు బిట్ శంకర్ మార్క్ లో వినిపిస్తోంది అని చెప్పాలి. ఏ ఆర్ రెహమాన్ మొదటి భాగానికి వర్క్ చేయగా ఈ భాగానికి  అనిరుద్ వర్క్ చేసాడు. అయినా అనిరుద్ మ్యూజిక్ కూడా శంకర్ రేంజ్ లోనే ఉండేలా అనిపిస్తుంది. ప్రోమోలో సాలిడ్ బీట్స్ వినిపిస్తున్నాయి.

తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చే ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందో, అంచనాలు అందుకుంటుందో లేదో చూడాలి. ఇక ఈ సినిమాలో కాజల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్, వివేక్, బ్రహ్మానందం తదితరులు నటిస్తున్నారు

Related Posts

Comments

spot_img

Recent Stories