భళా అంబటీ.. వైసీపీ వారంతా ఇలా సహకరిస్తారా?

నిజానికి అంబటి రాంబాబు తెలిసో తెలియకో అలా మాట్లాడేశారు అనడానికి కూడా వీల్లేదు. ఆయన కేవలం అత్యుత్సాహంతో.. తనకు అలవాటైన సవాళ్లు విసిరే ధోరణిలోనే మాట్లాడారు. కానీ.. తానొకటి తలిస్తే.. విధి మరొకటి తలచింది అన్నట్లుగా పరిస్థితులు వికటించాయి. సోషల్ మీడియా లో దుర్మార్గమైన పోస్టులు పెడుతున్న వైసీపీ కార్యకర్తల మీద ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తుండగా.. అంబటి రాంబాబు కొంత అత్యుత్సాహం ప్రదర్శించారు. తన నియోజకవర్గ పరిధిలోని ఒక కార్యకర్త మీద కేసులు నమోదు కాగా, ఆయన తన ఇంట్లోనే ఉన్నాడని.. పోలీసుల వద్ద సరైన ఆధారాలుంటే తన ఇంటికి వచ్చి అరెస్టు చేసుకోవచ్చునని సవాలు విసిరారు. పోలీసులు బుధవారం ఎంచక్కా ఆధారాలతో సహా వెళ్లి అంబటి ఇంట్లోంచి ఆ కార్యకర్తను అరెస్టు చేసి తీసుకెళ్లారు. తెలిసో తెలియకో అయినా.. ఈ రకంగా పోలీసులు వైసీపీ నాయకులు అందరూ సహకరిస్తే.. సోషల్ మీడియా పురుగులను ఏరిపారేయడం ఎంత సులువో కదా అని ప్రజలు అనుకుంటున్నారు.

విషయం ఏంటంటే.. హోంమంత్రి వంగలపూడి అనితపై నకరికల్లుకు చెందిన వైసీపీ కార్యకర్త రాజశేఖర్ రెడ్డి సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టారు. దీనిపై నూజివీడులో పోలీసు కేసు నమోదు అయింది. కొన్ని రోజులుగా పోలీసులు రాజశేఖర్ కోసం గాలిస్తున్నారు.  ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు మీడియా ముందుకు వచ్చి.. రాజశేఖర్ తన ఇంట్లోనే ఉన్నాడని.. ఆధారాలు ఉంటే అరెస్టు చేసుకోవచ్చునని సవాలు విసిరారు. దాంతో బుధవారమే పోలీసులు అంబటి ఇంటికి వెళ్లి అరెస్టు చేయడం జరిగింది.

నిజానికి ఇది అంబటి సహకారం కాకపోవచ్చునని.. ఆధారాలు ఉండవనే ఉద్దేశంతో, అత్యుత్సాహంతో సవాలు విసిరితే అది కాస్తా బెడిసికొట్టిందని ప్రజలు భావిస్తున్నారు. అదే సమయంలో.. జులై1 నుంచి అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత ప్రకారం.. కేవలం నేరానికి పాల్పడిన వారికి మాత్రమే కాదు, వారికి రక్ష్ణణ కల్పించిన వారికి కూడా కఠిన శిక్షలే ఉన్నాయి. అందువల్ల.. అంబటి రాంబాబు ముందుజాగ్రత్తగా..అరెస్టులు తనదాకా రాకుండా ఉండేందుకు తానే బహిరంగంగా పోలీసులకు ఉప్పందించి.. రాజశేఖర్ అరెస్టుకు కారణమై ఉంటారనే అనుమానం కూడా కొందరిలో ఉంది.

Related Posts

Comments

spot_img

Recent Stories