బెస్ట్‌ వర్క్‌ సినిమా!

స్టార్ హీరోల సినిమాలు వచ్చే ఏడాది సంక్రాంతి విడుదల కు రెడీ గా ఉన్నాయి. ముందు మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ ను సంక్రాంతి కానుకగా జనవరి 10 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నామని అధికారకంగా ప్రకటించారు మేకర్స్. అలాగే సంక్రాంతికి   వస్తున్న మరో సినిమా వెంకీ, అనిల్ రావిపూడి ‘ సంక్రాంతికి వస్తున్నాం’.

ఇక బాబీ – బాలయ్య సినిమా కూడా సంక్రాంతికే బరిలో నిలవనుంది. ఈ సినిమా విడుదలపై నిర్మాత నాగవంశీ పలు ఆసక్తికర కామెంట్లు చేసారు. నాగవంశీ మాట్లాడుతూ ‘బాలయ్య సినిమా ఎప్పుడు చూడని విధంగా ఉంటుంది, కొత్త బాలయ్యను చూస్తారు. ఇప్పటిదాకా బాలయ్య ను ఇలా ఎవరు చూపించలేదు. బాబీ ఇంతకు ముందు సినిమాల కంటే ఇది చాలా కొత్తగా ఉంటుంది.

మొత్తం సినిమాలో ఓ ఐదు ఆరు సీన్స్ కు థియేటర్స్ బ్లాస్టింగ్ అవుతాయి. సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ సీన్స్ లో బాలయ్య నటన అదిరిపోయింది. బాబీ డియోల్, బాలయ్య ఫేస్ ఆఫ్ సీన్స్ మాస్ ఆడియెన్స్ కు ఓ స్పెషల్‌ ట్రీట్‌ అంతే. బాలయ్య తో చేస్తున్న సినిమా బాబీ కెరీర్ లో బెస్ట్ వర్క్ సినిమాగా చెప్పుకొవచ్చు. నా సినిమా అని చెప్పట్లేదు గాని ఈ సినిమా పక్కా హిట్ కొడుతుంది. బాబీ తప్పుగా అనుకోవచ్చు గాని కథ పరంగా గాని, టేకింగ్ పరంగాని, విజువలైజ్ గాని, టెక్నికల్ గా గాని ఈ సినిమా బాబీ కెరీర్ బెస్ట్ వర్క్ మూవీ అవుతుంది. దీపావళి కానుకగా టైటిల్ టీజర్ ను విడుదల చేస్తాం. సంక్రాంతికి సినిమా విడుదల’ అని అన్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories