జక్కన్న శుభాకాంక్షలు!

మెగాస్టార్ చిరంజీవి తన డాన్స్ తో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకున్నారు. తన కెరీర్‌లో చిరంజీవి 24 వేల డాన్స్ మూవ్స్ చేసి రికార్డులు సృష్టించారు.  అందుకే ఆయనకు గిన్నిస్ వరల్డ్ రికార్డు పురస్కారం దక్కింది. అయితే , ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి రాజమౌళి తన  శుభాకాంక్షలు తెలియజేశారు.

అలాగే 46 ఏళ్ల చిరు అసాధారణ ప్రయాణం అద్భుతమని రాజమౌళి అన్నారు. భారత చిత్ర సీమలో అత్యంత ప్రతిభ కనబరిచిన నటుడిగా గిన్నిస్ రికార్డు సాధించినందుకు మెగాస్టార్‌కు రాజమౌళి శుభాకాంక్షలు తెలియజేశారు. తన డాన్సులకు గాను మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న విధానంగానే… మరికొంత మంది టాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ ఘనత ను ఇంతకు ముందే అందుకున్న సంగతి తెలిసిందే.

అత్యధిక చిత్రాల నిర్మాతగా రామానాయుడు, అత్యధిక చిత్రాల దర్శకుడిగా దాసరి, అత్యధిక చిత్రాల దర్శకురాలిగా విజయనిర్మల, బతికున్న వారిలో అత్యధిక చిత్రాల్లో నటించిన వ్యక్తిగా బ్రహ్మానందం, అత్యధిక పాటలు పాడినవారిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీల గిన్నిస్ రికార్డ్స్‌లో కెక్కిన సంగతి తెలిసిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories