రీకాల్ మేనిఫెస్టో నమ్మితే మరింత పరువు పోవడమే

ఒకవైపు ఏడాది కాలంలో ఏం చేశామో ప్రజలకు తెలియజెప్పడానికి కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజాప్రతినిధులు అందరూ ఇంటింటికీ తిరుగుతున్నారు. తాము చేసింది చెబుతున్నారు.. ప్రజల కొత్త కష్టాలు తెలుసుకుంటున్నారు. నాలుగేళ్ల తర్వాత ఓట్లకోసం ఇంటింటికీ నేతలు వెళ్లే డ్రామాలాగా కాకుండా.. మొదటి ఏడాది తర్వాతనే.. క్షేత్రస్థాయిలో ప్రజలకు వాస్తవంగా ఉన్న ఇబ్బందులు తెలుసుకునే ప్రయత్నంగా ఇదంతా జరుగుతోంది. ఒకవైపు ఈ కార్యక్రమం చాలా సక్సెస్ ఫుల్ గా జరుగుతుండగా.. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ రీకాల్ మేనిఫెస్టో అంటూ తెలుగుదేశం మీద బురద చల్లడానికి మరో కార్యక్రమానికి పిలుపు ఇచ్చింది.  అయితే కేవలం ఏడాది వ్యవధిలోనే మేనిఫెస్టో మీద నిందలు వేస్తుండడం చూసి ప్రజలు నవ్వుతుండగా.. ఈ కార్యక్రమాన్ని ఉపసంహరించుకోకుండా తమ పార్టీ పరువు మరింత నాశనం అవుతుందని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.

ఒకవైపు రీకీల్ మేనిఫెస్టోకు అద్భుతమైన స్పందన వస్తున్నట్టుగా ప్రజలు ఎగబడి తమ వద్దకు వస్తున్నట్టుగా వైసీపీ కార్యదర్శి సజ్జల రామక్రిష్ణారెడ్డి చెబుతున్నారు. కానీ.. వాస్తవంలో పరిస్థితి అలా లేదు. క నీసం ఆయన చెబుతున్న మాటలకు మద్దతుగా ఆయన కూడా  ఆధారాలు చూపించలేని స్థితిలో ఉన్నారు.
అన్నింటికంటె ఘోరమైన సంగతి ఏంటంటే.. రీకాల్ మేనిఫెస్టో కార్యక్రమం సక్సెస్ అవుతున్నట్టుగా, వైసీపీ బృందాలు ఇంటింటికీ తిరుగుతున్నట్టుగా కనీసం సాక్షి చానెల్లో, సాక్షి పేపర్లో కూడా రావడం లేదు. కానీ.. సజ్జల మాత్రం.. ప్రెస్ మీట్లు పెట్టి, పార్టీ కార్యకర్తల మీటింగులు పెట్టుకుని అంతా అద్భుతంగా జరుగుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు.

అయితే పార్టీ కార్యకర్తలు మాత్రం.. ఈ కార్యక్రమంతో విసిగిపోతున్నారు. ఏడాది పూర్తికాకుండా.. హామీలు నెరవేర్చలేదని ఆరోపిస్తూ ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నాం అంటున్నారు. ప్రజల్లోకి వెళ్లినప్పుడు అయిదేళ్లలో మీరు  ఒక్క డీఎస్సీ కూడా పెట్టలేకపోయారు. చంద్రబాబు రాగానే మెగా డీఎస్సీ నిర్వహించి ఉద్యోగాలు ఇస్తున్నారు కదా.. అని ప్రజలు అడుగుతున్నారని.. వైసీపీ శ్రేణులు జంకుతున్నారు.
జగన్ కు అయిడియాలు ఎవరిస్తున్నారో గానీ.. ఈ సమయంలో రీకాల్ మేనిఫెస్టో వలన.. తమ పార్టీ పరువు గంగలో కలుస్తోందని.. తొలిఅడుగు చూసి ఓర్వలేకనే తాము ఈ కార్యక్రమం చేస్తున్నట్టుగా జనం నవ్వుకుంటున్నారని కార్యకర్తలు బాధపడుతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories