టాలీవుడ్ లో డాషింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పూరి జగన్నాథ్ కు లైగర్, డబుల్ ఇస్మార్ట్ వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వలేదు. ఆ తర్వాత కొత్తగా చేస్తున్న ప్రాజెక్ట్ “బెగ్గర్” పై మాత్రం మంచి ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. హీరో ఎంట్రీ సీక్వెన్స్ కోసం ప్రత్యేకంగా భారీ సెట్ తయారు చేస్తున్నారని సమాచారం. ఇందులో విజయ్ సేతుపతి కొత్త లుక్ లో కనిపించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఆయన కోసం ప్రత్యేకంగా ఈ సన్నివేశాన్ని ప్లాన్ చేశారని అంటున్నారు. అంతేకాదు, ఆ ఎంట్రీలో విజయ్ సేతుపతితో పాటు మరికొంతమంది ప్రధాన నటీనటులు కూడా స్క్రీన్ పై కనిపించనున్నారు. ఇది యాక్షన్ సీక్వెన్స్ అయ్యే అవకాశముందని సినీ వర్గాల్లో గుసగుసలు మొదలయ్యాయి.