రీసెంట్ గా మంచి బజ్ ని రేకెత్తించిన సినిమా అనౌన్స్మెంట్ ఏదన్నా ఉంది అంటే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి అలాగే డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ ల కాంబినేషన్ అని చెప్పవచ్చు. నిజానికి వీరి కాంబోలో సినిమా అనేది కలలో కూడా ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు. ఆ రేంజ్ ట్విస్ట్ ని ఈ ఇద్దరూ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
అయితే ఫామ్ లో విజయ్ సేతుపతి ఉంటే పూరి జగన్నాథ్ వరుస వైఫల్యాలతో ఉన్నారు. ఈ కలయికపై ఎదురైనా ప్రశ్నకి విజయ్ సేతుపతి చెప్పిన సమాధానం ఇపుడు వైరల్ అవుతుంది. టైం ఆఫ్స్ ఇండియాతో మాట్లాడుతూ పూరి జగన్నాథ్ తోనే ఎందుకు అనే అంశాన్ని తాను రివీల్ చేశారు.
తాను ఏ దర్శకుని విషయంలో అయినా కూడా గతాన్ని పట్టించుకోను అని తనకి స్క్రిప్ట్ నచ్చితే తప్పకుండా చేస్తాను అని విజయ్ క్లారిటీ అందించాడు. అలాగే తమ కలయికలో సినిమా ఫుల్ ఆన్ యాక్షన్ సబ్జెక్టు అంటూ కూడా తాను తెలిపాడు. దీనితో ఈ సినిమాపై మాత్రం విజయ్ సేతుపతి గట్టి నమ్మకాన్నే పెట్టుకున్నట్లు తెలుస్తుంది.