బీ రెడీ..ట్రైలర్‌ వచ్చేసింది!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తాజాగా నటిస్తున్న చిత్రం కల్కి 2898 ఏడీ. ఈ సినిమాని మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో  ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా చేస్తున్నారు.ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ,కమల్ హాసన్ వంటి లెజెండరీ స్టార్స్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు.

ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.దీనితో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు.ఇప్పటికే సినిమాలోని స్పెషల్ క్యారెక్టర్ అయిన బుజ్జి పాత్రను మేకర్స్ గ్రాండ్ గా పరిచయం చేసారు.ప్రస్తుతం బుజ్జి (రోబోటిక్ కార్ )ను మేకర్స్ దేశంలోని పలు ప్రధాన నగరాల్లో తిప్పుతూ జోరుగా ప్రచారం చేస్తున్నారు.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా ట్రైలర్ ను దేశవ్యాప్తంగా పలు థియేటర్స్ లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ థియేటర్ లిస్ట్ ను అనౌన్స్ చేసారు. ఈ సినిమా ట్రైలర్ ను సోమవారం సాయంత్రం 6 గంటలకు గ్రాండ్ గా రిలీజ్ చేశారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories