ఢిల్లీ యాత్రలో బనకచర్లకు టాప్ ప్రయారిటీ!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన అత్యంత బిజీ షెడ్యూల్ మధ్య జరగనుంది. ఈనెల 15, 16 తేదీలలో రెండు రోజుల పాటు ముఖ్యమంత్రి ఢిల్లీలో పర్యటించినున్నారు. కీలకమైన జాతీయ స్థాయి రెండు సదస్సులలో ఆయన ప్రధాన ప్రసంగం చేయనున్నారు. వాటితో పాటు రెండురోజుల్లో అనేకమంది  కేంద్ర మంత్రులతో చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు.. రాష్ట్రానికి సంబంధించిన అనేక ప్రాజెక్టులకు కేంద్రం వద్ద ఆమోదం పొందటమే లక్ష్యంగా ఢిల్లీ పర్యటన సాగనుంది. కేంద్రం ఎదుట పెట్టనున్న అన్ని ప్రతిపాదనల్లోకి బనకచర్ల ప్రాజెక్టు గురించి అనుమతులు సాధించడమే టాప్ ప్రయారిటీగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

రెండురోజుల ఢిల్లీ పర్యటనలో 15వ తేదీ సాయంత్రం ప్రధానమంత్రి మ్యూజియం లైబ్రరీలో జరిగే పీవీ నరసింహారావు సంస్మరణ కార్యక్రమంలో చంద్రబాబునాయుడు పాల్గొని కీలక ప్రసంగం చేస్తారు. అదే విధంగా 16వ తేదీన సాయంత్రం భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) నిర్వహించే బిజినెస్ కాన్ఫరెన్స్ కు హాజరవుతారు. వీటితో పటు ఆయన అమిత్ షా, అశ్వినీ వైష్ణవ్, నీతిఆయోగ్ సభ్యుడు వికె సారస్వత్, ఢిల్లీ మెట్రో ఎండీ వికాస్ కుమార్ లతోను, 16న  మంత్రులు మన్సుఖ్ మానవీయ, సీఆర్ పాటిల్, నిర్మలా సీతారామన్ లతో భేటీ కానున్నారు. అమిత్ షా, సీఆర్ పాటిల్, నిర్మల లతో సమావేశాల్లో బనకచర్లకు అనుమతులు ఒక ప్రధాన ఎజెండాగా ఉన్ననున్నట్టు తెలుస్తోంది.

80 వేల ఎకరాలకు నీరందించే లక్ష్యంతో ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును సంకల్పించిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ సంకుచిత వ్యాఖ్యలతో  కేంద్రం వద్ద అడ్డుపుల్ల వేసింది. కేవలం వ్యర్ధ జలాలను మాత్రమే ఈ ప్రాజెక్టు ద్వారా వినియోగించుకోబోతున్నట్లుగా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ లాప్కోస్ కూడా సుదీర్ఘం అధ్యయనంతో పక్కా నివేదికను అందజేసింది. ఇదే విషయాన్ని ఏపీ సర్కారు కూడా చాలా కాలంగా చెబుతూనే ఉంది. గోదావరి నుంచి వృధాగా సముద్రంలో కలుస్తున్న జలాలనుంచి మాత్రమే అది కూడా అతి తక్కువ వాటాగా 200 టీఎంసీల నీటిని వినియోగించుకోవడానికి ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్లాన్ చేసింది.

అయితే ఈ ప్రాజెక్టు వలన గోదావరి జలాలు కృష్ణలో కలుస్తాయని అప్పుడు ఎగువ రాష్ట్రాలకు కూడా నికరజలాలలో వాటా ఇవ్వవలసి వస్తుందని కొన్ని అభ్యంతరాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో బనకచర్ల వలన గోదావరి జలాలు – కృష్ణలో కలిసే అవకాశం లేదని.. అలాంటి  అపోహలకు తావు లేకుండా అనుమతులు ఇవ్వాలని బనకచర్ల నుంచి పెన్నా బేసిన్ కు అనుసంధానించడమే లక్ష్యంగా తమ ప్రయత్నం సాగుతున్నదని చంద్రబాబు నాయుడు కేంద్రానికి వివరించనున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories