మహా కుంభమేళాలో బాలయ్య బాబు మూవీ..కానీ..!

ప్రపంచంలోనే అతిపెద్ద ఆత్యాధ్మిక వేడుక అయిన ‘మహా కుంభమేళా’ ప్రస్తుతం భారత్‌లోని ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలో కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు వస్తుంటారు. ఒక్కరోజులోనే ఏకంగా 3.5 కోట్ల మంది ఈ పుణ్యస్నానాలు చేశారంటే, ఈ వేడుకకు ఎలాంటి ప్రాధాన్యత ఉందో తెలుసుకోవచ్చు. అయితే, ఇలాంటి వేడుకను సినిమా వారు కూడా తమ సినిమాలో చూపించేందుకు ముందుకు వస్తున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న క్రేజీ సీక్వెల్ సినిమాల్లో  ‘అఖండ 2 – తాండవం’ కూడా ఒకటి. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే జరుగుతోంది. ఈ సినిమాను బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తుండగా నందమూరి బాలకృష్ణ ఈ సినిమాలో అఘోరా పాత్రలో యాక్ట్‌ చేస్తున్నారు. అయితే, ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మహా కుంభమేళాలో జరుగుతోంది. ఈ మహా కుంభమేళా కి సంబంధించి కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఇక ఈ మహా కుంభమేళాలో బాలయ్య కూడా పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. మహా కుంభమేళాలో అఘోరా పాత్ర కూడా కనిపిస్తుందని.. దీని కోసం బాలకృష్ణకు సంబంధించిన కొన్ని షాట్స్ చిత్రీకరించాలని.. అయితే, జనం తాకిడి తక్కువగా ఉన్న సమయంలో బాలయ్యపై ఈ సీన్స్ చిత్రీకరించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి మహా కుంభమేళా లో బాలయ్య ఎప్పుడు పాల్గొంటాడు అనేది మాత్రం ఇంకా చెప్పలేదు.

Related Posts

Comments

spot_img

Recent Stories