నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కించిన లేటెస్ట్ సాలిడ్ హిట్ చిత్రం “డాకు మహారాజ్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా అంచనాలు అందుకొని అదరగొట్టింది. అయితే ఈ సినిమాలో థమన్ అందించిన ఓ క్రేజీ మాస్ సాంగ్ ‘దబిడి దిబిడి’ విడుదల అయ్యాక పలు ట్రోల్స్ అందుకుంది కానీ ఇపుడు ఇదే సాంగ్ ఏకంగా గ్లోబల్ రీచ్ ని అందుకుంది అని చెప్పాలి.
ఊర్వశి రౌటేలాతో బాలయ్య చేసిన ఈ సాంగ్ కి జపాన్ అమ్మాయిలు హుక్ స్టెప్ వెయ్యడం సోషల్ మీడియాలో మంచి వైరల్ గా మారింది. అలాగే యూకే ఫేమస్ ఎఫ్ ఎం లో కూడా ఈ సాంగ్ ని ప్లే చేయడంతో బాలయ్య ఫ్యాన్స్ ఈ సాంగ్ గ్లోబల్ రీచ్ తో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అయితే బాలయ్య హవా ఇలా నడుస్తుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రాన్ని నాగవంశీ, త్రివిక్రమ్ లు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.