బాగుందంటున్న బాలయ్య బాబు! “డాకు మహారాజ్”తో ఈ సంక్రాంతిని కబ్జా చేసేందుకు నట సింహం బాలకృష్ణ రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా అమెరికాలోని డల్లాస్ లో జరిగిన “డాకు మహారాజ్” ప్రి రిలీజ్ ఈవెంట్ లో “అఖండ” గెటప్ తో సందడి చేసిన బాలయ్య వీరాభిమాని రుషి కిరణ్… ఆ గెటప్పులో అందరి దృష్టిని విశేషంగా ఆకర్షించడంతోపాటు.
బాలయ్య మెప్పు సైతం అందుకున్నారు. అయితే ఈ గెటప్ లో అలరించిన రుషి కిరణ్ నటించిన తాజా సినిమానే “ది సస్పెక్ట్”. అయితే డల్లాస్, పరిసర రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారు 7 వేల మంది వరకు ఈ వేడుకలో పాల్గొన్నట్లు సమాచారం. ఈ సంక్రాంతికి వస్తున్న “డాకు మహారాజ్” బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవడం ఖాయమని రుషి కిరణ్ అన్నారు. రుషి కిరణ్ నటించిన “ది సస్పెక్ట్” మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.