నందమూరి బాలకృష్ణ ఇప్పుడు నిజంగా జోరుమీద ఉన్నాడు. రెగ్యులర్‌గా హిట్ మీద హిట్ అందుకుంటూ అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నాడు. ఇప్పటికే నాలుగు సినిమాలు వరుసగా విజయాలు సాధించడంతో, ఆయన తదుపరి ప్రాజెక్ట్ మీదే అంతా ఫోకస్ పెట్టారు. ఇక ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు రావడం అభిమానుల ఆనందాన్ని మరింత పెంచింది.
ఈ సందర్భంగా జరిగిన ఒక ఫెలిసిటేషన్ ఈవెంట్‌లో బాలయ్య కొన్ని ఆసక్తికరమైన విషయాలు షేర్ చేశాడు. తన కెరీర్‌కి సంబంధించిన విశేషాలను చెబుతూ, గత ఏడు దశాబ్దాలుగా హీరోగా నటించడమంటే చిన్న విషయం కాదని చెప్పారు. ఇంతకాలం కూడా హీరోగా కొనసాగడం టాలీవుడ్‌లో చాలా అరుదైన విషయం అని అభిప్రాయపడ్డారు.
ఇప్పుడున్న ఫేజ్ తన సెకండ్ ఇన్నింగ్స్ అని, ఈ దశలో మంచి సక్సెస్‌లు అందుకుంటున్నట్టు చెప్పారు. వరుసగా వచ్చిన నాలుగు సినిమాలు పెద్ద విజయం సాధించాయని, ఇకపై కూడా తన కథల ఎంపికలో కొత్తదనాన్ని చూపిస్తానన్నారు. తన స్టోరీలతో ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారట.
ప్రస్తుతం బాలయ్య ‘అఖండ 2’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అలాగే గతంలో ఆయన నటించిన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘ఆదిత్య 369’కి సీక్వెల్ తానే డైరెక్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. దీని వల్ల అభిమానుల మధ్య ఇప్పుడు ఓ క్యూటియాసిటీ మొదలైంది. బాలయ్య తరువాత ఏ కథకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు..? ఆయన నుంచి మళ్లీ ఎలాంటి సబ్జెక్ట్ ఊహించవచ్చు..? అన్నది అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇలాంటి అప్‌డేట్స్‌తో బాలయ్య మరోసారి తన సినిమాల ద్వారా ప్రేక్షకుల్ని అలరించేందుకు రెడీ అవుతున్నాడు.