తాజాగా విడుదలై మంచి విజయాన్ని అందుకున్న సినిమాల్లో ఒకటి తేజ సజ్జ నటించిన మిరాయ్. ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్‌గా కనిపించగా, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తన స్టైల్‌లో యాక్షన్, ఎమోషన్‌ల మిక్స్‌తో తెరకెక్కించాడు. రిలీజ్ సమయంలోనే సినిమాపై అంచనాలు బాగానే ఉండగా, ఇప్పుడు వసూళ్ల పరంగా కూడా మంచి దూకుడు చూపిస్తోంది.
ఈ విజయవంతమైన సినిమాని తాజాగా నటసింహ నందమూరి బాలకృష్ణ తన కుమారుడు మోక్షజ్ఞతో కలిసి చూసారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయగా, బాలయ్య కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. ఆ సందర్భానికి సంబంధించిన కొన్ని వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో బాగా షేర్ అవుతున్నాయి.