తమిళ మాస్‌ మూవీ లో బాలయ్య బాబు!

 నందమూరి నటసింహం బాలకృష్ణ అంటే తెలుగు చిత్ర పరిశ్రమలో  ఎలాంటి క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. అయితే, ఆయన ఇప్పుడు తన నట విశ్వరూపాన్ని తమిళనాట చూపించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. తమిళ మాస్ మూవీలో గాడ్ ఆఫ్ మాసెస్ కనపడితే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని అభిమానులు చెబుతున్నారు. ఇక అసలు మ్యాటర్‌ ఏంటంటే.. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా సినిమా ‘జైలర్ 2’ గురించి అభిమానులు, ప్రేక్షకులు ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో తెలిసిన విషయమే.

ఈ సినిమాను దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతున్నాడు. ‘జైలర్’ మూవీ బ్లాక్‌బస్టర్ కావడంతో, ఇప్పుడు ‘జైలర్ 2’ పై అంచనాలు నెక్స్ట్ లెవెల్‌లో ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాలో రజినీకాంత్‌తో పాటు తొలి భాగంలో కేమియో రోల్ చేసిన కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ కూడా యాక్ట్‌ చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే, ఆయనతో పాటు ఈసారి బాలయ్య బాబు కూడా ఓ ముఖ్యమైన కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తుంది. దర్శకుడు నెల్సన్ ఇప్పటికే బాలయ్యతో చర్చలు జరిపినట్లు ఓ టాక్‌ వినపడుతుంది.అయితే, బాలయ్య తన నిడివి కేవలం కేమియోగా మాత్రమే కాకుండా ప్రాధాన్యత ఉండేలా తీర్చిదిద్దాలని అన్నారంట. దీంతో నెల్సన్ మరికొన్ని మార్పులు చేసి బాలయ్య పాత్రను సినిమాలో ఏకంగా 10 నిమిషాల పాటు ఉండేలా ప్లాన్‌ చేసుకున్నాడని తెలుస్తుంది.  

దీంతో ‘జైలర్ 2’ మూవీలో బాలయ్య మాస్ సంభవం ఎలా ఉండబోతుందా.. తమిళనాట మాస్ సెంటర్లు ఎలాంటి రీసౌండ్ చేస్తాయా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories