కొత్త లుక్‌ లో అదరగొట్టిన బాలయ్య బాబు!

నందమూరి నటి సింహం బాలయ్య బాబు తాజాగా ఎన్బీకే 109  సినిమాలో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను యంగ్‌ డైరెక్టర్ బాబీ బిగ్గెస్ట్ యాక్షన్‌ సినిమాగా తెరకెక్కిస్తుంది.  అలాగే ఈ సినిమాలో చాందిని చౌదరి కీలక పాత్రలో చేస్తుంది.

ఈ సినిమాలో బాలయ్యను దర్శకుడు బాబీ ఎంతో స్టైలిష్ గా చూపిస్తున్నాడు. ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయినా గ్లింప్స్‌ వీడియో ప్రేక్షకులకు బాగా నచ్చింది. బాలయ్య మాస్ డైలాగ్స్ కూడా ఫ్యాన్స్ కు బాగా నచ్చాయి. ఇదిలా ఉంటే నేడు (జూన్ 10 ) బాలయ్య బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ స్పెషల్ గ్లింప్స్‌  రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది.

తాజాగా ఆ గ్లింప్స్‌ వీడియో వచ్చేసింది. ఆ గ్లింప్స్ లో దేవుడు చాలా మంచోడయ్యా.. దుర్మార్గులకు కూడా వరాలు ఇస్తాడు.. వీళ్ళ అంతు చూడాలంటే కావాల్సింది జాలి, దయ, కరుణ.. ఇలాంటి పదాల అర్ధమే తెలియని అసురుడు అనే డైలాగ్ తో బాలయ్య ఎంట్రీ అదిరిపోతుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories