బాలయ్య 111….కొత్త ప్రపంచంతో రాబోతున్నారా?

నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్బంగా అభిమానులే కాదు, సినీ పరిశ్రమ నుంచి పలువురు ప్రముఖులు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బాలయ్య బర్త్‌డే అంటే ఆయన అభిమానులకు ఒక పండుగే. ఈ నేపథ్యంలో ఆయన్ని ఆనందపెట్టేలా ఆయన సినిమాలపై కూడా కాసింత ఆసక్తికరమైన సమాచారం బయటికి వచ్చింది.

ప్రస్తుతం బాలయ్య హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో మరో ప్రాజెక్ట్ గురించి కూడా ఫ్యాన్స్ లో మంచి బజ్ నడుస్తోంది. బాలయ్య తన కెరీర్‌లో 111వ సినిమాగా డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో కలిసి ఒక కొత్త సినిమా చేస్తున్నారన్న వార్తలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

తాజాగా ఈ సినిమాపై వినిపిస్తున్న అప్‌డేట్స్ చూస్తే, ఇది ఇప్పటివరకు గోపీచంద్ మలినేని తీసిన సినిమాలకు భిన్నంగా ఉండబోతోందని తెలుస్తోంది. మసాలా కమర్షియల్ సినిమాలకు ఓడిమారిన గోపీచంద్ ఈసారి ఒక కొత్త కోణాన్ని ట్రై చేస్తున్నట్టు టాక్. అతను ఎంచుకున్న కథాంశం పూర్తిగా విభిన్నంగా ఉండనుందన్న వార్తలు వస్తున్నాయి.

ఇక ఇది సాధారణ మాస్ ఎంటర్టైనర్ కాదని, కాస్త గ్రాండుగా ఉండే హిస్టారికల్ డ్రామాగా ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. కొత్తగా క్రియేట్ చేసే ప్రపంచం, ప్రత్యేకమైన కాస్ట్యూమ్స్, విభిన్నమైన ట్రీట్‌మెంట్‌తో ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించేందుకు గోపీచంద్ సిద్ధమవుతున్నట్టుగా ఫిల్మ్ నగర్ టాక్. కానీ ఇది నిజంగా పిరియాడిక్ డ్రామానేనా? లేక బేసిక్‌గా మోడర్న్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో కూడిన కథానాయికగా తెరకెక్కుతుందా అన్నది మాత్రం అధికారికంగా తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పై ఉన్న ఇంట్రెస్ట్ చూస్తే బాలయ్య – గోపీచంద్ కాంబినేషన్ నుంచి రొటీన్‌కు భిన్నంగా ఉండే సినిమా రాబోతుందని భావిస్తున్నారు. మరి ఈ హైప్‌కు తగినట్టే కంటెంట్ ఉంటుందా లేదా అన్నది తెలియాలంటే ఇంకొంత కాలం వెయిట్‌ చేయాలసిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories