నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా దర్శకుడు కొల్లి బాబీతో చేస్తున్న భారీ సినిమా “డాకు మహారాజ్” గురించి అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం అభిమానులు అంతా ఎప్పటి నుంచో చాలా ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాతో ఉన్న సంక్రాంతి సినిమాలు నుంచి ఆల్రెడీ ఫస్ట్ సింగిల్స్ బయటకు వచ్చాయి కానీ ఈ చిత్రానికి మాత్రం రాలేదు.
మరి ఫైనల్ గా మేకర్స్ దీని తేదీ అయితే ఇచ్చేసారు. తాజా సమాచారం ప్రకారం ఈ సాంగ్ ని చిత్ర బృందం డిసెంబర్ 14న విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. అలాగే ఇదొక పవర్ఫుల్ ట్రాక్ అంటూ కూడా తెలిపారు. ఇక దీనికి సంబంధించిన ప్రోమోని రేపు డిసెంబర్ 13 ఉదయం 10 గంటల 8 నిమిషాలకి వదలబోతున్నట్టుగా చెప్పారు.
మరి బాలయ్యకి థమన్ ఎలాంటి సంగీతం అందించాడో తెలిసిందే. దీంతో డాకు మహారాజ్ ఆల్బమ్ పై కూడా సాలిడ్ హైప్ ఉంది. మరి ఈ అవైటెడ్ ఫస్ట్ సింగిల్ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.